విశాఖపట్టణం: కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడింది. అంతే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.