Coastal area
-
‘మహా’ ఎన్నికలు.. కొంకణే కీలకం
సాక్షి, నేషనల్ డెస్క్: కొంకణ్.. మహారాష్ట్రలో రాజధాని ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీరప్రాంతం. నాలుగో వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటముల భాగ్యరేఖలను కొంకణే నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కొంకణే అతి పెద్ద ప్రాంతం. మొత్తం 288 స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని రెండు వైరి వర్గాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. కొంకణ్‌లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండటం విశేషం. శివసేన (షిండే) సారథి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వస్థలమైన థానే కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది. దాంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకప్పుడు ముంబై నుంచి వలస వెళ్లేవారు పంపే మొత్తాలపై ఆధారపడ్డ కొంకణ్‌లో కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. చేపలు, మామిడి, కాజు తదితరాల ఎగుమతితో ఈ ప్రాంతం స్వయంసమృద్ధి సాధించింది. యువత వలసలకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలతో స్థానికంగానే రాణిస్తున్నారు. వాయు, రైలు మార్గాలు ఇతోధికంగా పెరిగాయి. పర్యాటక ఆకర్షణలకు కూడా కొంకణ్ నెలవుగా మారింది. కమ్యూనిస్టులకు చెక్ పెట్టి... ముంబై, పరిసర ప్రాంతాల్లోని నూలు మిల్లులు, ఇతర కర్మాగారాల్లో కమ్యూనిస్టులు చాలాకాలం పాటు గణనీయమైన శక్తిగా వెలుగొందారు. 1980ల్లో శివసేన ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి. తొలుత కాంగ్రెస్ మద్దతుతో వారి ఆధిపత్యానికి గండి కొట్టిన సేన, ఆ తర్వాత కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టి కొంకణ్ అంతటా ప్రబల శక్తిగా ఎదిగింది. 1990ల నాటికి బీజేపీతో జట్టు కట్టి హిందూత్వవాదంతో మహారాష్ట్రవ్యాప్తంగా హవా చెలాయించింది. 1995కల్లా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 1999లో రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కాంగ్రెస్‌ను వీడి ఏర్పాటు చేసిన ఎన్సీపీ కూడా కొంకణ్‌లో పోటీదారుగా మారింది. అలా ఈ ప్రాంతంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరిగింది. అయితే 2014 నుంచీ పరిస్థితి మారుతూ వస్తోంది. మోదీ మేనియా సాయంతో ముంబై, పరిసర ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటూ వచి్చంది. ప్రస్తుతం మొత్తం మహారాష్ట్ర తీర ప్రాంతంలోనూ కాషాయ పార్టీ హవా కని్పస్తోంది. ఆగర్భ శత్రువులైన శివసేన, కాంగ్రెస్ 2019 ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిస్థితుల్లో చేయి కలపడం, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అగాఢీ (ఎంవీఏ) పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంకణ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. శివసేన అసంతృప్త నేత షిండే బీజేపీ మద్దతుతో పార్టీని చీల్చడమే గాక ఎంవీఏ సంకీర్ణాన్ని కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా శివసేన కాస్తా షిండే, ఉద్ధవ్ (యూబీటీ) వర్గాలుగా చీలింది. అనంతరం అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో చేరారు. నాటినుంచీ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ)గా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి తమదే నిజమైన పారీ్టగా నిరూపించుకోవడం ఈ నాలుగు వర్గాలకూ కీలకంగా మారింది. అలా వీరందరికీ కొంకణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టణ ప్రాబల్య ప్రాంతం → మహారాష్ట్రలో అత్యంత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగిన ప్రాంతంగా కొంకణ్ తీరం గుర్తింపు పొందింది. → సింధుదుర్గ్ నుంచి ముంబై దాకా విస్తరించిన కొంకణ్ పరిధిలో పాల్ఘార్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలున్నాయి. → ఇక్కడ 75 అసెంబ్లీ స్థానాలతో పాటు 12 మంది లోక్‌సభ స్థానాలున్నాయి. → గిరిజన ప్రాబల్య పాల్ఘర్లో 6, థానేలో 18, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, రత్నగిరిల్లో కలిపి 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిగతా 36 స్థానాలు ఒక్క ముంబై మహానగరంలోనే ఉన్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ కూటమికి ఏడు స్థానాలు దక్కాయి.→ నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. → కొంకణ్‌పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది.మిగతా ప్రాంతాల్లో... మహారాష్ట్రలో విదర్భ (62 అసెంబ్లీ సీట్లు), మరాఠ్వాడా (46), ఆనియన్ బెల్త్గా పేరొందిన ఉత్తర మహారాష్ట్ర (47), పశి్చమ మహారాష్ట్ర (58) ప్రాంతాల్లోనూ అధికార, విపక్ష కూటముల మధ్య గట్టి పోరు నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రుల సంఖ్య భారీగా పెరిగింది. వారిలో కనీసం 30 మంది దాకా నెగ్గడం ఖాయం. చివరికి ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకంగా మారతారు’’ అని మాజీ సీఎం ఛగన్ భుజ్‌బల్ అభిప్రాయపడ్డారు. – -
Earthquakes: జపాన్ తీరంలో రెండు భూకంపాలు
టోక్యో: జపాన్ సముద్ర తీరంతో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. గురువారం అర్థగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జీయోలాజీకల్ సర్వే(USGS) తెలిపింది. జపాన్‌లోని కురిల్ దీవుల్లో గురువారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మొదటి భూకంపం నమోదు కాగా, రెండో భూకంపం మధ్యాహ్నం 3.07 గంటల సమయంలో సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జీయోలాజీకల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు భూకంపాలు సముద్రంతో 23.8 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది. అయితే రెండు సార్లు సంభవించిన ఈ భూకంపాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆధికారులు వెల్లడించారు. -
తీరప్రాంత అభివృద్ధికి రూ.16 వేల కోట్లు
బిట్రగుంట: ‘రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ పనులను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అమర్నాథ్ మాట్లాడు తూ రామాయపట్నం పోర్టుతోపాటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన హార్బర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి, ఫిషింగ్ హార్బర్ ద్వారా మరో ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి విజ్ఞప్తి మేరకు బకింగ్‌హాం కెనాల్ మరమ్మతులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, మత్స్యకా రులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారా నికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏపీ మారిటైం చీఫ్ ఇంజినీర్ రాజగో పాల్, ఆర్డీవో వీకే శీననాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రవాణా ‘వసతుల’ కల్పనలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: సులభతర సరుకు రవాణా వ్యవస్థలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వరంగ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)–2022 ర్యాంకుల్లో రాష్ట్రం మరోసారి సత్తాను చాటింది. లీడ్స్–2022 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అచీవర్స్‌గా నిలిచాయి. ఫాస్ట్ మూవర్స్ విభాగంలో కేరళ ఉండగా, ఏస్పైర్స్ విభాగంలో గోవా, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. తీరప్రాంతం లేని రాష్ట్రాలు, తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల కింద నాలుగు విభాగాలుగా విభజించి అచీవర్స్, ఫాస్ట్‌మూవర్స్, ఏస్పైర్స్ ర్యాంకులను ప్రకటించారు. సర్వేలో 90 శాతానికిపైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అచీవర్స్‌గా, 80 నుంచి 90 శాతం మధ్య ఉన్న వాటిని ఫాస్ట్మూవర్స్గా, 80 శాతం కంటే తక్కువ పాయింట్లు పొందిన రాష్ట్రాలను ఏస్పైర్స్గా ప్రకటించారు. తీరప్రాంతం లేని రాష్ట్రాల విభాగాల్లో హరియాణ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. 2030 నాటికి దేశ ఎగుమతులు రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా 2018 నుంచి లీడ్స్ ర్యాంకులను ప్రకటించడం మొదలుపెట్టింది. 2021 లీడ్స్ ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొదటిస్థానంలో నిలిచింది. సింగిల్ డెస్క్‌తో సత్ఫలితాలు లీడ్స్–2022లో అత్యధిక పాయింట్లతో మొదటిస్థానం రావడంలో స్పందన కీలకపాత్ర పోషించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీస్ స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. రవాణా మౌలికవసతుల్లో గోడౌన్లు మినహాయించి మిగిలిన అన్నీ సగటుకంటే ఎక్కువ మార్కులు పొందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సులభతర సరుకు రవాణా కోసం పోర్టులు, పారిశ్రామికపార్కుల వద్ద ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. నెల్లూరు, గంగవరం, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. -
సంపన్న తీర హారం!
బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి మళ్లీ మీ జిల్లాకు (కృష్ణా) వస్తా. దశాబ్దాల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. – ఇటీవల నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా పెడన సభలో సీఎం జగన్ నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోస్తా తీరం శాశ్వత ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు పూర్తైతే రూ.పది వేల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు 15 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాథమిక అంచనా. ఏటా కనీసం 18–20 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకు మించి ఆదాయం సమకూరనుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్టులు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను వేగంగా చేపడుతోంది. 974 కి.మీ. పొడవైన కోస్తా తీరంలో సగటున ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో ఐదు శాతంగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. విస్తార అవకాశాలు... అపార అవకాశాలతో కోస్తా తీరం ప్రగతికి చిరునామాగా నిలువనుంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కోస్తా కారిడార్, జాతీయ రహదారులు, చెన్నై– కోల్‌కతా మూడో రైలు మార్గం, నూతన విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న పోర్టులతో పాటు కొత్తవీ రాబోతున్నాయి. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, పేరెన్నికగన్న పులికాట్, కొల్లేరు సరస్సులు, హంసలదీవి, సూర్యలంక, మైపాడు బీచ్‌లు.. ప్రముఖ ఆలయాలతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగశాల, గుల్లలమోద (నాగాయలంక)లో అందుబాటులోకి రానున్న మిస్సైల్ లాంచింగ్ సెంటర్, విశాఖలో నేవీ కేంద్రం... ఇలా కోస్తా తీరాన ప్రతిదీ ప్రత్యేకమే. పారిశ్రామిక కెరటాలు.. ఇప్పటికే ఉన్న పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ జూలై 20న శంకుస్థాపన చేయగా త్వరలోనే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో రూ.1,204 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుండగా తాజాగా రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం హార్బర్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ పనులను ప్రారంభించనుంది. పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హర్బర్లు ఏర్పాటవుతుండటంతో 35 భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా రూ.34,532 కోట్ల పెట్టుబడులతోపాటు 72 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.78 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు రవాణా మార్గం.. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతం తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి పోర్టులు తెలంగాణ, కర్నాటక, ఛతీస్ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరకు రవాణాకు ఎంతో అనుకూలం. నాగ్‌పూర్‌కు సరుకు రవాణా చేయాలంటే ముంబై కంటే బందరు పోర్టు దగ్గరి దారి అవుతుంది. నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ బందరు నుంచి నాగ్‌పూర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతం అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోర్టులు, హార్బర్లను అనుసంధానించేలా ఏపీ మారిటైమ్ బోర్డు పలు ప్రతిపాదనలను రూపొందించింది. పోర్టులను రైల్వేలు, జాతీయ రహదారులతో అనుసంధానించడం, తీరప్రాంతంలో జీవనోపాధులను మెరుగుపరచడం ద్వారా కోస్టల్ కమ్యూనిటి అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు పంపింది. ఆక్వాలోనూ కింగే.. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల్లోనూ మేటిగా గుర్తింపు పొందుతోంది. సీఎం జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకుంటూ సాగుదారులపై విద్యుత్తు భారాన్ని తగ్గించారు. పదెకరాల లోపున్న ఆక్వా రైతులు యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 మాత్రమే చెల్లించేలా ఊరట కల్పించారు. అదే టీడీపీ హయాంలో ఏకంగా రూ.3.80 చొప్పున వసూలు చేయడం గమనార్హం. చార్జీల భారాన్ని తగ్గించడం ద్వారా మూడేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు రూ.2,400 కోట్లు మేర సబ్సిడీ కల్పించింది. అంతేకాకుండా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అ«థారిటీ–20202ని తీసుకొచ్చారు. 5.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ చట్టాలు భరోసా కల్పిస్తున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా ఈ రంగం ద్వారా దాదాపు 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆక్వా హబ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. రూ.10,640 కోట్లతో దశలవారీగా 19 బెర్తులకు విస్తరించడంతో 25 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. 3,773 ఎకరాలను సేకరించి భారీ పారిశ్రామికవాడ నెలకొల్పనున్నారు. పలు కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ► నిర్మాణంలోని ఫిషింగ్ హార్బర్లు: జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ► పనులు ప్రారంభంకానున్న హార్బర్లు: బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం ► నిర్మాణం కానున్న పోర్టులు: మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు. ► ఉన్న పోర్టులు: విశాఖపట్నం, గంగవరం, కాకినాడ (3), కృష్ణపట్నం సీమకూ సముద్ర తీరం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమకూ సముద్రతీరం దక్కింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా పరిధిలోకి తీర ప్రాంతాలైన కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాలు చేరాయి. పులికాట్ సరస్సు కూడా కలిసొచ్చింది. బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా నిధులు అందనున్నాయి. బందరు పోర్టు బెస్ట్ వయబుల్ ప్రాజెక్టు అవుతుంది. – వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ -
సాగర తీరానికి ‘భారత్‌మాల’
పచ్చని చెట్లు ..తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీరం ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామికంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. జాతీయ రహదారి నిర్మాణం కాకినాడ–తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన పారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి.. ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు ఇప్పటికే అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా మన జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్ని కృష్ణ, ఆర్డీఓ కాకినాడ చదవండి: ప్రేమను గెలిపించిన పిడకల సమరం పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్ -
ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదు..!
చీరాలటౌన్: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
హమ్మయ్య.. ప్రాణాలతో తీరానికి..
సాక్షి, విశాఖపట్నం: గాజువాక ప్రాంతంలోని యారాడలో సముద్ర తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు చావు అంచుల నుంచి తప్పించుకున్నారు. ఆటవిడుపుగా యారాడకు వచ్చిన ఏడుగురు యువకులు అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్లలో చిక్కుకున్నారు. వారిలో నలుగురు యువకులు బయపడగా.. మిగతా ముగ్గురు మాత్రం అక్కడి నుంచి రాలేకపోయారు. తమ మిత్రులు ప్రమాదంలో చిక్కుకున్నారని యువకులు న్యూ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు .. రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో అధికార యంత్రాంగం యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో నగరానికి చెందిన కొండ నవీన్ (20), భీశెట్టి యశ్వంత్ (20), కె.శ్రవణ్ (20) ను రక్షించించారు. యువకులు క్షేమంగా బయటపడటంతో అధికారులు, కుటుంబ సభ్యులు, వారి మిత్రులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఫలితంలేని ప్రాజెక్ట్ అనవసరం
సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై కోస్టల్ రోడ్డు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎదురయ్యే కష్ట, నష్టాలను ఎదుర్కొనేందుకు కాంట్రాక్టరే సిద్ధంగా ఉండాలని చిన్న మెలికపెట్టింది. ఈ ప్రాజెక్టును ఆపేయాల్సిందిగా కోర్టుకెళ్లిన ఎన్జీవో సంస్థలు ప్రాజెక్ట్ వల్ల పొంచి ఉన్న ముప్పు గురించి వాదిస్తుండగా, ముంబై మున్సిపాలిటీ మాత్రం అవేమి పట్టనట్టుగా ప్రాజెక్టు పూర్తయితే నగరం పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయని చెబుతోంది. సముద్రం వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడమే కాకుండా మత్స్యకారుల ఉపాధి పోతుందని, పైగా కోట్లాది రూపాయలు గంగలో పోసినట్లు అవుతుందని అవి ఆరోపిస్తున్నాయి. ముంబై నగరంలో మెట్రో రైలు కోసం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగా, ఈ ఒక్క కోస్తా రోడ్డుకే 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న వారిలో 1.5 శాతం మంది ప్రతిపాదిత రోడ్డుపై ప్రయాణించే అవకాశం ఉందని, అంటే రోడ్డు ఆక్యుపెన్సీ శాతం ఆరు శాతం కూడా ఉండదని, అంత తక్కువ కార్ల కోసం ఎందుకు ప్రాజెక్టును పూర్తి చేయాలని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి కమీషన్ల పేరిట కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పన్నిన కుట్రలో భాగమే ఈ ప్రాజెక్ట్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులకు యూజర్ చార్జీలు కిలోమీటరుకు 110 రూపాయలు పడుతుందని, అంత డబ్బు వెచ్చించి ఈ రోడ్డుపై ఎవరు వెళ్లగలరనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లగ్జరీ కార్లలో ప్రయాణించే కొంత మంది ధనవంతుల కోసమే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని అర్థం అవుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఇప్పటికే ప్రభుత్వ రవాణా తగ్గిపోతూ ప్రైవేటు రవాణా పెరుగుతూ వస్తోందని, దీని వల్ల రోడ్లపై రద్దీ పెరగడమే కాకుండా వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యం వల్ల ఇంతకాలం ఆగిన ఈ ప్రాజెక్ట్‌ను ఇంతటితోని నిలిపివేయడమే ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు. -
ఉగ్ర కోరల్లో పశ్చిమ తీరం
పనాజి, గోవా : దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గోవా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని పోర్టులను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసినట్లు ఓడరేవుల శాఖ మంత్రి జయేష్ సల్గాంకర్ తెలిపారు. గతంలో స్వాధీనం చేసుకున్న ఓ భారతీయ బోటును పాకిస్తాన్ విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటిలిజెన్స్ ప్రభుత్వాలను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. గోవాతో పాటు, గుజరాత్, ముంబై తీరాలకు కూడా దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు అందాయి. తీరప్రాంతంలోని స్పోర్ట్స్ ఆపరేటర్స్, కాసినో నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఓడరేవుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫిషింగ్ బోటులో ఉగ్రవాదులు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నేవీ అధికారి జేమ్స్ బ్రగాంజా ధ్రువీకరించారు. -
తీరం..నిర్లక్ష్యం
మెరైన్ పోలీస్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వానికి చెవికెక్కినట్టులేదు. చొరబాట్లకు అవకాశం ఉన్న చోట్ల నిఘా పెట్టాలని సూచించినా స్పందన శూన్యంగానే ఉంది. తీర భద్రతపై ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం కనబరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. కొన్ని మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిపుణులైన సిబ్బంది, స్పీడ్బోట్లు తదితర వసతులు కల్పించకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి, అమరావతిబ్యూరో : నిత్యం ‘పారా షుషార్’గా ఉండాల్సిన తీరప్రాంత భద్రతా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. కొత్త మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు లేదు... కొత్త బోట్లు రావు... ఉన్న బోట్లకు డీజిల్‌కు బడ్జెట్ ఇవ్వరూ...సిబ్బంది నియామకాలు లేవు...చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా లేదు. జాతీయ మెరైన్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయకపోయినా స్పందన శూన్యం......ఇదీ రాజధాని జిల్లాల్లో మెరైన్ పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం. ప్రకటనలకే పరిమితమైన మెరైన్ స్టేషన్ల పెంపు..తూర్పుతీరంలో కీలకంగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతం కేంద్రీకృతమై ఉంది. దాదాపు 170కి.మీ. పొడవైన తీరప్రాంతం ఈ జిల్లాల సొంతం. రాజధాని అమరావతికి అనుసంధానంగా ఉంది. ఇంతటి కీలకమైనప్పటికీ అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెరైన్ పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నంలలో ఏర్పాటు చేశారు. కీలకమైన రాజధాని ప్రాంతానికి అవి ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు. కనీస వసతుల కరువు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్ పోలీస్స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసే ఉన్నాయి. డీజిల్ వ్యయానికి ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోవడమే కారణం. బోట్ల నిర్వహణకు తగినంతమంది నిపుణులైన సిబ్బంది (బోట్ క్రూ) లేరు. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు 10 మంది చొప్పున 50 మందిని నియమించాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా నియమించనే లేదు. రెండు జిల్లాల్లోని తీరప్రాంతంలో గస్తీ నిర్వహణకు మెరైన్ పోలీస్ విభాగానికి 2 ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం మరో 8 బోట్లు అవసరమని గుర్తించారు. రూ.16 కోట్లతో 2016 చివరికి వాటిని సమకూర్చాలని ప్రతిపాదించారు. కానీ ఒక్క స్పీడ్బోటునూ సమకూర్చుకోలేదు. అమరావతి పరిధిలో ఒక మెరైన్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అమలుకూ నోచుకోలేదు. నిఘా సంస్థల హెచ్చరించినా మొద్దు నిద్..రేకేంద్ర నిఘా సంస్థల నివేదిక ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతంలో 25 వరకు చొరబాటు ప్రాంతాలున్నాయి. వాటిలో రెండు వ్యూహాత్మక ప్రాంతాలు అత్యంత సున్నితమైనవిగా గుర్తించాయి. వాటన్నింటి వద్దా ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్న సూచనను రాష్ట్రం పట్టించుకోనేలేదు. మెరైన్ అకాడమీపై కేంద్రం వెనకడుగు..మచిలీపట్నంలో జాతీయ మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాటతప్పింది. గుజరాత్‌లోని ద్వారకాలో మాత్రమే అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసస్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేయలేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా పారా హుషార్ అంటుందా... ఏమో చూడాల్సిందే. -
కోస్తాకు పొంచి ఉన్న ముప్పు
-
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
-
కోస్తాకు పొంచి ఉన్న ముప్పు
సాక్షి, విశాఖ: దక్షిణ అండమాన్‌కు ఆనుకొని ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఆవరించి ఉంది. బుధవారం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం రానున్న 48 గంటల్లో బలపడి రెండు రోజుల పాటు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రానున్న 3 రోజులు తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలో పొడిగాలులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. పంటను ఇళ్లకు చేర్చుకోండి: అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలాల్లో కోత కోసిన వరిని నూర్పిళ్లు పూర్తి చేసి ఇళ్లకు చేర్చుకోవాలని, ఇతర వ్యవసాయోత్పత్తులను కూడా తడవకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోస్తాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం రైతులకు సూచించింది. రెవెన్యూ అధికారులు దండోరా ద్వారా ప్రజలకు వాయుగుండం ప్రభావం గురించి ముందుగానే తెలియజేయడంతోపాటు వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాల్లోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు ఈమేరకు వ్యవసాయ అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. -
కోస్తాకు తప్పిన ముప్పు
సాక్షి, విశాఖపట్నం : కోస్తా ప్రజలకు ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా భయపెడుతున్న వాయుగుండం ముప్పు తప్పింది. అయితే అల్పపీడనం గంటకు 30కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. పారాదీప్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఈ అర్థరాత్రి పారాదీప్ సమీపంలో ఉత్తర ఈశాన్య దిశగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో చదురుమదురు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
-
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం దక్షిణ ఆగ్నేయ దిశగా పూరికి 370కిలోమీటర్లు, ఒరిస్సా చాంద్‌బలికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తరం వాయువ్యదిశగా పయనిస్తోందని, నేటి అర్థరాత్రి లేదా రేపు తెల్లవారుజామున పూరీ చాంద్‌బలీ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 18గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రానున్న24 గంటలపాటు కోస్తాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మత్సకారులకు ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్సకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా ఇప్పటికే ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా కోస్తా జిల్లాల వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయ సహకారాల కోసం కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు కలెక్టరేట్ కార్యాలయం : 1800-4250-0002 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ : 0891-2569335 -
తీరంలో మొక్కల బాధ్యత మత్స్యకారులదే: కలెక్టర్
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో పొడవైన సముద్ర తీరం ఉందని, అయితే సరైన వనరులు లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో అపార నష్టం వాటిల్లుతోందని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తీర ప్రాంత పంచాయతీల సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. మడ అడవుల పెంపకంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయని, తీర గ్రామాల సహకారం కావాలని కోరారు. సరుగుడు, తాటిచెట్లు పెంచాలన్నారు. ఈ నెల 30నాటికి పెద్ద ఎత్తున తీరంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. తీరంలో రెండు చోట్ల ఫిషింగ్ హార్బర్లను నిమించడానికి అనువైన పరిస్థితులను అధ్యయనం చేశామని వివరించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. మత్య్సకారులకు మరబోట్లు, వలలు, ఆధునిక పరికరాలు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి మాట్లాడుతూ మత్య్సకార గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సర్పంచ్‌లు, అధికారులు అమలు చేయాలన్నారు. సమావేశంలో నీటియాజమాన్యసంస్థ ప్రాజక్టు డైరక్టరు ఆర్ కూర్మనాథ్ తోపాటు డీఎఫ్ఓ శాంతిస్వరూప్, సామాజిక అటవీశాఖాధికారి లోహితాస్యుడు, జడ్పీ సిఇఓ బి నగేష్, మత్య్సశాఖ డీడీ డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి జి కోటీశ్వరరావు, సెట్‌శ్రీ సీఈఓ మూర్తి తదితరులు హాజరయ్యారు. -
బాబుకు కోస్తాంధ్రపైనే ప్రేమ ఎక్కువ
శ్రీశైలం: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమ కన్నా కోస్తాంధ్రపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు.. అందుకే శ్రీశైలం డ్యాం 854 అడుగులకు చేరకుండానే నీటిని విడుదల చేస్తున్నారు' అని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం రాయలసీమ రైతు సంఘాల నాయకులు ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీశైలం డ్యాం వద్దకు సుమారు 200 మంది రైతు సంఘం నాయకులు, రైతులు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమ సాగు, తాగు నీటి సమస్యతో కటకటలాడుతోందని, అయినా కృష్ణా డెల్టాకు తాగునీటి పేరుతో నీటిని కిందకు వదులుతున్నారని వాపోయారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల వరకు నీరు చేరితే కానీ.. రాయలసీమ రైతులకు నీరు అందదని తెలిపారు. సీఎం చంద్రబాబు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రం మొత్తంపై చూపించాల్సిన ప్రేమను కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే చూపిస్తూ మరో ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. -
కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్టణం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అల్పపీడనం ప్రాంతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంటుంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. -
కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు
విశాఖపట్టణం: కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడింది. అంతే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. -
కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు
విశాఖపట్నం : కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూరీకి 50 కీ.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. ఆ సమయంలో 50 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
కోస్తాలో విస్తారంగా వర్షాలు!
విశాఖపట్నం: ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కో స్తాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో కురుపాంలో 10 సెం.మీలు, అవనిగడ్డలో 7, భీమడోలు 5, పాలేరు బ్రిడ్జి, మారుటేరులో మూడు సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
తీర్థవాదికి పోటెత్తిన భక్తులు
రామతీర్థం(విడవలూరు): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత కీలక ఘట్టంమైన తీర్థవాది భక్తులతో పోటెత్తింది. సుమారు లక్ష మంది భక్తులు తీర్థవాది(సముద్ర స్నానం)లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం అనంతరం నూతన దంపతులు మంగళవారం వేకువన వసంతోత్సవంలో పాల్గొన్నారు. సీతాన్వేషణలో భాగంగా రాముడు తూర్పు తీరానికి వెళుతూ శివపూజకు వేళ కావ డంతో రామతీర్థం వద్ద స్పటిక శింగలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేసి అనంతరం ఇక్కడ సముద్రస్నానం చేశారని భక్తుల విశ్వాసం. రామతీర్ధం నుంచి సముద్రం ఒడ్డుకు వెళ్లే దారి పొడువునా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల హరనామ స్మరణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. -
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
-
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తరాంధ్రతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో.. వచ్చే 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు బలోపేతం కావడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో మూడు రోజులపాటు రుతుపవనాలు క్రియాశీలకంగా ఉంటాయని, దీని ప్రభావంవల్ల కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
తీర ప్రాంతం కోత.. ప్రభుత్వ వైఫల్యమే..
-
కోతకు గురైన తీర ప్రాంతంలో వైఎస్ జగన్
-
టూరిస్ట్ హబ్‌గా కోస్తా తీర ప్రాంతం
-
మోడు వారిన జీడి
- తీరంలో అంతరించిపోతున్న అటవీ సంపద - వేరుపురుగు ఆశించి మోడు వారిన చెట్లు - తోటల్లో మిగిలింది ఇక నూటికి నాలుగే.. - నిద్రావస్థలో అటవీ అభివృద్ధి సంస్థ పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీర ప్రాంతంలోని జీడి మామిడి తోటలను గాలికి వదిలేసింది. చెట్లతో పచ్చగా కళకళలాడిన అటవీ భూములు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. గడచిన ద శాబ్దన్నర కాలంలో దాదాపు 95 శాతం చెట్లు మోడువారాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే తోటలు అంతరించిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లాలోని ప్రధానంగా తీరప్రాంతాలైన బాపట్ల ప్రాంతంలోని ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. వీటిల్లో 1956, 57, 58 సంవత్సరాల కాలంలో అటవీశాఖ జీడి మామిడి సాగు చేపట్టింది. అటు పర్యావరణానికి ఇటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి జీడిమామిడి తోటలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరం తర్వాత తెగుళ్లు ఉధృతం.. నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యాక బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడి మామిడి తోటలను ఆ సంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది. తోటలను రక్షించే ందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం కన్పించడం లేదు. తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. దీంతో జీడి మామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాల్లో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది. 15 ఏళ్ల కిందట ఐదు వేల చెట్లు.. ఇప్పుడు 200.. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 162 ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడిమామిడి తోటల్లో 15 ఏళ్ల కిందట ఐదు వేల చెట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 చేరుకుంది. తోటలు అంతరించిపోతున్నాయనడానికి ఇది నిదర్శనం. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంతో పాటు, పేరలిలో 2500 ఎకరాలు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 5000 ఎకరాలు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 20 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. ప్రభుత్వం అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తోటల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అవి పెరిగి ఫలసాయం అందించే వరకు అటవీ భూములని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు, రైతులకూ ఉపాధి కల్పించినవారవుతారు.