బిట్రగుంట: ‘రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ పనులను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అమర్నాథ్ మాట్లాడు తూ రామాయపట్నం పోర్టుతోపాటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన హార్బర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి, ఫిషింగ్ హార్బర్ ద్వారా మరో ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి విజ్ఞప్తి మేరకు బకింగ్‌హాం కెనాల్ మరమ్మతులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, మత్స్యకా రులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారా నికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏపీ మారిటైం చీఫ్ ఇంజినీర్ రాజగో పాల్, ఆర్డీవో వీకే శీననాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment