Natural Resources
-
సమగ్ర భూ సర్వే రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.35 వేల కోట్ల భూ దోపిడీ వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు. -
సహజ వనరుల బ్యాలెన్స్‌షీట్స్ ఏవీ?
చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా, చైర్మన్ బోర్డ్ఆఫ్ స్టడీస్‌గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. 1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ? ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి. పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య... అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్ఈసీ) ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ? ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి. సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ? అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది. పర్యావరణ అంశాలపై .. దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్‌చాంబర్‌గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు. -కె. రాహుల్ -
తీరప్రాంత అభివృద్ధికి రూ.16 వేల కోట్లు
బిట్రగుంట: ‘రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ పనులను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అమర్నాథ్ మాట్లాడు తూ రామాయపట్నం పోర్టుతోపాటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన హార్బర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి, ఫిషింగ్ హార్బర్ ద్వారా మరో ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి విజ్ఞప్తి మేరకు బకింగ్‌హాం కెనాల్ మరమ్మతులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, మత్స్యకా రులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారా నికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏపీ మారిటైం చీఫ్ ఇంజినీర్ రాజగో పాల్, ఆర్డీవో వీకే శీననాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
దేశానికే ఏపీ దిక్సూచి.. ప్రకృతి శక్తితో నిరంతర విద్యుత్
సాక్షి ప్రతినిధి కర్నూలు: ప్రకృతి వనరులను ఒడిసిపట్టి చౌకగా, నిరంతరం విద్యుత్ లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సందర్భాల్లో సైతం ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేసేలా రాష్ట్రంలో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పంప్డ్ స్టోరేజీ పవర్ యూనిట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలు బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అడుగులు ముందే నిలవడం గమనార్హం. గ్రీన్కో ప్లాంట్‌లో సౌర, పవన, హైడల్ విధానాల్లో విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ప్రయోజనాలను సీఎం జగన్ వివరించారు. ఈరోజు ఒక అద్భుతమైన, చారిత్రక సన్నివేశం ఆవిష్కృతమవుతోందన్నారు. శంకుస్థాపన సందర్భంగా తాపీ చేతపట్టి సిమెంట్ వేస్తున్న సీఎం వైఎస్ జగన్ కాలుష్య రహితంగా.. ‘పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్‌ప్లాంటు)ను ‘గ్రీన్కో’ చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్ విద్యుత్ అందుతుంది. కాలుష్య రహితంగా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్న ‘గ్రీన్కోకు’ అభినందనలు. దేశానికి ఈ ప్రాజెక్టు దిక్సూచి కావాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరకే అనువైన విద్యుత్తు.. ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనది. 3 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. ఇందులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యం కాగా 3,000 మెగావాట్లు సౌర విద్యుత్తు, 550 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి కానుంది. తద్వారా తక్కువ ధరకే స్థిరమైన, అనువైన నిరంతర విద్యుత్ 24 గంటలు అందుతుంది. ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత క్లీన్ ఎనర్జీ. తగ్గనున్న శిలాజ ఇంధనాల వినియోగం ఈ ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్‌ల సముదాయం ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌పీక్ అవర్స్) సోలార్, విండ్ పవర్‌ను ఉపయోగించుకుని నీటిని రిజర్వాయర్‌లోకి పంప్ చేయవచ్చు. డిమాండ్ ఎక్కువగా (పీక్ అవర్స్) ఉన్నపుడు తిరిగి నీటిని వినియోగించుకుని విద్యుదుత్పత్తి చేసే అవకాశం ప్రాజెక్టులో ఉంది. రోజంతా పునరుత్పాదక శక్తి కలిగి ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. రాష్ట్రంలో ఈ రోజు మనం చేపడుతున్న ఇంధన పునరుత్పాదక ప్రక్రియ భవిష్యత్తులో యావత్ దేశానికి మార్గదర్శకం కానుంది. విద్యుదుత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గిపోయి పునరుత్పాదక శక్తి ఇంధన విభాగం ముందంజలో నిలవనుంది. గ్రీన్ పవర్‌కు ప్రోత్సాహం పర్యావరణ సమతుల్యత, కాలుష్య రహితం చాలా కీలకం. ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ‘గ్రీన్కో’ ప్రాజెక్టును చేపట్టింది. మనం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. ‘గ్రీన్ పవర్’ (పర్యావరణ హితంగా) విధానాలతో విద్యుదుత్పత్తి ఎలా చేయవచ్చో ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి తెలియచేస్తోంది. గ్రీన్‌పవర్ ఉత్పాదక సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 33 వేల మెగావాట్లకుపైగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. మిట్టల్ కంపెనీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతోంది. ఈ సంస్థ 250 మెగావాట్ల విద్యుత్‌లో 100 మెగావాట్లను పునరుత్పాదక శక్తితో ఉత్పత్తి చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి దారి తీస్తుంది. గ్రీన్కో సంస్థకు సీఎం అభినందన ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సాకారం చేస్తున్న గ్రీన్కో సంస్థ ఎండీ అనిల్, బృందానికి ప్రత్యేక అభినందనలు. ‘గ్రీన్కో’కు ఎలాంటి సహాయం, సహకారం అవసరమైనా రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుంది. పైలాన్ ఆవిష్కరణ తొలుత ప్రాజెక్టు ప్రాంతం, పనులను పరిశీలించిన అనంతరం సీఎం జగన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్టు నిర్మాణం, విద్యుదుత్పాదనను వివరిస్తూ రూపొందించిన త్రీడీ నమూనాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవికిషోర్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, వెన్నపూస గోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంధన భద్రత రాష్ట్రంగా ఏపీ ‘పునరుత్పాదక విద్యుత్ పరిష్కారాలను అందించాలన్న అంతర్జాతీయ లక్ష్యాల కంటే ముందుగానే ఆ దిశగా అడుగులు వేయడం ‘గ్రీన్కో’కు గర్వకారణం. ముందుచూపు కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. దేశానికి ‘ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్’గా ఏపీ నిలవనుంది. విస్తృత వ్యాపార అవకాశాలతోపాటు అపార వనరులు, నౌకాశ్రయాలు, భూములు, ఖనిజాలు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 2023 నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి’ – అనిల్ చలమలశెట్టి, ‘గ్రీన్కో’ ఎండీ -
కరిగిపోతున్న ప్రకృతి సంపద: అప్పుడలా.. ఇప్పుడిలా!
సాక్షి, కరీనంగర్: ప్రకృతి సంపద కరిగిపోతోంది.. ఆహ్లాదం పంచే గుట్టలు కనుమరుగవుతున్నాయి.. గ్రానైట్, క్రషింగ్ తదితర చర్యలతో అంతరించిపోతోంది. సహజసిద్ధమైన గుట్టలపై ఉన్న చెట్ల సంపద కూడా తరిగిపోతుంది. గుట్టలు తవ్వి అక్రమార్కులు రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. పెద్ద మొత్తంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అలనాటి పచ్చదనం కాస్త కాంట్రాక్టర్లకు పసిడి తనంగా మారిపోతుంది. అక్రమార్కుల చేతిలో కొండలు, గుట్టలు రోజురో జుకూ కరిగిపోతున్నాయి. 2017 లో సగం వరకు ‘సాక్షి’ కెమెరాకు కనిపించిన బసంత్‌నగర్ సమీపంలోని అతిపెద్ద గుట్ట క్రషింగ్‌తో ఆగస్టు 2, 2021 వరకు ఇలా అడుగంటి అంతరించిపోతోంది.. మరో నాలుగేళ్లకు ఇక్కడ గుట్ట ఉండేదట అని చెప్పుకోవాల్సిన వస్తోందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పర్యావరణానికి తీరని నష్టం వాటిలుతున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపులేకుండా పోతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సహజవనరులే ఆంధ్రప్రదేశ్ సంపద
ముంబై: సహజసిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సోమవారం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ సదస్పులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మాట్లాడుతూ... అన్ని రంగాల్లోనూ ప్రపంచస్థాయి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అన్నివిధాల అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి భవిష్యత్ ఆదాయ రంగాలన్నింటికీ ఒకటి చేసే దిశగా ఈ అంతర్జాతీయ సదస్సు ఒక ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మంత్రి తెలిపారు. పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలపై, అనుకూల రంగాలపై ప్రధానంగా మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గాలు సహా ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సహజ వనరులు వంటి అంశాలను మంత్రి మేకపాటి సదస్సు వేదికగా స్పష్టంగా వివరించారు.పెట్టుబడులకు అనుకూల వాతావరణం, దేశంలోనే అతి పొడవైన తీరప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీ తీరంలో గ్యాస్, ఆయిల్, పెట్రోలియం వంటి సహజవనరులు భారీగా ఉన్నాయని .. అవే ఏపీకి అరుదైన సహజ సంపదగా మంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ మధ్యలో ఏర్పాటు చేయనున్న పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) కారిడార్ పెట్టుబడుల గురించి మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా ఏపీకి పీసీపీఐఆర్ రీజియన్లతో పెట్టుబడులను ఆకర్షించే పొటెన్షియల్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలో పర్యటించి ఓఎన్జీసీ, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సీఎండీలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ వేదిక ద్వారా మేకపాటి వెల్లడించారు. త్వరలో కేంద్రమంత్రి సదానంద గౌడ రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి కోరారు. ఏపీ పారిశ్రామిక విధానం అమలులో మూలస్తంభాలు : ఏపీలో పారిశ్రామిక విధానం అమలులో నాలుగు మూల స్తంభాలుంటాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకత, సుపరిపాలన, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రేపటికోసం అంతర్జాతీయ స్థాయిలో అపారమైన మానవ వనరులు వంటి సానుకూల అంశాలతో భారత ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, ప్రభుత్వం నుంచి సహకారం వంటి విషయాలలో సింగిల్ విండో విధానం అమలు చేసి, త్వరితగతిన పరిశ్రమలను పరుగులు పెట్టించనున్నామని ఆయన తెలిపారు. కేంద్రం 2025 వరకు 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్దేశించుకుందని.. కోస్టల్ కారిడార్, పెట్రో కెమికల్ కారిడార్లు గ్లోబల్ ఎకనమీలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలన్నదే ప్రధాన ధ్యేయమన్నారు. అంతకు ముందు, ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రితో మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. పారిశ్రామికాభివృద్ధి, వనరులు, పెట్టుబడుల వంటి అంశాలపై మాట్లాడుకున్నారు. మంత్రి ప్రసంగం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఏపీ విజన్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో తీర ప్రాంతం, పోర్టులు, గ్యాస్, ఆయిల్, పెట్రో కెమికల్స్ వంటి సహజవనరుల గురించి స్పష్టంగా వివరించారు. ఏయే రంగాలపై ఏపీ ప్రధానంగా దృష్టి పెట్టి లక్ష్యాన్ని నిర్దేశించుకుందో రజత్ భార్గవ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కెమికల్స్ , ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి డి.వి సదానందగౌడ, ఒడిశా రాష్ట్ర హోం, విద్యుత్, పరిశ్రమలు, సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కెప్టెన్ డిబ్య శంకర్ మిశ్రా, కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ ముఖ్య కార్యదర్శి రాఘవేంద్రరావు, దీపక్ నైట్రేట్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పి.మెహతా, ఫిక్కీ ప్లాస్టిక్, పెట్రో కెమికల్స్ పరిశ్రమల కమిటీ ప్రభ్ దాస్, కేంద్ర కెమికల్స్ , ఫర్టిలైజర్స్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విషం చిమ్ముతున్న కులతత్వం
న్యూఢిల్లీ: ‘మన గ్రామాలు ఇప్పటికీ కులతత్వ విషంతో నిండిపోయాయి. కులతత్వ విషం గ్రామాలను నాశనం చేస్తోంది. గ్రామాల స్వప్నాలను ధ్వంసం చేస్తోంది. కులతత్వాన్ని వీడేలా మనం చర్యలు తీసుకోవాలి. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి’అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఫలవంతమైన అభివృద్ధి పథకాలను రూపొం దించాలన్నారు. ఢిల్లీలో లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ జయంతి, సంస్కరణవాది నానాజీ దేశ్‌ముఖ్ శత జయంతి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. సహజవనరులకు కొరత లేదు.. దేశంలో సహజ వనరులకు కొరత లేదని, చివరి వ్యక్తి వరకూ అందజేసేందుకు వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన ఫలితాలు రావాలంటే అందుకు తగ్గ మెరుగైన పాలనా యంత్రాంగం అవసరమన్నారు. మెరుగైన పాలనా యంత్రాంగం ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చని, అలాగే ఎక్కువ ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. గ్రామీణ భారతం సర్వతోముఖాభివృద్ధికి.. ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేయాలని, వీటి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి స్ఫూర్తి దెబ్బ తినకూడదు గ్రామీణాభివృద్ధి స్ఫూర్తి దెబ్బ తినకుండా.. మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కొత్త పథకాల రూపకల్పన ఉండాలని మోదీ చెప్పారు. గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, ఆప్టికల్ పైబర్ కేబుల్‌తో ఇంటర్నెట్ మొదలైన అవకాశాలు కల్పిస్తే ఉపాధ్యాయులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులకు అక్కడ జీవించడానికి ఎటువంటి సంకోచం ఉండబోదని చెప్పారు. వారు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించడం ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. జయప్రకాశ్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని, అప్పట్లో అధికారంలో ఉన్న వారిని ఆయన నాయకత్వం వణికించిందన్నారు. దేశ్‌ముఖ్ మంత్రి పదవిని తిరస్కరించి, గ్రామీణాభివృద్ధి కోసం జేపీతో కలసి నడిచారని చెప్పారు. -
అటవీ భూములను రక్షించండి
- పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన - ఎన్జీటీలో అమరావతి నిర్మాణంపై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం సహజ వనరుల వినాశనానికి పాల్పడుతోందని, అటవీ భూములను, నీటి కుంటలనుసైతం వదలడంలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాజధాని నిర్మాణంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి అమరావతిని ప్రభుత్వం ఎంచుకోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 251 ఎకరాల అటవీ భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తోందని, అలాగే 497 ఎకరాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తడి నేలలు ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే కొండవీటి వాగు, కృష్ణా నది నాశనం అవుతాయన్నారు. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, రాజధాని నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోరారు. విచారణ నేటికి వాయిదా.. ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటి దాకా పిటిషనర్ల్లు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందన తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ‘‘ఏటా మూడు పంటలు పండే ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందనేది స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు ఏంటి?. భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఏ విధంగా చెల్లిస్తారు. కొండవీటి వాగు ప్రవా హ దిశ మార్పు అభ్యంతరాలపై సమాధాన మేమిటి?, 10-15 మీటర్లలో భూగర్భ జలా లు లభించే ప్రాంతంలో అభివృద్ధి పేరిటి చేపడుతున్న ఇసుక మైనింగ్‌పై మీ వివరణ ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వీటన్నింటికీ సమాధానం కోరుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
మార్పు తప్పదు కానీ... మారింది వాళ్లా మనమా?
మధ్య ఆసియా ప్రాంత సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎలాంటి వ్యవహారాన్ని కుదుర్చుకోవాలనుకున్నా సరే, అది పాకిస్తాన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మోదీకి తెలిసి వచ్చింది. ఆ దేశాలతో మనం మంచి, బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లయితే, పాకిస్తాన్‌తో సత్సంబంధాలను ఏర్పర్చుకోవడం దీనికి ముందు షరతు. పాక్ పట్ల మోదీ వైఖరిలో మార్పుకు ఇదే కారణం. పాకిస్తాన్‌ను సందర్శిస్తానని ప్రకటించడంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రదర్శిం చిన సాహస చర్యకుగాను ఆయనను తప్పక అభినందించాలి. కేవలం భౌతిక పరమైన సాహస చర్య అనే దృక్కోణంలోంచి మాత్రమే నేనిలా చెప్పటం లేదు. పాకిస్తాన్‌ను నేను అనేకసార్లు సందర్శించి ఉన్నాను కానీ ఎన్నడూ నాకు అక్కడ అభద్రతా భావం స్ఫురించలేదు. అక్కడ తనకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రతను ఇస్తారని మోదీ గ్రహిస్తారు. ఇది స్పష్టం కూడా. అయితే పాకి స్తాన్‌లో అత్యంత భద్రతాచ్ఛాయలో ఉన్న నాటి అధ్యక్షుడు పెర్వేజ్ ముషారఫ్ కాన్వాయ్ కూడా రెండుసార్లు బాంబుదాడికి గురయింది. పైగా పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో బహిరంగ సభలోనే హత్యకు గురై చాలా కాలం కాలేదు. అందుకే, క్రికెట్ టీమ్‌లు కూడా వెళ్లడానికి తిరస్కరిస్తున్న చోటికి వెళ్లడా నికి అంగీకరించిన మోదీని సాహసి అనే చెప్పాలి. మోదీ సాహస ప్రవృత్తికి రెండో ఉదాహరణ కూడా ఉంది. పాకిస్తాన్‌ను సందర్శించాలని నిర్ణయించుకున్న సందర్భంగా ఆయన మన మీడియాలో చాలా మంది హెచ్చరికలను తిరస్కరించారు. అదే సమయంలో మన వ్యూహాత్మక వ్యవ హారాల నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చారు. అంతకంటే ముఖ్యమైన దేమిటంటే, పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాలని ఒత్తిడి చేసిన భారతీయ జనతాపార్టీ మద్దతుదారులను కూడా ఆయన పక్కన పెట్టారు. చాలాకాలంగా నవాజ్ షరీఫ్‌ను తక్కువగా చూడటంలో మోదీ సఫలీకృతు లవుతూ వస్తున్నారు. తానెలా చెబితే అలా చేసేలా పాకిస్తాన్‌ను లొంగదీసుకు న్నట్లు భారత్ గత సంవత్సర కాలంగా చెప్పుకుంటూ వస్తోంది. పాకిస్తాన్ హై కమిషనర్‌ను హురియత్ కలవడం వంటి అప్రాధాన్య అంశం వ్యవహారంలో భారత్ రుసరుసలాడటానికి ఇదే కారణం. అధీన రేఖ పొడవునా నిరంతరం కాల్పులు జరుగుతుండటం వంటి ఇతర వ్యవహారాలకు వస్తే, పాకిస్తాన్‌ను అధిగ మించడానికి తగినంత సైనిక సామర్థ్యం భారత్‌కు ఉందన్న ధీమాను బీజేపీ నిల బెట్టుకోలేకపోతున్న విషయమూ స్పష్టమే. మనం పాకిస్తాన్‌పై ఆధిక్యత ప్రదర్శిం చలేకపోయాం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ పట్ల భారత్ తన వైఖరిని మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ముందే చెప్పినట్లు మోదీ ఇక్కడే నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. పాకిస్తాన్‌ను శాశ్వత శత్రువుగా భావి స్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తి పాకిస్తాన్‌ను సంద ర్శించడం అనేదే ఒక అసాధారణ విషయం. ప్రస్తుతం బీజేపీ జాతీయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా మునుపటి బాస్ ఎంజే అక్బర్.. మోదీ తీసుకున్న యూటర్న్‌పై వ్యాఖ్యానించడానికి తెగ సాహసం ప్రదర్శించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడంపై పాకిస్తాన్ తొలిసా రిగా తన ఆమోదాన్ని తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఇదొక అబద్ధం. పాకి స్తాన్ ఈ అంశంపై చేసిన వాస్తవ సూత్రీకరణ ఏదంటే 2001 సెప్టెంబర్ 9న (9/11) అమెరికాలో అల్‌ఖైదా దాడులు జరిగినప్పటినుంచి ఉగ్రవాదాన్ని ‘దాని అన్ని రూపాల్లో’ తిరస్కరిస్తున్నట్లు మాత్రమే ఆ దేశం పేర్కొంటూ వచ్చింది. నిజా నికి కశ్మీర్లో భారత ప్రభుత్వ ఉగ్రవాదాన్ని కూడా ఈ ‘ఉగ్రవాదపు అన్ని రూపాలు’ పదబంధంలో పొందుపర్చి పాకిస్తాన్ ఉపయోగిస్తూ వచ్చింది. దాన్ని ఇప్పుడు బీజేపీ తన విజయంగా పేర్కొనడం కేవలం కపటత్వమే కాగలదు. అసలు వాస్తవం ఏమిటంటే మోదీ ఈ వారం మధ్య ఆసియా ప్రాంతంలో పర్యటించారు. గ్యాస్‌తో సహా ఆ దేశాల సహజ వనరులను ఉపయోగించుకునే విషయంలో ఎలాంటి వ్యవహారాన్ని కుదుర్చుకోవాలనుకున్నా సరే, అది పాకి స్తాన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మోదీకి తొలిసారిగా తెలిసి వచ్చింది. మధ్య ఆసియా తనకు తానుగా స్థాన చలనం పొంది అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా తనకోసం ఎగిరి వస్తుందని భారత్ భావించలేదు. తుర్క్మెనిస్తాన్, తజ కిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్ దేశాలతో మనం మంచి, బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లయితే, పాకిస్తాన్‌తో మంచి, సత్సంబంధాలను ఏర్పర్చుకున్న తర్వాతే అందుకు పూనుకోగలం. భౌగోళిక పరిధులను మనం ఎన్నటికీ అధిగమించలేము. బీజేపీ నేత, అటల్ బిహారీ వాజ్‌పేయి తరచుగా ఎంతో వివేకంతో దీన్ని ప్రస్తావించేవారు. ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అయితే నేనిప్పుడు ఈ విషయంపై బాకా ఊదడం లేదు. కానీ, పాకిస్తాన్ పట్ల వైఖరిని గత నవంబర్లోనే మోదీ మార్చుకున్న సందర్భంగా నేను ఇలా రాశాను. ‘‘నా అభిప్రాయం ప్రకారం తన చర్యల పర్యవసానం గురించి పెద్దగా ఆలోచించకుండానే పాకిస్తాన్‌తో తన సంప్రదింపులను మోదీ రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ గురించి ఆయన గట్టిగానే మాట్లాడారు కానీ, ఈ వారం మాత్రం (అంటే గత నవంబర్‌లో) తన శత్రువైన నవాజ్ షరీఫ్‌తో తప్పనిసరై మోదీ చేతులు కలపాల్సి వచ్చింది. మోదీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది తప్పనిసరి. ఇది వినా మరొక మార్గం లేదు. కొందరు ఊహిస్తున్నట్లు మోదీ విధానం ఇక్కడా లేదు అక్కడా లేదు. అది కేవలం అంగ విన్యాసం మాత్రమే. ఇలాంటి వైఖరిని భరించడమనేది ఆచరణ సాధ్యం కాని సందర్భంలో కఠినంగానూ, పెడసరం గానూ వ్యవహరించడం భారతీయులకు తెచ్చిపెట్టే ప్రయోజనం ఏమిటో మరి?’’ బీజేపీలోకానీ, మీడియాలోని దాని బలమైన మద్దతుదారులలో కాని ఏ ఒక్కరూ దీన్ని వివరించలేరు. సరిహద్దులలో మన పౌరులను పాక్ సైన్యం చంపుతున్న దానికంటే ఎక్కువగా పాక్ పౌరులను హతమార్చడం ద్వారా పాకి స్తాన్‌కు గుణపాఠం చెప్పానని నాటి రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీన్ని గుణపాఠమనే చెబుదామా? పలువురు భారతీయులు దీంతో ఏకీభవించక పోవచ్చు. అలా చేస్తే సరిహద్దుల్లో కాల్పులు శాశ్వతంగా ఆగిపోతాయని జైట్లీ ఏద యినా హామీ ఇవ్వగలరా? ఇలా కుదరనట్లయితే, పరిణామాలు తీవ్రస్థాయికి చేరినప్పుడు వాటిని చల్లబర్చేలా వ్యవహరించకుండా పాకిస్తాన్‌తో సంభాషణలు జరపకుండా ఉండటంలో అర్థం ఏమిటి? కఠినంగా వ్యవహరించాలనే ఆలోచనా విధానం తనకు తానుగా చేసిన ప్రతి పాదనలు ఏవీ లేవు. గత 20 ఏళ్లుగా ఇది పదే పదే స్పష్టమవుతూ వచ్చింది. వాస్త వాలు దీన్ని నిరూపిస్తాయి. ఉపఖండాన్ని ఒక అణు యుద్ధరంగంగా బీజేపీ రూపొందించింది నిజమే.. అంతమాత్రాన, పాకిస్తాన్‌పై తన కండబలం ప్రదర్శిం చేటంత బలమైన స్థితిలో భారత్ లేదు. కశ్మీర్‌పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని అది తిరస్కరిస్తోంది. పైగా.. ఈ సమయంలో కూడా భారత్, పాక్‌తో మాట్లా డటం లేదు. ఈ పరిస్థితి మారుతుంది. చివరకు.. భారత్, దాని కాఠిన్యపు బృం దమే లోబడవలసి వస్తుంది. ఎంజే అక్బర్ సాహసోపేతమైన, నిరర్థక ప్రసంగాలను పక్కనబెట్టి చూస్తే బీజేపీ ఇప్పటికే కాస్త తగ్గింది. దీంట్లో ఏ తప్పూ లేదు. పాకిస్తాన్ ఏ ఒక్క విషయం లోనూ మారలేదు. మారిందల్లా బీజేపీ, దాని దాపరికంలేని మద్దతుదారులే. వాస్తవంగా చూస్తే ఇది మంచి విషయం కూడా. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు
పదో తరగతి జీవశాస్త్రం భూమి సహజ వనరులకు ఆలవాలమైన గ్రహం.నీరు, నేల, అడవులు, వృక్షాలు, జంతువులు మానవ మనుగడకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.వీటిని సరైన రీతిలో వినియోగించుకోకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. భవిష్యత్ తరాలు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత. సహజ వనరులు వనరులను సంరక్షించకపోతే కలిగే నష్టాలు, వాటిని సుస్థిరపరచుకునే విధానాల గురించి ‘సహజ వనరులు’ పాఠ్యభాగంలో వివరించారు. దీంట్లో భాగంగా రెండు గ్రామాల్లో నిర్వహించిన అధ్యయనాలను పేర్కొన్నారు. వనపర్తి గ్రామంలో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఈ గ్రామంలో బావుల ద్వారా నీటి పారుదల నిర్వహించే 25 కుటుంబాల సామాజిక, ఆర్థిక అంశాలను సేకరించారు. వడ్డిచెర్ల గ్రామంలో తీవ్ర నీటికొరత ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో బావుల సంఖ్య, నీటి పారుదల ఉన్న భూ వైశాల్య శాతం, అందులో తగ్గుదల, ఫలితంగా పంటల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. చిన్న, పెద్ద రైతులు బావుల ద్వారా నీటిపారుదలపై చేస్తున్న వార్షిక ఖర్చు, పంటల ద్వారా పొందిన ఆదాయాన్ని సరి చూశారు. ఈ గ్రామాల్లో ఎండిపోతున్న బావుల్లో నీరు చేరుకునేలా భూగర్భ జలాల సుస్థిరత్వం కోసం కేంద్రం దృష్టి సారించింది. మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశ పెట్టడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లాంటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించింది. ఫలితంగా నీటి వనరుల రక్షణలో పెద్ద ముందడుగు పడింది. అందరికీ నీరు అనే అంశంలో భూమిపై ఉన్న మొత్తం నీటి గణాంకాలను తెలియజేస్తూ, మంచినీరు చాలా తక్కువగా ఉందని, నీటిని విచక్షణతో వాడుకోవాలని వివరించారు. వాటర్‌షెడ్, సామాజిక చెరువు, కాంటూర్ సేద్యం లాంటి సముదాయ ఆధారిత విధానాలను అవలంబించాలని తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్యం దిశగా జరిగిన ప్రయత్నం, సముదాయ ఆధారిత విధానాలు, వీటికి సహాయపడిన ఇక్రిసాట్ సంస్థ గురించి తెలుసుకోవాలి. తక్కువ ఎత్తు పెరిగే పంటలను సాగు చేయడం, కాంటూర్ సేద్యం మొదలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుకునే రైతు ఆధారిత విధానాలను ప్రోత్సహించడం చాలా అవసరం. బీడు భూముల అభివృద్ధి, వాటిలో మొక్కల పెంపకం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, నీటి వనరులు మొదలైన అంశాల గురించి తెలిపారు. గోదావరీ నదీజలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడానికే సరిపోవడం లేదు. అందువల్ల నీటిపారుదల సౌకర్యాల వినియోగం కోసం మెరుగైన పథకాలను రూపొందించుకోవాల్సి ఉంది. మన చుట్టూ ఉన్న పునరుద్ధరింపదగిన, పునరుద్ధరింపలేని వనరుల గురించి అవగాహన పెంచుకోవాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇళ్లు, వస్తువుల ఉత్పత్తి - రవాణా, ఇంధన వినియోగం గురించి తెలుసుకోవాలి. అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు. భూమిపై అధికంగా మానవుడి తాకిడికి గురవుతున్న వనరు కూడా ఇదే. దీనివల్ల హరిత గృహ వాయువులు విడుదలై, గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి. భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందించడానికి సుస్థిర అటవీ విధానాలను అనుసరించాలి. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. రాజస్థాన్‌లో బైష్ణోయి తెగకు చెందిన అమృతాదేవి, ఆమె కుమార్తెలు, గ్రామస్థులంతా అడవులను నరికివేయకుండా కాపాడటానికి ప్రాణాలు అర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. సుస్థిర అటవీ పద్ధతులు, పునఃచక్రీయ విధానాలను అవలంబించడం ద్వారా అడవులను కాపాడుకోవాలి. ఆహారోత్పత్తికి నేల అత్యంత అవసరం. ఒకే రకం పంటను పలుమార్లు పండించడం లాంటి లోపభూయిష్టమైన పద్ధతుల వల్ల నేలలోని పోషకాలు నశిస్తాయి. కాంటూర్ పట్టీ పంటలు, ఎంపిక పంట పద్ధతులతో నేలను రక్షించుకోవచ్చు. జీవవైవిధ్యం మరో ప్రధాన అంశం. భూమిపై తరిగిపోతున్న జీవులు, వాటిని కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది శిలాజ ఇంధనాలు. మనదేశంలో ఉపయోగిస్తున్న వివిధ వనరుల గురించి తెలుసుకోవాలి. ఇంధన పొదుపు, దీని కోసం పాటించాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (బయోడీజిల్), సైకిల్ వాడకం లాంటివాటి గురించి తెలుసుకోవాలి. భూమిలో లభించే వివిధ ఖనిజ లవణాల గురించి పరిశీలించాలి. గనుల తవ్వకం ద్వారా కోల్పోతున్న ఖనిజ నిక్షేపాలు, వెలువడుతున్న గాలి, ధూళి లాంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా.. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మూడు ఖ (ఖ్ఛఛీఠఛ్ఛి, ఖ్ఛఠట్ఛ, ఖ్ఛఛిడఛ్ఛి)లను ఆచరించాలి. ఐ్ఖఇూ లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ కోసం చేస్తున్న కృషిని తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అభివృద్ధిపేరుతో వనరుల విధ్వంసం పరిశ్రమల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, రహదారుల ఏర్పాటు కోసం వనరులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అనేక ప్రాంతాల్లో పంటపొలాలు ప్లాట్లుగా మారి బీడుపడి పోతున్నాయి. బహుళజాతి సంస్థల వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో నీరు వ్యాపారమైంది. బెంగాల్‌లోని సింగూరు భూములు, తమిళనాడు కుడంకుళం లాంటివాటిని వనరుల అతి వినియోగానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీటికి సంబంధించి ప్రజావ్యతిరేకత అధికంగా ఉంది. పర్యావరణ సంరక్షణ సూత్రాలు తగ్గించడం, తిరిగి వాడటం, పునఃచక్రీయం అనే 3 అంశాల ద్వారా పర్యావరణ రక్షణను నిర్వహించాలి. 1. తగ్గించడం (ఖ్ఛఛీఠఛ్ఛి): వనరులను వృథా చేయకుండా తక్కువగా వినియోగించాలి. అవసరంలేని సమయాల్లో విద్యుద్దీపాలు, ఫ్యాన్లను ఆర్పి ఉంచాలి. 2. తిరిగి వాడటం (ఖ్ఛఠట్ఛ): పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవాలి. కాగితాన్ని తిరిగి వాడటం వల్ల మొక్కలను అధిక మొత్తంలో కాపాడగలుగుతాం. 3. పునఃచక్రీయం (ఖ్ఛఛిడఛ్ఛి): ఒకసారి ఉపయోగించి వృథాగా ఉన్న పదార్థాలను తిరిగి వేరే రూపంలో వినియోగించుకోవాలి. దీన్నే పునఃచక్రీయం అంటారు. వీటితో పాటు ఇటీవల ఖ్ఛ్టజిజీజు (తిరిగి ఆలోచించడం) అనే అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కూడా ఆచరణీయమే. కీలకభావనలు ఇంకుడు చెరువు: నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పరిచే నీటి నిల్వలే ఇంకుడు చెరువులు. సూక్ష్మ నీటిపారుదల: బిందు సేద్యం, తుంపరల విధానం ద్వారా జరిగే నీటిపారుదల. బోరు బావులు: భూగర్భ జలాలను పైకి తేవడానికి తవ్వే గొట్టపు బావులు. సుస్థిర అభివృద్ధి: ఒక రంగంలో జరిగే అభివృద్ధి వల్ల మరో రంగానికి నష్టం కలుగకుండా సమగ్ర అభివృద్ధి సాధించడం. జీవ ఇంధనాలు: మొక్కలు, జంతు సంబంధ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసే ఇంధనాలు. కాంటూర్ పట్టీ పంటల విధానం: నేల క్రమక్షయానికి గురవకుండా నేలవాలుకు అడ్డంగా కట్టలను ఏర్పరచడం ద్వారా జరిపే వ్యవసాయ విధానం. గట్లు: వర్షపు నీరు పొలాల్లోకి పారి వ్యర్థం కాకుండా అడ్డుగా నిర్మించే నిర్మాణాలు. కట్టల నిర్వహణ: వాన నీటిని వ్యర్థం కాకుండా అడ్డుకట్టల్లో నిల్వచేసి, ఆ నీటిని తిరిగి ఎండిన బావులు, బోరు బావుల్లో నింపి భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి అనుసరించే విధానం. ఇంకుడు గుంతలు: వర్షపు నీరు భూమిలో ఇంకడం కోసం తవ్వే గుంతలు. ఇక్రిసాట్ (ఐఇఖఐఅఖీ): ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది అర్ధ శుష్క మండలాల్లో పెరిగే మొక్కలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది. డైక్: ప్రాజెక్టు నుంచి వెళ్లే కాలువలకు కట్టే అడ్డుకట్టలను డైక్‌లు అంటారు. నీటి వినియోగదారుల సంఘం: చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల లాంటి నీటి వినియోగ నిర్మాణాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజాసంఘాలు. రైతు ఆధారిత విధానాలు: పొలాల్లో వ్యక్తిగతంగా నేల, నీటి సంరక్షణ కోసం రైతులు అమలు చేసే కార్యక్రమాలను రైతు ఆధారిత విధానాలు అంటారు. గ్లైరిసిడియా: పొడి నేలలో పెరిగే లెగ్యుమినేసి కుటుంబ మొక్కలు. ఇవి నేలలో నైట్రోజన్ నిల్వలు పెరగడానికి, గట్లు బలంగా ఉండటానికి సహాయపడతాయి. బిందు సేద్యం: ఇది సూక్ష్మ నీటిపారుదల విధానం. మొక్కలకు సన్నని పైపుల ద్వారా వేర్ల వద్ద నీరు అందేలా చేస్తారు. ూఖఈ్క: యునెటైడ్ నేషన్స డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది ప్రపంచ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హరిత గృహ వాయువులు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ూై2, క్లోరోఫ్లోరో కార్బన్లను గ్రీన్హౌస్ వాయువులు అంటారు. ఇవి ఓజోన్ పొరకు హాని కలుగజేస్తాయి. సుస్థిర అటవీ విధానాలు: భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయడానికి అవలంబించాల్సిన విధానాలను సుస్థిర అటవీ విధానాలు అంటారు. ఎంపిక పంట పద్ధతి: పంట కోసేటప్పుడు ఒక్కో మొక్క లేదా చిన్న గుంపును తీసివేయడం. దీనివల్ల నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. జట్రోఫా కర్కాస్: బయో డీజిల్ తయారీకి ఉపయోగపడే మొక్క. 1. మంజు ఇంటికి పాలిథిన్ కవర్లను తేవడం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎ) ఆమె మార్కెట్టుకు వెళ్లకూడదు బి) అమె పాలిథిన్ను వాడాలి సి) మార్కెట్టుకు గుడ్డసంచీ తీసుకెళ్లాలి డి) కూరగాయల బదులు వేరేవి తినాలి 2. రమ్య తన పాత పుస్తకాలను పారేయకుండా తన చెల్లెలికి ఇచ్చి చదువుకోమన్నది. ఈ చర్య దేనికి ఉదాహరణ? ఎ) తగ్గించడం బి) పునఃచక్రీయం సి) సహాయం డి) పునర్వినియోగం 3. కింది వాక్యాల్లో ఏది సత్యం? 1) నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచడానికి ఎక్కువ ఎరువులు వేయాలి 2) గట్లపై గ్లైరిసిడియా మొక్కలను పెంచడం ద్వారా నత్రజని నిల్వలను పెంచాలి. ఎ) 1, 2 సత్యం బి) 1 సత్యం, 2 అసత్యం సి) 2 సత్యం, 1 అసత్యం డి) 1, 2 రెండూ అసత్యం 4. కిందివాటిలో రైతు ఆధారిత విధానం ఏది? ఎ) కాలువలు తీయడం బి) చెరువుల కింద సాగు సి) కాంటూర్ పట్టీ సేద్యం డి) ఎక్కువ నీటిని వినియోగించడం సమాధానాలు 1) సి 2) డి 3) సి 4) సి 1. అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ ృృృృ లో ఉంది. 2. నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో ఆనకట్టలు కట్టి ఏర్పరచిన నిర్మాణాలు ృృృృృ 3. }రాంసాగర్ ప్రాజెక్టును ృృృృృ నదిపై నిర్మించారు. జవాబులు 1) హైదరాబాద్ (రాజేంద్రనగర్) 2) ఇంకుడు చెరువులు 3) గోదావరి -
విమాన నగరం
విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల నిర్వహణ సముదాయం ఏర్పాటుకు విదేశీ సంస్థల ఉత్సాహం పెరుగుతున్న విదేశీ సర్వీసులు పర్యాటక, పారిశ్రామిక రంగాలను ఆకర్షించే ప్రయత్నం విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. ఇక్కడి సహజ వనరులు, సదుపాయాలు పాలకుల్లో ఆశలు కల్పిస్తున్నాయి. జి ల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు కూడా అందుబాటులో ఉండటం, పర్యాటక ప్రాం తాలు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులను ఆకర్షించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దేశ, విదేశీ పెట్టుబడులు ఇక్కడికి రావాలంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుండి రోజుకి 16 నుంచి 18 విమాన సర్వీసులు నడుపుతున్నారు. నాలుగు దేశీయ, నాలుగు అంతరాతీయ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుత సర్వీసులు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. దీంతో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్‌జైన్ ఇటీవల విశాఖలో ప్రాధమికంగా వెల్లడించారు. ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ప్రస్తుత ఎయిర్‌పోర్టును విస్తరిస్తే సరిపోతుందని, భోగాపురం విశాఖకు 55 కిలోమీటర్లు ఉన్నందున ప్రయాణీకులకు ఇబ్బంది గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరిస్తారా లేక విశాఖ సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు నిర్మిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా విమానాశ్రయం విస్తరణ తప్పనిసరి అనేది స్పష్టమవుతోంది. ఇక ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు విశాఖలో విమానాల నిర్వహణ సముదాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే 100 విమానాలతో ఇక్కడ హబ్ నెలకొల్పుతామని ప్రకటించింది. విమాన సర్వీసులు కూడా పెరుగుతున్నాయి. ఎయిర్ ట్రావెల్ర్స్ అసోసియేషన్ (ఇండియా) చేసిన ప్రయత్నాల వల్ల ఇటీవల ఎయిర్ ఏషియా కంపెనీ కౌలాలంపూర్-విశాఖ-కౌలాలంపూర్ సర్వీసును ఎయిర్ ఏషియా తక్కువ టిక్కెట్టుతో ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, బ్యాంకాక్, యునెటైడ్ స్టేట్స్, టోక్యో, బీజింగ్‌లను కలుపుతూ ఈ సర్వీసు నడుస్తోంది. ఇదే కంపెనీ బ్యాంకాక్-విశాఖ-బ్యాంకాక్ సర్వీసును త్వరలో ప్రారంభించనుంది. ఎయిర్ లంక నడుపుతున్న కొలంబో-విశాఖ-కొలంబో సర్వీసును కూడా రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు ఎటిఎ అధ్యక్షుడు డి.వరదారెడ్డి అంటున్నారు. మరోవైపు ఫ్లై దుబాయ్, ఎఐ అరేబియా విమాన సంస్థలు కూడా ఆయా దేశాలకు నేరుగా విశాఖ నుంచి విమాన సర్వీసులు నడిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కనిపించని ‘ప్రకాశం’
ప్రకాశం జిల్లా: అవతరించి 45 ఏళ్లు కావస్తోంది. వెనుకబడిన ప్రాంతాల సంగమంగా ఏర్పడిన ‘ప్రకాశం’లో సహజ వనరులకు కొరతలేకున్నా పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి వెలుగు రేఖలు ప్రసరించడం లేదు. నేడు జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రకాశం జిల్లా ఆవిర్భావానికి ఓ విశిష్టత ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉందన్న కారణంతో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. అయితే ఏ క్షణాన జిల్లా పురుడు పోసుకుందో కానీ.. ఇప్పటికీ అభివృద్ధి సాధించలేక పోయింది. నిరుద్యోగం.. కరువు.. ఆకలి చావులు.. వలసలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. నేడు జిల్లా ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై సింహావలోకనం చేసుకుందాం... -ఒంగోలు టౌన్ సహజవనరులున్నా.. జిల్లాలో సహజన వనరులకు కొరత ఉందనుకుంటే అది తప్పే. కేవలం పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. రాష్ట్ర విభజన తర్వాత అయినా మేలు జరుగుతుందనుకుంటే మెుండి చేయే చూపించారు. జిల్లాలో నల్ల బంగారంగా ఖ్యాతి చెందిన గ్రానైట్ వ్యాపారానికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. రాయల్టీలో రాయతీ.. ఎక్స్పోర్టులో ప్రభత్వ సాయం అందకపోవడం.. కరెంటు కోతలు ఆ రంగాన్ని దెబ్బ తీస్తున్నాయి. రంగుల పలకలదీ ఇదే పరిస్థితి. ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తే ఇబ్బడిముబ్బడిగా విదేశీమారక ద్రవ్యం వచ్చే అవకాశాలున్నా అటు వైపు పూర్తిగా దృష్టి సారించడంలేదు. చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటీ లేకపోవడంతో నిరోద్యోగం తాండవిస్తోంది. పారిశ్రామిక రంగంలో జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడంలేదు. కన్నీరు మిగుల్చుతోన్న ప్రాజెక్టులు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా భావించిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దీనిని పూర్తిగా పక్కన పెట్టేసింది. బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కేటారుుంచడంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రధాన పంట కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందడంలేదు. కేవలం ఆర్భాటపు ప్రకటనలే.. పామూరు, పీసీపల్లి మండలాల్లో జాతీయ ఉత్పత్తిరంగ జోన్‌ను ఏర్పాటుచేసి 70వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామంటూ ఇటీవల కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ప్రకటించారు. అదేవిధంగా దొనకొండలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కుతో 30వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. కానీ ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాకు కీలకమైన యూనివర్శిటీ ప్రస్తావన కూడా లేకుండా పోయింది. దీని కోసం విద్యార్థి సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోవడంలేదు. యంత్రాంగం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే నిజంగానే జిల్లా ప్రకాశిస్తుందని భావించక తప్పదు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మెుత్తం 74 పరిశ్రమలున్నట్లు చెప్పుకుంటున్నా.. వీటి వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారో ప్రశ్నార్థకమే! ధాన్యాగారానికి ఎసరు.. జిల్లాలో వరి సాగు పండించే భూములు లక్షల హెక్టార్లలో ఉన్నారుు. సాగర్, కొమ్మమూరు కాలువల కింద ప్రధాన ఆయకట్టు ఉంది. అరుుతే ప్రతి ఏటా నీటి విడుల కోసం యుద్ధాలు చేయూల్సి వస్తోంది. ఫలితంగా బంగారు పంటలు పండే భూములు ఎండిపోతున్నాయి. దీనికితోడు తీవ్ర వర్షాభావం వల్ల ప్రధాన చెరువులు, రిజర్వాయర్లు నిండక వాటి కింద భూములు బీడులుగా మారుతున్నారుు. నీటి విడుదలలో ప్రజా ప్రతినిధులు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా సాగర్ విషయంలో గుంటూరు జిల్లా రైతులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నా ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనుల్లేక జిల్లా వ్యాప్తంగా వలసలు ఎక్కువయ్యూరుు. ఏడాదిలో ఎనిమిది నెలలకు పైగా సొంత ఊర్లను వదిలి వెళుతున్నారు. అవతరణకు ముందు విశేష కృషి ప్రకాశం జిల్లా అవతరించడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడంతో జిల్లా ఏర్పాటుపై శాంతియుత పోరాటాలు జరిగాయి. కానీ శ్రమ వృథానే అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించారు. ఒంగోలుకు చెందిన వకీలు మట్టా హరినారాయణ శ్రేష్ఠి, బత్తిన పెరుమాళ్లునాయుడుకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. బత్తిన పెరుమాళ్లునాయుడు 1937-1946 ప్రాంతంలో మద్రాసు రాష్ట్రానికి శాసనసభ్యునిగా వ్యవహరించారు. 1960 ఫిబ్రవరి 23న పిశుపాటి వెంకటరాయశర్మ ఒంగోలు జిల్లా ఏర్పాటు అవసరంపై ప్రభుత్వానికి విన్నవించారు. జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నందున ఈ విజ్ఞప్తిని మన్నించలేకపోతున్నట్లు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత గంజాం రాఘవాచార్యులు, ధారా గోపాలశాస్త్రి, నారాయణం కేశవాచార్యులు, ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం తదితరులు కృషి చేశారు. రొండా నారపరెడ్డి కృషితో సఫలీకృతం జిల్లా ఏర్పాటు విషయంలో పట్టువదలని విక్రమార్కునిగా పోరాడి సాధించిన ఘనత జిల్లాకు చెందిన మాజీ మంత్రి రొండా నారపరెడ్డికి దక్కుతుంది. దీని కోసం నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై ఆయన ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. చివరకు 1970 ఫిబ్రవరి 2న నూతన జిల్లా ఏర్పాటైంది. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను వేరుచేసి సరిహద్దులు నిర్ణరుుంచారు. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్నూలు జిల్లా, ఉత్తరాన గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాలు, దక్షిణాన నెల్లూరు, కడప హద్దులుగా ఒంగోలు జిల్లా తన ప్రయూణాన్ని ప్రారంభించింది. ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తుగా.. ఇదే ప్రాంతానికి చెందినవారై కావడంతో 1972 మేలో ప్రకాశం జిల్లాగా పేరు మార్పు చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలున్న భ వనానికి ప్రకాశం భవన్ అనేపేరు పెట్టారు. 1982 నవంబరు 5న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాంస్యవిగ్రహా న్ని ఇదే ఆవరణలో.. నాటి గవర్నర్ కేసీ అబ్రహం ఆవిష్కరించారు. -
మనసొకటి... మాటొకటి!
అపారమైన ప్రకృతి వనరులు, మేలురకం మానవ వనరులు ఏపీలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త ఏడాది ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడంవల్ల అయోమయం తప్ప ఫలితముంటుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానే లేదు. ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప. ఢిల్లీ దర్బార్‌లో ఇటీవల ఒకరోజు. సింహాసనం ఎదుట ఆం.ప్ర. ఏలిక. ‘దేవరా, మోదీవరా! కొత్తరాష్ర్టంగా ఏర్పడ్డాం, పీకల్లోతు కష్టాల్లో వున్నాం. పెద్ద మనసుతో ఆదుకోవాలి’. ‘మీ అర్జీ మాకు తెలుసు. మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకు వచ్చారు. కానీ...’ ‘అయ్యో, ఎంత మాట! అది అయ్యేపనికాదని మీకూ తెలుసు... మాకూ తెలుసు’. ‘మరి?... పోలవరం తక్షణం పూర్తి చేయమంటారు. అంతేనా?’ ‘తొందరేమి లేదు. ప్రస్తుతానికి ఎత్తిపోతల స్కీముతో ఎత్తిపోసుకునే ఆలో చన చేస్తున్నాము. ఆ విషయాన్ని మీరు సావకాశంగా పరిశీలించవచ్చు.’ ‘అయితే మీ మనసులోని మాటేమిటో... ఎన్టీఆర్‌కు భారతరత్న అడిగేం దుకు వచ్చారు. ఔనా?. కానీ, ఈసారికి నిర్ణయం జరిగిపోయింది. భవిష్యత్తులో చూద్దాం.’ ‘నా మనసేమిటో తెలిస్తే మీ నోటి వెంట ఇలాంటి ప్రశ్న వచ్చేదే కాదు.’ ‘మరి మీ కోరికేమిటో మీరే సెలవీయండి.’ ‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్‌ను చేపట్టాము. మావాళ్లంతా ఈ ప్రాజెక్టు మీద గంపెడాశలు పెట్టుకు న్నారు. భూసమీకరణకు ప్రత్నిస్తున్నాము. కానీ భూసేకరణ చట్టాన్ని అలుసుగా తీసుకొని కొందరు సహకరించడం లేదు. మీరు తక్షణం ఆ చట్టం కోరలు పీకేయాలి.’ ‘మేమూ అదే ఆలోచిస్తున్నాము. మా మీదా ఒత్తిడి పెరుగుతోంది. తప్పని సరిగా సవరిద్దాం. వచ్చే బడ్జెట్లో సుమా...’ ‘అప్పటి దాకా ఆగలేము. అతి పే...ద్ద ప్రాజెక్టు. ప్రారంభం కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాము. మిమ్మల్ని ఇంకే కోరికా కోరము. హుద్‌హుద్ తుపాను సాయం కోసం కూడా పట్టుబట్టలేదు. ఈ విషయంలో మాత్రం తక్ష ణం ఆర్డినెన్స్ బాణాన్ని ప్రయోగించాలి. తప్పదు.’ ‘మాకూ అవసరం... మీకూ అవసరం. అలాగే చేసేద్దాం. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ఎనభై శాతం మంది సమ్మతి, సామాజిక ప్రభావాల అంచనా వంటి నిబంధనల్ని తొలగిద్దాం’. ‘చట్టంలో మరో దుర్మార్గ నిబంధన కూడా వుంది. ముక్కారు పంటలు పండే భూములను అభివృద్ధి కోసం సేకరించవద్దట. ఆ నిబంధన కూడా తొల గించాలి. మా రాజధాని భూముల్లో మూడు పంటలూ పండుతాయి...’ ‘ఇంకేమీ అడగనన్నారుగా... మీ కోసం అలాగే... ఆల్ ది బెస్ట్’ కేంద్ర సర్కార్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన సంభాషణలేమిటో మనకు తెలియదు కానీ, సారాంశం మాత్రం పైన చెప్పిందేనని ఢిల్లీ రాజకీయవర్గాల భోగట్టా. అపార రాజకీయానుభవశాలి, అపర చాణక్యుడు, హైదరాబాద్ నవ నిర్మాత వగైరా బిరుదులతో మీడియా చేత పిలిపించుకోవాలని తెగ ఉబలాట పడే చంద్రబాబునాయుడు గడచిన ఏడు మాసాల పాలనలో కేంద్రంలోని మిత్రపక్షం వద్ద చక్రం తిప్పి సాధించిన ఏకైక ఘన కారం్య- భూసేకరణ చట్టం కోరలు పీకే ఆర్డినెన్స్‌ను ఆగమేఘాల మీద జారీ చేయడమే. రాజధాని హడావుడిని మినహాయిస్తే, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా నిస్తేజమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలు అటకెక్కాయి. ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన సంతకాలకూ దిక్కులేదు. సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచనైతే పెంచారు కానీ, ఈ జాబితా నుంచి 18 లక్షల మందిని తొలగించారు. పునరుద్ధరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక, జీవనాధారం కోల్పోయిన షాక్‌ను తట్టుకోలేక గుండెపగిలి చనిపోతున్న వార్తలు ప్రతిరోజూ వినవస్తున్నాయి. రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాబు రుణమాఫీ మాటను నమ్మి తన విజయానికి తొలి కారణంగా నిలిచిన రైతు లోకాన్ని ఆయన వంచించిన తీరు రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నమ్మినందుకు ‘అన్న’కు వెన్నుపోటు తప్పనట్టే అన్నదాతకూ బాబు వెన్నుపోటు తప్పలేదు. బాబు వాగ్దాన భంగం దెబ్బకు మహిళల పొదుపు సంఘాలు కుదేలయ్యాయి. వారి పొదుపులు సగానికి సగం పడిపోయాయని ఒక అధ్యయనంలో తేలింది. రైతులకు పాత అప్పులు మాఫీకాక, కొత్త అప్పులు దొరకక వ్యవసాయం మూలనపడింది. దాంతో ఉపాధి లేక లక్షలాది మంది వలస బాట పట్టారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచే రెండున్నర లక్షలమంది కర్ణాటకకు వలస పోయారంటే గ్రామాల పరిస్థితి ఎంత దైన్యంగా ఉందో తెలుస్తుంది. ఇంకా శీతాకాలంలోనే ఉన్నాం. వేసవికాలం రానే లేదు. అప్పుడే మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సుమారు రెండు వేల గ్రామాల గొంతు తడవాలంటే నీళ్ల ట్యాంకర్లు రావాల్సిందే. రక్షిత మంచినీటి వసతి లేక కలుషిత నీటి వాడకంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాథమిక వైద్యం పడకేసింది. బెజవాడ వంటి నగరంలోనే కుక్కకాటుకు మందులేక నిండు ప్రాణం బలైపోయిన సంఘటనను మనచిపోలేము. ఒక్క కర్నూలు జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే గడచిన సంవత్సరం 12 వేల మంది ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకొని బయటకొచ్చారు. వీరిలో కేవలం ఐదువందల మందికి మాత్రమే చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరికాయి. అవి కూడా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో. మిగతా ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగుల్లో కొందరు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుం టున్నారు. ఎక్కువ మంది నిరుద్యోగ సైన్యంలో కలసిపోయారు. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఇప్పటికే లక్ష మంది నమోదయ్యారు. ఇదే పరిస్థితి కొద్దిపాటి హెచ్చుతగ్గులతో రాష్ట్రమంతటా ఉంది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించేది. రాజకీయ కారణాలతో దాన్ని అటకెక్కించారు. హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో 1,500 కోట్ల నష్టం జరిగిందని అధికారులే తేల్చారు. ఇప్పటికీ పైసా పరిహారం రాలేదు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లు ధ్వంసమై మత్స్యకారులు వీధినపడితే ఇప్పటికీ సాయం అందలేదు. పదమూడవ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల కోసం విడుదల చేసిన నిధులను కరెంటు బిల్లుల కింద ప్రభుత్వం కట్టేసుకుంది. ఇప్పుడు చీపుర్లుకొనే డబ్బులు కూడా లేని పంచాయతీలు స్వచ్ఛ భారత్ కోసం ఎలా కృషి చేస్తాయో చూడాలి. రాష్ట్ర వాస్తవ పరిస్థితులు ఇలావుంటే పూర్తి అసత్యాలతో కొత్త సంవత్సరం రోజున రాష్ట్రముఖ్యమంత్రి కొన్ని పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ప్రజల వివేకాన్ని, జ్ఞాపక శక్తిని కూడా ఎగతాళి చేసేదిగా ఉంది. జనవరి ఒకటో తేదీనాడు చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన సారాంశం- ‘‘2004 నాటికి నేను రాష్ట్రంలో ఒక స్వర్గాన్ని నిర్మించాను. ఆ తరువాత పాలకులు దానిని నరకంగా మార్చారు. సుదీర్ఘ పాదయాత్రలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగుల దుర్భర జీవితాలను చూసి చలించిపోయాను. వారి మోముల్లో వెలుగులు పూయిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందుకే అధికారంలోకి రాగానే రైతు రుణ విముక్తి, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల పెంపు, ఉద్యోగుల పదవీ విరమణ పెంపు, స్వచ్ఛమైన మంచినీరు, బెల్టుషాపుల రద్దు వంటి అంశాల ఫైళ్లపై సంతకం చేశాను. ఆ మేరకు రైతుకు రుణ ఉపశమనం చేశాను. తుపానును ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. యువశక్తి ఉంది. ఖనిజసంపద ఉంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుదాం.’’ కాబట్టి 2004 నాటికి రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ మేరకు అగ్రస్థానంలో నిలిపారో, ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో సూచించే కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. * చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఆఖరు సంవత్సరం (2003- 04) రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల టన్నులు కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న చివరి సంవత్సరం (2008-09) ఆహార ధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులు. * బీటీ పత్తి విత్తనాల ధర ప్యాకెట్‌కు చంద్రబాబు హయాంలో రూ. 1,850. రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 650. * రాష్ర్ట ఆర్థికవృద్థి చంద్రబాబు చివరి ఐదేళ్లలో 5.72% వైఎస్ ఐదేళ్ల కాలంలో 9.54%. * రాష్ర్ట ఆస్తులు- అప్పుల నిష్పత్తి చంద్రబాబు పాలనలో 45 :100, వైఎస్ పాలనలో 120 :100. * వరి కనీస మద్ధతు ధర చంద్రబాబు పాలనలో క్వింటాల్‌కు రూ. 490. వైఎస్ పాలనలో రూ. 1,000. * ఐటీ ఉద్యోగుల సంఖ్య 2004 నాటికి 85,000. అదే 2009 నాటికి 2,50,000. * ఆర్టీసీ చార్జీలు చంద్రబాబు కాలంలో(1995-2004) ఐదుసార్లు పెరిగితే వైఎస్ కాలంలో (2004-2009) ఒక్కసారి కూడా పెరగలేదు. * అదే కాలంలో విద్యుత్ చార్జీలు చంద్రబాబు ఎనిమిదిసార్లు పెంచితే వైఎస్ ఒక్కసారి కూడా పెంచలేదు. * బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు. వైఎస్ మాత్రం ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, ఈబీసీ విద్యార్థు లకు ఈ పథకాన్ని అమలు చేశారు. * చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేశారు. వైఎస్ అమలు చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వ్యవసాయం చతికిలపడి, కులవృత్తులు మూలనపడి వయసొచ్చిన జనమంతా వలసబాట బట్టి కదల్లేని వృద్ధులతో, మొండి గోడలతో మిగిలిపోయి కళ తప్పిన నాటి గ్రామాలపై మహాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లే కన్నీరు పెడు తుందో’... అన్న గేయం ఒక్కటి చాలదా? చంద్రబాబు పాలనపై అంతకు మిం చిన అభిశంసన పత్రం ఇంకేముంటుంది? అపారమైన ప్రకృతి వనరులు- మేలు రకం మానవ వనరులు రాష్ర్టంలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త సంవత్సరం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా (దృష్టిని కేంద్రీకరించాల్సిన రంగం) ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ (హార్డ్‌వేర్- సాఫ్ట్వేర్)-ఫార్మా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, పవర్ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడం వల్ల అయోమయం తప్ప ఫలితముం టుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానేలేదు. ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప. కొసమెరుపులాగా చంద్రబాబు పేద ప్రజలందరూ సంక్రాంతి రోజున పప్పన్నంలో నెయ్యి వేసుకొని తినాలని కోరుకుంటున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా ఆ ‘సంక్రాంతి గిఫ్ట్’ను అందజేయనున్నట్టు చెప్పారు. ఆయన అధికార దండం పట్టిన ఈ ఏడు మాసాల్లో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం, పంచదార తప్ప మరే సరుకూ అందలేదు! ‘పండక్కి పప్పన్నం, నెయ్యి’కి కూడా ఎన్నికల వాగ్దానాల గతే పట్టదనుకుందాం! - వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
పారిశ్రామిక గుమ్మం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సింగరేణి బొగ్గు గనులు, అపార అటవీ సంపద, ఇతర సహజ వనరులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఖమ్మం.. పారిశ్రామిక రంగం వైపు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాలో లభిస్తున్న ఖనిజ సంపదను వినియోగించి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడి నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బయ్యారంలోని అపార ఖనిజ సంపదను పూర్తిస్థాయిలో వినియోగించి అక్కడ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఫలించబోతోంది. ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయడంతో ఏజెన్సీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నిర్ణయాలతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వాలు దీనికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభించకపోవడంతో జిల్లా ప్రజల్లో ఒకింత ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల విలువ గల ఖనిజ సంపద గల ఈ ప్రాంతంలో కర్మాగారం నిర్మిస్తారా.. లేదా.. ముడిసరుకు రవాణాకు అనువైనప్రాంతంలో ఫ్యాక్టరీని నిర్మిస్తారా..? అనే అంశంపై ఇంకా జిల్లా ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం వచ్చే రెండేళ్లల్లో పూర్తవుతుందనే ఆశ ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. అలాగే జిల్లాలో మరో పారిశ్రామిక వాడగా ఎదగడానికి అన్ని హంగులున్న మణుగూరులో సైతం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు జిల్లా ప్రజలు చిరకాలంగా చేస్తున్న పోరాటం ఫలించినట్టే అని తెలుస్తోంది. తెలంగాణకు ఖమ్మం జిల్లాను విద్యుత్ హబ్‌గా మార్చాలనే కేసీఆర్ కృతనిశ్చయం.. జిల్లా ప్రజల జీవన ప్రమాణాల్లో కొత్త వెలుగులు నింపుతుందన్న గంపెడాశ వ్యక్తమవుతోంది. అలాగే కొత్తగూడెంలో సైతం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించడానికి వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి అన్ని రకాల పాలనా పరమైన ఆటంకాలను అధిగమించడానికి అధికారులను ఫైళ్లతో పరుగుల తీయిస్తోంది. భూ సేకరణ, నిర్వాసితుల నష్ట పరిహారం తదితర అంశాలను సత్వరమే పరిష్కరించడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టుకు తుది రూపం రానుంది. అలాగే విస్తారమైన బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి ప్రాంతంలో సైతం మరో విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రమైన ఖమ్మం రూపురేఖలు అభివృద్ధి పరంగా మారనున్నాయి. జిల్లాలో కొత్తగా అపార బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించిన సింగరేణి సంస్థ అక్కడ బిగ్గు తవ్వకాలను సత్వరం ప్రారంభిస్తే కొత్తగా నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టులకు చేదోడుగా వాదోడుగా ఉండటంతోపాటు జిల్లాలోని వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఖమ్మం గ్రానైట్ నిరంతర విద్యుత్ కోతల వల్ల సంక్షోభంలో కూరుకుపోతోంది. గ్రానైట్ ఉత్పత్తికి సంబంధించి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నా విద్యుత్‌కోత గ్రానైట్ వ్యాపారుల పట్ల శాపంగా మారింది. వేలాది మంది ఆధారపడి ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనిస్తే జిల్లాలో ఈరంగం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్న విశ్వాసం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని గిరిజనులు తమ ఉపాధికి ప్రధాన మార్గంగా ఎంచుకున్న తునికాకు సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు సరైన విధానం అమల్లో లేదు. దీంతో గిరిజనులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గిరిజనుల ఉపాధి పరిరక్షణకు భద్రాచలం ప్రాంతంలో బీడీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెలంగాణ ప్రభుత్వంలోనైనా సాకారమైతే తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని గిరిజనులు గంపేడాశలతో ఉన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలతో పారిశ్రామిక వాడగా వెలుగొందుతున్న పాల్వంచలో ఎరువుల కర్మాగారం నిర్మించాలన్న డిమాండ్ సైతం ఆది నుంచి ఉంది. దీనిపై సైతం ప్రభుత్వం ఒకింత దృష్టి సారిస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుగులేని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. -
డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం
ఐటీ కంపెనీల సీఈవోల సదస్సులో సీఎం చంద్రబాబు హైటెక్ సిటీని తలదన్నే రీతిలో విశాఖలో ‘సిగ్నేచర్ టవర్’ ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిని చేస్తాం ప్రతి ఇంటిని ఒక ఐటీ కేంద్రంగా మారుస్తాం సిలికాన్ కారిడార్‌గా విశాఖ అభివృద్ధి చేస్తాం గూగుల్, విప్రో తదితర సంస్థలతో ఒప్పందాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని అతి త్వరలోనే ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకర్ని ఈ-ఆక్షరాస్యునిగా చేయడంతోపాటు ఒకర్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఐటీ కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్-స్టార్ట్ అప్ విధాన పత్రాలను విడుదల చేశారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకుగాను విప్రో, సమీర్, టెక్ మహేం ద్ర, టిస్సాల్వ్, మోబ్మి సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. అదే విధంగా 16 ఐటీ కంపెనీలకు విశాఖపట్నం, విజయవాడలలో భూములు, ఇంక్యుబేషన్ సెంటర్లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఏమన్నారంటే... - రానున్న నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఐటీ రంగ ఫలాలను సామాన్యునికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వయంసహాయక సంఘాల కార్యకలాపాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. చిన్నతరహా- మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చి వాటి విస్తరణకు బాటలు వేస్తాం. - ఇంటర్నెట్ సేవలను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం గూగుల్ సంస్థకు పూర్తిగా సహకరిస్తుంది. ప్రతి ఇంటిని ఓ ఐటీ కేంద్రంగా రూపాంతరం చెందేలా చేస్తాం. - హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని తలదన్నేరీతిలో విశాఖపట్నం మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ను నిర్మిస్తాం. ఇందుకోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. విశాఖపట్నంను సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తాం. ముంబాయి తరువాత దేశానికి ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖపట్నంను తీర్చిదిద్దుతాం. - రాజకీయ- పరిపాలన రాజధానిగా విజయవాడ, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిలను అభివృద్ధి పరుస్తాం. ఈ మూడు మెగాసిటీలతోపాటు రాష్ట్రంలో 30 స్మార్ట్ సిటీలను తీర్చిదిద్దుతాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్‌తోపాటు వివిధ జిల్లాల్లో ఉన్న ఖనిజ సంపదను వెలికితీస్తాం. - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హారాష్ట్రంలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగా లు, ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఐటీ కంపెనీల స్థాపనకు వీలుగా సింగిల్ విండో విధానం ద్వారా నాలుగు వారాల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. - సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు జె.సత్యన్నారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్, మోబ్మి సీఈవో సంజయ్ విజయ్‌కుమార్‌లతోపాటు నాస్కామ్, గూగుల్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థల ప్రతినిధులు, పలు ఐటీ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. -ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ఎంపీలు కె. హరిబాబు, అవంతి శ్రీనివాస్, కొత్తపల్లి గీత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్, బండారు సత్యన్నారాయణమూర్తి, తదితరులు హాజరయ్యారు. 20 ఎకరాల్లో సిగ్నేచర్ టవర్! విశాఖశివారులోని మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ పేరిట ఐటీ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మధురవాడ ఎస్ఈజెడ్లోని హిల్-3 మీద 20 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. సీఎం సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి టవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈమేరకు భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ యువరాజ్‌తోపాటు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. సిగ్నేచర్ టవర్ డిజైన్‌ను నిర్ణయించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే విశాఖపట్నంలో ఐఐఎంతోసహా పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు కోసం భూములు గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో త్వరలో సమావేశం నిర్వహించనున్నామని, ఆలోపు భూముల గుర్తింపు పూర్తి చేయాలని చెప్పారు. ఆ సమావేశం తర్వాత విశాఖలో ఏఏ విద్యా సంస్థలు ఏర్పాటు చేసేది స్పష్టత ఇస్తామని సీఎం తెలిపారు. ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం అంతకుముందు సీఎం చంద్రబాబు విశాఖపట్నం శివారులోని మధురవాడలోని ఐటీ ఎస్ఈజెడ్లో రూ.23 కోట్లతో నిర్మిం చిన టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (సన్‌రైజ్ స్టార్ట్అప్)ను ప్రారంభిం చారు. ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి ఐటీ రంగ సమస్యలను తెలుసుకున్నారు. విశాఖపట్నంలో ఐటీ, పర్యాటక రంగాలను జోడించి అభివృద్ధి పరిచేలా ప్రణాళిక రూపొందించమని అధికారులకు సూచిం చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు నిరంత రం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందుబాటులోని టెక్నాలజీని ఉపయోగిం చి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. -
రాజధాని దరి.. పశ్చిమగోదావరి
►జిల్లాకు నిట్, నిఫ్ట్లతో సరి ►తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ►చింతలపూడిలో బొగ్గు నిక్షేపాల వెలికితీత ►నరసాపురానికి ఫిషింగ్ హార్బర్ ►పోలవరంపై నామమాత్రపు ప్రస్తావన ►‘ఏలూరు స్మార్ట్ సిటీ’ ఊసెత్తని సీఎం సాక్షి ప్రతినిధి, ఏలూరు : సహజ వనరులు అపారంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధాని చేయాలనే డిమాండ్‌ను ఇసుమంతైనా పట్టించుకోని పాలకులు మొదటినుంచీ చెబుతున్నట్టుగానే మన జిల్లాకు సమీపంలో ఉన్న విజయవాడను రాజధానిగా ప్రకటించారు. దానికి కూతవేటు దూరంలోనే ఉన్న జిల్లాగా రాజధాని స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆశలు తప్ప ప్రత్యేకించి పశ్చిమగోదావరికి ప్రభుత్వం పట్టం కట్టలేదన్న వాదనలకే బలం చేకూరుతోంది. జిల్లాకు ముందునుంచీ చెబుతున్నట్టు నిట్, నిఫ్ట్, తాడేపల్లిగూడెం ఎరుుర్‌పోర్టు పునరుద్ధరణ, నరసాపురంలో ఫిషింగ్ హార్బర్ తప్పించి జిల్లాను దేశ చిత్రపటంలో నిలిపే స్థాయిలో బహుళార్థసాధక ప్రాజెక్టు ఏమీ రాలేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీ సమావేశంలో మన జిల్లాలో నెలకొల్పే ప్రాజెక్టులకు సంబంధించి చేసిన ప్రకటనలపై వివిధవర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. స్మార్ట్ సిటీ వట్టిమాటే ఏలూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని ఇక్కడి ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చినా కనీసం ఎక్కడా ఆ ప్రస్తావనే రాలేదు. అటు శ్రీకాకుళం ఇటు రాజమండ్రి, కాకినాడ సహా 14 నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చగా, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి మాత్రం ఆ భాగ్యం దక్కలేదు. తాడేపల్లిగూడెంలో నిర్వాసితుల వివాదం నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాదు రాదని చెబుతున్న విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు సీఎం స్పష్టమైన ప్రకటన చేశారు. సిరామిక్ పరిశ్రమలకు ఊతం జిల్లాకు ఆదాయం సమకూర్చడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి అవసరమ్యే ఖనిజ సంపద జిల్లాలో సమృద్ధిగా ఉంది. ద్వారకాతిరుమల వద్ద 6 మీటర్ల లోతులో లక్షలాది టన్నుల సుద్ద బంకమట్టి (వైట్ క్లే) నిల్వలు ఉన్నాయి. కూచింపూడి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఈ నిక్షేపాలున్నట్టు అంచనా. దీనితో కుండలు, తెల్ల సుద్దలు, రాచిప్పులు తయారు చేయడమే కాక సిరామిక్స్ పరిశ్రమలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సిరామిక్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పడంతో అది ఈ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక చింతలపూడిలో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తామని ప్రకటించడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్టయింది. అగ్రివర్సిటీకి బదులు ఉద్యాన పరిశోధనా కేంద్రం జిల్లాలో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములు, వెంకట్రామన్నగూడెం, చింతలపూడి అటవీ భూములు అనువుగా ఉంటాయని, ఈ మూడుచోట్ల దాదాపు 1,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని జిల్లా అధికారులు కొద్దిరోజుల క్రితమేనివేదిక రూపొం దించి ఉన్నతాధికారులకు పంపారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఇప్పటికే ఉండటంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తుందనుకున్నారు. కానీ అది గుంటూరు జిల్లాకు తరలిపోవడంతో ఉద్యాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో వైద్య కళాశాలను నెలకొల్పాలనే యోచన ఉన్నట్టు పాలకులు చెబుతూ వచ్చినా దానిపైనా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యాసంస్థలను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. వీటిలో నిట్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోనూ, నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. భీమవరంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ జిల్లాలో 5,22,549 హెక్టార్ల సాగుభూమి ఉంది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు. అత్యధికంగా వరి పండిస్తుండగా అరటి, చెరకు, కొబ్బరి, జొన్న, పొగాకు, పత్తి, మామిడి, ఆరుుల్‌పామ్ వంటి పంటలనూ సాగు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను అన్ని జిల్లాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రజల ఆహార అవసరాలు తీర్చవచ్చు. అంతేకాకుండా పొగాకు, జీడిపప్పు పరిశ్రమలను విస్తరించి అంతర్జాతీయ మార్కెట్లో వాటా సంపాదించవచ్చు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపిస్తామని ప్రకటించారు. అక్వా రాజధానిగా ఉన్న భీమవరంలో అక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు డెల్టాలో లేసుపార్కు ఏర్పాటుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు వ్యవసాయాధారితమైన నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పడం తోపాటు జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. ఇక కొల్లేరు సరస్సును పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరంపై నామమాత్రపు ప్రకటనలే చేశారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటూ ముందునుంచీ చెబుతూ వచ్చిన ప్రకటనే తప్పించి పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఎక్కడా వెల్లడించలేదు. ఏతావాతా ముందుగా అనుకున్న ప్రాజెక్టులే తప్పించి జిల్లాను అనూహ్యంగా అభివృద్ధి చేయగల, వేలాదిమందికి ఉపాధి చేకూర్చగల బహుళార్థప్రయోజన ప్రాజెక్టులేమీ దక్కలేదన్న వ్యాఖ్యలే ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -
అకస్మాత్తుగా సంభవించే ఆపద!
Civils Prelims Paper - I డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ, ప్రజలను పూర్తిగా నిరాశ్రయులను చేసే ఆకస్మిక ఘటనలనే విపత్తులు అంటారు. ప్రకృతి వనరులు, మౌలిక వనరులు ధ్వంసం కావడం, సాధారణ జన జీవనానికి ఆటంకాలు కలగడం, సామాన్య ప్రజలు తమ జీవనోపాధిని పునరుద్ధరించుకోలేకపోవడం, ధన, ప్రాణ నష్టాలు ఈ విపత్తుల వల్ల సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీ.పూ. 430 నుంచి విపత్తులకు సంబంధించిన వివరాల నమోదు ప్రారంభమైంది. అదే సంవత్సరంలో ఏథేన్స నగరంలో టైఫస్ మహమ్మారి సంభవించినట్లు నమోదు చేశారు. క్రీ.పూ. 1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ప్రావిన్‌సలో సంభవించిన భూకంపంలో 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తం గా అత్యధికంగా ప్రాణ నష్టానికి కారణమైన విపత్తు ఇదే. గ్రీక్ భాషకు చెందిన ఈఠట(చెడ్డ), అఠట్ట్ఛట (నక్షత్రం) అనే పదాల కలయిక ద్వారా వచ్చిన ఈజీట్చట్ట్ఛట, మధ్యయుగాల నాటి ఫ్రెంచి పదం ఈ్ఛట్చట్టట్ఛ, ప్రాచీన ఇటలీ భాషకు చెందిన ఈజీట్చట్టటౌ పదాల నుంచి విపత్తు అనే పదం ఏర్పడింది. గ్రీక్, లాటిన్ భాషల్లో ఈజీట్చట్ట్ఛట అంటే ‘దుష్టనక్షత్రం’ (Bad Star) అని అర్థం. ప్రాచీన కాలంలోని ప్రజలు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రానికి ఆపాదిస్తూ దాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు. విపత్తు సంభవించే ప్రాంతంలో వచ్చే మార్పులు - ప్రజల దైనందిన కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి. - మౌలిక వసతులు (రోడ్డు, రైల్వేమార్గాలు, వైద్యవసతులు, తాగునీరు మొదలైనవి) దెబ్బతింటాయి. - సాధారణ ప్రజల జీవనోపాధి దెబ్బతిం టుంది. వారు నిరాశ్రయులవుతారు. - ప్రకృతి వనరులు ధ్వంసమవుతాయి. - ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. విపత్తుల లక్షణాలు - ఆకస్మికంగా వస్తాయి. అందువల్ల వాటి రాకను ముందుగా గుర్తించలేం. అవి సంభవించిన తర్వాత వాటివల్ల జరిగే తీవ్రతను మాత్రమే ముందస్తు చర్యల ద్వారా తగ్గించవచ్చు. - విపత్తులు అతివేగంగా వస్తాయి. - తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. విపత్తు నిర్వచనాలు 2005 విపత్తు నిర్వహణ చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం విపత్తు అంటే ‘ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ చర్యల వల్ల సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం లేదా దుర్ఘటననే’ విపత్తు అని పిలుస్తారు.ఐక్యరాజ్య సమితి (ూ్ఖై) ఇచ్చిన నిర్వచనం ప్రకారం... ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణాన్ని, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’. విపత్తుల స్వభావాన్ని పరిశీలిస్తే అవి రెండు రకాలు. ప్రకృతిలో మార్పుల వల్ల సంభవించేవి. ఉదా: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల సంభవించేవి. ఉదా: రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఆయిల్ లీకేజీ, పారిశ్రామిక దుర్ఘటనలు. ముఖ్యంగా ఈ విపత్తులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా తీవ్ర విపత్తులు సంభవించాయి. వీటి కారణంగా సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నష్ట తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంది. ప్రాణ నష్టం అధికంగా జరిగిన దేశాల్లో ఆసియా దేశాలు అగ్రభాగాన ఉన్నాయి. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తుల తరచుదనం కిందివిధంగా ఉంది. వరదలు - 30 % తుఫాన్లు - 21 % కరవు సంబంధిత విపత్తులు - 19 % మహమ్మారి వ్యాధులు - 15 % భూకంపాలు, సునామీలు - 8 % భూపాతాలు - 4 % అగ్నిపర్వత విస్ఫోటనాలు - 1 % కీటక దాడులు - 1 % హిమసంపాతాలు - 1 % భారతదేశంలోని విశిష్టమైన భౌగోళిక, వాతావరణ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవ కారక విపత్తులు సంభ విస్తున్నాయి. గడిచిన 30 ఏళ్ల కాలంలో భారతదేశంలో 431 తీవ్ర విపత్తులు సంభవించాయి. వాటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ప్రకారం గత 3 దశాబ్దాలలో సంభవించిన ముఖ్యమైన విపత్తుల కారణంగా 1,43,039 మంది ప్రాణాలు కోల్పోగా, 15 కోట్ల మందికిపైగా వీటి ప్రభావానికి గురయ్యారు. ఆస్తులు, ఇతర మౌలిక సౌకర్యాలకు 48 00 కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు, భూపాతాలు, హిమపాతాలు, కరవు అధికంగా సంభవిస్తున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 విపత్తు భరితమై ఉన్నాయి. దాదాపు 58.6% భూభాగం భూకంప తాకిడికి, 68% కరవు, 12% భూభాగం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలు, 8% భూభాగం (5,700 కి.మీ. తీర ప్రాంతం) తుఫాన్లకు లోనవుతున్నాయి. భారతదేశంలో విపత్తుల స్వభావాలు ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగి ఉన్న మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇందుకు అనేక ప్రకృతి, మానవ చర్యలు కారణమవుతున్నాయి. ప్రతికూల భౌగోళిక, శీతోష్ణస్థితి పరిస్థితులు, స్థలాకృతి స్వభావాలు, పర్యావరణ నిమ్నీకరణ, జనాభావృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ అభివృద్ధి మొదలైన కారకాలు దేశంలో విపత్తులకు కారణమవుతున్నాయి. వీటివల్ల తీవ్రస్థాయిలో ధన, ప్రాణ నష్టాలు సంభవించడమే కాకుండా దేశంలోని జీవనాధార వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది. విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి దేశంలో ఐదు ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. అవి... 1. భౌగోళిక విరూప కారకాల వల్ల (ఎౌ్ఛ ఖ్ఛీఛిౌ్టజీఛి ఊ్ఛ్చ్టఠట్ఛట) హిమాలయాలు, వాటిని ఆనుకొని ఉన్న ఒండ్రుమైదానాలు తరచూ భూకంపాలు, భూపాతాలు, జలక్షయం లాంటి విపత్తులకు గురవుతున్నాయి. 2. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతం స్థిరమైన భూభాగం అయినప్పటికీ మానవ తప్పిదాల వల్ల అప్పుడప్పుడూ ఇక్కడ జరుగుతూ ఉన్నట్లు కనిపించే భౌగోళిక విరూపక చలనాల వల్ల ఈ ప్రాంతం కూడా ఇటీవల భూకంప ప్రభావానికి లోనవుతోంది. 3. గంగా - సింధూ - బ్రహ్మపుత్రా మైదాన ప్రాంతాలు హిమాలయాలను ఆనుకొని ఉన్నందు వల్ల భూకంపాలకు గురవు తున్నాయి. ఈ నదీ వ్యవస్థల్లో పాత ఒండ్రుమట్టి పేరుకు పోవడం వల్ల తరచూ వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనవుతున్నాయి. 4. రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఎడారి శీతోష్ణస్థితి ప్రభావం కారణంగా తరచూ కరవుకు లోనవుతున్నాయి. 5. తూర్పు తీర రాష్ట్రాలన్నీ తరచూ వరదలు, తుఫాన్ల తాకిడికి లోనవుతున్నాయి. 6. మహాసముద్రాల భూతలంపై జరిగే భౌగోళిక విరూపకార చలనాల వల్ల తీర ప్రాంతాలను సునామీలు ముంచెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం భారతదేశంలో విపత్తుల కారణంగా ఏటా జీడీపీలో 2% ఆర్థిక నష్టం జరుగుతోంది. దేశంలో 1982 నుంచి 2001 మధ్య సంభవించిన సహజ విపత్తుల వల్ల 1,07,813 మంది ప్రాణా లు కోల్పోయారు. సగటున సంవత్సరానికి 5,390 మరణాలు సంభవించాయి. మానవుడు చేపట్టే అభివృద్ధి పోకడల తీవ్రత పరిమితికి మించి కొనసాగితే ‘ఎల్‌నినో’ లాంటి వా తావరణ మార్పుల తీవ్రత, తరచుదనం పెరిగి భారతదేశంపై కరవు ప్రభావం మరింత ఉధృతమవుతుందని ఐపీసీసీ నివేదిక తెలిపింది. మాదిరి ప్రశ్నలు 1. విపత్తు పదాన్ని ఏ భాషా పదజాలాల నుంచి గ్రహించారు? 1) గ్రీక్ 2) ఫ్రెంచి 3) లాటిన్ 4) పైవన్నీ 2. విపత్తుల నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి? 1) క్రీ.పూ. 450 2) క్రీ.పూ. 470 3) క్రీ.పూ. 430 4) క్రీ.పూ. 420 3. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో విపత్తు సంభ వించినప్పుడు కలిగే మార్పు? 1) ప్రకృతి, సమాజ వనరులు విధ్వంసానికి లోనవుతాయి 2) ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి 3) సామాన్య ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుంది 4) పైవన్నీ 4. {పపంచవ్యాప్తంగా తుఫాన్ల ప్రభావానికి ఎంతశాతం భూభాగం లోనవుతోంది? 1) 30 % 2) 21 % 3) 19 % 4) 12 % 5. కిందివాటిలో ప్రకృతి వైపరీత్యం ఏది? 1) కరవు 2) యుద్ధం 3) ఉగ్రవాదం 4) పైవన్నీ 6. {పపంచబ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా విపత్తుల వల్ల సంభవించే నష్టతీవ్రత దేశ జాతీయ ఆదాయంలో ఎంతశాతం ఉంది? 1) 1 2) 2 3) 3 4) 4 7. భారతదేశంలో ఎంతశాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది? 1) 58 2) 68 3) 48 4)12 8. విపత్తు అంటే ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణానికి, కార్యకలాపాలకు అంత రాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపద’ అని నిర్వచించింది? 1) ూ్ఖై 2) గిఏై 3) ప్రపంచ బ్యాంక్ 4) ఏషియన్ బ్యాంక్ 9. {పపంచవ్యాప్తంగా సంభవించే విపత్తుల వల్ల ఏ ప్రాంతాలు అధికంగా నష్టానికి లోనవుతున్నాయి? 1) లాటిన్ అమెరికా దేశాలు 2) ఆఫ్రికా దేశాలు 3) ఆసియా దేశాలు 4) దక్షిణ అమెరికా దేశాలు 10. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ఏది? 1) వరదలు 2) తుఫాన్లు 3) కరవు 4) భూకంపాలు 11. గడిచిన 30 ఏళ్లలో ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ఖ్ఛఞౌట్ట ప్రకారం విపత్తుల వల్ల భారత దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య? 1) 3,20,000 2) 2,20,000 3) 1,90,039 4) 1,43,039 12. Prevention Web Statistics Report ప్రకారం గడిచిన 30 ఏళ్లలో దేశంలో సంభవించిన విపత్తుల వల్ల ఎన్ని కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది? 1) 2800 2) 3800 3) 4800 4) 5800 13. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తు భరిత ప్రాంతంలో ఉన్నాయి? 1) 25, 2 2) 24, 3 3) 23, 4 4) 27, 2 14. భారతదేశంలో ఎంత భూభాగం తుఫాన్ల ప్రభావిత ప్రాంతంలో ఉంది? 1) 16 % 2) 12 % 3) 8 % 4) 2 % 15. హిమాలయా ప్రాంతాల్లో భూకంపాల తర చుదనం ఎక్కువగా ఉండటానికి కారణం? 1) జలక్రమక్షయం 2) భౌగోళిక విరూపకారక చలనాలు 3) నేల క్రమక్షయం 4) అధిక వర్షపాతం -
ఆర్థిక అసమానతలతో ముప్పు
సాక్షి, హైదరాబాద్: సహజ వనరులను ఆక్రమించి పెంచుకున్న సంపదతో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలను శాసిస్తున్నారని అంతర్జాతీయ సెమినార్లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’, ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’, ‘డెమొక్రసీ డైలాగ్స్’ ఆధ్వర్యంలో నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ప్రజాస్వామ్యం - సామ్యవాదం - 21వ శతాబ్దపు నూతన దృక్పథాలు’ అనే అంశంపై మూడు సమాంతర సెమినార్లు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఈ సెమినార్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఎస్.వినయ్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ రమా మెల్కొటే, శాంతా సిన్హా, సీడీఎస్ చైర్మన్ వై.బి.సత్యనారాయణ, దాదాపు 30 దేశాలకు చెందిన సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఉద్యమకారులు, రాజకీయవేత్తలు హాజరయ్యారు. సంపన్నులే శాసిస్తే ప్రమాదం: ఈ సెమినార్లో కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వమే ధారాదత్తం చేయడం వల్ల కొందరి సంపద హద్దుల్లేకుండా పెరిగిపోయింది. మరోవైపు ఆకలి, దారిద్య్రం వంటివి అంతకన్నా ఎక్కువగా పెరిగాయి. సంపన్నులు, పేదల మధ్య తీవ్రంగా పెరిగిన అంతరాలు సమాజంలో అశాంతిని, అసంతృప్తిని పెంచుతున్నాయి. తద్వారా పెరుగుతున్న అశాంతి సమాజ భద్రతకు మంచిది కాదు. రెండు వర్గాల మధ్య అసమానతలపై ప్రజాస్వామిక ఉద్యమాలు వస్తున్నాయి. ఇంతకన్నా ప్రమాదం అత్యంత సంపన్నుల నుంచి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలోని సహజ వనరులను ఉపయోగించుకుని కొందరు శతకోట్ల రూపాయల ఆస్తి ఉన్న సంపన్నులుగా ఎదిగారు. ఇలాంటివారు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో బంధించారు. రాజకీయాలనూ ఇలాంటివారే శాసిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులపై రాజ్యాంగ నియంత్రణ: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ... ‘‘ప్రభుత్వం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరం. జాతి సంపద సహజ వనరులను ఆక్రమించుకున్న మార్కెట్ శక్తులు అన్ని రాజ్య వ్యవస్థలతో పాటు మీడియా, విద్యా వ్యవస్థలనూ కబళిస్తున్నాయి. వాటి అడుగుజాడల్లో మైనింగ్ ఇతరత్రా మాఫియాలు సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వాటిని నియంత్రించడానికి రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు. సామ్రాజ్యవాద శక్తులు అణచివేస్తున్నాయి: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ... ‘‘ఉత్పాతకత, మార్కెట్ రంగం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలి. వ్యక్తుల భారీ పెట్టుబడులపై పరిమితులు విధించాలి. ఆర్థిక ప్రణాళిక ద్వారా వికేంద్రీకరణను ప్రయోగాత్మకంగా అమలుచేయాలి. బహుళ రాజకీయపార్టీల వ్యవస్థ ద్వారా వక్రీకరణలను నివారించొచ్చు. సామ్రాజ్యవాద శక్తులు విప్లవాత్మక మార్పులను నియంత్రిస్తున్నాయి. విప్లవోద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయ’’ని వివరించారు. -
అభివృద్ధి పేరుతో సహజ వనరుల దోపిడీ
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ ఆదివాసీలు తరతరాలుగా అనుభవించిన సహజ వనరులు అభివృద్ధి పేరుతో దోపిడీకి గురవుతున్నాయని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు పేర్కొన్నారు. వారు అనుభవించే సహజ వనరులను ప్రభుత్వాలు బలవంతంగా లాక్కుంటున్నాయన్నారు. ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘గిరిజన మహిళలు - సాధికారిత’ అనే అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సును శుక్రవారం వీసీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరిక సమాజం గిరిజనులను అన్ని విధాలుగా వివక్షతకు గురిచేస్తోందని, గిరిజన మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా తయారయిందని తెలిపారు. రాజకీయ సంకల్పం ఉంటే తప్ప గిరిజనుల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సోషియాలజీ విభాగ మాజీ కో- ఆర్డినేటర్ ఆచార్య లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ అభివృద్ధి సూచికలైన ఆరోగ్యం, విద్య, ఉపాధి, సమాజిక స్థితి గతంతో పోల్చితే చాలా దిగజారాయన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రత్యేక చట్టాలు ఏవీ ఆదివాసీల దరిచేరటం లేదని పేర్కొన్నారు. సదస్సు డెరైక్టర్ డాక్టర్ ఎం.త్రిమూర్తిరావు మాట్లాడుతూ గిరిజన మహిళల సమస్యలపై అధ్యయనం చేసి వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కావలసిన సూచనలు చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ సెన్సైస్ డీన్ ఆచార్య బి.సాంబశివరావు అధ్యక్షత వహించిన సభలో రెక్టార్ ఆచార్య వై.పి.రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఓఎస్డీ ఆచార్య ఎ.వి.దత్తాత్రేయరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.మధుసూదనరావు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య అమర్నాథ్, గిరిజన సంక్షేమ విభాగం జనరల్ మేనేజర్ దేవర వాసు, ఏఎన్‌యూ మహిళా అధ్యయన కేంద్రం కో- ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్. స్వరూపరాణి తదితరులు ప్రసంగించారు. అనంతరం సదస్సు సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. -
బినామీ ‘ఘనులు...’!
తెల్లరాయిపై కన్నేసిన బడాబాబులు ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ఏజెన్సీ సంపద అక్రమ లీజులతో గిరిజనులకు అన్యాయం భద్రాచలం, న్యూస్‌లైన్ భద్రాచలం ఏజెన్సీలో ఉన్న అపార ఖనిజ సంపదపై కొంతమంది బడాబాబులు కన్నేశారు. ఇక్కడ ఉన్న తెల్లరాయి నిక్షేపాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గాజు తయారీకి ఉపయోగకరంగా ఉండే తెల్లరాయి భద్రాచలం ఏజెన్సీలో పుష్కలంగా దొరుకుతుండటంతో గిరిజనుల భూములను లీజుకు తీసుకొని ఈ అక్రమానికి పాల్పడుతున్నారు.భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడి మధ్యవర్తుల ద్వారా గిరిజనుల భూములను గిరిజనుల పేరునే లీజుకు తీసుకుని, తమ కనుసన్నల్లో తెల్లరాయి తవ్వకాలు, తరలింపుప్రక్రియ సాగిస్తున్నారు. భద్రాచలం మండలం లక్ష్మీపురం పంచాయతీలోని రంగాపురం, బండిరేవు.., ఎటపాక పంచాయతీలోని బొజ్జుగుప్ప, మాధవరావు పేట.., చింతూరు మండలంలోని చట్టి.., దుమ్ముగూడెం మండలంలోని కొమ్మనాపల్లి సమీపంలో ఇటీవల తెల్లరాయి తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు గనుల నిర్వహణకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వటంతో ఈ అక్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ నుంచి విజయవాడకు తరలించిన తెల్లరాయిని పాలీష్ చేసిన తరువాత తమిళనాడు రాష్ట్రంలోని వివిధ గాజు తయారీ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కారుచౌకగా లీజుకు భూములు : తెల్లరాయి నిక్షేపాలు లభించే గిరిజనులకు చెందిన భూములను తక్కువ ధరకే లీజుకు తీసుకుంటున్నారు. భద్రాచలం మండలంలోని రంగాపురం క్వారీనే పరిశీలించినట్లైతే... ఆ గ్రామంలోని ఎనిమిదిమంది గిరిజనులకు చెందిన 11 ఎకరాల భూమిని గుంటూరుకు చెందిన ఓ గిరిజన మహిళ పేరుతో ఇరవై ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ.1000చొప్పున కౌలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల భద్రాచలానికి చెందిన కొంతమంది వచ్చి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి చనిపోయారని చెప్పి మళ్లీ ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని భూమిపై హక్కుదారుడైన మడకం ముత్తయ్య తెలిపాడు. అయితే కౌలు గిట్టుబాటు కాదని పట్టుబడితే ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.2500లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపాడు. రాయి తీయటం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడుస్తామని చెప్పినప్పటికీ అలానే వదిలేయటంతో పశువులు దానిలో పడి మృతిచెందుతున్నాయని ఆయన తెలిపాడు. అలాగే భద్రాచలం మండలం బండిరేవు క్వారీ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా తెల్లరాయిని తరలిస్తున్న రెండు లారీలను ఇటీవల అధికారులు పట్టుకున్నారు. ఇలా కారుచౌకగా గిరిజనుల భూములను లీజుకు తీసుకొని వాటిలో ఉన్న ఖనిజ సంపదను బడాబాబులు కొల్లగొడుతుండడం గమనార్హం. గిరిజనుల అంగీకారంతోనే లీజు ఒప్పందాలు జరిగాయనే కారణంతో రెవెన్యూ అధికారులు కూడా క్వారీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండటంతో ఏజెన్సీ సంపద ఇతర ప్రాంతాలకు త రలిపోతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి ఏజెన్సీలో లభించే ఖనిజ సంపద ద్వారా ఈ ప్రాంత వాసులు అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. -
యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మెదక్ జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనుమతి లేని క్వారీల ద్వారా ఎరర్రాళ్లు, ఎరమ్రట్టి, పలుగు రాళ్లు, కంకర తరలివెళ్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లు, ఇటుక బట్టీలు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ యంత్రాంగానికి కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్ అథారిటీ పరిధిలోని పది మండలాలతో పాటు, పొరుగునే ఉన్న మండలాల్లో సహజ వనరుల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లను గుర్తించి తొలగించే బాధ్యతను రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సంయుక్తంగా అప్పగించారు. అక్రమ ఇసుక ఫిల్టర్లు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయాలనే నిబంధన ఉన్నా, చర్యలు తీసుకున్న దాఖలా కనిపించడం లేదు. పటాన్చెరు, హత్నూర, తూప్రాన్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక ఫిల్టర్ల ద్వారా రోజూ హైదరాబాద్‌కు వందలాది టన్నుల ఇసుక తరలివెళ్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో విలువైన ఎరర్రాయి, ఎరమ్రట్టిని అక్రమార్కులు పొరుగునే ఉన్న కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జీఓఎంఎస్ 74 ప్రకారం జిల్లాలో ఖనిజాలు ఉన్న ప్రాంతాలను మైనింగ్ అధికారులు గుర్తించాల్సి ఉంటుంది. ఖనిజ సంపద, సహజ వనరులు తరలకుండా చూడాల్సిన బాధ్యత ఈ విభాగంపైనే ఉంది. ఎరమ్రట్టి, ఎరర్రాళ్లు వున్న ప్రాంతాన్ని మైనింగ్ ప్రాంతంగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇటుక బట్టీలదీ ఇదే కథ హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న మండలాల్లో ఇటుక బట్టీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అయితే ప్రభుత్వ ఖజానాకు మాత్రం రూపాయి ఆదాయం సమకూరడం లేదు. అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను పరిశ్రమలు, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సర్వే చేసి గుర్తించాల్సి ఉంటుంది. వీటిని రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సి ఉన్నా, స్పందన కనిపించడం లేదు. క్వారీ నిర్వాహకుల నుంచి సెస్ వసూలు కూడా శాస్త్రీయంగా జరగడం లేదు. హెక్టార్‌కు రూ.10 వేల చొప్పున సెస్ వసూలు చేయాల్సిఉండగా, విస్తీర్ణం, సెస్ నిర్ణయంపై కాకి లెక్కలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు క్రషర్ల నుంచి వచ్చే ఇసుకను నిర్మాణాలకు వాడేలా చూడాలని కలెక్టర్ దినకర్‌బాబు జిల్లా స్థాయి టాస్కఫోర్స(గనులు) కమిటీ సమావేశంలో సూచించారు. ప్రభుత్వ శాఖల ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి క్రషర్ల ద్వారా వచ్చే ఇసుక వాడకంపై ప్రచారం చేయాలనే ఆదేశాలు కూడా ఆచరణకు నోచుకోవడం లేదు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సహజ వనరులు, ఖనిజాలు లూ టీ అవుతున్నాయి. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా మారింది పరిస్థితి. అనుమతులు లేనివారు ఖనిజాలను యథేచ్ఛగా దోచుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. అనుమతి పొందిన వారిలో కొం దరు పరిమితికి మించి ఖనిజాలు, వనరులను తవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది. దర్జా గా వనరుల దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతుంది. ఇది లావుంటే సీనరేజీ పేరిట జిల్లాకు కేటాయించాల్సిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ఖనిజాలు తవ్వితే సీనరేజీ తప్పనిసరి.. సహజ వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అనుమతులు ఇవ్వడంతోపాటు సీనరేజీ చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రాళ్లు, పలుగురాళ్లు, సున్నం నిల్వలు, స్పటిక, ఇసుక, మొరం నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనికితోడు ఇటుకల తయారీకి వినియోగించి నల్లమట్టి సైతం ఉంది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించి గనేట్, కంకర రాళ్ల తవ్వకాలకు సంబంధించి మైనింగ్‌శాఖ అనుమతులు ఇస్తోంది. సీనరేజీ చార్జీలు ఇలా... లెసైన్స్ పొందిన వారు రాళ్లు, గనేట్, కంకర క్యూబిక్ మీటర్‌కు రూ.33 చొప్పున సీనరేజీ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. సున్నపురాయి మెట్రిక్ టన్నుకు సుమారు రూ.40 నుంచి రూ.50, మొరం, మట్టి, గ్రావెల్ మెట్రిక్ టన్నుకు రూ.13 చొప్పున సీనరేజీని రెవెన్యూ, పంచాయతీ శాఖలకు కట్టాలి. మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.30, లక్ష ఇటుకలకు రూ.3,500 చొప్పున సీనరేజీ చెల్లించాలి. నేరుగా ఖజానాకు.. వనరులు, ఖనిజాల తవ్వకాలకు మైనింగ్, రెవె న్యూ, పంచాయతీ శాఖ నుంచి అనుమతులు పొందిన వ్యాపారులు నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన అకౌంట్లలో సీనరేజీ చార్జీలను చలాన రూపంలో జమచేయాలి. అయితే అనుమతులు పొందిన వారిలో కొందరు పరిమితికి మించి వనరులను దోచుకుంటున్నట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా లూటీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే అనుమతులు తీసుకోని వారు సైతం అక్రమంగా తోడేస్తున్నారు. విలువైన ఖనిజాలు మాయమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. జిల్లాకు కేటాయించే విధానం ఇది.. జిల్లాలో మైనింగ్ శాఖ లెసైన్స్ ఉన్నవారు రాళ్లు, సున్నపురాళ్లు, స్పటిక, ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్నవారు, ఇటుకల తయారీ దారులు సీన రేజీ చెల్లిస్తుంటారు. ఇది నేరుగా ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఈ నిధుల్లో జిల్లా వాటాను తిరిగి జిల్లాకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏడాదికి నాలుగు విడతల్లో సీనరేజీ నిధులను జిల్లాకు విడుదల చేస్తుంది. 25 శాతం జడ్పీ, 50 శాతం మండల పరిషత్, 25 శాతం పంచాయతీలకు సీనరేజీ నిధులను ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుంది. 2006 నుంచి జిల్లాకు మొండి చెయ్యి.. 2006 నుంచి జిల్లాకు పూర్తిస్థాయిలో సీనరేజీ నిధులు రావటంలేదు. 2006 నుంచి 2012 వరకు జిల్లాకు రూ.90.16 కోట్ల సీనరేజీ నిధులు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6.59 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.83.57 కోట్ల సీనరేజీ నిధులు జిల్లాకు రావాల్సి ఉంది. సీనరేజీ బకాయిలు రాబట్టేందుకు అధికారులు విఫలయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. నిధుల కోసం గత కలెక్టర్ సురేశ్ కుమార్ ఆరు దఫాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు సమాచారం. ప్రస్తుత కలెక్టర్ దినకర్‌బాబు సైతం గత ఫిబ్రవరిలో సీనరేజీ చెల్లింపుల గురించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదు. ప్రజాప్రతినిధులు ఒత్తిడి అవసరం సీనరేజీ నిధులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తి చూపటంలేదు. దీంతో ప్రభుత్వం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులు రావటంలేదు. డీఆర్సీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రస్తావించినా ఫలితం కానరావటంలేదు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎంతోపాటు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉ న్నాయి. అలా జరిగిన పక్షంలో స్థానిక సంస్థల కు జనరల్ ఫండ్‌లో సీనరేజీ నిధులు జమ అవుతాయి. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది. -
అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు
విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహజ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రాలకు, ప్రజాస్వామ్యానికి మారు పేరు గా చెప్పుకునే అమెరికాకు స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ పౌరు ల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నదని రచ్చకెక్కించిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవలి వార్తల్లోని వ్యక్తి. స్నోడెన్ వెల్లడించిన, వెల్లడించనున్న రహస్యాలపై పుంఖానుపుంఖాలుగా కథనాలను వెలువరించిన మీడియా ఒక కీలక అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. స్నోడెన్‌కు ఆశ్రయం కల్పించడానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు నెలరోజులు ఎందుకు పట్టింది? అమెరికాతో సంబంధాలు బెడుస్తాయన్న భయం అందుకు కారణం కానేకాదు. అవి ఇప్పటికంటే మెరుగుపడే ఆశా లేదు, దిగజారే అవకాశమూ లేదు. జూలై ఒకటిన మాస్కోలో రష్యా నేతృత్వంలోని ‘గ్యాస్ ఎగుమతి దేశాల వేదిక’ (జీయీసీఎఫ్) వార్షిక సమావేశాలు మొదలయ్యాయి. మూడేళ్లక్రితం అమెరికా తనకు చేసిన అవమానానికి స్నోడెన్ ఆశ్రయం రూపంలో బదులు తీర్చుకోవడానికి అదే రోజు పుతిన్‌కు సరైన ‘ముహూర్తం’ కుదిరింది. అందుకే నెల రోజులు స్నోడెన్ మాస్కో విమానాశ్రయంలో పడిగాపులు పడాల్సివచ్చింది. 2010 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ షేల్ గ్యాస్ ఇనిషియేటివ్ (జీఎస్జీయీ)ని ప్రారంభించి భారత్, చైనాలతో సహా నలభైకి పైగా దేశాలను ఆహ్వానించారు. ‘నిరపాయకరమైన’, లాభదాయకమైన పద్ధతుల్లో షేల్ గ్యాస్ వెలికితీత పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకునే ‘సహకారానికి’ నాంది పలికారు. భారీ షేల్ నిల్వలున్న రష్యాను మాత్రమే మినహాయించారు. పుతిన్ కూడా జీయీసీఎఫ్ అంతర్జాతీయ సమావేశం జరుగుతుండగా స్నోడెన్‌కు ఆశ్రయాన్ని ప్రకటించి బదులు తీర్చుకున్నారు. సహజవాయు నిక్షేపాలపై ‘భల్లూకం’ పట్టు షేల్ చమురు, షేల్ గ్యాస్‌లను ప్రత్యామ్నాయ చమురు, వాయువులుగా పిలుస్తున్నారు. రష్యా ప్రపంచంలోనే అతి ఎక్కువ సహజవాయు నిక్షేపాలున్న దేశం. రష్యా ఆధిపత్యంలోని జీఈసీఎఫ్ దేశాల చేతుల్లోనే ప్రపంచ సహజ వాయు నిక్షేపాలలో 70 శాతానికి పైగా ఉన్నాయి. అందుకే రష్యా, ఇరాన్, కతార్, బొలీవియా, వెనిజులా, లిబియా, అల్జీరియా తదితర 13 దేశాల జీఈసీఎఫ్ను చమురు ఎగుమతి దేశాల సంస్థ ‘ఒపెక్’తో పోలుస్తూ ‘గ్యాస్ ఒపెక్’గా పిలుస్తారు. రష్యా, ఇరాన్, ఖతార్‌లలో ప్రపంచ సహజవాయు నిక్షేపాలలో 57 శాతానికి పైగా ఉన్నాయి. పైగా ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిలో 85 శాతం జీఈసీఎఫ్ చేతుల్లోనే ఉంది. అమెరికా ఇంధనావసరాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఈ అవసరాల కోసం గ్యాస్ వినియోగించే యూరోపియన్ దేశాలు జీఈసీఎఫ్పైనే ఆధారపడి ఉన్నాయి. సహజవాయువేగాక పెట్రోలియం రవాణాకు వీలుగా ఉండే ఎల్పీజీ తయారీ మార్కెట్టుపైనా, రవాణా చేసే గ్యాస్ పైపులైన్లపైనా దాని ఆధిపత్యమే కొనసాగుతోంది. అటు గల్ఫ్‌లోనూ, ఇటు నాటో కూటమిలోనూ ఉన్న పలు అమెరికా మిత్రదేశాలు ఇంధన అవసరాలకోసమో, మార్కెట్కోసమో రష్యాపై ఆధారపడాల్సివస్తోంది. 1990లలో కుప్పకూలిన రష్యా దశాబ్ది తిరగకముందే కోలుకోవడం ప్రారంభించింది. పూర్వ ప్రాభవం కోసం పావులు కదుపుతోంది. 2001లో జీఈసీఎఫ్కు నాంది పలికి, 2008 నాటికి దాన్ని ఆర్థిక కూటమిగా మార్చింది. ఇరాక్, అఫ్ఘాన్ యుద్ధాల్లో అమెరికా కూరుకుపోయిన కాలంలోనే రష్యా తన ‘సామ్రాజ్యాన్ని’ పునర్నిర్మించే ప్రయత్నాలు సాగించింది. అమెరికా మరో ‘సౌదీ అరేబియా’ క్షీణిస్తున్న అమెరికా ఆర్థిక ప్రాబల్యంతోపాటే దాని అంతర్జాతీయ ప్రతిష్ట కూడా ఇటీవలి కాలంలో దిగజారుతోంది. పైగా సోవియెట్ యూనియన్ పతనానంతర రష్యాతో సంబంధాలను పలు యూరోపియన్ దేశాలు పునర్నిర్వచించుకుంటున్నాయి. రష్యాను ఎదుర్కోడానికి అమెరికాకు షేల్ గ్యాస్ ‘మంత్రదండం’ దొరికింది. ప్రపంచ ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో విస్తృతంగా ఉన్న వివాదాస్పదమైన షేల్ గ్యాస్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికి తీసే కార్యక్రమాన్ని ఒబామా వేగవంతం చేశారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇప్పటికే అది గ్యాస్ ఎగుమతి దేశంగా మారాల్సింది. కానీ వివిధ రాష్ట్రాల్లో షేల్ బావులకు వ్యతిరేకంగా తలెత్తుతున్న ఆందోళనలు, సుదీర్ఘ చర్చలతో ‘అనవసర’ జాప్యాలు తప్పడం లేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మూడు గ్యాస్ ఎగుమతి టెర్మినల్స్ నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 2020 నాటికే అమెరికాను ‘గ్యాస్ సౌదీ అరేబియా’గా మార్చాలనేది ఒబామా కల. 2012లో రష్యా వాయు ఉత్పత్తి 65,300 కోట్ల క్యూబిక్ మీటర్లు కాగా, అమెరికా కూడా దానికి ధీటుగా 65,100 కోట్ల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తిని సాధించింది. అమెరికా షేల్ గ్యాస్ దూకుడు కంటే వేగంగా అంచనాలపై నడిచే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు తగ్గాయి. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు చమురును ఎల్పీజీగా మార్చి అమ్ముకునే మార్కెట్లు కుంచించుకుపోతాయనే ఆందోళనలో పడ్డాయి. ఆ ఆందోళన చైనాకు దారులు తెరిచింది. చైనాలో కూడా విస్తారంగా షేల్ నిల్వలున్నా దానికి షేల్ జ్వరం సోకలేదు. సమీప భవిష్యత్తులో కూడా అది సంప్రదాయక చమురు నిల్వలపైనే ఆధారపడాలని యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు ఇతర దేశాల వనరులను కొని లేదా దబాయించి ప్రస్తుత అవసరాలకు విని యోగించుకుంటూ, తమ వనరులను పొదుపుగా వాడుకుంటోంది. జీఈసీఎఫ్తోపాటూ, అరబ్బు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా అది చమురు, ఎల్పీజీలను దిగుమతి చేసుకోడానికి ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికా షేల్ గ్యాస్‌తో పోటీ మూలంగా డిమాండు కొరత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు చైనా అంతులేని ఇంధన దాహం ఆసరా అవుతోంది. ‘ఇంధనానికి బదులు ఆయుధాల’ ఒప్పందాలతో అమెరికా కోటలోకి చైనా వాణిజ్య మార్గంలో చొరబడిపోతోంది. రష్యా సైతం సౌదీ అరే బియా వంటి దేశాలతో అలాంటి భారీ ఒప్పందాలను చేసుకుంటోంది. గల్ఫ్‌లోని అమెరికా కోట బీటలు వార డం ప్రపంచ ఇంధన ఆధిపత్యపు పోరుకు ఒక పార్శ్వం. ఒబామా పగటి కల... పలువురు అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఒబామా షేల్ స్వప్నాన్ని పగటి కలగా కొట్టిపారేస్తున్నారు. అమెరికా చెబుతున్నట్టు దాని షేల్ నిల్వలు వంద ఏళ్లకు సరిపడేంత ఘనమైనవేమీ కావని సవాలు చేస్తున్నారు. షేల్ గ్యాస్ ప్రబోధకులు, ప్రచారకులు దాచిపెడుతున్న ఒక ఆర్థిక వాస్తవాన్ని పోస్ట్ కార్బన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు డేవిడ్ హ్యూస్ బయటపెట్టారు. 1990ల నుంచి అమెరికాలోని పనిచేస్తున్న గ్యాస్ బావుల సంఖ్య 90 శాతం పెరిగిందిగానీ, ఒక్కో బావి సగటు ఉత్పాదకత 38 శాతానికి పడిపోయిందని డేవిడ్ తన ‘డ్రిల్ బేబీ, డ్రిల్’ నివేదికలో వెల్లడించారు. షేల్... భూమిలో బాగా లోతున, సువిశాల విస్తీర్ణంలో బల ్లపరుపుగా వ్యాపించి ఉండే నేల పొరల మధ్య ఇరుక్కుని ఉంటుంది. కాబట్టి సంప్రదాయక బావుల నుంచి 70 నుంచి 100 ఏళ్ల వరకు తక్కువ వ్యయాలతో వెలికితీత సాధ్యమైతే, షేల్ బావులు 10 నుంచి 20 ఏళ్లల్లోనే అడుగంటుతాయి. ఏటికేడాది ఉత్పాదకత పడిపోతూ, వ్యయాలు పెరిగిపోతుంటాయి. ఎప్పటికప్పుడు సమీపంలో కొత్త బావులు తవ్వుతూనే ఉండాలి, భారీగా కొత్త పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. దీంతో దీర్ఘకాలంలో షేల్ గ్యాస్ వ్యయాలు పెరిగి వాణిజ్యపరంగా లాభసాటి కాకుండాపోతుంది. ఈ ముప్పు తెలుసు కాబట్టే అమెరికాలోని షేల్ లాబీ త్వరత్వరగా గ్యాస్ ఎగుమతులు చేసేయాలని ఆరాటపడిపోతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్ వరకు అంటించిన షేల్ జ్వరానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామాగ్రిని, రాయల్టీలను నొల్లేసుకోవాలని తొందరపడుతోంది. ఇతర దేశాలు షేల్ గ్యాస్ మార్కెట్లోకి వచ్చేసరికే షేల్ మార్కెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. ఒబామా షేల్ కలను అమ్మి అమెరికన్ పెట్రో గుత్త సంస్థలు లాభాలు చేసుకుంటాయి. అప్పటికల్లా కాస్పియన్ సముద్ర తీరంలోని రష్యా ఇంధన కోటలో పాగవేయాలనేది అమెరికా దీర్ఘకాలిక వ్యూహం. రష్యా ప్రాబ ల్యం కింద ఉన్న మధ్య ఆసియా దేశాల చమురు, గ్యాస్ నిక్షేపాలపై ఆధిపత్యం సంపాదించడానికి అది ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మానవహక్కుల ఉల్లంఘనకు ప్రసిద్ధి చెందిన అజర్బైజాన్లో మే నెల చివర్లో అది ‘అమెరికా-అజర్బైజాన్: విజన్, ప్యూచర్’ అనే సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి ఒబామా ప్రభుత్వ అత్యున్నతాధికారులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రపంచ బ్యాం కు ప్రతినిధులు, మంత్రుల భార్యలు తదితరులు దాదాపు 400 మంది హాజరయ్యారు. అజర్‌బైజాన్‌ను కేంద్రంగా చేసుకొని ఆ దేశంలోని బాకూ తీరం నుంచి టర్కీకి అటు నుంచి ఇతర యూరప్ దేశాలకు గ్యాస్‌ను ఎగమతి చేయడానికి ట్రాన్స్‌కాస్పియన్ పైపులైన్ నిర్మాణానికి అమెరికాకు అజార్బైజాన్ స్థావరంగా మారింది. ఇంతవరకు రష్యా ప్రాబల్యం కింద ఉన్న తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్లలోని చమురు కేంద్రాలపైకి అమెరికా వల విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరత్వరగా తరిగిపోతున్న సహ జ వనరులపై ఆధిపత్యం కోసం పదునెక్కుతున్న తీవ్ర సంఘర్షణకు అమెరికా, రష్యాల గ్యాస్ చిచ్చు అద్దం పడుతున్నది. సహజంగానే ఇలాంటి పోటీలో అటూ ఇటూ కూడా ఉంటూ లాభపడగల ‘తెలివితేటలు’ చైనాకు మాత్రమే ఉన్నాయి. - పిళ్లా వెంకటేశ్వరరావు