పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు | three principles of environmental conservation cheery | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు

Published Mon, Mar 23 2015 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు

పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు

పదో తరగతి
 
జీవశాస్త్రం
 
భూమి సహజ వనరులకు ఆలవాలమైన గ్రహం.నీరు, నేల, అడవులు, వృక్షాలు, జంతువులు మానవ మనుగడకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.వీటిని సరైన రీతిలో వినియోగించుకోకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి. పర్యావరణ పరిరక్షణకు
 ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. భవిష్యత్ తరాలు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత.
 
సహజ వనరులు

వనరులను సంరక్షించకపోతే కలిగే నష్టాలు, వాటిని సుస్థిరపరచుకునే విధానాల గురించి ‘సహజ వనరులు’ పాఠ్యభాగంలో వివరించారు. దీంట్లో భాగంగా రెండు గ్రామాల్లో నిర్వహించిన అధ్యయనాలను పేర్కొన్నారు. వనపర్తి గ్రామంలో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఈ గ్రామంలో బావుల ద్వారా నీటి పారుదల నిర్వహించే 25 కుటుంబాల సామాజిక, ఆర్థిక అంశాలను సేకరించారు. వడ్డిచెర్ల గ్రామంలో తీవ్ర నీటికొరత ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో బావుల సంఖ్య, నీటి పారుదల ఉన్న భూ వైశాల్య శాతం, అందులో తగ్గుదల, ఫలితంగా పంటల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. చిన్న, పెద్ద రైతులు బావుల ద్వారా నీటిపారుదలపై చేస్తున్న వార్షిక ఖర్చు, పంటల ద్వారా పొందిన ఆదాయాన్ని సరి చూశారు. ఈ గ్రామాల్లో ఎండిపోతున్న బావుల్లో నీరు చేరుకునేలా భూగర్భ జలాల సుస్థిరత్వం కోసం కేంద్రం దృష్టి సారించింది. మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశ పెట్టడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లాంటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించింది. ఫలితంగా నీటి వనరుల రక్షణలో పెద్ద ముందడుగు పడింది.

అందరికీ నీరు అనే అంశంలో భూమిపై ఉన్న మొత్తం నీటి గణాంకాలను తెలియజేస్తూ,  మంచినీరు చాలా తక్కువగా ఉందని, నీటిని విచక్షణతో వాడుకోవాలని వివరించారు. వాటర్‌షెడ్, సామాజిక చెరువు, కాంటూర్ సేద్యం లాంటి సముదాయ ఆధారిత విధానాలను అవలంబించాలని తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్యం దిశగా జరిగిన ప్రయత్నం, సముదాయ ఆధారిత విధానాలు, వీటికి సహాయపడిన ఇక్రిసాట్ సంస్థ గురించి తెలుసుకోవాలి. తక్కువ ఎత్తు పెరిగే పంటలను సాగు చేయడం, కాంటూర్ సేద్యం మొదలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుకునే రైతు ఆధారిత విధానాలను ప్రోత్సహించడం చాలా అవసరం.

బీడు భూముల అభివృద్ధి, వాటిలో మొక్కల పెంపకం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, నీటి వనరులు మొదలైన అంశాల గురించి తెలిపారు. గోదావరీ నదీజలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడానికే సరిపోవడం లేదు. అందువల్ల నీటిపారుదల సౌకర్యాల వినియోగం కోసం మెరుగైన పథకాలను రూపొందించుకోవాల్సి ఉంది.

మన చుట్టూ ఉన్న పునరుద్ధరింపదగిన, పునరుద్ధరింపలేని వనరుల గురించి అవగాహన పెంచుకోవాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇళ్లు, వస్తువుల ఉత్పత్తి - రవాణా, ఇంధన వినియోగం గురించి తెలుసుకోవాలి. అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు. భూమిపై అధికంగా మానవుడి తాకిడికి గురవుతున్న వనరు కూడా ఇదే. దీనివల్ల హరిత గృహ వాయువులు విడుదలై, గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి. భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందించడానికి సుస్థిర అటవీ విధానాలను అనుసరించాలి. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. రాజస్థాన్‌లో బైష్ణోయి తెగకు చెందిన అమృతాదేవి, ఆమె కుమార్తెలు, గ్రామస్థులంతా అడవులను నరికివేయకుండా కాపాడటానికి ప్రాణాలు అర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. సుస్థిర అటవీ పద్ధతులు, పునఃచక్రీయ విధానాలను అవలంబించడం ద్వారా అడవులను కాపాడుకోవాలి.
 ఆహారోత్పత్తికి నేల అత్యంత అవసరం.  ఒకే రకం పంటను పలుమార్లు పండించడం లాంటి లోపభూయిష్టమైన పద్ధతుల వల్ల నేలలోని పోషకాలు నశిస్తాయి. కాంటూర్ పట్టీ పంటలు, ఎంపిక పంట పద్ధతులతో నేలను రక్షించుకోవచ్చు. జీవవైవిధ్యం మరో ప్రధాన అంశం. భూమిపై తరిగిపోతున్న జీవులు, వాటిని కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది శిలాజ ఇంధనాలు. మనదేశంలో ఉపయోగిస్తున్న వివిధ వనరుల గురించి తెలుసుకోవాలి. ఇంధన పొదుపు, దీని కోసం పాటించాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (బయోడీజిల్), సైకిల్ వాడకం లాంటివాటి గురించి తెలుసుకోవాలి. భూమిలో లభించే వివిధ ఖనిజ లవణాల గురించి పరిశీలించాలి. గనుల తవ్వకం ద్వారా కోల్పోతున్న ఖనిజ నిక్షేపాలు, వెలువడుతున్న గాలి, ధూళి లాంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకోవాలి.

ఇందిరాగాంధీ చెప్పినట్లుగా.. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మూడు ఖ (ఖ్ఛఛీఠఛ్ఛి, ఖ్ఛఠట్ఛ, ఖ్ఛఛిడఛ్ఛి)లను ఆచరించాలి. ఐ్ఖఇూ లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ కోసం చేస్తున్న కృషిని తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి.
 
 అభివృద్ధిపేరుతో వనరుల విధ్వంసం


పరిశ్రమల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, రహదారుల ఏర్పాటు కోసం వనరులను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అనేక ప్రాంతాల్లో పంటపొలాలు ప్లాట్లుగా మారి బీడుపడి పోతున్నాయి.
బహుళజాతి సంస్థల వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో నీరు వ్యాపారమైంది.
 బెంగాల్‌లోని సింగూరు భూములు, తమిళనాడు కుడంకుళం లాంటివాటిని వనరుల అతి వినియోగానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీటికి సంబంధించి ప్రజావ్యతిరేకత అధికంగా ఉంది.
 
 పర్యావరణ సంరక్షణ సూత్రాలు 

 
తగ్గించడం, తిరిగి వాడటం, పునఃచక్రీయం అనే 3 అంశాల ద్వారా పర్యావరణ రక్షణను నిర్వహించాలి.
 1.    తగ్గించడం (ఖ్ఛఛీఠఛ్ఛి): వనరులను వృథా చేయకుండా తక్కువగా వినియోగించాలి. అవసరంలేని సమయాల్లో విద్యుద్దీపాలు, ఫ్యాన్లను ఆర్పి ఉంచాలి.
 2.    తిరిగి వాడటం (ఖ్ఛఠట్ఛ): పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవాలి. కాగితాన్ని తిరిగి వాడటం వల్ల మొక్కలను అధిక మొత్తంలో కాపాడగలుగుతాం.
 3.    పునఃచక్రీయం (ఖ్ఛఛిడఛ్ఛి): ఒకసారి ఉపయోగించి వృథాగా ఉన్న పదార్థాలను తిరిగి వేరే రూపంలో వినియోగించుకోవాలి. దీన్నే పునఃచక్రీయం అంటారు.
 వీటితో పాటు ఇటీవల ఖ్ఛ్టజిజీజు (తిరిగి ఆలోచించడం) అనే అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కూడా ఆచరణీయమే.
 
కీలకభావనలు

ఇంకుడు చెరువు: నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పరిచే నీటి నిల్వలే ఇంకుడు చెరువులు.
సూక్ష్మ నీటిపారుదల: బిందు సేద్యం, తుంపరల విధానం ద్వారా జరిగే నీటిపారుదల.
బోరు బావులు: భూగర్భ జలాలను పైకి  తేవడానికి తవ్వే గొట్టపు బావులు.
సుస్థిర అభివృద్ధి: ఒక రంగంలో జరిగే అభివృద్ధి వల్ల మరో రంగానికి నష్టం కలుగకుండా సమగ్ర అభివృద్ధి సాధించడం.
జీవ ఇంధనాలు: మొక్కలు, జంతు సంబంధ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసే ఇంధనాలు.
కాంటూర్ పట్టీ పంటల విధానం: నేల క్రమక్షయానికి గురవకుండా నేలవాలుకు అడ్డంగా కట్టలను ఏర్పరచడం ద్వారా జరిపే వ్యవసాయ విధానం.
గట్లు: వర్షపు నీరు పొలాల్లోకి పారి వ్యర్థం కాకుండా అడ్డుగా నిర్మించే నిర్మాణాలు.
కట్టల నిర్వహణ: వాన నీటిని వ్యర్థం కాకుండా అడ్డుకట్టల్లో నిల్వచేసి, ఆ నీటిని తిరిగి ఎండిన బావులు, బోరు బావుల్లో నింపి భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి అనుసరించే విధానం.
ఇంకుడు గుంతలు: వర్షపు నీరు భూమిలో ఇంకడం కోసం తవ్వే గుంతలు.
ఇక్రిసాట్ (ఐఇఖఐఅఖీ): ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది అర్ధ శుష్క మండలాల్లో పెరిగే మొక్కలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది.
డైక్: ప్రాజెక్టు నుంచి వెళ్లే కాలువలకు కట్టే అడ్డుకట్టలను డైక్‌లు అంటారు.
నీటి వినియోగదారుల సంఘం: చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల లాంటి నీటి వినియోగ నిర్మాణాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజాసంఘాలు.
రైతు ఆధారిత విధానాలు: పొలాల్లో వ్యక్తిగతంగా నేల, నీటి సంరక్షణ కోసం రైతులు అమలు చేసే కార్యక్రమాలను రైతు ఆధారిత విధానాలు అంటారు.
గ్లైరిసిడియా: పొడి నేలలో పెరిగే లెగ్యుమినేసి కుటుంబ మొక్కలు. ఇవి నేలలో నైట్రోజన్ నిల్వలు పెరగడానికి, గట్లు బలంగా ఉండటానికి సహాయపడతాయి.
బిందు సేద్యం: ఇది సూక్ష్మ నీటిపారుదల విధానం. మొక్కలకు సన్నని పైపుల ద్వారా వేర్ల వద్ద నీరు అందేలా చేస్తారు.
ూఖఈ్క: యునెటైడ్ నేషన్‌‌స డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది ప్రపంచ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
 హరిత గృహ వాయువులు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ూై2, క్లోరోఫ్లోరో కార్బన్లను గ్రీన్‌హౌస్ వాయువులు అంటారు. ఇవి ఓజోన్ పొరకు హాని కలుగజేస్తాయి.
 సుస్థిర అటవీ విధానాలు: భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయడానికి అవలంబించాల్సిన విధానాలను సుస్థిర అటవీ విధానాలు అంటారు.
 
ఎంపిక పంట పద్ధతి: పంట కోసేటప్పుడు ఒక్కో మొక్క లేదా చిన్న గుంపును తీసివేయడం. దీనివల్ల నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు.
 జట్రోఫా కర్కాస్: బయో డీజిల్ తయారీకి ఉపయోగపడే మొక్క.
 
 
1.    మంజు ఇంటికి పాలిథిన్ కవర్లను తేవడం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
     ఎ) ఆమె మార్కెట్టుకు వెళ్లకూడదు    బి) అమె పాలిథిన్‌ను వాడాలి
     సి) మార్కెట్టుకు గుడ్డసంచీ తీసుకెళ్లాలి    డి) కూరగాయల బదులు వేరేవి తినాలి

2.    రమ్య తన పాత పుస్తకాలను పారేయకుండా తన చెల్లెలికి ఇచ్చి చదువుకోమన్నది. ఈ చర్య దేనికి ఉదాహరణ?
     ఎ) తగ్గించడం    బి) పునఃచక్రీయం
     సి) సహాయం    డి) పునర్వినియోగం
 
3.    కింది వాక్యాల్లో ఏది సత్యం?
     1) నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచడానికి ఎక్కువ ఎరువులు వేయాలి
     2) గట్లపై గ్లైరిసిడియా మొక్కలను పెంచడం ద్వారా నత్రజని నిల్వలను పెంచాలి.
     ఎ) 1, 2 సత్యం
     బి) 1 సత్యం, 2 అసత్యం
     సి) 2 సత్యం, 1 అసత్యం
     డి) 1, 2 రెండూ అసత్యం
 
4.    కిందివాటిలో రైతు ఆధారిత విధానం ఏది? ఎ) కాలువలు తీయడం
     బి) చెరువుల కింద సాగు
     సి) కాంటూర్ పట్టీ సేద్యం    
     డి) ఎక్కువ నీటిని వినియోగించడం
 
 సమాధానాలు
     1) సి    2) డి    3) సి    4) సి
 
 
 
 1.    అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ ృృృృ లో ఉంది.
 2.    నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో ఆనకట్టలు కట్టి ఏర్పరచిన నిర్మాణాలు ృృృృృ
 3.    }రాంసాగర్ ప్రాజెక్టును ృృృృృ నదిపై నిర్మించారు.
 జవాబులు
 1)    హైదరాబాద్ (రాజేంద్రనగర్)
 2)    ఇంకుడు చెరువులు    3) గోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement