Tenth grade
-
పాఠం స్పీడ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పాఠశాల అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు గతంలో మార్చి, ఏప్రిల్‌లో జరిగేవి. కోవిడ్ కారణంగా పరీక్షలు ఆలస్యమయ్యాయి. మరో వైపు స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం, మధ్యలో సెలవుల వల్ల సిలబస్ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు స్కూళ్లకు సిలబస్ పూర్తి చేసే అవకాశం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది కూడా టెన్త్ సిలబస్ 70 శాతమే అమలు చేస్తున్నారు. అందులో ఇప్పటికీ 60 శాతం మించి సిలబస్ పూర్తి కాలేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. మిగిలిన సిలబస్‌ను క్షుణ్ణంగా చెప్పాలంటే కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని, అంత సమయం లేకపోవడంతో వేగంగా ముగించేందుకు ఉపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఫలితంగా విద్యార్థులకు అర్థమైనా, కాకపోయినా సిలబస్ పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. బోధన సమయంలో పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులతో నిశిత అధ్యయనం చేయించ డం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. విద్యార్థులే సొంతంగా ఎక్కువ సమయం కేటాయించి లోతైన అధ్యయనం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ విధానం పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇంత వరకూ లోతైన బోధన జరిగిందని, ఇప్పుడు పైపైన బోధన చేస్తే, వాటిల్లోనే విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తే సమాధానం ఇవ్వడం విద్యార్థులకు కష్టంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళికా బద్దంగా బోధన జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే వీలుందంటున్నారు. ఇది కాకుండా రివిజన్‌కు సమయం ఉండే వీల్లేదని టీచర్లు అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన ఆన్లైన్ క్లాసులపై అవగాహన కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. -
TS: ‘పది’లో ఆరు పేపర్లే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే నిర్వహించనున్నారు. దీనితోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. బహుళ ఐచ్చిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో.. గత ఏడాది లాక్డౌన్ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఆన్లైన్ క్లాసులు జరిగాయి. సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు కూడా మొదలయ్యాయి. అయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (టీఎస్‌సీఈఆర్‌టీ)’పేర్కొంది. పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని సిఫారసు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. 2021–22 ఏడాదికి సంబంధించి టెన్త్ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాటైంది. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది. వాటిని ఆరుకు కుదించడం బోర్డు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తొలినాళ్లలో 9, 10 తరగతులు రెండింటి నుంచీ ప్రశ్నలిచ్చేవారు. దీనివల్ల విద్యార్థి సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం తెలుసుకునే అవకాశం ఉండేదని చెప్పేవారు. తర్వాత ఆ విధానాన్ని సరళీకరించి పదో తరగతి పాఠాలకే పరిమితం చేశారు. కొన్నేళ్ల కింద మరోసారి పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ ప్రశ్నల శాతాన్ని ఖరారు చేసేఅవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సిలబస్ గందరగోళం! కోవిడ్ నేపథ్యంలో మొత్తం సిలబస్ బోధించడం కష్టమని భావించిన విద్యాశాఖ దాన్ని 30 శాతం మేర తగ్గించింది. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇంకా బోధించని పాఠాలను నిలిపివేస్తారా? ఎవైనా నిర్థిష్టమైన పాఠాలను ఎంపిక చేసి, కోత పెడతారా? అన్నది తేల్చాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో కొంత సిలబస్ పూర్తికాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకుని, రివిజన్ మొదలుపెట్టాయి. సిలబస్ కోత విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఇబ్బందులు ఉంటాయి’’అని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. సిలబస్‌పై విద్యాశాఖ వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, నాణ్యతకు పదునుపెట్టే సబ్జెక్టుల్లో కోత పెట్టొద్దని మరో ఉపాధ్యాయ సంఘం నేత నర్సిరెడ్డి సూచించారు. -
‘పది’ పేపర్ లీకేజీ కలకలం
రూరల్ జిల్లాలో లీక్.. ఖమ్మంలో ప్రత్యక్షం ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రం వాట్సప్‌లో హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఖమ్మం విద్యాశాఖాధికారులు ప్రాథమిక దర్యాప్తులో వర్ధన్నపేటలో లీకైనట్లు వెల్లడి పోలీసుల అదుపులో నిందితులు వరంగల్ : పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం వరంగల్ రూరల్ జిల్లాలో లీక్ అయి ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షం కావడంతో అక్కడ విద్యాశాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంగ్లిష్ పేపర్–1 పరీక్ష మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత వాట్సప్‌లో ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. అన్ని వాట్సప్‌లలో ప్రశ్నలు కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా లీకేజీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఖమ్మం విద్యా«శాఖాదికారులు వెంటనే ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశారు. ప్రశ్నపత్రం లీకైందనే ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఏసీపీ గణేష్ ఆ«ధ్వర్యంలో పోలీసులు డీఈఓ కార్యాలయానికి చేరుకొని విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మీబాయిని ప్రశ్నించారు. ఈమేరకు వరంగల్ ఆర్జేడీ బాలయ్యతో సంప్రదింపులు జరిపారు. ఉదయం 9.30 గంటలకే పరీక్ష ప్రారంభమైందని, 11.30 గంటలకు పరీక్ష పూర్తయి ఉంటుందా? లేక విద్యార్థి పరీక్ష రాసి వస్తే అతడి ప్రశ్నపత్రాన్ని వాట్సప్‌లో పెట్టారా? లేదా నిజంగా లీక్ అయిందా? అనే విషయం విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఖమ్మం డీఈఓ విజయలక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ చానల్లో 12.15 గంటలకు ప్రశ్నపత్రం లీక్ అయిందని కథనాలు ప్రసారమయ్యాయని, దీని ఆధారంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. వాట్సప్‌లో వచ్చిన పేపర్ ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చర్చించి.. అసలు వ్యవహారాన్ని రాబట్టారు. చివరకు ప్రశ్నపత్రాన్ని వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ వాట్సప్‌లో పెట్టినట్లు వెల్లడైంది. టెక్నాలజీతో గుట్టురట్టు.. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌కు వాట్సప్ వేదికగా మారింది. ఇదే నూతన విధానం నిందితుడిని సైతం పట్టించేందుకు ఉపయోగపడింది. పోలీసులు విచారణలో ప్రశ్నపత్రం వచ్చిన వాట్సప్ ద్వారా కొత్త టెక్నాలజీతో ఎక్కడెక్కడి నుంచి ప్రశ్నపత్రం వచ్చిందో తెలుసుకున్నారు. పోలీసుల విచారణలో.. వరంగల్‌కు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఉదయం 9.40 గంటలకు ప్రశ్నపత్రాన్ని లీక్ చేశాడనే నిర్ధారణకు వచ్చారు. 10.36 గంటలకు ఖమ్మంలోని ఓ చానెల్ ప్రతినిధికి ఆ ప్రశ్నపత్రం చేరినట్లు గుర్తించారు. దీని ఆధారంగా చానెల్లో 11.30 గంటలకు ప్రసారమైనట్లు గుర్తించారు. పోలీసులు మాత్రం పరీక్ష చివరి క్షణాల్లోనే పరీక్షా పత్రం లీక్ అయినట్లు వెల్లడించారు. సీఎం దృష్టికి లీకేజీ వ్యవహారం.. ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో ప్రసారం కావటంతో సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో ఎంసెట్–2 పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం వరంగల్‌లో జరగడంతో ఆయన ప్రశ్నాప్రతం లీకేజీపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ కార్యాలయం నుంచే విచారణ పదవ తరగతి ప్రశ్నాప్రతం లీకేజీపై ఖమ్మం జిల్లా పోలీసులు అక్కడి డీఈవో కార్యాలయం నుంచి విచారణ ప్రారంభించారు. ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో సీఐలు రాజిరెడ్డి, నాగేంద్రాచారి, ఎస్సై మల్లయ్యలు జిల్లాలో పరీక్షలు జరుగుతున్న తీరు, సిబ్బంది, బందోబస్తుపై ఆరాతీశారు. వాట్సప్‌లో వచ్చిన సందేశం, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టారు. పలుమార్లు మీడియా ప్రతినిధులు, డీఈఓ, ఆర్జేడీలతో చర్చలు జరిపారు. అక్కడి నుంచి సీపీ షానవాజ్ ఖాసీం, కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్‌తో చర్చించారు. అనంతరం ఏసీపీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. డీఈఓ విజయలక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో దోషులను పట్టుకుంటామన్నారు. ఆర్జేడీ అత్యవసర సమీక్ష పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అంటూ కథనాలు రావటంతో ఆర్జేడీ బాలయ్య, ఖమ్మం డీఈఓ విజయలక్ష్మీబాయి మంగళవారం మధ్యాహ్నం చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే జైలుశిక్ష తప్పదని, లీకేజీ వ్యవహారంలో కొందరి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతుందని, దీనిపై పోలీసుల విచారణ జరుగుతుందని, దోషులుగా తేలితే శిక్ష తప్పదన్నారు. ప్రతి విద్యార్థి ప్రశ్నపత్రంపై హాల్‌టికెట్ నంబర్ విధిగా వేసేలా చూడాలన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత మాత్రమే విద్యార్థులను బయటకు పంపించాలని సూచించారు. ప్రశ్నపత్రాలను భారీ బందోబస్తు, ఎస్కార్ట్ సహాయంతో తరలించాలన్నారు. -
ఖేడ్ ను దౌడ్ తీయిస్తా
♦ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ♦ పాఠశాలలు ఏర్పాటు చేయిస్తా ♦ మంత్రి హరీశ్‌రావు వెల్లడి ♦ సిద్దిపేటలో ‘ఖేడ్’ విద్యార్థుల ♦ విద్యాభ్యాసంపై విస్మయం ♦ గత పాలకుల వైఫల్యమే కారణమని వ్యాఖ్య సిద్దిపేట జోన్: ‘బాబు దినేష్.. పదో తరగతి చదువు కోసం నారాయణఖేడ్ నుంచి సిద్దిపేటకు రావడం బాధాకరంగా ఉంది. ఇటీవల ఖేడ్ ఉప ఎన్నికల్లో కొన్ని రోజులు అక్కడే ఉన్నా. అక్కడి పరిస్థితి చూస్తే బాధ వేసింది. విద్య, తాగు, సాగు నీరు, మౌలిక వసతులు లేక ఖేడ్ ప్రజలు పడుతున్న బాధలు నన్ను కలచి వేశాయి. నారాయణఖేడ్‌ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించి దశ మారుస్తా’నంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం స్థానిక హైస్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆకస్మికంగా పదో తరగతిని పరిశీలించారు. తరగతి గదిలో అత్యధికంగా తండాకు చెందిన పిల్లలను గుర్తించిన మంత్రి.. నారాయణఖేడ్‌కు చెందిన వారు ఎందరున్నారని ప్రశ్నించారు. 14 మంది విద్యార్థులు లేచి తమతమ ఊర్ల పేర్లను వినిపించారు. ఒక్కసారిగా 14 మంది ఒకే తరగతి గదిలో ఖేడ్ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న విషయం తెలుసుకుని మంత్రి విస్మయం చెందారు. వెంటనే ఆయన ఆ విద్యార్థులతో యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన, వసతి గృహాల్లో సౌకర్యాల గూర్చి ఆరా తీశారు. అక్కడే ఉన్న అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులచే ఖేడ్ పరిస్థితిపై చర్చించారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో కేవలం మూడు పాఠశాలలే ఉండటం ఆ ప్రాంత దారుణ స్థితిని తెలుపుతున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఖేడ్‌లో విద్యారంగం అభివృద్ధి చెందలేదన్నారు. ఖేడ్ లాంటి ప్రాంతం లో ఆశించిన స్థాయిలో పాఠశాలలు లేక అక్కడి తండా విద్యార్థులు వందలాది మంది సిద్దిపేట, మెదక్ లాంటి వసతి గృహాల్లో విద్యాభ్యాసానికి వస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఖేడ్‌ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు. ఖేడ్‌లో పాఠశాలల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, నాయకులు రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మంత్రి హరీష్‌రావు విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో అరబిందో సహకారంతో నిర్మిం చిన మరుగుదొడ్ల బ్లాక్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు వదిలిన విషయాన్ని గ్రహించి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
జిన్నారం: ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడి చదవాలని పదోతరగతి విద్యార్థులకు ఎంఈఓ ప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. సోమవారం జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రకాశ్ మాట్లాడుతూ.. పదో తరగతిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ఉదయం వేళలో తప్పనిసరిగా స్నాక్స్ అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జ్ఞానమాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టేన్ షన్
పూర్తి కాని పదోతరగతి సిలబస్ కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కరువు ఆందోళనలో విద్యార్థులు చిత్తూరు(గిరింపేట): ప్రతి విద్యార్థి జీవితంలో కీలకఘట్టం పదోతరగతి. అక్కడ గట్టెక్కితే కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పదో తరగతి విద్యార్థులకు.. జిల్లాలో చాలాచోట్ల టీచర్లు లేరు. కనీసం విద్యావలంటీర్లను కూడా నియమించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు మరో రెండు నెలలే గడువుంది. కీలక సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించకపోవడం దారుణమని ఉపాధ్యాయసంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో 534 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 28 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం పదో తరగతికి సంబంధించి 386 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. కీలక సబ్జెక్టులైన ఇంగ్లీషు, గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, సాంఘికశాస్త్రానికి టీచర్లే లేరు. నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టు టీచరు ఉండాలి. ఈ స్థాయిలో ఎక్కడా నియామకాలు జరగలేదు. నెలాఖరువరకే గడువు.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నె లాఖరుకు పదోతరగతి సిలబస్ మొత్తం పూర్తి కావాలి. కానీ ఉపాధ్యాయుల కొరత వల్ల కొన్నిచోట్ల 80 శాతం, మరికొన్ని చోట్ల 50 నుంచి 60 శాతం పాఠ్యాంశాలు మాత్రమే పూర్తయ్యాయి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న వారితోనే తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఉన్నత పాఠశాలల్లో బోధించే టీచర్లు వేరే ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల ఆ స్థానాలు ఖాళీ అయ్యాయని చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు కుప్పం మండలానికి మాత్రం వలంటీర్లను నియమించి జిల్లాలోని మిగిలిన మండలాల్లోని పాఠశాలలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సక్సెస్‌లో మరీ అధ్వానం జిల్లాలో 339 సక్సెస్ పాఠశాలల్లో ప్రత్యేక సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. ఆ పాఠశాలల్లో ఈ ఏడాది 27 వేల మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధమ్యం చెప్పే వారు లేక తెలుగు మీడియం వారితోనే బండిలాకొస్తున్నారు. ఇదిగో సాక్ష్యం.. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ్ ల్వాంగేజ్ బోధించడానికి ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మరొక ప్రాంతానికి బదిలీ అయినప్పటి నుంచి ఆ సబ్జెక్ట్‌కు వేరొక ఉపాధ్యాయున్ని నియమించ లేదు. గుడిపాల మండలంలోని మిట్టఇండ్లు, ఏఎల్‌పురంలో సోషియల్, బయాలజీ బోధించే టీచర్లు లేరు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ఉర్ధూ ఉన్నతపాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీ. పీటీఎం మండలంలోని కందుకూరు జడ్పీ హైస్కూల్లో గణితం, హిందీ, పీటీయంలోని ఉన్నత పాఠశాలలో బయాలజీ, సోషియల్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులే తమ సొంత డబ్బులతో వలంటీర్లను నియమించుకుని బోధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర అధికారులకు నివేదిక పంపాం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించిన ఖాళీల జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపాం. వారి నుంచి అదేశాలు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక సర్ధుబాటు చేయడం జరుగుతుంది. వారంలోపు ఖాళీగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు యత్నిస్తాం. - నాగేశ్వరరావు, డీఈవో -
జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచే ్చ నెల 18 నుం చి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల విభా గం డెరైక్టర్ శేషుకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుము తో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ఫీజులను సంబంధిత ప్రధానోపాధ్యాయునికి చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చని వెల్లడించారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ద్వితీయభాష పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పాత సిలబస్వారికి ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. -
పర్యావరణ పరిరక్షణకు ముచ్చటైన మూడు సూత్రాలు
పదో తరగతి జీవశాస్త్రం భూమి సహజ వనరులకు ఆలవాలమైన గ్రహం.నీరు, నేల, అడవులు, వృక్షాలు, జంతువులు మానవ మనుగడకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.వీటిని సరైన రీతిలో వినియోగించుకోకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జీవవైవిధ్యాన్ని కాపాడాలి. భవిష్యత్ తరాలు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత. సహజ వనరులు వనరులను సంరక్షించకపోతే కలిగే నష్టాలు, వాటిని సుస్థిరపరచుకునే విధానాల గురించి ‘సహజ వనరులు’ పాఠ్యభాగంలో వివరించారు. దీంట్లో భాగంగా రెండు గ్రామాల్లో నిర్వహించిన అధ్యయనాలను పేర్కొన్నారు. వనపర్తి గ్రామంలో నీరు పుష్కలంగా లభిస్తుంది. ఈ గ్రామంలో బావుల ద్వారా నీటి పారుదల నిర్వహించే 25 కుటుంబాల సామాజిక, ఆర్థిక అంశాలను సేకరించారు. వడ్డిచెర్ల గ్రామంలో తీవ్ర నీటికొరత ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో బావుల సంఖ్య, నీటి పారుదల ఉన్న భూ వైశాల్య శాతం, అందులో తగ్గుదల, ఫలితంగా పంటల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు. చిన్న, పెద్ద రైతులు బావుల ద్వారా నీటిపారుదలపై చేస్తున్న వార్షిక ఖర్చు, పంటల ద్వారా పొందిన ఆదాయాన్ని సరి చూశారు. ఈ గ్రామాల్లో ఎండిపోతున్న బావుల్లో నీరు చేరుకునేలా భూగర్భ జలాల సుస్థిరత్వం కోసం కేంద్రం దృష్టి సారించింది. మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ప్రవేశ పెట్టడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లాంటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించింది. ఫలితంగా నీటి వనరుల రక్షణలో పెద్ద ముందడుగు పడింది. అందరికీ నీరు అనే అంశంలో భూమిపై ఉన్న మొత్తం నీటి గణాంకాలను తెలియజేస్తూ, మంచినీరు చాలా తక్కువగా ఉందని, నీటిని విచక్షణతో వాడుకోవాలని వివరించారు. వాటర్‌షెడ్, సామాజిక చెరువు, కాంటూర్ సేద్యం లాంటి సముదాయ ఆధారిత విధానాలను అవలంబించాలని తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్యం దిశగా జరిగిన ప్రయత్నం, సముదాయ ఆధారిత విధానాలు, వీటికి సహాయపడిన ఇక్రిసాట్ సంస్థ గురించి తెలుసుకోవాలి. తక్కువ ఎత్తు పెరిగే పంటలను సాగు చేయడం, కాంటూర్ సేద్యం మొదలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుకునే రైతు ఆధారిత విధానాలను ప్రోత్సహించడం చాలా అవసరం. బీడు భూముల అభివృద్ధి, వాటిలో మొక్కల పెంపకం, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు, నీటి వనరులు మొదలైన అంశాల గురించి తెలిపారు. గోదావరీ నదీజలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపడానికే సరిపోవడం లేదు. అందువల్ల నీటిపారుదల సౌకర్యాల వినియోగం కోసం మెరుగైన పథకాలను రూపొందించుకోవాల్సి ఉంది. మన చుట్టూ ఉన్న పునరుద్ధరింపదగిన, పునరుద్ధరింపలేని వనరుల గురించి అవగాహన పెంచుకోవాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇళ్లు, వస్తువుల ఉత్పత్తి - రవాణా, ఇంధన వినియోగం గురించి తెలుసుకోవాలి. అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు. భూమిపై అధికంగా మానవుడి తాకిడికి గురవుతున్న వనరు కూడా ఇదే. దీనివల్ల హరిత గృహ వాయువులు విడుదలై, గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తున్నాయి. భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందించడానికి సుస్థిర అటవీ విధానాలను అనుసరించాలి. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. రాజస్థాన్‌లో బైష్ణోయి తెగకు చెందిన అమృతాదేవి, ఆమె కుమార్తెలు, గ్రామస్థులంతా అడవులను నరికివేయకుండా కాపాడటానికి ప్రాణాలు అర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. సుస్థిర అటవీ పద్ధతులు, పునఃచక్రీయ విధానాలను అవలంబించడం ద్వారా అడవులను కాపాడుకోవాలి. ఆహారోత్పత్తికి నేల అత్యంత అవసరం. ఒకే రకం పంటను పలుమార్లు పండించడం లాంటి లోపభూయిష్టమైన పద్ధతుల వల్ల నేలలోని పోషకాలు నశిస్తాయి. కాంటూర్ పట్టీ పంటలు, ఎంపిక పంట పద్ధతులతో నేలను రక్షించుకోవచ్చు. జీవవైవిధ్యం మరో ప్రధాన అంశం. భూమిపై తరిగిపోతున్న జీవులు, వాటిని కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది శిలాజ ఇంధనాలు. మనదేశంలో ఉపయోగిస్తున్న వివిధ వనరుల గురించి తెలుసుకోవాలి. ఇంధన పొదుపు, దీని కోసం పాటించాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (బయోడీజిల్), సైకిల్ వాడకం లాంటివాటి గురించి తెలుసుకోవాలి. భూమిలో లభించే వివిధ ఖనిజ లవణాల గురించి పరిశీలించాలి. గనుల తవ్వకం ద్వారా కోల్పోతున్న ఖనిజ నిక్షేపాలు, వెలువడుతున్న గాలి, ధూళి లాంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా.. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మూడు ఖ (ఖ్ఛఛీఠఛ్ఛి, ఖ్ఛఠట్ఛ, ఖ్ఛఛిడఛ్ఛి)లను ఆచరించాలి. ఐ్ఖఇూ లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ కోసం చేస్తున్న కృషిని తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి. అభివృద్ధిపేరుతో వనరుల విధ్వంసం పరిశ్రమల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, రహదారుల ఏర్పాటు కోసం వనరులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అనేక ప్రాంతాల్లో పంటపొలాలు ప్లాట్లుగా మారి బీడుపడి పోతున్నాయి. బహుళజాతి సంస్థల వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు హరించుకుపోతున్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో నీరు వ్యాపారమైంది. బెంగాల్‌లోని సింగూరు భూములు, తమిళనాడు కుడంకుళం లాంటివాటిని వనరుల అతి వినియోగానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. వీటికి సంబంధించి ప్రజావ్యతిరేకత అధికంగా ఉంది. పర్యావరణ సంరక్షణ సూత్రాలు తగ్గించడం, తిరిగి వాడటం, పునఃచక్రీయం అనే 3 అంశాల ద్వారా పర్యావరణ రక్షణను నిర్వహించాలి. 1. తగ్గించడం (ఖ్ఛఛీఠఛ్ఛి): వనరులను వృథా చేయకుండా తక్కువగా వినియోగించాలి. అవసరంలేని సమయాల్లో విద్యుద్దీపాలు, ఫ్యాన్లను ఆర్పి ఉంచాలి. 2. తిరిగి వాడటం (ఖ్ఛఠట్ఛ): పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవాలి. కాగితాన్ని తిరిగి వాడటం వల్ల మొక్కలను అధిక మొత్తంలో కాపాడగలుగుతాం. 3. పునఃచక్రీయం (ఖ్ఛఛిడఛ్ఛి): ఒకసారి ఉపయోగించి వృథాగా ఉన్న పదార్థాలను తిరిగి వేరే రూపంలో వినియోగించుకోవాలి. దీన్నే పునఃచక్రీయం అంటారు. వీటితో పాటు ఇటీవల ఖ్ఛ్టజిజీజు (తిరిగి ఆలోచించడం) అనే అంశం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కూడా ఆచరణీయమే. కీలకభావనలు ఇంకుడు చెరువు: నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పరిచే నీటి నిల్వలే ఇంకుడు చెరువులు. సూక్ష్మ నీటిపారుదల: బిందు సేద్యం, తుంపరల విధానం ద్వారా జరిగే నీటిపారుదల. బోరు బావులు: భూగర్భ జలాలను పైకి తేవడానికి తవ్వే గొట్టపు బావులు. సుస్థిర అభివృద్ధి: ఒక రంగంలో జరిగే అభివృద్ధి వల్ల మరో రంగానికి నష్టం కలుగకుండా సమగ్ర అభివృద్ధి సాధించడం. జీవ ఇంధనాలు: మొక్కలు, జంతు సంబంధ వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసే ఇంధనాలు. కాంటూర్ పట్టీ పంటల విధానం: నేల క్రమక్షయానికి గురవకుండా నేలవాలుకు అడ్డంగా కట్టలను ఏర్పరచడం ద్వారా జరిపే వ్యవసాయ విధానం. గట్లు: వర్షపు నీరు పొలాల్లోకి పారి వ్యర్థం కాకుండా అడ్డుగా నిర్మించే నిర్మాణాలు. కట్టల నిర్వహణ: వాన నీటిని వ్యర్థం కాకుండా అడ్డుకట్టల్లో నిల్వచేసి, ఆ నీటిని తిరిగి ఎండిన బావులు, బోరు బావుల్లో నింపి భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి అనుసరించే విధానం. ఇంకుడు గుంతలు: వర్షపు నీరు భూమిలో ఇంకడం కోసం తవ్వే గుంతలు. ఇక్రిసాట్ (ఐఇఖఐఅఖీ): ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది అర్ధ శుష్క మండలాల్లో పెరిగే మొక్కలకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది. డైక్: ప్రాజెక్టు నుంచి వెళ్లే కాలువలకు కట్టే అడ్డుకట్టలను డైక్‌లు అంటారు. నీటి వినియోగదారుల సంఘం: చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల లాంటి నీటి వినియోగ నిర్మాణాలకు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రజాసంఘాలు. రైతు ఆధారిత విధానాలు: పొలాల్లో వ్యక్తిగతంగా నేల, నీటి సంరక్షణ కోసం రైతులు అమలు చేసే కార్యక్రమాలను రైతు ఆధారిత విధానాలు అంటారు. గ్లైరిసిడియా: పొడి నేలలో పెరిగే లెగ్యుమినేసి కుటుంబ మొక్కలు. ఇవి నేలలో నైట్రోజన్ నిల్వలు పెరగడానికి, గట్లు బలంగా ఉండటానికి సహాయపడతాయి. బిందు సేద్యం: ఇది సూక్ష్మ నీటిపారుదల విధానం. మొక్కలకు సన్నని పైపుల ద్వారా వేర్ల వద్ద నీరు అందేలా చేస్తారు. ూఖఈ్క: యునెటైడ్ నేషన్స డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది ప్రపంచ దేశాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హరిత గృహ వాయువులు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ూై2, క్లోరోఫ్లోరో కార్బన్లను గ్రీన్హౌస్ వాయువులు అంటారు. ఇవి ఓజోన్ పొరకు హాని కలుగజేస్తాయి. సుస్థిర అటవీ విధానాలు: భవిష్యత్ తరాలకు అటవీ వనరులను అందజేయడానికి అవలంబించాల్సిన విధానాలను సుస్థిర అటవీ విధానాలు అంటారు. ఎంపిక పంట పద్ధతి: పంట కోసేటప్పుడు ఒక్కో మొక్క లేదా చిన్న గుంపును తీసివేయడం. దీనివల్ల నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. జట్రోఫా కర్కాస్: బయో డీజిల్ తయారీకి ఉపయోగపడే మొక్క. 1. మంజు ఇంటికి పాలిథిన్ కవర్లను తేవడం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఎ) ఆమె మార్కెట్టుకు వెళ్లకూడదు బి) అమె పాలిథిన్ను వాడాలి సి) మార్కెట్టుకు గుడ్డసంచీ తీసుకెళ్లాలి డి) కూరగాయల బదులు వేరేవి తినాలి 2. రమ్య తన పాత పుస్తకాలను పారేయకుండా తన చెల్లెలికి ఇచ్చి చదువుకోమన్నది. ఈ చర్య దేనికి ఉదాహరణ? ఎ) తగ్గించడం బి) పునఃచక్రీయం సి) సహాయం డి) పునర్వినియోగం 3. కింది వాక్యాల్లో ఏది సత్యం? 1) నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచడానికి ఎక్కువ ఎరువులు వేయాలి 2) గట్లపై గ్లైరిసిడియా మొక్కలను పెంచడం ద్వారా నత్రజని నిల్వలను పెంచాలి. ఎ) 1, 2 సత్యం బి) 1 సత్యం, 2 అసత్యం సి) 2 సత్యం, 1 అసత్యం డి) 1, 2 రెండూ అసత్యం 4. కిందివాటిలో రైతు ఆధారిత విధానం ఏది? ఎ) కాలువలు తీయడం బి) చెరువుల కింద సాగు సి) కాంటూర్ పట్టీ సేద్యం డి) ఎక్కువ నీటిని వినియోగించడం సమాధానాలు 1) సి 2) డి 3) సి 4) సి 1. అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ ృృృృ లో ఉంది. 2. నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో ఆనకట్టలు కట్టి ఏర్పరచిన నిర్మాణాలు ృృృృృ 3. }రాంసాగర్ ప్రాజెక్టును ృృృృృ నదిపై నిర్మించారు. జవాబులు 1) హైదరాబాద్ (రాజేంద్రనగర్) 2) ఇంకుడు చెరువులు 3) గోదావరి