జిన్నారం: ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడి చదవాలని పదోతరగతి విద్యార్థులకు ఎంఈఓ ప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. సోమవారం జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రకాశ్ మాట్లాడుతూ.. పదో తరగతిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ఉదయం వేళలో తప్పనిసరిగా స్నాక్స్ అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జ్ఞానమాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
'పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
Published Tue, Feb 2 2016 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement