Public high schools
-
పాఠశాలలకు నేడు ఐచ్ఛిక సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఈ నెల 18వ తేదీని ఆప్షనల్ హాలిడేగా వినియోగించుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రతి ఉన్నత పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లే ఐచ్ఛిక సెలవును వినియోగించుకోవాలని, మిగతా వారు పాఠశాలలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే నాడు సెలవుగా గతంలోనే విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
'పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
జిన్నారం: ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడి చదవాలని పదోతరగతి విద్యార్థులకు ఎంఈఓ ప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. సోమవారం జిన్నారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రకాశ్ మాట్లాడుతూ.. పదో తరగతిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ఉదయం వేళలో తప్పనిసరిగా స్నాక్స్ అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జ్ఞానమాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రభుత్వం ప్రోత్సహి స్తోందన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో కార్పొరేట్ జోక్యం నివారించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. కరువు జిల్లా అనంతపురానికి సాగు, తాగునీరుతో పాటు కేంద్రీయ విశ్వ విద్యాలయ ఏర్పాటుకు ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ.బాబురెడ్డి మాట్లాడుతూ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ జీఓలు ఇచ్చింది తామేనని ముఖ్యమంత్రి చెబుతూ మరోవైపు 700కు పైగా అక్రమ బదిలీలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇందుకు నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరే ట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. నూ తన పీఆర్సీ వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇచ్చినా కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండువారాలు గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం అందలేదన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సీకే నాగేంద్రబాబు, ప్రధానకార్యదర్శి కోటేశ్వరప్ప, కార్యదర్శులు నాగేంద్ర, జయచంద్రారెడ్డి, సూర్యనారాయణ, సుధాకర్, వెంకటరామిరెడ్డి, గోవిందరాజులు, కోశాధికారి ఈశ్వరయ్య, ఆడిట్ కన్వీనర్ సాయినాథ్‌బాబు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు వృత్తిలో మమేకం కావాలి : ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు వృత్తిలో మమేకమై విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే. చంద్రమౌళి పదో తరగతి విద్యార్థుల కోసం రచించిన ‘బయాలజీ నోట్స్’ పుస్తకాన్ని ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో గేయానంద్ ఆవిష్కరించి తొలికాపీని డీఈఓ అంజయ్యకు అందజేశారు. గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు శాస్త్రీయ దృ క్పథాన్ని పెంపొందించాలన్నారు. ‘బయాలజీ నోట్స్’ పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. మడకశిర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బయ్య, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ర్ట కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ అధ్యాపకుడు, రచయిత గిరిధర్ హరినాథ్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, హెచ్ఎం రమాదేవి, పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్య మిథ్యే
జిల్లాలో 90 శాతం పాఠశాలల్లో ట్యూటర్లు కరువు 20 శాతానికిపైగా కంప్యూటర్లు చోరీ ఉన్న కంప్యూటర్లు పనిచేయని వైనం కొన్నింటిని సొంతానికి వాడుకుంటున్న టీచర్లు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం చిత్తూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో 309 పాఠశాలల్లో రూ.20కోట్లకు పైగా వెచ్చించి 3,399 కంప్యూటర్లను ప్రభుత్వం అందజేసింది. ఎవరాన్ కంపెనీ ద్వారా కంప్యూటర్ ట్యూటర్లను నియమించినా సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో వారు పత్తాలేకుండా పోయారు. 20 శాతానికి పైగా కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. 70 శాతం కంప్యూటర్లు మూల నపడ్డాయి. 10 శాతం కూడా పనిచేస్తున్న పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సొంత పనులకు వాడుకుంటున్న పరిస్థితి. కంప్యూటర్ విద్య కోసం ఇచ్చిన జనరేటర్లు కొన్ని చోరీకి గురి కాగా, మరికొన్ని పనికిరాకుండా పోయాయి. మొత్తంగా ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడ మే అందుకు కారణమవుతోంది. ► నియోజకవర్గంలో 41 ఉన్నత పాఠశాలలుండగా, 24 పాఠశాలలకు 264 కంప్యూటర్లు ఇచ్చారు. 90శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►చంద్రగిరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. రామచంద్రాపురంలో 12 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చెడిపోయిన కంప్యూటర్లను బాగుచేసే వారు లేరు. కొన్నిచోట్ల కంప్యూటర్లను టీచర్లే వాడుకుంటున్నారు. ►గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 32 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చా రు. మొత్తం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పాలసముద్రం మండలం బలిజకండ్రిగ హైస్కూల్లో 11 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►కుప్పం నియోజకవర్గంలో 42 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఆరు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. . ►మదనపల్లె నియోజకవర్గంలో 50 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్లు ఎక్కడా పనిచేయడం లేదు. కొన్ని చోట్ల టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినా వారు కూడా కంప్యూటర్ విద్యను బోధించే పరిస్థితి లేదు. ►పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో 30 పాఠశాలల కు కంప్యూటర్లు ఇచ్చారు. ఎక్కడా పనిచేయడం లేదు. పలమనేరు మండలం దొడ్డిపల్లె హైస్కూల్లో కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పీలేరు నియోజకవర్గంలో 55 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. ఐదు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. కలికిరి, కలకడ పాఠశాలల్లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పుంగనూరు నియోజకవర్గంలో 30 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. 11 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. పుంగనూరు బసవరాజు హైస్కూల్లో నాలుగు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. చౌడేపల్లె మండలం చారాల జెడ్పీ హైస్కూల్లో మూడు కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►పూతలపట్టు నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూ లనపడ్డాయి. ఎం.పైపల్లె పాఠశాలలో కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ► తంబళ్లపల్లె నియోజకవర్గంలో 39 పాఠశాలలకు 320 కంప్యూటర్లు ఇ చ్చారు. బి.కొత్తకోట ఉర్దూ హైస్కూ ల్, బడికాయలపల్లె హైస్కూల్లో 15 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►సత్యవేడు నియోజకవర్గంలో 45 పాఠశాలలకు 450 కంప్యూటర్లు ఇచ్చారు. 70 శాతం కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. సత్యవేడు మండలం మదనంబేడు హైస్కూల్లో 10 కంప్యూటర్లు చోరీ అయ్యాయి. ►నగరి నియోజకవర్గంలో 29 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. చాలా చోట్ల కంప్యూటర్లు పనిచేయడం లేదు. జనరేటర్లు కూడా పనిచేయడం లేదు. ►చిత్తూరు నియోజకవర్గంలో 31 పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో మూడు నుంచి ఐదు వరకు కంప్యూటర్లను ఇచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రైవేటు వ్యక్తులతో కంప్యూటర్ విద్య నేర్పిస్తున్నారు. జనరేటర్లు లే వు. విద్యుత్ లేకపోతే కంప్యూటర్లు పనిచేయడం లేదు.