రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రభుత్వం ప్రోత్సహి స్తోందన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో కార్పొరేట్ జోక్యం నివారించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు.
కరువు జిల్లా అనంతపురానికి సాగు, తాగునీరుతో పాటు కేంద్రీయ విశ్వ విద్యాలయ ఏర్పాటుకు ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ.బాబురెడ్డి మాట్లాడుతూ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ జీఓలు ఇచ్చింది తామేనని ముఖ్యమంత్రి చెబుతూ మరోవైపు 700కు పైగా అక్రమ బదిలీలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇందుకు నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరే ట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు.
నూ తన పీఆర్సీ వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇచ్చినా కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండువారాలు గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం అందలేదన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సీకే నాగేంద్రబాబు, ప్రధానకార్యదర్శి కోటేశ్వరప్ప, కార్యదర్శులు నాగేంద్ర, జయచంద్రారెడ్డి, సూర్యనారాయణ, సుధాకర్, వెంకటరామిరెడ్డి, గోవిందరాజులు, కోశాధికారి ఈశ్వరయ్య, ఆడిట్ కన్వీనర్ సాయినాథ్‌బాబు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు వృత్తిలో మమేకం కావాలి : ఎమ్మెల్సీ
ఉపాధ్యాయులు వృత్తిలో మమేకమై విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే. చంద్రమౌళి పదో తరగతి విద్యార్థుల కోసం రచించిన ‘బయాలజీ నోట్స్’ పుస్తకాన్ని ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో గేయానంద్ ఆవిష్కరించి తొలికాపీని డీఈఓ అంజయ్యకు అందజేశారు. గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు శాస్త్రీయ దృ క్పథాన్ని పెంపొందించాలన్నారు. ‘బయాలజీ నోట్స్’ పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు.
డీఈఓ అంజయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. మడకశిర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బయ్య, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ర్ట కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ అధ్యాపకుడు, రచయిత గిరిధర్ హరినాథ్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, హెచ్‌ఎం రమాదేవి, పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
Published Mon, Jun 29 2015 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement
Advertisement