mlc geyanand
-
ప్రజారోగ్యం పట్టదా?
ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి సిగ్గు రాలేదు దారుణ పరిస్థితులున్నా మంత్రులు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష అనంతపురం సిటీ : ‘ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా అనంతలో చిన్నపాటి జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదు. సర్వజనాస్పత్రిలో 350 పడకల మీద 1,006 మంది రోగులను ఎలా పడుకో బెడతారో అర్థంకావడం లేదు. 50 పడకలున్న చిన్న పిల్లల వార్డులో 200 మంది చేరారు. వారిని ఇక్కడ చేర్చుకోకుండా వైద్యులు బయటకు పంపలేరు కదా! ప్రభుత్వం ప్రతిదానికీ వైద్యులపై పడే బదులు.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఏ సమస్యా ఉండద’ని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్సీ.. చిన్న పిల్లల వార్డును తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను వైద్యులు ఏకరువు పెట్టడంతో ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు నేరుగా ఆస్పత్రి ముఖద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. రాత్రి వర్షంలోనే దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా మొత్తానికి ఏకైక దిక్కయిన సర్వజనాస్పత్రిని ఇంతటి దారుణస్థితిలో ఉంచుతుందా అని ప్రశ్నించారు. పాతికేళ్లకు పైగా సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అనేకమార్లు వచ్చివెళుతున్నా సర్వజనాస్పత్రి సమస్యలు మాత్రం తీర్చడం లేదన్నారు. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, 510 ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలని ఇప్పటికే చాలాసార్లు మంత్రులను కలిసి విన్నవించామన్నారు. అయితే ఎవరూ స్పందించడం లేదన్నారు. విష జ్వరాలతో చిన్న పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే దాకా నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ నేత చవ్వా రాజశేఖరరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, రచయితలు, మేధావులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు అంజి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : ఈ నెల 25లోగా గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో మంత్రి సునీత కూడా నీటి విడుదలపై ప్రకటన చేశారు.lసీఎం మాట నెగ్గించుకునేందుకు హడావుడిగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ఫేజ్–2 కాలువకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్ తెలిపారు. ప్రస్తుతం 90 కిలోమీటరు వరకు నీటిని తీసుకుపోతామన్నారు. నెల, రెండు నెలల తర్వాత పనులు పూరై్తతే గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకుపోతామన్నారు. ఓ వైపు హెచ్చెల్సీ సాగులో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు రెండేళ్లుగా పంటల సాగుకు నోచుకోక ఆయకట్టు బీడుగగా మారింది. రూ. కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఒక్కో టీఎంసీ తీసుకురావడానికి రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత విలువైన జలాలను కాలువల్లో పారించడం కోసమేనా ? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంది. కనీసం తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆర్బాటం కోసం మాత్రమే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి చెరువులకు నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ కింద ఉన్న చెరువులకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కెనాల్ కింద దాదాపు 23 చెరువులు ఉన్నాయన్నారు. హంద్రీనీవా నుంచి వచ్చే నీటిని బట్టి హెచ్చెల్సీ సౌత్, నార్త్ ఇతర కాలువ కింద ఆయకట్టుకు నీరు వదలాల వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని వివరించారు. -
ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారమివ్వాలి
అనంతపురం అర్బన్: జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందని, ఎకరాకు రూ.15 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనా మేషాలు లేక్కిస్తూ పంట నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రైతుల మనోధైర్యాన్ని కాపాడేందుకు బేషరుతుగా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే రాయలసీమను కరువు లేని ప్రాంతంగా మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. కరువు రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం ప్రకటిండం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. -
సీమ అభివృద్ధి కోసం చైతన్యయాత్ర
పుట్టపర్తి టౌన్ : రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ చైతన్యయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్సీ గేయానంద అన్నారు. ఆదివారం పర్తిసాయి ధర్మశాలలో ఏపీ రైతు సంఘం 11వ జిల్లా మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నుంచి యాత్ర ప్రారంభించామన్నారు. ఈ నెల 25 నుంచి ఎడారి ఛాయలు నెలకొన్న కణేకల్లు మండం నుంచి యాత్ర ప్రారంభిస్తామన్నారు. యాత్రలో ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మానవహక్కుల వేదికనాయకులు బాషా, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఆదిశేషు పాల్గొంటారన్నారు. -
‘అపోలోకు ఎందుకు అప్పగించారు?’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య ప్రైవేటీకరణ మొదలైందని శాసనమండలిలో పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘వైద్యం, ఆరోగ్యం- రాష్ట్ర ప్రభుత్వ విధానం’ అంశంపై శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చను ప్రారంభించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. చిత్తూరులోని ప్రభుత్వాసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మెడికల్ కాలేజీకి అనుమతి తెచ్చుకొని దానిని నిర్వహించుకోని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రజలకు అందుతున్న సేవలు బాగా లేని మాట వాస్తవమని.. అయితే, ఇప్పుడు దానికి బదులుగా దీర్ఘకాలంలో మరింత నష్టం చేకూర్చే పీపీపీ పద్దతి వైపు ప్రయత్నాలు చేయటం సరికాదని గేయానంద్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను వైద్యం, ఆరోగ్య విభాగాలను వేర్వేరుగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
'అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లే'
అనంతపురం : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లేనని సీపీఎం ఎమ్మెల్సీ గేయానంద్ వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని ఆయన మంగళవారం నాడు తిరస్కరించారు. అనంతపురం పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అభివృద్దిని వికేంద్రీకరిస్తానన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఎమ్మెల్సీ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు రూ.లక్షకోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని గేయానంద్ డిమాండ్ చేశారు. -
సమాజానికి ఎదురీదే వాడే కవి
అనంత కవితా స్వరాలు పుస్తకావిష్కరణలో ఎమ్మెల్సీ గేయానంద్ అనంతపురం కల్చరల్ : సమాజానికి ఎదురీదే స్వభావం కలవారిలోనే కవితావేశం దాగుంటుందని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన ‘అనంత కవితా స్వరాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పిళ్ళా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గేయానంద్, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ, ప్రజ్ఞాసురేష్ హాజరయ్యారు. గేయానంద్ మాట్లాడుతూ 71 మంది కవులు, కవియిత్రులు వివిధ కథా వస్తువులను తీసుకుని ఆలోచింపజేసే విధంగా రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సింగమనేని మాట్లాడుతూ చదవాలనిపించే సాహిత్యం అడుగంటిపోతున్న తరుణంలో సాహితీ స్రవంతి మరోసారి పాఠకుల హృదయాలకు దగ్గరగా ఉండే కథా వస్తువులతో పుస్తకాన్ని సాహితీ లోకానికి అందించడం అభినందనీయమన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఎస్వీయూ ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ పుస్తక సమీక్ష చేశారు. అనంతరం అనంత కవితా స్వరాలలో భాగస్వామ్యం వహించిన కవులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో శేషాచార్యులు అనంత వైభవాన్ని కీర్తిస్తూ పద్య పఠనం చేశారు. సాహితీ స్రవంతి సభ్యులు తగరం క్రిష్ణయ్య, రియాజుద్దీన్, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, ఆచార్య పిఎల్ శ్రీనివాసరెడ్డి, చెట్ల ఈరన్న, శేఖర్, జెన్నే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ప్రభుత్వం ప్రోత్సహి స్తోందన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో కార్పొరేట్ జోక్యం నివారించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. కరువు జిల్లా అనంతపురానికి సాగు, తాగునీరుతో పాటు కేంద్రీయ విశ్వ విద్యాలయ ఏర్పాటుకు ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ.బాబురెడ్డి మాట్లాడుతూ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ జీఓలు ఇచ్చింది తామేనని ముఖ్యమంత్రి చెబుతూ మరోవైపు 700కు పైగా అక్రమ బదిలీలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇందుకు నిరసనగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరే ట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. నూ తన పీఆర్సీ వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇచ్చినా కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండువారాలు గడిచినా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం అందలేదన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సీకే నాగేంద్రబాబు, ప్రధానకార్యదర్శి కోటేశ్వరప్ప, కార్యదర్శులు నాగేంద్ర, జయచంద్రారెడ్డి, సూర్యనారాయణ, సుధాకర్, వెంకటరామిరెడ్డి, గోవిందరాజులు, కోశాధికారి ఈశ్వరయ్య, ఆడిట్ కన్వీనర్ సాయినాథ్‌బాబు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు వృత్తిలో మమేకం కావాలి : ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు వృత్తిలో మమేకమై విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే. చంద్రమౌళి పదో తరగతి విద్యార్థుల కోసం రచించిన ‘బయాలజీ నోట్స్’ పుస్తకాన్ని ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో గేయానంద్ ఆవిష్కరించి తొలికాపీని డీఈఓ అంజయ్యకు అందజేశారు. గేయానంద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు శాస్త్రీయ దృ క్పథాన్ని పెంపొందించాలన్నారు. ‘బయాలజీ నోట్స్’ పదో తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. మడకశిర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బయ్య, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు కులశేఖర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ర్ట కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ అధ్యాపకుడు, రచయిత గిరిధర్ హరినాథ్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్‌నాయక్, హెచ్ఎం రమాదేవి, పాల్గొన్నారు. -
రాయలసీమపై 'బాబు' మొసలి కన్నీరు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును గేయానంద్ ఎండగట్టారు. రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తన్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్లు పూర్తి కావాలంటే రూ.2500 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు నూతన రాజధానిపై చూపిస్తున్న శ్రద్ధ.. కరువు రైతులపై ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలని గేయానంద్ డిమాండ్ చేశారు.