'అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లే' | MLC geyanand criticises cm chandrababu | Sakshi
Sakshi News home page

'అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లే'

Published Tue, Oct 20 2015 6:08 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

'అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లే' - Sakshi

'అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లే'

అనంతపురం : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి వెళ్లిన నీళ్లన్నీ రాయలసీమ కన్నీళ్లేనని సీపీఎం ఎమ్మెల్సీ గేయానంద్ వ్యాఖ్యానించారు. అమరావతి  శంకుస్థాపన ఆహ్వానాన్ని ఆయన మంగళవారం నాడు తిరస్కరించారు. అనంతపురం పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అభివృద్దిని వికేంద్రీకరిస్తానన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఎమ్మెల్సీ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు రూ.లక్షకోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని గేయానంద్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement