రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ చైతన్యయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్సీ గేయానంద అన్నారు.
పుట్టపర్తి టౌన్ : రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ చైతన్యయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్సీ గేయానంద అన్నారు. ఆదివారం పర్తిసాయి ధర్మశాలలో ఏపీ రైతు సంఘం 11వ జిల్లా మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నుంచి యాత్ర ప్రారంభించామన్నారు.
ఈ నెల 25 నుంచి ఎడారి ఛాయలు నెలకొన్న కణేకల్లు మండం నుంచి యాత్ర ప్రారంభిస్తామన్నారు. యాత్రలో ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మానవహక్కుల వేదికనాయకులు బాషా, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఆదిశేషు పాల్గొంటారన్నారు.