సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, కడప/కోటిరెడ్డి సర్కిల్: ‘రాయలసీమ నుంచి అనేకమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య మంత్రులయ్యారు. ప్రాజెక్టులతో పాటు అనేక రంగాలను విస్మరించడంతో రాయలసీమ అభివృద్ధిలో వెనకబడిపోయింది.. సీమ అభివృద్ధికి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుంది..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కడపలో శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘రాయ లసీమ రణభేరి’ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ ఆధిక్యతతో గెలిపించినా మూడేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ లేదని.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని వి మర్శించారు. రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం పాలకులు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తన భుజస్కంధాలపై వేసుకుందని, పూర్తి చేసేందుకు శక్తివంఛన లేకుండా కృషిచేస్తోందన్నారు. అనేక జా తీయ రహదారులు నిర్మిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం లోకి వస్తామన్నారు. రౌడీ ప్రభుత్వం పోతుందని, జనసేనతో కలిసి డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభు త్వాన్ని స్థాపిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. గండికోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవాలయాలను కూడా కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని స్పష్టంచేశారు.
బీజేపీ కార్యకర్తలపై వేధింపులు
సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సాగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్, జాతీయ ప్రధాన కార్యదర్శులు పురందేశ్వరి, వినోద్‌దౌడె, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌లు మాట్లాడుతూ.. రాయలసీమకు 200 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
సీమ అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
వైఎస్సార్‌సీపీని ఓడించాలంటే పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీనిగానీ, ప్రాజెక్టులనుగానీ పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర నేతలు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, తదితరులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment