rayalaseema development
-
సీమ ప్రజల కాంక్షలు ఫలించేలా...
2024 లోక్ సభ, శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాయల సీమ ప్రాంత సమస్యలను జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిర్దిష్టంగా తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాయలసీమ ప్రయోజనాలతో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. సాక్షాత్తు భారత పార్లమెంటుచే ఆమోదం పొంది చట్టబద్ధంగా అవకాశం ఉన్న ఆ హక్కుల అమలు జరగాలి. వీటితో పాటు ఇతర అనేక అంశాలను కూడా రాయలసీమ పౌరసమాజం, ప్రజా సంఘాలూ కోరుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలకు చోటు కల్పించాలని మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడింట ఒక భాగం జనాభా ఉన్న అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవ స్థల విషయంలో సీమ వాసుల ఆకాంక్షల మేరకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇతర రంగాల అభివృద్ధిలోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. కోటి ఎకరాల భూభాగం ఉన్న రాయలసీమకు తుంగభద్ర–కృష్ణా నదీ జలాలలో 133 టీఎంసీల నికరజలాలపై హక్కు ఉంది. ఆ నీటిని అందేలా చూడాలి. పెండింగ్ ప్రాజె క్టులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించాలి. విభజన చట్టం సెక్షన్ 46లో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి తగిన ఆర్థిక వెసులుబాటులు చేయా లని ఉంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధి కోసం ప్యాకేజీ రూపొందించాలని ఉంది. ఈ ప్యాకేజీని కనీసం లక్షకోట్లతో సమగ్రంగా చేపట్టాలి. సెక్షన్ 94 ప్రకారం ఇరు రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను మినహాయింపుతో సహా తగిన ఆర్థిక చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక పన్ను మినహాయింపుతో సీమ ఖనిజ వనరులు వెలికితీతతో పాటు, స్థానికంగా ఉత్పాదక పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలి. సీమ యువతకు ఆయా రంగాలలో ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా కేంద్రాలు నెలకొల్పాలి. యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఆత్మవిశ్వాసం నింపాలి. విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలను కేటాయించింది. ఇందులో రాయలసీమకు సంబంధించినవి కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురము), రెండు ఐఐటీలు (తిరుపతి, కర్నూలు), ఐఐఎస్ఇఆర్ (తిరుపతి) ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాయిలో ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరేలా నిర్మాణం చేయాలి. ముద్దనూరు – పుట్టపర్తి, కడప –రాయచోటి– కదిరి – పుట్టపర్తి– చిక్ బళ్ళాపురం, రాయచోటి – మదనపల్లె– బెంగుళూరు, కళ్యాణదుర్గం– పావగడ్డ – తుమకూరు, నంద్యాల – కర్నూలు తదితర రైల్వేలైన్లలను నిర్మించాలి. కర్నూలు, నంద్యాల జిల్లాలను సీడ్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలి. రైతులకు ఉపయోగపడేలా సీమలో శీతల గిడ్డంగులు నిర్మాణం చేయాలి. సీజనల్ వలస కూలీలకు ఉపాధి కల్పించాలి. రాయలసీమ పురావస్తు, చరిత్ర అవశేషా లనూ, సంస్కృతి, సాహిత్యం, మాండలికం, జానపదకళల సంరక్షణకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. 1800 నాడు బ్రిటిష్ వారిపై పాలేగాళ్ల తిరుగుబాట్లను ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించాలి. రాయలసీమలోని పర్యా టక, చారిత్రక స్థలాలు సంరక్షించి, కనీస వసతులు కల్పించాలి. ప్రసిద్ధ ప్రాంతాలతో టూరిజం సర్క్యూ ట్లు నెలకొల్పాలి. సీమ వాతావరణం, కరువు నివారణ, నీటి సంరక్షణ, కృత్రిమ వర్షాలు, మైనింగ్, తదితర అంశాల నేపథ్యంగా పరిశోధన సంస్థలు నెలకొల్పాలి. స్వయంప్రతిపత్తితో కూడిన రాయల సీమ బోర్డును నెలకొల్పాలి. డా‘‘ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత ‘ 99639 17187 -
Fact Check: ‘కట్టలు’ తెగిన అక్కసు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని ఈనాడు రామోజీరావు సహించలేకపోతున్నారు. ప్రజలు అభివృద్ధి చెందితే చంద్రబాబు మొహం కూడా చూడరన్నది ఆయన భయం. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై ఆయన అక్కసు కట్టలు తెంచుకుంది. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు నీరందించి పచ్చటి పైర్లతో కళకళలాడేలా చేస్తుంటే అసత్య కథనాలతో ప్రజలను.. ముఖ్యంగా రైతులను మభ్య పెట్టేలా అసత్య కథనాలు అచ్చేస్తున్నారు. గత 55 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్సార్బీసీల ద్వారా మళ్లిస్తూ దుర్భిక్ష రాయలసీమను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సస్యశ్యామలం చేస్తున్నారు. దీంతో రాయలసీమ రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు. ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పిదాలు, మోసాలు, దోపిడీని కప్పిపుచ్చుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ పచ్చి అబద్ధాలతో ‘ఈనాడు’లో టన్నులకొద్దీ కథనాలను అచ్చేసి, వికృతానందం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఎన్నాళ్లీ.. ఆయకట్టుకథలు’ శీర్షికన మంగళవారం ఓ కట్టుకథ వండి వార్చారు. ఆ కథనంలో ప్రతి అక్షరంలో సీఎం వైఎస్ జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు. కళ్లుండీ చూడలేకపోతే ఎలా? ► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని దక్కించుకున్న బాబు.. ఓట్ల కోసం 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద, 1999 ఎన్నికలకు ముందు గండికోట వద్ద మరోసారి గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. కానీ.. ఆ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టికూడా ఎత్తలేదు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1,55,00 ఎకరాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 5 లక్షల మందికి తాగు నీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో చాలావరకు పనులు పూర్తి చేశారు. ► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని ఇష్టానుసారం భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నాలుగైదు టీఎంసీలు తరలించి, ఆయనే పూర్తి చేసినట్లు బీరాలు పలికారు. ► వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2020–21 నుంచి ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేస్తూ.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అవుకు వద్ద రెండో సొరంగాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసి, ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలిస్తున్నారు. సర్వారాయ సాగర్, పైడిపాలెం, వామికొండ సాగర్‌లలో మిగిలిన పనులు, 35 వేల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.130 కోట్లతో చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద వచ్చిన రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవేవీ రామోజీకి కన్పించలేదు. హంద్రీ–నీవాతో సీమ సస్యశ్యామలం ► గాలేరు– నగరి ప్రాజెక్టు మాదిరిగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉరవకొండ వద్ద ఓసారి, 1999 ఎన్నికలకు ముందు ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఆ తొమ్మిదేళ్లలో ఒక్క అడుగు పని కూడా చేయకుండా రైతులను మోసం చేశారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఆయన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్ హౌస్ నిర్మించిన వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా హంద్రీ–నీవాకు నీటిని తరలించేలా 2007 ఆగస్టు 31న ముచ్చుమర్రి ఎత్తిపోతల చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. ► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపైనా 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22 (ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. చివరకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేలా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేదు. ► వైఎస్ జగన్ సీఎం అయ్యాక శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. ► హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ► హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించేలా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ► 2019–20లో 41.93 టీఎంసీలు, 2020–21లో 40.98, 2021–22లో 41.23, 2022–23లో 33.85 టీఎంసీలు (కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురవడంతో నీటిని తరలించాల్సిన అవసరం లేకుండా పోయింది), వర్షాభావ పరిస్థితుల్లోనూ 2023–24లో 15 టీఎంసీలు తరలించడం ద్వారా సాగు, తాగునీరు అందించారు. ► సీమను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకూ రెండేసి మార్లు శంకుస్థాపన చేసి, చేతులు దులుపుకొన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టాక, అప్పటివరకు పనులు చేసిన కాంట్రాక్టర్లను అక్రమంగా తొలగించి, వ్యయాన్ని భారీగా పెంచేసి, నచ్చిన కాంట్రాక్టర్లతో పనులు చేయించి, కమీషన్లు దండుకొన్న విషయం రామోజీకి తెలియంది కాదు. అయినా చంద్రబాబు అక్రమాలపై ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడు సీఎం జగన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, సీమ రైతులకు సాగునీటిని, ప్రజలకు తాగునీటిని అందిస్తుంటే మాత్రం కడుపు మంట రాతలు రాస్తున్నారు. -
రాయలసీమ అభివృద్ధిపై తప్పుడు రాతలు..!
-
సీమ అభివృద్ధికి కేంద్రం కృషి
సాక్షి, కడప/కోటిరెడ్డి సర్కిల్: ‘రాయలసీమ నుంచి అనేకమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య మంత్రులయ్యారు. ప్రాజెక్టులతో పాటు అనేక రంగాలను విస్మరించడంతో రాయలసీమ అభివృద్ధిలో వెనకబడిపోయింది.. సీమ అభివృద్ధికి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుంది..’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కడపలో శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో ‘రాయ లసీమ రణభేరి’ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. ఏపీ ప్రజ లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ ఆధిక్యతతో గెలిపించినా మూడేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ లేదని.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని వి మర్శించారు. రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం పాలకులు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తన భుజస్కంధాలపై వేసుకుందని, పూర్తి చేసేందుకు శక్తివంఛన లేకుండా కృషిచేస్తోందన్నారు. అనేక జా తీయ రహదారులు నిర్మిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం లోకి వస్తామన్నారు. రౌడీ ప్రభుత్వం పోతుందని, జనసేనతో కలిసి డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభు త్వాన్ని స్థాపిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. గండికోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవాలయాలను కూడా కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని స్పష్టంచేశారు. బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వేధింపులు సాగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, జాతీయ ప్రధాన కార్యదర్శులు పురందేశ్వరి, వినోద్దౌడె, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌లు మాట్లాడుతూ.. రాయలసీమకు 200 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. సీమ అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రులు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీని ఓడించాలంటే పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీనిగానీ, ప్రాజెక్టులనుగానీ పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర నేతలు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, తదితరులు కూడా పాల్గొన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా.. జనవరిలో మనోచైతన్య యాత్ర
తిరుపతి అర్బన్: ఐకమత్యంతో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతి ఒక్కరూ జైకొట్టాలని రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ పిలుపునిచ్చింది. ఇందుకోసం వచ్చే జనవరిలో మనో చైతన్య యాత్ర పేరుతో శ్రీశైలం లేదా కర్నూలు నుంచి అమరావతి వరకు పెద్దఎత్తున ఉద్యమకారులు, మేధావులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తిరుపతితో శనివారం కమిటీ నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాయలసీమకు జైకొట్టే పార్టీలను పాదయాత్రలో స్వాగతిస్తామన్నారు. జైకొట్టకపోతే ఆ నేతలకు రానున్న రోజుల్లో రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. సీమ నేతలైన చంద్రబాబునాయుడు, తులసిరెడ్డి, నారాయణ, రామకృష్ణ తదితరులు అమరావతికి జైకొట్టడం సిగ్గుచేటన్నారు. సీమ ప్రజలే ఈ నేతలను వీధుల్లో పడేశారని గుర్తుచేశారు. త్యాగాలకు రాయలసీమ పెట్టింది పేరని అభివర్ణించారు. 68 ఏళ్ల క్రితమే కర్నూలు రాజధానిని త్యాగం చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. అంతేకాదు.. ఆ సమయంలో బళ్లారి నగరంతోపాటు, తుంగభద్ర, కృష్ణ పెన్నా ప్రాజెక్టులను కోల్పోయామన్నారు. భూములకు పరిహారం తీసుకుని.. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి రైతులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని అంశం అమరావతి ప్రజలకే పరిమితం కాదని.. ఐదుకోట్ల ఆంధ్రులతో ముడిపడిన అంశమని కమిటీ నేతలు తేల్చిచెప్పారు. త్యాగం అంటే అమరావతి రైతులది కాదని.. రాయలసీమ ప్రజలదేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. శాంతికి నిలయమైన తిరుపతి నగరంలో వివాదాలు ఉండరాదనే మౌనం పాటించాల్సి వచ్చిందని కమిటీ నేతలు తెలిపారు. ఆ చానెల్స్‌తో మాట్లాడతాం ఇక తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఏబీఎన్, టీవీ 5, టీవీ 9 చానల్స్ యాజమాన్యంతోను చర్చిస్తామని.. తాము చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా ఉండాలని కోరుతామని వారు చెప్పారు. అలాగే, కర్నూలులో హైకోర్టు.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉండాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టంచేయాలని వారు డిమాండ్ చేశారు. సీమలో పుట్టి సీమకు అన్యాయం చేస్తే సీమ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతివ్వకుండా అమరావతికి జైకొట్టే నేతలను సీమ ప్రజలు ప్రశ్నించాలని కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని.. అయితే అమరావతితోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వికేంద్రీకరణకు మద్దుతుగా నిలుస్తామని వారు స్పష్టంచేశారు. జలయజ్ఞం పేరుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు. మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ధి అధ్యయన కమిటీ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షిక ప్రతినిధుల సంస్థ అధ్యక్షుడు.. సీమ ఉద్యమకారుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ ఉద్యమకారులు బండి నారాయణస్వామి (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత), జర్నలిస్టు వర్మ తదితరులు మాట్లాడారు. అలాగే, కార్యక్రమంలో రచయిత శాంతి నారాయణ, హైకోర్టు సీనియర్ న్యాయవాది సీహెచ్ శివారెడ్డి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ నాయకులు, వేణుగోపాల్‌రెడ్డి (హిందూ పోరాట సమితి నేత), డాక్టర్ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు’
సాక్షి, కర్నూలు : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాయలసీయ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ముందుకు రావాలని కోరారు. రాజధాని, హైకోర్టు కోసం కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల భూమి ఉందని తెలిపారు. కర్నూలుకు రాజధాని, హైకోర్టు ప్రకటిస్తే.. రాజధాని అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పారు. -
మూగబోయిన విప్లవ గళం
సాక్షి, అనంతపురం కల్చరల్/శింగనమల: ‘పాలక పక్షాలన్నీ సీమకు అన్యాయమే చేశాయి.. దోపిడీ విధానాలతో తీరని మోసం చేస్తున్నాయి’ అంటూ సీమలోని పలు వేదికలపై నినదించిన విప్లవ గళం డాక్టర్ కృష్ణమూర్తి ఇక లేరు. రాయలసీమ అభ్యున్నతి కోసం జీవితాంతం పరితపించిన ఆయన ఇటీవల రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ పదిరోజుల కిందట తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కక్షలు... కార్పణ్యాలు మాత్రమే రాయలసీమ ముఖచిత్రం కాదని, కరువు కరాళ నృత్యం చేస్తున్నా కళలకు, విజ్ఞానదాయక విషయాలకు నెలవని చాటుతూ సీమ ఊపిరిగా జీవించిన ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. శాస్త్రీయమైన నిబద్ధతతో ఉద్యమ ఊపిరులందించిన ఆయన అంత్యక్రియలు సోమవారం అనంతపురం శివారులోని బళ్లారి రోడ్డులో నిర్వహించారు. అంతకు ముందు అనంతపురంలోని కల్యాణదుర్గం రోడ్డులోని వైట్‌ఫీల్డ్ క్వార్టర్స్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. పలు జిల్లాల నుంచి అభిమానులు, ఉద్యమకారులు విచ్చేసి కన్నీటి నివాళులర్పించారు. విద్యావంతుల వేదిక ఏర్పాటుతో.. జిల్లాలోని నార్పల మండలం చామలూరు గ్రామంలో వెంకటలక్ష్మమ్మ, ఎరికలప్ప దంపతులకు 1961 జూన్ 6న కృష్ణమూర్తి జన్మించారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, స్త్రీల వ్యాధులపై డీజీవో కోర్సు పూర్తి చేశారు. విద్యార్ధి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అదే జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలందించారు. ఏపీ పౌరహక్కుల సంఘం సభ్యునిగా అనేక ప్రజా ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేస్తూనే 2009లో రాయలసీమ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక కన్వీనర్‌గా సీమలోని నాలుగు జిల్లాలో ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. కర్నూలు జిల్లా నుంచి అనంతపురానికి బదిలీపై వచ్చి, జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. నాలుగేళ్లుగా శింగనమల పీహెచ్సీలో ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ వచ్చారు. కృష్ణమూర్తి మృతి సమాచారం అందుకున్న శింగనమల మండల అధికారులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సంతాపం ప్రకటించారు. పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఉద్యమానికి తీరని లోటు సీమ అభివృద్ధిలో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్న డాక్టర్ కృష్ణమూర్తి మరణం రాయలసీమ ఉద్యమానికి తీరని లోటు అంటూ రాయలసీమ విద్యావంతుల వేదిక సభ్యుడు రామాంజినేయులు, శ్రీనివాసులు, అరుణ్, విరసం నాయకులు పాణి, నాగేశ్వచారి, శశికళ, ఏపీసీఎల్సీ నాయకులు ఆచార్య శేషయ్య, జలసాధన సమితి నాయకులు రాంకుమార్, రామకృష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, వేమన అధ్యయన, అభివృద్ధి కేంద్రం నిర్వాహకులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి , రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు నాగార్జునరెడ్డి, అశోక్‌రెడ్డి, సీమకృష్ణ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రత్నం, యేసేపు, గురజాడ అధ్యయన కేంద్రం దేశం శ్రీనివాసరెడ్డి, హంద్రీనీవా సాధన సమితి నాయకులు లోచర్ల విజయభాస్కరరెడ్డి, అరసం రాష్ట్ర అ«ధ్యక్షుడు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, నానీల నాగేంద్ర, ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ నెల 21న ఎన్జీవో హోమ్‌లో కృష్ణమూర్తి సంతాప సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
చంద్రబాబు డిప్రెషన్లో ఉన్నాడు
-
డిప్రెషన్లో చంద్రబాబు...
సాక్షి, కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్రెషన్లో ఉన్నారని.. అందుకే మోదీపై తిరగబడాలంటూ మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం ఉదయం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ ఆయన(చంద్రబాబు) డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారు. అందుకే తిరగబడాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎన్నికల్లో సమయంలో 1200 వాగ్దానాలు చేశారు. కనీసం వాటిలో 10శాతం కూడా పూర్తి చేయలేదు. కానీ, బీజేపీ మాత్రం హామీల్లో సగం పూర్తి చేసింది. మిగతావి కూడా త్వరలోనే నెరవేరుస్తుంది. పోనీ అధికారంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటే.. ఎంత సేపు డబ్బులు వెనకేసుకోవటంలోనే బిజీగా అయిపోయారు. స్కూల్ యూనిఫామ్ క్లాత్‌లను చెన్నై నుంచి తెచ్చి అప్కోలో కొన్నట్లు చెబుతూ మోసం చేస్తున్నారు. చంద్రబాబు పక్కా కాంగ్రెస్ కోవర్టు. ఇప్పటికీ లాలూచీ పడుతూనే ఉంటారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారు’ అని వీర్రాజు విరుచుకుపడ్డారు. ఇక రాయలసీమ జిల్లాలకు కేంద్రం చేసిన సాయం గురించి వివరించిన ఆయన.. పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. రాయలసీమపై బీజేపీ కన్నబిడ్డపై చూపే ప్రేమను చూపుతుంటే.. బాబు మాత్రం సవతి ప్రేమను చూపిస్తున్నారన్నారు. సీమ ప్రజలకు ఇంత చేస్తే కేంద్ర ప్రభుత్వంపై తిరగబడాలంటూ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారంటూ చంద్రబాబును నిలదీశారు. హంద్రినీవా అంచనాలను పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ను అద్భుతంగా తీర్చి దిద్దినట్లు అసెంబ్లీలో ప్రకటించారని.. మళ్లీ ఇప్పుడు అదే అసెంబ్లీలో నిత్యం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం డ్యాష్ బోర్డ్ అనేది మొత్తం తప్పుల తడకేనన్నారు. శివాజీ ఆరోపణలపై... ఇక సినీ నటుడు శివాజీ బీజేపీపై చేసిన ఆరోపణలపై సోము వీర్రాజు స్పందించారు. శివాజీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే పిలిపించి.. ఆ ఆధారాలపై దర్యాప్తు ప్రభుత్వం చేపట్టాలి. కానీ, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటే అందులో అర్థం ఏంటని? ఆయన అన్నారు. దమ్ముంటే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన సవాల్ విసిరారు. -
సీమ అభివృద్ధికి ఐక్య పోరాటం
అనంతపురం రూరల్: రాయలసీమ అభివృద్ధికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి అద్యక్షతన గురువారం న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలకు ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, రాయలసీమ విమోచన సమితి నాయకులు సీమ కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు టి.పి.రామన్న, పీఎస్వో విద్యార్థి సంఘం, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరంలో విశ్వ, అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్4 ప్రకారం హైకోర్టును రాజధాని ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అభివృద్ధిని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించడం వల్ల విభజన తర్వాత అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తు చేశారు. మరోసారి అదే తప్పుని సీఎం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
సీమ అభివృద్ధి కోసం చైతన్యయాత్ర
పుట్టపర్తి టౌన్ : రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ చైతన్యయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్సీ గేయానంద అన్నారు. ఆదివారం పర్తిసాయి ధర్మశాలలో ఏపీ రైతు సంఘం 11వ జిల్లా మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నుంచి యాత్ర ప్రారంభించామన్నారు. ఈ నెల 25 నుంచి ఎడారి ఛాయలు నెలకొన్న కణేకల్లు మండం నుంచి యాత్ర ప్రారంభిస్తామన్నారు. యాత్రలో ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మానవహక్కుల వేదికనాయకులు బాషా, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఆదిశేషు పాల్గొంటారన్నారు. -
'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు'
కడప: రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు వందరోజుల పాలనపై ఆయన పెదవి విరిచారు. బాబు వందరోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు.