
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఈ నెల 18వ తేదీని ఆప్షనల్ హాలిడేగా వినియోగించుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రతి ఉన్నత పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లే ఐచ్ఛిక సెలవును వినియోగించుకోవాలని, మిగతా వారు పాఠశాలలకు రావాలని ఇచ్చిన ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు ఆప్షనల్ హాలిడే నాడు సెలవుగా గతంలోనే విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment