కనిపించని ‘ప్రకాశం’ | Prakasam district formation day for 45 years | Sakshi
Sakshi News home page

కనిపించని ‘ప్రకాశం’

Published Mon, Feb 2 2015 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

కనిపించని ‘ప్రకాశం’

కనిపించని ‘ప్రకాశం’

ప్రకాశం జిల్లా: అవతరించి 45 ఏళ్లు కావస్తోంది. వెనుకబడిన ప్రాంతాల సంగమంగా ఏర్పడిన ‘ప్రకాశం’లో  సహజ వనరులకు కొరతలేకున్నా పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి వెలుగు రేఖలు ప్రసరించడం లేదు. నేడు జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రకాశం జిల్లా ఆవిర్భావానికి ఓ విశిష్టత ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉందన్న కారణంతో  ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. అయితే ఏ క్షణాన జిల్లా పురుడు పోసుకుందో కానీ.. ఇప్పటికీ అభివృద్ధి సాధించలేక పోయింది. నిరుద్యోగం.. కరువు.. ఆకలి చావులు.. వలసలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదు. నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. నేడు జిల్లా ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై సింహావలోకనం చేసుకుందాం...                    
 -ఒంగోలు టౌన్
 
 సహజవనరులున్నా..
 జిల్లాలో సహజన వనరులకు కొరత ఉందనుకుంటే అది తప్పే. కేవలం పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. రాష్ట్ర విభజన తర్వాత అయినా మేలు జరుగుతుందనుకుంటే మెుండి చేయే చూపించారు. జిల్లాలో నల్ల బంగారంగా ఖ్యాతి చెందిన గ్రానైట్ వ్యాపారానికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. రాయల్టీలో రాయతీ.. ఎక్స్‌పోర్టులో ప్రభత్వ సాయం అందకపోవడం.. కరెంటు కోతలు ఆ రంగాన్ని దెబ్బ తీస్తున్నాయి. రంగుల పలకలదీ ఇదే పరిస్థితి. ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తే ఇబ్బడిముబ్బడిగా విదేశీమారక ద్రవ్యం వచ్చే అవకాశాలున్నా అటు వైపు పూర్తిగా దృష్టి సారించడంలేదు. చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటీ లేకపోవడంతో నిరోద్యోగం తాండవిస్తోంది. పారిశ్రామిక రంగంలో జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడంలేదు.
 
 కన్నీరు మిగుల్చుతోన్న ప్రాజెక్టులు
 జిల్లాకు ప్రతిష్టాత్మకంగా భావించిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దీనిని పూర్తిగా పక్కన పెట్టేసింది. బడ్జెట్‌లో చాలా తక్కువ నిధులు కేటారుుంచడంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రధాన పంట కాలువల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందడంలేదు.
 
 కేవలం ఆర్భాటపు ప్రకటనలే..
 పామూరు, పీసీపల్లి మండలాల్లో జాతీయ ఉత్పత్తిరంగ జోన్‌ను ఏర్పాటుచేసి 70వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామంటూ ఇటీవల కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ప్రకటించారు. అదేవిధంగా దొనకొండలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కుతో 30వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. కానీ ఇది ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాకు కీలకమైన యూనివర్శిటీ ప్రస్తావన కూడా లేకుండా పోయింది. దీని కోసం విద్యార్థి సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోవడంలేదు. యంత్రాంగం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే నిజంగానే జిల్లా ప్రకాశిస్తుందని భావించక తప్పదు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మెుత్తం 74 పరిశ్రమలున్నట్లు చెప్పుకుంటున్నా.. వీటి వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారో ప్రశ్నార్థకమే!
 
 ధాన్యాగారానికి ఎసరు..
 జిల్లాలో వరి సాగు పండించే భూములు లక్షల హెక్టార్లలో ఉన్నారుు. సాగర్, కొమ్మమూరు కాలువల కింద ప్రధాన ఆయకట్టు ఉంది. అరుుతే ప్రతి ఏటా నీటి విడుల కోసం యుద్ధాలు చేయూల్సి వస్తోంది. ఫలితంగా బంగారు పంటలు పండే భూములు ఎండిపోతున్నాయి. దీనికితోడు తీవ్ర వర్షాభావం వల్ల ప్రధాన చెరువులు, రిజర్వాయర్లు నిండక వాటి కింద భూములు బీడులుగా మారుతున్నారుు. నీటి విడుదలలో ప్రజా ప్రతినిధులు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా సాగర్ విషయంలో గుంటూరు జిల్లా రైతులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నా ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనుల్లేక జిల్లా వ్యాప్తంగా వలసలు ఎక్కువయ్యూరుు. ఏడాదిలో ఎనిమిది నెలలకు పైగా సొంత ఊర్లను వదిలి వెళుతున్నారు.
 
 అవతరణకు ముందు విశేష కృషి
 ప్రకాశం జిల్లా అవతరించడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడంతో జిల్లా ఏర్పాటుపై శాంతియుత పోరాటాలు జరిగాయి. కానీ శ్రమ వృథానే అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించారు. ఒంగోలుకు చెందిన వకీలు మట్టా హరినారాయణ శ్రేష్ఠి, బత్తిన పెరుమాళ్లునాయుడుకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. బత్తిన పెరుమాళ్లునాయుడు 1937-1946 ప్రాంతంలో మద్రాసు రాష్ట్రానికి శాసనసభ్యునిగా వ్యవహరించారు. 1960 ఫిబ్రవరి 23న పిశుపాటి వెంకటరాయశర్మ ఒంగోలు జిల్లా ఏర్పాటు అవసరంపై ప్రభుత్వానికి విన్నవించారు. జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నందున ఈ విజ్ఞప్తిని మన్నించలేకపోతున్నట్లు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత గంజాం రాఘవాచార్యులు, ధారా గోపాలశాస్త్రి, నారాయణం కేశవాచార్యులు, ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం తదితరులు కృషి చేశారు.
 
 రొండా నారపరెడ్డి కృషితో సఫలీకృతం
 జిల్లా ఏర్పాటు విషయంలో పట్టువదలని విక్రమార్కునిగా పోరాడి సాధించిన ఘనత జిల్లాకు చెందిన మాజీ మంత్రి రొండా నారపరెడ్డికి దక్కుతుంది. దీని కోసం నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై ఆయన ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. చివరకు 1970 ఫిబ్రవరి 2న నూతన జిల్లా ఏర్పాటైంది. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను వేరుచేసి సరిహద్దులు నిర్ణరుుంచారు. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్నూలు జిల్లా, ఉత్తరాన గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాలు, దక్షిణాన నెల్లూరు, కడప హద్దులుగా ఒంగోలు జిల్లా తన ప్రయూణాన్ని ప్రారంభించింది. ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తుగా.. ఇదే ప్రాంతానికి చెందినవారై కావడంతో 1972 మేలో ప్రకాశం జిల్లాగా పేరు మార్పు చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలున్న భ వనానికి ప్రకాశం భవన్ అనేపేరు పెట్టారు. 1982 నవంబరు 5న ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కాంస్యవిగ్రహా న్ని ఇదే ఆవరణలో.. నాటి గవర్నర్ కేసీ అబ్రహం ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement