విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం
విమానాల నిర్వహణ సముదాయం ఏర్పాటుకు విదేశీ సంస్థల ఉత్సాహం
పెరుగుతున్న విదేశీ సర్వీసులు
పర్యాటక, పారిశ్రామిక రంగాలను ఆకర్షించే ప్రయత్నం
విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. ఇక్కడి సహజ వనరులు, సదుపాయాలు పాలకుల్లో ఆశలు కల్పిస్తున్నాయి. జి ల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు కూడా అందుబాటులో ఉండటం, పర్యాటక ప్రాం తాలు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులను ఆకర్షించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దేశ, విదేశీ పెట్టుబడులు ఇక్కడికి రావాలంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుండి రోజుకి 16 నుంచి 18 విమాన సర్వీసులు నడుపుతున్నారు. నాలుగు దేశీయ, నాలుగు అంతరాతీయ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుత సర్వీసులు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. దీంతో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్‌జైన్ ఇటీవల విశాఖలో ప్రాధమికంగా వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ప్రస్తుత ఎయిర్‌పోర్టును విస్తరిస్తే సరిపోతుందని, భోగాపురం విశాఖకు 55 కిలోమీటర్లు ఉన్నందున ప్రయాణీకులకు ఇబ్బంది గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరిస్తారా లేక విశాఖ సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు నిర్మిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా విమానాశ్రయం విస్తరణ తప్పనిసరి అనేది స్పష్టమవుతోంది. ఇక ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు విశాఖలో విమానాల నిర్వహణ సముదాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే 100 విమానాలతో ఇక్కడ హబ్ నెలకొల్పుతామని ప్రకటించింది. విమాన సర్వీసులు కూడా పెరుగుతున్నాయి. ఎయిర్ ట్రావెల్‌ర్స్ అసోసియేషన్ (ఇండియా) చేసిన ప్రయత్నాల వల్ల ఇటీవల ఎయిర్ ఏషియా కంపెనీ కౌలాలంపూర్-విశాఖ-కౌలాలంపూర్ సర్వీసును ఎయిర్ ఏషియా తక్కువ టిక్కెట్టుతో ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, బ్యాంకాక్, యునెటైడ్ స్టేట్స్, టోక్యో, బీజింగ్‌లను కలుపుతూ ఈ సర్వీసు నడుస్తోంది. ఇదే కంపెనీ బ్యాంకాక్-విశాఖ-బ్యాంకాక్ సర్వీసును త్వరలో ప్రారంభించనుంది. ఎయిర్ లంక నడుపుతున్న కొలంబో-విశాఖ-కొలంబో సర్వీసును కూడా రప్పించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు ఎటిఎ అధ్యక్షుడు డి.వరదారెడ్డి అంటున్నారు. మరోవైపు ఫ్లై దుబాయ్, ఎఐ అరేబియా విమాన సంస్థలు కూడా ఆయా దేశాలకు నేరుగా విశాఖ నుంచి విమాన సర్వీసులు నడిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విమాన నగరం
Published Fri, Mar 20 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement