ఇద్దరు అమెరికన్‌ ఇండియన్లకు... కీలక పదవులు | Joe Biden Appoints 2 Indian-American CEOs To US Advisory Committee | Sakshi
Sakshi News home page

ఇద్దరు అమెరికన్‌ ఇండియన్లకు... కీలక పదవులు

Published Sun, Mar 12 2023 5:30 AM | Last Updated on Sun, Mar 12 2023 5:30 AM

Joe Biden Appoints 2 Indian-American CEOs To US Advisory Committee - Sakshi

వాషింగ్టన్‌: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్‌ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్‌ రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సీఈఓ మనీశ్‌ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది.

‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్‌ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement