అమెరికా రాజకీయాల్లో భారతీయులు | Sakshi Guest Column On Indians in American Politics | Sakshi
Sakshi News home page

అమెరికా రాజకీయాల్లో భారతీయులు

Published Tue, Mar 5 2024 4:42 AM | Last Updated on Tue, Mar 5 2024 8:16 AM

Sakshi Guest Column On Indians in American Politics

విశ్లేషణ

సిద్ధాంతపరంగా అమెరికా రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. కానీ ఆచరణలో, రిపబ్లికన్, డెమోక్రటిక్‌ పార్టీలు రెండూ తమలో తామే సంకీ ర్ణాలుగా ఉంటున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ దాని ఆధిపత్య స్థానంలోని కరడుగట్టిన మితవాదులకూ, పార్టీ లోపలే తమ వాణిని అట్టిపెట్టుకోవడానికి ఘర్షణ పడుతున్న గతకాలపు సంప్రదాయవాదులకూ మధ్య గొప్ప అంతర్యుద్ధానికి సాక్షీభూతంగా ఉంది. ఇక డెమోక్రటిక్‌ పార్టీ శిబిరం...సెంట్రిస్టులు, సెంటర్‌– లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులకు నిలయంగా ఉంటోంది. అయితే, మితవాద పక్షం నుంచి ప్రగతిశీల వామపక్షాల వరకు, అమెరికాకు చేతనత్వం కలిగిస్తున్న ఐదు రాజకీయ పక్షాలలోనూ భారతీయ అమెరికన్‌ నాయకులు ప్రధాన పాత్రధారులుగా ఉండటమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనార్హం.

కరుడుగట్టిన మితవాదం (ఫార్‌–రైట్‌)తో ప్రారంభిద్దాం. ఈ రాజకీయ ధోరణి, కింది విధానాలను కలిగివుంది. 1.కార్పొరేట్‌ పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మించడంపై అమెరికా దృష్టి కేంద్రీకరించాలి. ఇంధన వాడకాన్ని ఎంతకైనా పెంచాలి. ఇప్పటికే ఉన్న ట్రేడింగ్‌ ఏర్పాట్లపై పూర్తిగా తిరోగమించాలి. 2. అమెరికా తన అంతర్జాతీయ కట్టుబాట్లను తగ్గించుకోవాలి. ఐరోపా నుండి వెనక్కి తగ్గాలి. ఎక్కువగా చైనాపై దృష్టి పెట్టాలి. 3. అమెరికా తన సరిహద్దులను పటిష్టంగా కాపాడు కోవాలి.

సామాజిక జనాభా మార్పులు సంఘర్షణలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు శ్వేత క్రైస్తవ జనాభా రాజకీయ ఆధిపత్యానికి కలగబోయే ముప్పును సూచిస్తున్నారు. 4. అమెరికా ‘మేలుకొలుపు’ (వోకిజం) రాజకీయాలను తిప్పికొట్టాలి. అవి లైంగికత లేదా జాత్య హంకారంపై విద్యా బోధన లేదా నిశ్చయాత్మక చర్య లేదా యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు వంటివి ఏవైనా కావచ్చు. 5. అమెరికన్‌ ఫెడరల్‌ ప్రభుత్వం, నిఘా సంస్థలు రాజకీయంగా రాజీ పడ్డాయి. వీటి సిబ్బందిని తగ్గించడంతో సహా నాటకీయంగా రీబూట్‌ చేయడం అవసరం.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ ధోరణికి నిజమైన మార్గదర్శకుడు, ముఖ చిత్రం కూడా. అయితే, ఈ రోజు ఈ ఉద్యమం తదుపరి తరం ముఖా లలో వివేక్‌ రామస్వామి కూడా ఉన్నారు. నిజానికి, వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కన్జర్వేటివ్‌ రాజకీయ కార్యాచరణ సమావేశంలో, ట్రంప్‌ ఉపాద్యక్షుడి ఎంపికగా రామస్వామి కూడా ఫేవరెట్‌లలో ఒకరుగా ఉద్భ వించారు.

మధ్యేవాద–సంప్రదాయవాద ధోరణిని పరిశీలిద్దాం. ఈ అంతరి స్తున్న మితవాద రిపబ్లికన్ ల తరం మూడు కీలక అంశాలలో, కరుడు గట్టిన మితవాదం నుండి భిన్నంగా ఉంటుంది. 1. అంతర్జాతీయ కట్టు బాట్ల పరంగా, అమెరికా బలం... పొత్తులపై, ‘నాటో’ కూటమి పట్ల నిబద్ధతపై, భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ స్కూల్‌ విశ్వసిస్తుంది.

ఐరోపాలో రష్యా సవాలును, ఇండో–పసిఫిక్‌లో చైనా సవాలును, పశ్చిమాసియాలో ఇరాన్‌ను అమెరికా కలిసి ఎదుర్కోవాలని నమ్ముతుంది. 2. సంస్కృతీ యుద్ధాల పరంగా – మితవాద రిప బ్లికన్ లు అబార్షన్, తుపాకీ హక్కులు, విద్యపై పార్టీ ఎజెండాతో సరిపెట్టుకుంటారు. అన్నింటికీ మరీ ఎక్కువ ఆందోళన చెందకుండా విభిన్న దృక్కోణాల పట్ల అంగీకారంగా ఉంటారు. 3. మితవాద రిప బ్లికన్ లు అమెరికన్‌ సంస్థలపై విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ప్రజా స్వామ్య నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇది యునైటెడ్‌ స్టేట్స్‌ క్యాపిటల్‌ మీద జనవరి 6న జరిగిన మూక దాడి సమర్థకుల నుండి వైరుధ్యాన్ని సూచిస్తుంది.

సెనేట్‌లో మిచ్‌ మెక్‌కానెల్‌ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, నిక్కీ హేలీ ఇప్పుడు మితవాద రిపబ్లికన్‌ పార్శా్వనికి ప్రజా ముఖంగా ఉన్నారు. ఆమె అయోవా, న్యూ హాంప్‌షైర్‌ ప్రైమరీలలో ట్రంప్‌ చేతిలో ఓడిపోయారు. తన సొంత రాష్ట్రం సౌత్‌ కరోలినాలోనూ ఓడారు. నెవాడాలో అయితే ‘ఈ అభ్యర్థులు ఎవరూ కారు’ విభాగంలో పోల్‌ అయిన ఓట్ల కంటే తక్కువ ఓట్లను పొందడం అనేది ఈ భావజాలం ఈరోజు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉందో చూపి స్తుంది.

కానీ మొత్తంగా నియోజకవర్గాల పరంగా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. న్యూ హాంప్‌షైర్‌లో హేలీకి వచ్చిన 43 శాతం ఓట్లు, సౌత్‌ కరోలినాలో వచ్చిన 39 శాతం ఓట్లలో ఇది కనిపిస్తుంది. గెలవడానికి సరిపోదు కానీ, ఈ వర్గాలు ఇంటిలోనే ఉంటే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్‌ అవకాశాలు నాటకీయంగా మసక బారుతాయి.

డెమోక్రాట్లలో సెంట్రిస్టులు, సెంటర్‌ లెఫ్టులు, లెఫ్టులు...
ఇక మనం డెమోక్రటిక్‌ పార్టీ శిబిరానికి మరలుదాం. డెమోక్రటిక్‌ సెంట్రిస్ట్‌లకు, సెంటర్‌–లెఫ్ట్‌కు అధ్యక్షుడు జో బైడెన్‌ నాయకత్వం వహిస్తున్నారు. వివిధ ప్రపంచ రంగాల్లో అమెరికా పాత్రకు సంబంధించి మధ్యేవాద రిపబ్లికన్‌ల నిబద్ధతను ఈ స్కూల్‌ కూడా పంచుకుంటుంది. ఇది కరుడుగట్టిన మితవాద, ప్రగతిశీల భావజాలాలు రెండింటినీ కలుపుకొని, అమెరికాలో పెట్టుబడి వికాసంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని నడిపించింది.

ఇది అబార్షన్‌ హక్కులపై ప్రగతిశీల దృక్ప థాన్ని కనబరుస్తుంది. అయితే దీనిని ప్రజారోగ్య సమస్యగా, మహిళల హక్కుల సమస్యగా చూస్తుంది. ఇది నిర్మాణాత్మక జాతి వివక్షను గుర్తిస్తుంది కానీ పెరుగుతున్న సంస్కరణలను కూడా విశ్వసిస్తుంది. అధిక లోటును దృష్టిలో ఉంచుకుని సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించేందుకు ఇది కట్టుబడి ఉంది. వలసలపై, మరింత కఠినమైన చట్ట అమలు, మరింత మానవీయ విధానం రెండింటి మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది.

భారతీయ అమెరికన్లలో, ఇల్లినాయికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మధ్యేవాది(సెంట్రిస్ట్‌). కానీ సిలికాన్‌ వ్యాలీ నుండి హౌస్‌ రిప్రజెంటేటివ్‌గా ఉన్న రో ఖన్నా మాత్రం సెంటర్‌–లెఫ్ట్‌ వర్గా నికి చెందిన అత్యంత ప్రముఖ హక్కుదారు. ఆయన మధ్యేవాదులకు, అభ్యుదయవాదులకు కుడివైపున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు.

పైగా 2028లో అధ్యక్ష ఎన్నికల కోసం తానూ ఒక రాయి విసరాలని భావిస్తున్నారు. మార్కెట్‌కు సాంకేతిక పరిజ్ఞానం, మధ్య అమెరికాలో శ్రామిక వర్గానికి ఆర్థిక దేశభక్తి గురించి ఈయన మాట్లాడతారు. బహుళవాదం, మైనారిటీలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతారు. చైనాపై కఠినమైన జాతీయ భద్రతా చర్యలు, గాజాలో కాల్పుల విరమణ, కార్పొరేట్‌ దోపిడీ, ప్రచార సంస్కరణల భాష గురించి కూడా మాట్లాడతారు.

చివరగా, ప్రగతిశీల ధోరణిలోకి వెళ్లి చూడండి. వారు తమ సొంత అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ, విస్తృతంగా చెప్పా లంటే, ప్రగతిశీలురు స్వేచ్ఛా వాణిజ్యంపై సందేహాస్పదంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్‌ చర్యలను సైనిక–పారిశ్రా మిక సముదాయం నడపడాన్ని వ్యతిరేకిస్తారు. అసమానత, దాన్ని ఎదుర్కొనే విధానపరమైన నిర్ణయాల్లో జాతి, లింగవివక్షలను ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారు. కార్పొరేట్‌ అధికారానికి బలమైన ప్రత్యర్థులు. అధిక పన్నుల ప్రతిపాదకులకు వ్యతిరేకులు. తీవ్రమైన వాతావరణ విధాన రక్షకులు. ప్రపంచంలోని మానవ హక్కుల వంటి సమస్యలపై మరింత చురుకైన అమెరికన్‌ జోక్యానికి లాబీయిస్టులు.

ఈ విభాగంలోని ప్రముఖ ముఖాలు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హౌస్‌ ప్రోగ్రెసివ్‌ కాకస్‌ చైర్‌ ప్రమీలా జయపాల్‌. పురోగామి విశ్వాసాలను కమలా హారిస్‌ పంచుకుంటున్నప్పటికీ, విదేశాంగ విధా నాల విషయంలో మాత్రం ఆమె సెంట్రిస్ట్‌ వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. 

ఈ ఐదు రకాల ధోరణులు... అమెరికా రాజకీయాలు ఈరోజు ఎందుకు సందడిగా విభజించబడి ఉన్నాయో, పైగా మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా ఎందుకు ఉన్నాయో వివరించడంలో సహాయ పడవచ్చు. పైగా భారతీయ అమెరికన్లు అక్కడ తమ కొత్త నేల భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా, తరచుగా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు.

ప్రశాంత్‌ ఝా 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, కాలమిస్ట్‌
(‘ది హిందూస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement