వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. పిల్లలు లేనివారు పాలించేందుకు తగదు అంటూ గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కించపరిచినట్లు మాట్లాడారు. తాజాగా దీనిపై తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాగా, జేడీ వ్యాన్స్ 2021లో అమెరికాలో పిల్లలులేని తల్లుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లలందరికీ ఓట్లు వేసే అవకాశం ఇద్దాం. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులకు ఆ ఓట్లపై నియంత్రణ ఉండేలా చూసుకుందాం. మీరు అమెరికాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఒక పేరెంట్‌గా మరింత శక్తిని కలిగి ఉండాలి. పిల్లలు లేని వారి కంటే పిల్లులు ఉన్న పేరెంట్స్‌కి ప్రజాస్వామ్యంపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే తమ వాయిస్ వినిపించగలరు. ఇదే సమయంలో పిల్లలు లేని వారు వాయిస్‌ను ఎక్కువ వినిపించలేరు(చైల్డ్ లెస్ క్యాట్ లేడీస్). పిల్లలు లేని వారు పాలించేందుకు పనికిరారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాన్స్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల వేళ జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నేతలు వ్యాన్స్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
JD Vance calls for taking away voting power from “people who don’t have kids”: “Doesn't this mean that non-parents don't have as much of a voice as parents? Yes. Absolutely” pic.twitter.com/rXhzMoat47
— Kamala HQ (@KamalaHQ) July 25, 2024
ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తినే ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత, ఓహియో సెనేటర్ జేమ్స్ వ్యాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యాక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వ్యాన్స్.. ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment