fishing harbor
-
Fact Check: రొయ్య రాతల గొయ్యిలో రామోజీ
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా గత 57 నెలలుగా రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ప్రతీ కౌంట్‌కు ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేయడమే కాదు.,. పెంచిన ఫీడ్ ధరలను 3 సార్లు ఉపసంహరించుకునేలా ఈ ప్రభుత్వం చేసింది. ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్తును అందిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులూ భారీగా పెరిగాయి. రొయ్యల ఉత్పత్తి బాబు ఐదేళ్ల పాలనలో 1.74 లక్షల టన్నులకు మాత్రమే పెరిగితే.. సీఎం జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లలోనే ఏకంగా 6.94 లక్షల టన్నులకు పెరిగింది. బాబు హయాంలో జాతీయ స్థాయిలో రొయ్యల ఉత్పత్తి 67 శాతం ఉండగా, ప్రస్తుతం 77.55 శాతానికి పెరిగింది. ఇవేమీ రాజగురువు రామోజీకి మాత్రం కన్పించడం లేదు. ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నప్పటికీ, అదే పనిగా విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా ‘రొయ్య ఎగరలేదు..రైతు ఎదగలేదు’ అంటూ అబద్ధాలను అచ్చేశారు.. వాస్తవాలు ఏమిటంటే.. ఆరోపణ : పెరగని రొయ్యల ఉత్పత్తి వాస్తవం..: రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వాసాగును గుర్తిస్తూ, వారికి అందాలి్సన అన్నిసంక్షేమ ఫలాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 2018–19లో 39 లక్షల టన్నులు ఉన్న రొయ్య/మత్స్య ఉత్పత్తులు 2022–23కు వచ్చేసరికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి ఏకంగా 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. ఇలా ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11.09 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. ఆరోపణ : ఎగుమతులు పెరగలేదు వాస్తవం..: ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగాయి. 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు ఎగుమతులు జరిగితే.. 2022–23లో ఏకంగా రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. జీవీఏ చూసుకుంటే రూ.48 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.68 వేల కోట్లకు పెరిగింది. ఏటా సగటున 5.12 శాతం వృద్ధిరేటు నమోదవుతోంది. గ్రోత్ రేట్ ఐదేళ్లలో జాతీయ స్థాయిలో 19.37 శాతం ఉంటే, ఏపీలో 25.59 శాతంగా నమోదవుతోంది. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఆరోపణ : సిండికేట్‌గా మారి దోపిడీ వాస్తవం..: నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు ప్రభుత్వం ఐదేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచి్చన అప్సడా చట్టం ద్వారా. కంపెనీలు, సరఫరాదారులను రైతులకు జవాబుదారీతనంగా నిలిచేలా చేసింది. బాబు హయాంలో ఐదేళ్ల పాటు సాగిన వారి దోపిడీకి జగన్ పాలనలో అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా ముడిపదార్థాల ధరలు 28 శాతం మేర పెరగడం వల్ల ఆ మేరకు రొయ్య మేత ధర 21.36 శాతం (రూ.72 నుంచి రూ.91.50లకు) మేర పెరిగింది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860 పడకుండా అడ్డుకుంది. ఆరోపణ : నియంత్రణా ...అదెక్కడ? వాస్తవం..: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. ప్రతీ 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చుతగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతీ రైతుకు, ప్రతీ రొయ్యకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 100 కౌంట్ రొయ్యకు రూ.210 ప్రభుత్వం నిర్ణయిస్తే, రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470కు కొనుగోలు చేస్తోంది. ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రతీ ఆక్వా రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది.ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ప్రభుత్వం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020లను అమలులోకి తీసుకొచి్చంది. ఇవే నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆరోపణ: రాయితీ విద్యుత్తుకు మంగళం వాస్తవం..: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 57 నెలలుగా యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్తు సరఫరా చేసింది. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుచేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఫిష్ సర్వే ద్వారా రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఇందులో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే వారికి సాయంగా 3.34 లక్షల ఎకరాలకు సబ్సిడీ విద్యుత్తు వర్తింప చేస్తున్నారు. మొత్తం 66,993 కనెక్షన్లలో 54,072 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. జోన్ పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,306 కోట్లు ఆక్వా సబ్సిడీ కింద ఈ ప్రభుత్వం ఖర్చుచేసింది. ఆరోపణ : ఆక్వా రైతులకు ఆదరణేది? వాస్తవం..: స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్‌తో డొమెస్టిక్ మార్కెటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు, నాలుగు వేల మినీ అవుట్‌లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు అన్నీ కలిపి 2,500 యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 732 ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వడమే కాక, పంట సాగు వేళ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌ఫుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు. దక్కాయి. ఇవేమీ రామోజీకి కన్పించడం లేదు. రామోజీ వక్రభాష్యాలకు హద్దూపద్దూ లేదు. చంద్రబాబు సాధించలేని ప్రగతిని సీఎంగా జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఓర్వలేనితనం, కడుపుమంట నిలువెల్లా రామోజీకి కంటగింపుగా మారాయి.. ప్రభుత్వం అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం ఏ మంచి చేసినా, అది మంచే కాదని వక్రీకరణే పనిగా పెట్టుకుని పవిత్రమైన జర్నలిజానికే కళంకం తెస్తున్నారు. ఆక్వారంగంలో జగన్ సాధించిన నీలి విప్లవ పురోగమనం జాతీయ స్థాయిలోనే అబ్బురపరిచే ఫలితాలనిస్తుంటే...ఆ అభివృద్ధిని రామోజీ ఓర్వలేక పోతున్నారు.. చేపలు, రొయ్యల ఉత్పత్తులు బాబు హయాంలో 39 లక్షల టన్నులుంటే , అది జగన్ పాలనలో 51 లక్షల టన్నులకు పెరగడం ఈనాడుకు కనిపించలేదు. జాతీయ స్థాయిలో చూసినా బాబు పాలన నాటికి ఉన్న రొయ్యల ఉత్పత్తి అయిదింతలు పెరిగినా, అదీ రామోజీకి గొప్పగా అనిపించదు. ఎగుమతుల్లో ఏటా సగటున 5.12 శాతం వృద్ధి రేటు నమోదవుతున్నా అదీ తనకు నచ్చదు. ఇలా... జగన్ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా అన్నీ నూరుశాతం ప్రగతిని సాధించినవే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా పాలనలో తనదంటూ ముద్ర ఏర్పరుచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును గొప్పగా ప్రొజెక్టు చేయడానికి రామోజీ పడరాని పాట్లు పడుతున్నారు... వాస్తవాలకు ఈనాడు ఎంత మసిబూసి మారేడు కాయ చేయాలనుకన్నా , నిజాలను దాచేసి అబద్ధాలను అచ్చేయాలనుకున్నంత మాత్రాన సత్యాలు అసత్యాలుగా మారిపోవుకదా...ఆక్వా రంగంలో జగన్ ప్రభుత్వ విజయాలు, చంద్రబాబు వైఫల్యాలు ఇవిగో... -
Fact Check: కోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టుల గురించి ఏం తెలుసు?
‘అసలే కోతి.. ఆ పైన కల్లు తాగింది.. ఆ తర్వాత దానికి పిచ్చెక్కింది.. తర్వాత దానికి దయ్యం పట్టింది.. ఇక ఈ కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. పచ్చ పత్రిక ఈనాడు అధినేత రామోజీరావు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ విషం జిమ్మడమే రామోజీ పనిగా పెట్టుకున్నారు. నిత్యం ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలతో కూడిన కథనాలను అచ్చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ‘రేవూ.. రేవూ.. ఎందుకు పూర్తికావు’ అంటూ ఈనాడులో ఒక విష కథనాన్ని వండివార్చారు. అభూత కల్పనలతో, అసత్యాలతో సాగిన ఈ కథనానికి సంబంధించి అసలు వాస్తవాలివీ.. – సాక్షి, అమరావతి దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాభివృద్ధికి సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తీర ప్రాంతం వెంట లక్షల్లో నివసిస్తున్న మత్స్యకారుల సంక్షేమంపై ముందుగా దృష్టి సారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలసపోయేవారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కోస్ట్‌గార్డుకు మన మత్స్యకారులు చిక్కారు. ఇలాంటి దుస్థితిని అరికట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరుతో వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అంతేకాకుండా వలసలను నివారించడానికి రాష్ట్రంలోనే పది ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని తలపెట్టింది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసుకుని ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం అందుబాటులోకి రానున్నాయి. రెండో దశ కింద మరో ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రామోజీరావు మాత్రం కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో.. మత్స్యకారులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితికి చెక్ పెడుతూ ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఏకంగా 60 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా.. వారు స్థానికంగానే ఉపాధి పొందేలా మినీ పోర్టుల స్థాయిలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, బియ్యపుతిప్ప, కొత్తపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. 12,000 బోట్లను సురక్షితంగా నిలుపుకోవడమే కాకుండా అక్కడే చేపలను వేలం వేసుకోవడం, శీతలీకరణ, ఎండబెట్టుకోవడం, మార్కెటింగ్ వంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తోంది. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ల పక్కనే ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తోంది. అందుబాటులోకి తొలి దశ హార్బర్లు తొలి దశలో రూ.1,523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో రామోజీ కడుపుమంటతో తట్టుకోలేకపోయారు. మిగిలిన మూడు హార్బర్లలో నిర్మాణ పనులు 65 శాతంపైగా పూర్తయినా కేవలం 30 శాతమే అయ్యాయంటూ ఎప్పటిలానే అబద్ధాలను అచ్చేశారు. దాదాపు రెండేళ్లపాటు కరోనా, మధ్యలో భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేస్తోంది. -
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనలో కీలక ఆధారాలు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు ఇద్దరు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారని, 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కొంప ముంచిన ఉప్పు చేప ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం అదేబోటులో పనిచేసిన నాని మామ సత్యం.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేశాడు. దీంతో మంటలు చెలరేగాయి. 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి నిందితులు కారణమయ్యారు. వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణం: సీపీ ఈ కేసుపై సీపీ రవిశంకర్ మీడియాకు వివరించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని పేర్కొన్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి ఫిషింగ్ హార్బర్‌కు వచ్చారు. అల్లిపల్లి వేంకటేష్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకుని పార్టీ చేసుకున్నారు. అనంతరం సిగరెట్ తాగి పక్కన ఉన్న 815 నెంబర్ బోటుపై పడేశారు. దీంతో మంటలు చెలరేగి వ్యాపించడంతో గమనించి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటారు. వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామని.. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానతులను విచారించామని సీపీ పేర్కొన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారు. విచారణలో భాగంగానే యూట్యూబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని సీపీ తెలిపారు. చదవండి: చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది! -
విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ?
Updates.. ►విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి సీదిరి అప్పలరాజు. ►విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ►విశాఖపట్నంంలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 30కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ►ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లు ద్వారా అదుపులోకి తెచ్చారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ►మరోవైపు.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో వివరాలను పోలీసు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
తీరప్రాంత అభివృద్ధికి రూ.16 వేల కోట్లు
బిట్రగుంట: ‘రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ పనులను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అమర్నాథ్ మాట్లాడు తూ రామాయపట్నం పోర్టుతోపాటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన హార్బర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి, ఫిషింగ్ హార్బర్ ద్వారా మరో ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి విజ్ఞప్తి మేరకు బకింగ్‌హాం కెనాల్ మరమ్మతులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, మత్స్యకా రులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారా నికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏపీ మారిటైం చీఫ్ ఇంజినీర్ రాజగో పాల్, ఆర్డీవో వీకే శీననాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ చొరవతో నెరవేరబోతున్న దశాబ్దాల కల
-
జగనన్న సంకల్పం.. ప్రారంభానికి జువ్వలదిన్నె రెడీ! వారికి మంచి రోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైనవి వాస్తవ రూపం దాలుస్తున్నాయి. వీటి రాకతో ఇక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని వేలాది మంది మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లి, ఎప్పటికప్పుడు ఇంటికొస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే రోజులు అతి త్వరలోనే రానున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మత్స్యకారుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వారికి ఆ కష్టాలను దూరం చేయాలని భావించి, అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ప్రధానంగా డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, ప్రీకాస్ట్ వంటి పనులు దాదాపు పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మిగతా ఐదు శాతం పనులు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పట్టిన చేపలు వేలం వేసుకోవడానికి హాలు, కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.288.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ హార్బర్లో 1,250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా 6,100 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 9 హార్బర్లతో 60,858 మందికి ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూ.3,520.56 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి. రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుందని అంచనా. మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా హార్బర్ల వద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద జువ్వలదిన్నె వద్ద 50 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మత్స్య ఉత్పత్తులే కాకుండా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రాసెస్ చేసేలా ఈ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే ఉపాధి లభిస్తుంది చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ హర్బర్ వస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందొచ్చు. ఇక్కడ అరుదైన మత్స్య సంపద ఉన్నా, హర్బర్ లేకపోవడంతో తమిళనాడు మత్స్యకారులు దొంగతనంగా వచ్చి వేటాడుతున్నారు. జువ్వలదిన్నె హార్బర్ ద్వారా ఆ సమస్య ఉండదు. ఈ హార్బర్ వద్ద ఇతరత్రా మౌలిక వసతులు కూడా కల్పిస్తుండటం సంతోషం. ► బుచ్చింగారి చిట్టిబాబు, మత్యకారుడు, ఆదినారాయణపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా త్వరలో ప్రారంభం తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నాం. రెండో దశ హర్బర్లకు సంబంధించి డిజైన్లు ఖరారు దశలో ఉన్నాయి. అవి ఖరారు కాగానే పనులు మొదలు పెడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హర్బర్ లేదా ఓడరేవు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ► షాన్ మోహన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు జువ్వలదిన్నెలో పనుల పురోగతి ఇలా.. ► 2021 మార్చి 19న పనులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ► భారీ మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఆగడానికి వీలుగా కాలువను తవ్వడం కోసం ఏకంగా 10.5 లక్షల టన్నుల ఇసుకను తవ్వి పక్కన పోశారు. ఈ బ్రేక్‌వాటర్ ఛానల్ తిరిగి పూడిపోకుండా ఉండటం కోసం 3.20 లక్షల టన్నుల రాతిని వినియోగించారు. ఉత్తరం వైపు బేక్ వాటర్ 835 మీటర్లు, దక్షిణం వైపు 620 బ్రేక్ ఛానల్స్‌ను రాతితో నింపే ప్రక్రియ పూర్తయింది. ► అలల ఉధృతిని తట్టుకునే విధంగా సిమెంట్‌తో నిర్మించిన 9,176 ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉండే సిమెంట్ దిమ్మెలు–టెట్రాపాడ్స్ అని కూడా అంటారు) పేరుస్తున్నారు. ఇందులో ఇప్పటికే 6,919 ట్రైపాడ్స్ను అమర్చారు. 1,250 బోట్లు నిలుపుకోవడానికి 909 మీటర్ల జెట్టీ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందుకోసం 312 ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ (సముద్రం లోపలికి సిమెంట్‌తో కూడిన ఇనుప దిమ్మెలు) ఏర్పాటు చేశారు. ► వీటిని ఒడ్డుతో అనుసంధానం చేసే సిమెంట్ జెట్టీ నిర్మాణం 672 మీటర్లు ఇప్పటికే పూర్తయింది. మిగిలింది పది రోజుల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే బోట్లు ఇక్కడికి వచ్చి ఆపుకోవచ్చు. చేపల వేటను ప్రారంభించవచ్చు. ► ఇక కేవలం ఉపరితలం మీద నిర్మించే అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా భవనాలు శ్లాబు దశ దాటాయి. మిగిలినవి శ్లాబు దశకు చేరుకున్నాయి. ఇంతకాలం ఉపాధి కోసం కుటుంబాలను వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. త్వరలో జువ్వలదిన్నె హార్బర్ అందుబాటులోకి వస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల మా కల ఇప్పుడు నిజమవుతోంది. బుచ్చింగారి చిట్టిబాబు, మత్స్యకారుడు, ఆదినారాయణపురం, నెల్లూరు జిల్లా -
గంగపుత్రులకు బాసటగా..
సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో బతుకుపోరు సాగించే గంగపుత్రుల బెంగ తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో వారి అభివృద్ధికి బాటలు వేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాదు.. మత్స్యరంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ మెరైన్ స్టేట్–2021 అవార్డుతో పాటు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డులు వరించాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సుడిగుండంలో చిక్కుకున్న నావలా మారిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చుక్కానిలా మారి ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2018–19లో 39.92 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2021–22 సీజన్లో ఏకంగా 48.13 లక్షల టన్నులకు చేరాయి. ఈ ఉత్పత్తులు మూడేళ్లలో ఎనిమిది లక్షల టన్నుల మేర పెరిగాయి. రాష్ట్రంలో ఆక్వారంగంపై ఆధారపడి 2018–19లో 16.46 లక్షల మంది జీవనోపాధి పొందారు. వారి సంఖ్య 2021–22 నాటికి 26.50 లక్షలకు పెరిగింది. మత్స్యకారులు, ఆక్వారైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 738 మంది మత్స్యసహాయకులను నియమించింది. మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్టుతో పాటు ఏపీ ఫిష్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. ఈ–ఫిష్ ద్వారా 4.49 లక్షల ఎకరాల ఆక్వాసాగును క్రమబద్ధీకరిస్తోంది. 6,854 మంది మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ ద్వారా రూ.11.41 కోట్ల రుణసాయం అందించింది. ఆర్బీకేల ద్వారా 13,945 మత్స్యసాగు బడుల నిర్వహణతో నాణ్యమైన దిగుబడులను పెంపొందించేందుకు ఆక్వారైతులకు శిక్షణ ఇచ్చింది. సంక్షేమ పథకాలతో బాసట టీడీపీ హయాంలో కుటుంబానికి రూ.2 వేల చొప్పున రెండేళ్లు, ఆ తర్వాత రూ.4 వేల చొప్పున మూడేళ్లు మత్స్య వేట నిషేధ భృతి ఇచ్చారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.104.62 కోట్ల భృతి అందజేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ మూడేళ్లలో రూ.418.08 కోట్లను మత్స్యకారులకు అందించింది. టీడీపీ హయాంలో నిషేధకాలం ముగిసిన తరువాత ఏడాదికిగానీ సొమ్ము అందేదికాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధకాలం ముగియకుండానే వారి ఖాతాల్లో జమచేస్తోంది. బోట్లకు డీజిల్ లీటర్‌కు రూ.6.03 వంతున సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 460 బోట్లకు రూ.60.12 కోట్ల లబ్ధిచేకూర్చింది. ఈ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో 17,770 బోట్లకు రూ.89.17 కోట్ల లబ్ధికలిగించింది. గతంలో మాదిరి కాకుండా స్మార్ట్ కార్డుల ద్వారా సబ్సిడీ పోను మిగిలిన మొత్తం చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 116 బాధిత కుటుంబాలకు రూ.11.60 కోట్ల సాయం అందించింది. ఆక్వా చెరువులకు అందించే విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.3.86 నుంచి రూ.1.50కు తగ్గించడమేగాక 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రూ.2,290.11 కోట్ల మేర ఆక్వారైతులు విద్యుత్ సబ్సిడీ ద్వారా లబ్ధిపొందారు. ఇక జీఎస్పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన 38,282 కుటుంబాలకు రూ.178.04 కోట్ల సాయం అందించింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇన్పుట్స్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీరప్రాంతాల్లో రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వీటికి ఐఎస్వో గుర్తింపు తీసుకొచ్చింది. ► పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద రూ.332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే రూ.100 కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు కూడా పిలిచింది. ► రూ.3177కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. రూ.155 కోట్లతో విశాఖపట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్లను ఆధునికీకరిస్తోంది. వీటిద్వారా 76,230 మందికి ప్రత్యక్షంగా, 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ► 40 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను రూ.90.44 కోట్లతో పునరుద్ధరించడమేగాక రూ.86.95 కోట్లతో కొత్తగా 4 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తోంది. ► విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం, గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపుపీత హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ► పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి వద్ద రూ.5.26 కోట్లతో బ్రూడర్ బ్యాంక్, అనంతపురంలో రూ.5 కోట్లతో తలాపియా బ్రీడింగ్ సెంటర్‌తో పాటు రూ.184 కోట్లతో గుంటూరు జిల్లా పరసావారిపాలెం వద్ద 280 ఎకరాల్లో మెగా ఆక్వాపార్క్ ఏర్పాటు చేస్తోంది. ► మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 70 ఆక్వాహబ్స్తో పాటు 14 వేలకు పైగా రిటైల్ అవుట్ లెట్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో రూ.325.15 కోట్లతో 25 ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తోంది. రూ.546.97 కోట్లతో 10 ప్రాసెసింగ్, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. -
పేద అక్కచెల్లెమ్మల మేలే లక్ష్యం
మురమళ్ల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల్లోని అక్కచెల్లెమ్మల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి 50 –100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించిన వ్యవస్థ ద్వారా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం ఆయన నాలుగో ఏడాది మత్స్యకార భరోసాతోపాటు ఓఎన్జీసీ నష్ట పరిహారం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనందరికీ పరిచయం ఉన్న మల్లాడి సత్యలింగ నాయకర్ 180 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టారు. ఈయన ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో చదువుకోలేకపోయారు. సముద్రాన్నే నమ్ముకుని, ఆ సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకున్నారు. అక్కడ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి, రంగూన్లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. సొంత గడ్డ మీద మమకారంతో తను సంపాదించినదంతా అమ్మేసి.. ఈ ప్రాంతంలో భూములు కొని ఒక ట్రస్టు పెట్టారు. దాదాపుగా 110 సంవత్సరాలుగా వేల మంది పేదలకు మంచి చేశారు. అదే స్ఫూర్తితో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలను నా వాళ్లుగా భావించి దాదాపు 32 పథకాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ కష్టాలు కళ్లారా చూశాను ► మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. చేపల వేట నిషేధ సమయంలో వారిని ఆదుకునేందుకు వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ మత్స్యకార భరోసాలో భాగంగా 1,08,755 మందికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మొత్తంగా రూ.109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కూడా ఇలా సహాయం చేసిన చరిత్ర లేదు. ► మరోవైపు ఇక్కడే ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) పైప్‌లైన్ కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 69 గ్రామాల్లో 6078 బోట్లకు పని లేకుండా పోయింది. దీంతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు మనందరి ప్రభుత్వమే చొరవ తీసుకుని మొదటి విడదతగా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున, 4 నెలలకు రూ.46 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇలా ఇస్తున్న సొమ్ము రూ.108 కోట్లు. మత్స్యకార భరోసాగా ఇస్తున్న సొమ్ము మరో రూ.109 కోట్లు. మొత్తంగా ఇవాళ రూ.217 కోట్లు నేరుగా ఇస్తున్నాం. ► గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్పీసీ వాళ్లు డ్రిల్లింగ్ చేయడం వల్ల అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి రూ.47,250 చొప్పున మొత్తం రూ.70 కోట్లు మన ప్రభుత్వం విడుదల చేసింది. ఇది గత ప్రభుత్వ పాలనకు, మన ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడా. వలసల నివారణకు చర్యలు ► మత్స్యకారుల వలసలు నివారించాలని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేస్తున్నాం. వీటి కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మిగిలినవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ► ఫిష్ ఆంధ్రా పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ.333 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, వాటికి అనుసంధానంగా సుమారు 14 వేల రిటైల్ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. వీటివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎంత తేడానో మీరే చూడండి ► చేపల వేట నిషేధ సమయంలో అందించే సహాయం అప్పట్లో రూ.4వేలు ఉంటే దాన్ని రూ.10 వేలకు పెంచాం. గతంలో కొంతమందికి మాత్రమే ఇచ్చేవారు. ఇవాళ అర్హులందరికీ ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు పాలనలో 2014–15 కాలంలో కేవలం 12,128 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార భృతి కేవలం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో రూ.4 వేలకు పెంచుతూ 2018–19లో 80 వేల కుటుంబాలకు పెంచారు. ► 2014–15లో మత్స్యకార భృతికి ఇచ్చిన మొత్తం కేవలం రూ.2.50 కోట్లు. 2018–19లో రూ.32 కోట్లు. ఈ రోజు మీ బిడ్డగా సంవత్సరానికి రూ.109 కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నాను. ఆ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. మన ప్రభుత్వంలో ఈ ఏడాది ఇచ్చిన రూ.109 కోట్లతో కలుపుకుంటే మొత్తం రూ.419 కోట్లు మీ చేతుల్లో పెట్టాం. ► డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచాం. మత్స్య శాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రై వేటు బంకుల్లో కూడా డీజిల్ పట్టుకునేటప్పుడే సబ్సిడీ అందేలా స్మార్ట్ కార్డ్స్ జారీ చేశాం. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్లు చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. మొత్తం 17,770 బోట్లకు మూడేళ్లుగా సబ్సిడీపై డీజిల్ ఇస్తున్నాం. ► సముద్రంలో చనిపోయిన వారికి గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తామనే వారు. కానీ అది ఎప్పుడొస్తుందో.. అసలు రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం రాగానే ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా 116 కుటుంబాలకు మేలు చేయగలిగాం. -
5 ఫిషింగ్ హార్బర్లకు టెండర్లు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం)లలో నిర్మించే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచింది. అతి తక్కువ ధర కోట్ చేసిన విశ్వ సముద్ర టెండర్లు దక్కించుకున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి దశ కింద రూ.1,204 కోట్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్టా జిల్లా మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్ హర్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ పనులను ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేగంగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఏర్పడుతుంది. -
కృష్ణపట్నంలో మినీ హార్బర్
ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితమే సర్వే కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే.. కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్ హార్బర్ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు. మరింత వెసులుబాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మినీ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్ వంటి వసతులు చెంతకు వస్తాయి. – పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్ మత్స్యకారులకు ఎంతో మేలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు -
Andhra Pradesh: ప్రతి జిల్లాలో విమానాశ్రయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలన్నది మంచి భావన (కాన్సెఫ్ట్) అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘వన్ డిస్ట్రిక్ట్.. వన్ ఎయిర్పోర్ట్’కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాల నిర్మాణంపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, వైఎస్సార్ కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, బోయింగ్ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు.. రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని చెప్పారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రద్దీకి తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్‌కు 4 ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. 9 ఫిషింగ్ హార్బర్లకు గాను తొలి దశలో నిర్మాణం చేపడుతున్న ఉప్పాడ (తూర్పుగోదావరి), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), జువ్వలదిన్నె (నెల్లూరు)ల్లో ఫిషింగ్ హార్భర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అక్టోబర్‌కు పూర్తవుతాయని వివరించారు. రెండో విడతలో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) జిల్లాల్లో చేపడుతున్న హార్బర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో వీటికి టెండర్లు ఖరారు చేస్తామన్నారు. – ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, సీఎఫ్ఎస్ఎస్ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ప్రకాశం’లో ఫ్లోటింగ్ ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా ఓడరేవు వద్ద నీటిపై తేలియాడే జెట్టీ (ఫ్లోటింగ్ జెట్టీ) విధానంలో హార్బర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఓడరేవు వద్ద ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ వ్యయానికి ప్రతిపాదనలను తక్షణం పంపించాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఓడ రేపు వద్ద ఫ్లోటింగ్ జెట్టీ ఏర్పాటు ఈ 8 హార్బర్లకు అదనం. దీంతో రాష్ట్రంలో మొత్తం తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రతిపాదిత 8 హార్బర్లలో ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్లతో జువ్వలదిన్నె (శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్పలో రూ.1,580.22 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో న్యాయపరిశీలనకు టెండర్లు తొలి దశలో మాదిరే నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి టెండర్లు పిలవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుడగట్లపాలెం లో రూ.365.81 కోట్లతో, పూడిమడక రూ.392. 53 కోట్లు, కొత్తపట్నంలో రూ.392.45 కోట్లు, బియ్యపుతిప్ప రూ. 429.43 కోట్లతో హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసిం ది. ఇందులో బియ్యపుతిప్ప హార్బర్ మినహా మిగిలిన మూడింటి ప్రాజెక్టు ప్రణాళికలను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (సీఐసీఈఎఫ్) ఆమోదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒకొక్క హార్బర్ నిర్మా ణానికి రూ.150 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వ నుంది. మిగిలిన మొత్తంలో 90 శాతం ఎన్ఐడీఐ రుణంగా అందిస్తుంది. బియ్యపుతిప్ప హార్బర్ ప్రాజెక్టు ప్రణాళికకు సీఐసీఈఎఫ్ ఆమోదం తీసుకుని న్యాయ పరిశీలన అనంతరం టెండర్లు పిలవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ హర్బర్ల నిర్మాణంతో30,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే 8.4 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయి. -
ఆశల వేటకు గంగపుత్రులు సిద్ధం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందడిగా ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలో ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలు కానుంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్ హార్బర్లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది. ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... ►20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది. సుమారు రూ.3 లక్షలు. ►వలలు సుమారు రూ.30 వేలు. ►బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. ►ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. ►సుమారు 15 టన్నుల ఐస్ రూ.22 వేలు. ►ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. ►మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజు వేటకే మొగ్గు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్ రన్ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు. బోట్లు 2వ తేదీ అర్ధరాత్రి వెళ్లి 3వ తేదీ జెట్టీలకు చేరడం వల్ల చేపల మార్కెట్ కూడా 3న తెరుచుకోనుంది. టన్ను ఐస్ రూ.1400 ఫిషింగ్ హార్బర్లో ఉన్న 11 ఐస్ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కారి్మకులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్‌రన్‌కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్‌కు డిమాండ్ లేదేని యజమానులు చెబుతున్నారు. నిబంధనలు తప్పక పాటించాలి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు. జూన్ 1 నుంచి వేటకు అనుమతిచ్చినా బోటు యజమానులు 2వ తేదీ అర్ధరాత్రి బయలుదేరనున్నారని, వీరు వేట ముగించి ఏ జెట్టీకి తమ బోటును చేరుస్తారో అక్కడే సరకు దించాలని సూచించారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్ని బోట్లను ఒకే జెట్టీమీదకు చేర్చకూడదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆటోలు, వ్యాన్లకు హార్బర్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. హార్బర్లోని షెడ్లలో వేలం నిర్వహణ కొనసాగుతుందని, వేలంలో పాల్గొనే మత్స్యకారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, మరబోట్ల సంఘాల ప్రతినిధులు పి.సి.అప్పారావు, బర్రి కొండబాబు, సీహెచ్.సత్యనారాయణమూర్తి, పోర్టు సిబ్బంది, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్తపట్నం తీరప్రాంతంలో ఫిష్షింగ్ హార్బర్
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని పది మండలాల పరిధిలో 102 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల మత్స్యకారులు సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తంగా 88 వేల మంది సముద్ర తీరం వెంబడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 39 మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు 2,200, తెప్పలు 620 వరకు ఉన్నాయి. నెరవేరనున్న మత్స్యకారుల కల జిల్లా మత్స్యకారుల ఏళ్లనాటి కల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నెరవేరనుంది. అందుకు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొత్తపట్నం సముద్ర తీరం వేదిక కానుంది. మత్స్యకారుల సంప్రదాయ వృత్తి సముద్రపు వేటకు అనువైన వసతులు లేక జిల్లా మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. మత్స్య పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల నేతలు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫిష్షింగ్ హార్బర్లలో జిల్లాలోని కొత్తపట్నంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. నిజాంపట్నం వెళ్తున్న మత్స్య పారిశ్రామికవేత్తలు జిల్లాలోని సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోట్లు (మర పడవలు) నిలుపుకునేందుకు హార్బర్ లేకపోవడంతో జిల్లాలోని మత్స్య పారిశ్రామిక వేత్తలు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఫిష్షింగ్ హార్బర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. సముద్రంలో మూడు రకాల పడవలతో మత్స్య సంపద కోసం వేట సాగిస్తారు. వాటిలో ఒకటి తెరచాపలు, తెడ్ల సాయంతో సంప్రదాయ కొయ్య తెప్పల (కంట్రీ బోట్లు)తో వేట సాగిస్తారు. రెండోది ఆ కొయ్య తెప్పలకే మోటారు అమర్చి వేగంగా సముద్రంలోకి వెళ్లి వేట సాగించటం. ఈ రెండు రకాల బోట్లలో తెల్లవారు జామున వేటకు వెళ్తే మధ్యాహ్నానికో, సాయంత్రానికో తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే. అంతకు మించి సముద్రంలో ఉంటే మత్స్యకారులకు అన్నపానీయాలు ఉండవు. ఇక మూడో రకం మెకనైజ్డ్ బోట్లు. ఈ బోట్లలో రెండు, మూడు నెలలపాటు సముద్రంలో వేట కొనసాగించే విధంగా అన్నీ సమకూర్చుకొని సముద్రంలోకి వెళ్లవచ్చు. ఆ బోటులోనే ఉండేందుకు, పట్టిన మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటి ఒక్కో బోటులో ఏడు నుంచి పది మంది వరకు మత్స్యకారులు వేట సాగించేందుకు వీలుంటుంది. అలాంటి మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ లేక ఓడరేవు నుంచి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో నిలుపుకొంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లాలంటే మన జిల్లా నుంచి మత్స్యకారులు నిజాంపట్నం వెళ్లి అక్కడి నుంచి బోటులో సముద్రంలోకి వెళ్తారు. సముద్ర నియంత్రణ చట్టం ప్రకారం తీరం నుంచి ఆరు కిలో మీటర్లు అవతలే ఈ బోట్లు వేట సాగించాలి. ఉపాధి మెరుగుపడే అవకాశం జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటే మత్స్య పారిశ్రామికవేత్తలు అలాంటి బోట్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. జిల్లాలో ఆ అవకాశం లేకపోవడంతో కేవలం 39 మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడైతే వందల సంఖ్యలో బోట్లు కొనేందుకు అనేక మంది ముందుకొస్తారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మంది సముద్రంలో వేటకు వెళ్తారు. అందులో కూడా దాదాపు 10 వేల మంది పక్క జిల్లాలు, చెన్నై, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటారు. ఇక్కడే హార్బర్ ఏర్పాటు చేస్తే వలసలు వెళ్లాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం వేటకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి: కొత్తపట్నం సముద్ర తీరంలో హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి దొరుకుతుంది. పక్క జిల్లాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న మత్స్య పారిశ్రామికవేత్తల కంటే ఇంకా ఎక్కువ మంది మెకనైజ్డ్ బోట్లలో వేట సాగించేందుకు ఆసక్తి చూపుతారు. దీనిద్వారా అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. మత్స్యకార యువత, మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య సంపద ఉత్పత్తి కూడా ఐదు నుంచి పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, జేడీ, మత్స్య శాఖ -
బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ!
సాక్షి, అమరావతి: బందరు ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్‌తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు నాడు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మేటలు ఏర్పడే పరిస్థితులున్న హార్బర్ల వద్ద నిత్యం డ్రెడ్జింగ్ నిర్వహించాలని నిపుణులు సూచించినా.. ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇసుక మేటల సమస్య యథాతథంగానే ఉండటంతో మర పడవల నిర్వాహకులు బందరు ఫిషింగ్ హార్బర్ నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు తరలివెళ్లిపోతున్నారు. హార్బర్లోని సమస్యలను బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాల కల్పన బందరు హార్బర్లో ప్రస్తుత పరిస్థితులు, హార్బర్ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అంచనాలపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) రూపొందించే బాధ్యతను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)కి అప్పగించారు. ఈ సంస్థ.. సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు అంచనాలు రూపొందిస్తోంది. అన్ని అనుమతులు వచ్చాక హార్బర్ విస్తరణకు టెండర్లు ఆహ్వానించనున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
గంగపుత్రులకు బెంగలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచడంతోపాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే దశాబ్దాల కాలంగా కేవలం మాటలకే పరిమితమైన పూడిమడిక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెదం తెలిపాయి. ఇందులో తొలిదశలో నాలుగు, మలిదశలో నాలుగు హార్బర్లను నెలకొల్పనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక వద్ద ఫిషింగ్ హార్బర్‌ను మలిదశలోరూ.353.10కోట్ల నిధులతో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల కల.. ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షిత హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో ఇక్కడి హార్బర్ సామర్ధ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. కానీ ఇన్నేళ్లూ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఐదు నెలల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ హార్బర్ ఏర్పాటు అనుకూలతలపై సర్వే చేపట్టింది. ఢిల్లీకి చెందిన వాప్కాస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పూడిమడకలో హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి.. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే.. ఇక భీమిలి ప్రాంతంలో జెట్టీ నిర్మించేందుకు అనుకూలతలపై సర్వే చేయాలని ఇప్పటికే బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (బెంగళూరు) సంస్థకు మత్స్యశాఖ లేఖ రాసింది. ఆ ప్రాంతంలో సముద్రం లోతు, అలల ప్రభావం, ఇసుక తిన్నెల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి సదరు సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఈ జెట్టీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పోర్టు ఆధీనం నుంచి తప్పించాలి.. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ పోర్టు ఆధీనంలో నడుస్తోంది. హార్బర్లో ఉన్న 11 జెట్టీల్లో నిలిపి ఉంచే బోట్లకు ఏటా పోర్టు సొమ్ము వసూలు చేస్తుంది. వసూలు చేసిన సొమ్ముతో తగిన మౌలిక సదుపాయాల కల్పన, హార్బర్లోకి బోట్లు వచ్చేందుకు అనువుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టడం లేదు. మత్స్యశాఖ ఆధీనంలో ఉంటే తగిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు. మత్స్యకారుల కష్టాలు తీరే అవకాశం ఉంది. – దూడ ధనరాజు, బోటు యజమాని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి బతికే వారిలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునే మహిళలు అధికంగా ఉన్నారు. వీరికి తగిన మరుగు సదుపాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన ఫిషింగ్ హార్బర్లలో మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. – అల్లిపిల్లి అప్పలస్వామి, కలాసీ జట్టీ నిర్మాణం చేపడితే మేలు.. పూడిమడక తీరం నుంచి వెయ్యి పడవల్లో వేట సా గిస్తున్నాం. పడవల్ని రోజూ వేటకు తీసుకెళ్లాలంటే ఎనిమిది మంది కలాసీలు మోయాల్సి ఉంటుంది. కలాసీలకు అయ్యే ఖర్చు వేటకు భారంగా మారింది. జట్టీ నిర్మాణం చేపడితే మోత భారం ఉండదు. లంగరు వేసిన పడవల్ని ఇద్దరు తీసుకెళ్లి వేట చేయగలుగుతారు. – చింతకాయల కాసుబాబు, మత్స్యకారుడు, పూడిమడక 20 ఏళ్లుగా జట్టీ కావాలని అడుగుతున్నాం.. పూడిమడకలో జట్టీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్లుగా అడుగుతున్నాం. తుపాను వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు ఉండదు. సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారీ పడవల్ని భద్రపరుచుకోవడానికి అవస్థలు పడుతున్నాం. పడవల్ని భద్రపరుచుకోకపోతే ఒకదానికొకటి తాకి మరమ్మతులకు గురవుతున్నాయి. మోగకు వెళ్లే రహదారిని బాగుచేయాలి. – గనగళ్ల బాపయ్య, మత్స్యకారుడు, పూడిమడక పడవలు దెబ్బతింటున్నాయి ఇదివరకు చిన్నపడవలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు కోనాం, సూరల వేటకు పెద్దపడవల్ని వినియోగిస్తున్నాం. పడవని జరపడం ఇబ్బందిగా ఉంది. జట్టీ నిర్మిస్తే కలాసీల అవసరం లేకుండా వేటసాగుతుంది. సముద్రం కోతకు గురైనప్పుడు తీరంలో పడవలు దెబ్బతింటున్నాయి. జట్టీ నిర్మిస్తే సమస్యలన్నీ పోతాయి. – వాడముదుల అమ్మోరు, మత్స్యకారుడు, పూడిమడక త్వరలో సర్వే చేస్తాం.. పూడిమడకలో హార్బర్‌ను గ్రీన్ ప్రాజెక్ట్‌గా చేపడతాం. ఆ మేరకు త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మత్స్యశాఖ తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు లేఖ కూడా రాశాం. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది –పి.కోటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్, మత్స్యశాఖ శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం 3 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. దీన్ని ఎండు చేపలు నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. కనీసం 30 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి ఉంటే రొయ్యలు అధికంగా లభ్యం అయినప్పుడు ఇందులో నిల్వచేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకోవచ్చు. గిడ్డంగి లేకపోవడం వల్ల రొయ్యలకు గిట్టుబాటు ధర లభ్యం కావడం లేదు. – బర్రి కొండబాబు, అధ్యక్షుడు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ -
ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ!
మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గడచిన కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలు అమలైతే జిల్లాలోని మత్స్యకారులకు మేలు జరగడంతోపాటు పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని ఏకైక ఫిషింగ్ హార్బర్ బందరు సమీపంలోని గిలకలదిండి వద్ద ఉంది. దీనిని దాదాపు పాతికేళ్ల క్రితం రూ.4.70 కోట్లు వెచ్చించి నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఇసుక మేటలు వేసి పూడుకుపోవడంతో బోట్లు సముద్రంలోకి వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో చాలా ఏళ్లుగా ఈ హార్బర్ మత్స్యకారులకు అక్కరకు రావడం లేదు. కొన్నేళ్లపాటు పోటు సమయంలో మాత్రమే అతికష్టం మీద వేటకెళ్లేవారు. ఆ తర్వాత అదీ వీలు పడలేదు. విధిలేని పరిస్థితుల్లో జిల్లా మత్స్యకారులు ఇతర జిల్లాల్లో ఉన్నహార్బర్లకు వెళ్లి అక్కడ నుంచి చేపలవేట సాగిస్తున్నారు. మత్స్యకారులు ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వాలు గిలకలదిండి హార్బర్ సమస్యను తేలిగ్గా తీసుకున్నాయి. ఈ హార్బర్ విస్తరణకు తూతూమంత్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడానికే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో.. ఇలా ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న ఈ హార్బర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హార్బర్ పునర్ నిర్మాణంపై డీపీఆర్ తయారు చేసే బాధ్యతను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వాప్కోస్)కు అప్పగించింది. ఈ సంస్థ నివేదికను రూపొందించి హార్బర్ పునర్ నిర్మాణానికి రూ.280 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. ఆధునిక సదుపాయాలు.. ఈ ప్రతిపాదనలు అమలైతే హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటవుతాయి. వీటిలో చేపల అమ్మకం షెడ్లు, లోడింగ్ సదుపాయాలు, పరిపాలనా భవనం, కమర్షియల్ కాంప్లెక్స్, రెస్టారెంట్, మత్స్యకారుల విశ్రాంతి భవనం, వర్తకులకు డార్మిటరీ, మరుగుదొడ్లు, సామాజిక భవనం, కోస్టల్ పోలీస్ స్టేషన్, రేడియో కమ్యూనికేషన్ టవర్, అంతర్గత రోడ్లు, పార్కింగ్ బోటు బిల్డింగ్, రిపేరు, టింబర్ యార్డులు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్, రక్షిత మంచినీటి ట్యాంకు, ఐస్ ప్లాంట్లు, ఇంధన స్టోరేజి సదుపాయాలు వంటివి ఉంటాయి. హార్బర్లో రోజుకు 1.75 లక్షల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయనున్నారు. ఇసుక సమస్యకు పరిష్కారం ఇలా.. హార్బరు పరిసరాల్లో ఇసుక పెద్ద ఎత్తున పేరుకుపోతుండడం బోట్ల రాకపోకలకు వీలుపడడం లేదు. అందువల్ల హార్బర్ బేసిన్లో 3.5 మీటర్ల లోతు వరకు ఇసుకను డ్రెడ్జింగ్ చేస్తారు. పడవలు సముద్రంలోకి వెళ్లడానికి, ఇసుక మేటలు నివారించడానికి 1150 మీటర్ల దూరం ఒకటి, 1240 మీటర్ల మేర మరొకటి చొప్పున ట్రైనింగ్ వాల్స్ (గోడలు) నిర్మిస్తారు. ప్రస్తుతం 200 మీటర్ల గోడ మాత్రమే ఉంది. అలాగే బోట్లు, క్రాఫ్ట్‌లు, వెస్సల్స్ ల్యాండింగ్‌కు వీలుగా 798 మీటర్ల మేర గట్టు (క్వే) నిర్మాణం కూడా చేపడతారు. 10 ఎకరాల స్థలం అవసరం.. హార్బర్ విస్తరణకు అవసరమైన పర్యావరణ, ఎస్ఈజెడ్ అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. ప్రస్తుతం ఉన్న గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నుంచి 350 బోట్ల రాకపోకలకు వీలుగా నిర్మించారు. విస్తరణ అనంతరం హార్బర్ అందుబాటులోకి వస్తే 1,600 బోట్లు రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది. హార్బర్ విస్తరణకు 10 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇది మచిలీపట్నం పోర్టు ఆధీనంలో ఉంది. ఈ స్థలాన్ని హార్బర్‌కు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయితే త్వరలోనే టెండర్లు పిలుస్తారని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. విస్తరణ పూర్తయితే ఈ హార్బర్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
విశాఖ ఫిషింగ్ హార్భర్‌లో అగ్ని ప్రమాదం
-
తీరంలో ఫిషింగ్ హార్బర్?
కె.మత్స్యలేశంలో పోర్టు భూముల పరిశీలన కె.మత్స్యలేశం (గార) : జిల్లాలోని సముద్ర తీరాన ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ తీరాన ఎప్పటి నుంచో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వంలో ఉండటం, జిల్లాలోనే అత్యధికంగా వేట సాగే ప్రాంతం కావడంతో స్థల పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. కె.మత్స్యలేశం(పోర్టు కళింగపట్నం) తీరంలో పీపీపీ ప్రాజెక్టు పద్ధతిలో నిర్మించనున్న టెక్‌మహింద్రా రిసార్టు పక్కనే పోర్టు భూములతో పాటు బందరువానిపేట వద్ద భూమిని పరిశీలించారు. సర్వే నంబరు 221లో పోర్టు భూమి 116 ఎకరాల్లో నిర్మించే పరిస్థితి ఉంది. స్థానిక సర్పంచ్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు రిసార్టుకు ఇబ్బంది లేకుండా చూడాలని, కె.మత్స్యలేశం, బందరువానిపేట మధ్యలోని బ్రిడ్జి వద్ద నుంచి హార్బర్ నిర్మాణం జరిగితే బాగుంటుందని కమిషనర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించారు. భూముల వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు రోడ్డు కనెక్టవిటీ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బందరువానిపేట మత్స్యకారులతో వేట పరిస్థితులు, ఇటీవల అందించిన బోట్లను ఆయన పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీలు మాదిరిగా 75 శాతం రారుుతీ ఇవ్వాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ డీడీ డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఇన్చార్జి తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఎఫ్‌డీవో దివాకరరావు, ఏడీఏ నిర్మలకుమారి, ఆర్ఐ డి. రామకృష్ణ, ఇన్స్పెక్టర్ గంగాధరరావు పాల్గొన్నారు. -
కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముత్తుకూరు: సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు అధికంగా ఉన్న కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. ముత్తుకూరులోని పాతదళితవాడను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఆదివారం కాకాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయ కారణాల వల్ల ఫిషింగ్‌హార్భర్ జువ్వలదిన్నెకు తరలిపోయినప్పటికీ కృష్ణపట్నంలో మాత్రం ఒక ఫిషింగ్ హార్భర్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల వల్ల ముత్తుకూరు అభివృద్ధి చెందినట్టు చాలా మంది అంటున్నారని, కానీ ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే అభివృద్ధికి సార్థకత ఏర్పడుతుందన్నారు. అందుకు యువకుల్లో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత కూడా పరిశ్రమల యజమానులదేనన్నారు. పేదల ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు కేటాయిస్తే సరిపోదన్నారు. కనీసం రూ.15 వేలు ఇస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యేల కోటా కింద రూ.50 లక్షలు ఇవ్వడం మానేశారన్నారు. పాతదళితవాడలో మురుగుకాలువలు, పక్కాగృహాలు, వీధిలైట్లు, నివేశన స్థలాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. మొక్కలు పెంచితే బహుమతులు వైఎస్సార్సీపీ దత్తత తీసుకొన్న పాతదళితవాడలో మొక్కలు సక్రమంగా పెంపకం చేసే వారికి ఏటా రూ.5, రూ.3, రూ.2 వేలు చొప్పున మూడేళ్లపాటు బహుమతులు అందజేస్తామని స్థానిక నేత కాకుటూరు లక్ష్మణరెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మొక్కలు నాటారు. వివిధ సమస్యలపై స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్‌శర్మ, సుగుణ, సునీత, నాయకులు ఈదూరు శ్రీనివాసులురెడ్డి, తంబిప్రసాద్, బైనారామయ్య పాల్గొన్నారు.