Fact Check: రొయ్య రాతల గొయ్యిలో రామోజీ | Fact Check: Ramoji Rao Eenadu Fake News On AP Fishing Harbors | Sakshi
Sakshi News home page

Fact Check: రొయ్య రాతల గొయ్యిలో రామోజీ

Published Sun, Mar 17 2024 5:38 AM | Last Updated on Sun, Mar 17 2024 10:01 AM

Fact Check: Ramoji Rao Eenadu Fake News On AP Fishing Harbors - Sakshi

రొయ్య ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ నెం.1

ఐదేళ్లలో 6.94లక్షల టన్నులు పెరిగిన రొయ్యల ఉత్పత్తి

ఏటా రూ.20 వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి

57 నెలల్లో రూ.3306 కోట్ల విద్యుత్తు సబ్సిడీ చెల్లింపు

బాబు ఎగ్గొట్టిన రూ.340 కోట్లు చెల్లించిన ప్రభుత్వం

వరుసగా రెండేళ్ల పాటు బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌గా నిలిచిన ఏపీ

అయినా ఈనాడు ఏడుపుగొట్టు రాతలు

సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా గత 57 నెలలుగా  రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది.  ప్రతీ కౌంట్‌కు ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేయడమే కాదు.,. పెంచిన ఫీడ్‌ ధరలను 3 సార్లు ఉపసంహరించుకునేలా ఈ ప్రభుత్వం చేసింది. ఆక్వాజోన్‌ పరిధిలో పదెకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్తును అందిస్తోంది. ఫలితంగా  ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులూ భారీగా పెరిగాయి.

రొయ్యల ఉత్పత్తి బాబు ఐదేళ్ల పాలనలో 1.74 లక్షల టన్నులకు మాత్రమే పెరిగితే.. సీఎం జగన్‌ ప్రభుత్వంలో గత  ఐదేళ్లలోనే ఏకంగా 6.94 లక్షల టన్నులకు పెరిగింది. బాబు హయాంలో జాతీయ స్థాయిలో రొయ్యల ఉత్పత్తి  67 శాతం ఉండగా, ప్రస్తుతం 77.55 శాతానికి పెరిగింది. ఇవేమీ రాజగురువు రామోజీకి మాత్రం కన్పించడం లేదు. ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నప్పటికీ, అదే పనిగా విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా ‘రొయ్య ఎగరలేదు..రైతు ఎదగలేదు’ 
అంటూ అబద్ధాలను అచ్చేశారు..  వాస్తవాలు ఏమిటంటే..

ఆరోపణ : పెరగని  రొయ్యల ఉత్పత్తి
వాస్తవం..:
రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్‌ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఈ–ఫిష్‌ ద్వారా ఆక్వాసాగును గుర్తిస్తూ, వారికి అందాలి్సన అన్నిసంక్షేమ ఫలాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 2018–19లో 39 లక్షల టన్నులు ఉన్న రొయ్య/మత్స్య ఉత్పత్తులు 2022–23కు వచ్చేసరికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి ఏకంగా 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. ఇలా ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11.09 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది.

ఆరోపణ :  ఎగుమతులు పెరగలేదు
వాస్తవం..:
ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు  చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగాయి. 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు ఎగుమతులు జరిగితే.. 2022–23లో ఏకంగా రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. జీవీఏ చూసుకుంటే రూ.48 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.68 వేల కోట్లకు పెరిగింది.  ఏటా సగటున 5.12 శాతం వృద్ధిరేటు నమోదవుతోంది. గ్రోత్‌ రేట్‌ ఐదేళ్లలో జాతీయ స్థాయిలో 19.37 శాతం ఉంటే, ఏపీలో 25.59 శాతంగా నమోదవుతోంది. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్‌ రెసిడ్యూల్స్‌ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

ఆరోపణ : సిండికేట్‌గా మారి దోపిడీ
వాస్తవం..:
నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరాకు ప్రభుత్వం ఐదేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచి్చన అప్సడా చట్టం ద్వారా. కంపెనీలు, సరఫరాదారులను రైతులకు జవాబుదారీతనంగా నిలిచేలా చేసింది. బాబు హయాంలో ఐదేళ్ల పాటు సాగిన వారి దోపిడీకి  జగన్‌ పాలనలో అడ్డుకట్ట  పడింది. అంతర్జాతీయంగా ముడిపదార్థాల ధరలు 28 శాతం మేర పెరగడం వల్ల ఆ మేరకు రొయ్య మేత ధర 21.36 శాతం (రూ.72 నుంచి రూ.91.50లకు) మేర పెరిగింది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్‌ ధరలను వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860 పడకుండా 
అడ్డుకుంది.

ఆరోపణ : నియంత్రణా ...అదెక్కడ?
వాస్తవం..:
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. ప్రతీ 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరల హెచ్చుతగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతీ రైతుకు, ప్రతీ రొయ్యకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 100 కౌంట్‌ రొయ్యకు రూ.210 ప్రభుత్వం నిర్ణయిస్తే, రూ.245 చొప్పున, 30 కౌంట్‌ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470కు కొనుగోలు చేస్తోంది. ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రతీ ఆక్వా రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది.ఆక్వా కల్చర్‌ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ప్రభుత్వం ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ–2020. ఏపీ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌–2020లను అమలులోకి తీసుకొచి్చంది. ఇవే నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్స్‌ ఏర్పాటుతో ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.  

ఆరోపణ:  రాయితీ విద్యుత్తుకు మంగళం
వాస్తవం..:
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 57 నెలలుగా యూనిట్‌ రూ.1.50 చొప్పున విద్యుత్తు సరఫరా చేసింది. ఆక్వాజోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుచేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఫిష్‌ సర్వే ద్వారా రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఇందులో జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే వారికి సాయంగా 3.34 లక్షల ఎకరాలకు సబ్సిడీ విద్యుత్తు వర్తింప చేస్తున్నారు. మొత్తం 66,993 కనెక్షన్లలో 54,072 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. జోన్‌ పరిధిలో ఉన్న కనెక్షన్లలో  95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,306 కోట్లు ఆక్వా సబ్సిడీ కింద ఈ ప్రభుత్వం ఖర్చుచేసింది.

ఆరోపణ :  ఆక్వా రైతులకు ఆదరణేది?
వాస్తవం..:
స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్‌ ఆంధ్రా బ్రాండింగ్‌తో డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్‌లు, నాలుగు వేల మినీ అవుట్‌లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్‌ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు అన్నీ కలిపి 2,500 యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 732 ఫిషరీస్‌ అసిస్టెంట్స్‌ ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వడమే కాక, పంట సాగు వేళ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌ఫుట్స్‌ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ స్కోచ్‌ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డులు. దక్కాయి.  ఇవేమీ రామోజీకి కన్పించడం లేదు.

రామోజీ వక్రభాష్యాలకు హద్దూపద్దూ లేదు. చంద్రబాబు సాధించలేని ప్రగతిని సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి సాధిస్తే ఓర్వలేనితనం, కడుపుమంట నిలువెల్లా రామోజీకి కంటగింపుగా మారాయి.. ప్రభుత్వం అన్ని వర్గాలకు జగన్‌ ప్రభుత్వం ఏ  మంచి చేసినా, అది మంచే కాదని వక్రీకరణే పనిగా పెట్టుకుని పవిత్రమైన జర్నలిజానికే కళంకం తెస్తున్నారు. ఆక్వారంగంలో జగన్‌ సాధించిన నీలి విప్లవ పురోగమనం జాతీయ స్థాయిలోనే అబ్బురపరిచే ఫలితాలనిస్తుంటే...ఆ అభివృద్ధిని రామోజీ ఓర్వలేక పోతున్నారు.. చేపలు, రొయ్యల ఉత్పత్తులు బాబు హయాంలో 39 లక్షల టన్నులుంటే , అది జగన్‌ పాలనలో 51 లక్షల టన్నులకు పెరగడం ఈనాడుకు కనిపించలేదు. జాతీయ స్థాయిలో చూసినా బాబు పాలన నాటికి ఉన్న రొయ్యల ఉత్పత్తి అయిదింతలు పెరిగినా, అదీ రామోజీకి గొప్పగా అనిపించదు.

ఎగుమతుల్లో ఏటా సగటున 5.12 శాతం వృద్ధి రేటు నమోదవుతున్నా అదీ తనకు నచ్చదు. ఇలా... జగన్‌ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా అన్నీ నూరుశాతం ప్రగతిని సాధించినవే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా  పాలనలో తనదంటూ ముద్ర ఏర్పరుచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును గొప్పగా ప్రొజెక్టు చేయడానికి  రామోజీ పడరాని పాట్లు పడుతున్నారు... వాస్తవాలకు ఈనాడు ఎంత మసిబూసి మారేడు కాయ చేయాలనుకన్నా , నిజాలను దాచేసి అబద్ధాలను అచ్చేయాలనుకున్నంత మాత్రాన సత్యాలు అసత్యాలుగా మారిపోవుకదా...ఆక్వా రంగంలో జగన్‌ ప్రభుత్వ విజయాలు, చంద్రబాబు వైఫల్యాలు ఇవిగో...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement