భయంతో వణికిపోతూ రామోజీ నిస్సిగ్గు రాతలు
జగన్ ప్రభుత్వంలో 29.51 లక్షల కొత్త పింఛన్లు
బాబు హయాంలో ప్రతి నెలా నరకమే
నేడు వలంటీర్లతో నేరుగా ఇంటి వద్దే అందజేత
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్‌కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!!
పింఛనుదారుల సంఖ్య పెరిగింది
జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో.
ఇంటికో పింఛను విధానం బాబుదే
కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్‌సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు.
కోతల్లేవు
పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు.
పింఛను విధానంలో మరెన్నో మార్పులు
► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది.
► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో అందజేస్తున్నారు.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు.
► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం.
► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు.
► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment