మద్యంపై పైత్యపు రాతలు
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు.
మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు..
మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్‌ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు.
దాచేస్తే దాగని సత్యాలు
చంద్రబాబు హయాంలో
► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది.
► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు.
► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు.
► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు.
► ఏటా బార్ల సంఖ్య పెంపు.
► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ.
► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది.
జగన్ హయాంలో
► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు.
► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు.
► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం.
► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు.
► 4,380 పరి్మట్ రూమ్‌లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే.
► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు.
► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం.
► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష.
► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)ఏర్పాటు.
► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment