excise tax
-
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్‌లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు
ముంబై: కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌సేత్ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల్లో రెండో అతి పెద్ద వాటా కలిగిన కార్పొరేట్ పన్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్–జూలై) 10.4 శాతం తగ్గడం గమనార్హం. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 14 శాతం తగ్గడంపై వస్తున్న ఆందోళలను సేత్ తోసిపుచ్చారు. పన్నుల వసూళ్లను దీర్ఘకాలానికి చూడాలని సూచించారు. ‘‘కేవలం కొన్ని నెలల డేటా చూసి, దీర్ఘకాల ధోరణిని అంచనా వేయకూడదు. కనీసం మరో త్రైమాసికం వేచి చూసిన తర్వాత దీర్ఘకాలంపై అంచనాకు రావాలి. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగానే పన్ను వసూళ్లు ఉంటాయన్నది నా ఉద్దేశ్యం’’అని వివరించారు. ఎస్ఎంఈ రుణాలపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా సేత్ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఏప్రిల్–జూలై కాలానికి స్థూల పన్నుల ఆదాయం రూ.8.94 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.8 శాతం అధికం. 2023–24 సంవత్సరానికి రూ.33.61 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొనడం గమనార్హం. -
పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని ఆమె సూచనప్రాయంగా పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని అన్నారు. ఇంధనం కొనుగోళ్లు–వ్యయాల మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో ప్రభుత్వంపై రూ. 70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని, ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆయిల్ బాండ్ల భారాన్ని భరిం చాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం’’ అని ఆమె ఈ సందర్భంగా వివరించారు. రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. పెట్రోల్‌పై ప్రస్తు తం లీటర్‌కు రూ.32.90 ఎక్సైజ్ సుంకం భారం పడుతుండగా, డీజిల్‌పై ఇది రూ.31.80గా ఉంది. పెట్రోలియం ప్రొడక్టులు... పెట్రోలియం ప్రొడక్టులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోనికి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. జీఎస్టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే, ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ ఒకే పన్నుగా మారతాయి. ద్వంద్వ పన్నుల విధానానికి (ఎక్సైజ్ సుంకంపై వ్యాట్ విధింపు) ఇది ముగింపు పలుకుతుంది. రెట్రో ట్యాక్స్‌పై త్వరలో నిబంధనలు రెట్రో పన్ను రద్దు నేపథ్యంలో పరిస్థితుల నిర్వహణకు త్వరలో నియమ నిబంధనలు తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. రెట్రో పన్న రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. రెట్రో ట్యాక్స్ కేసుల ఉపసంహరణ, రిఫండ్, వివాద పరిష్కారంపై తన శాఖ అధికారులు కెయిర్న్, వొడాఫోన్లతో చర్చిస్తున్నట్లు కూడా ఆర్థికమంత్రి తెలిపారు. రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను ఈ నెలారంభంలో రద్దు చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 2–6 శ్రేణిలో అదుపులోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్థికమంత్రి వ్యక్తం చేశారు. ఆదాయాలు పెరుగుతాయ్: రానున్న నెలల్లో ప్రభుత్వ ఆదాయాలు భారీగా పెరుగుతాయన్న భరోసాను ఆర్థికమంత్రి ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నులు గత కొన్ని నెలలుగా పెరిగాయని అన్నారు. ఐటీ పోర్టల్ సమస్యలు త్వరలో పరిష్కారం ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ల దాఖలు విషయంలో ఈ ఫైలింగ్ పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు కొద్ది వారాల్లో పరిష్కారం అవుతాయని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంలో తాను పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌తో నిరంతరం చర్చిస్తున్నట్లు వివరించారు. ఇన్ఫోసిస్ హెడ్ నందన్ నీలేకని కూడా ఈ మేరకు హామీ ఇస్తూ తనకు నిరంతరం సందేశాలను పంపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆదాయపు పన్ను 2 ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి సంబంధించి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రాజెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వొడాఫోన్‌పై ‘చర్చలు’ వొడాఫోన్ ఐడియా కుప్పకూలకుండా ప్రభుత్వం ఒక మార్గాన్ని అన్వేషిస్తుందన్న వార్తల నేపథ్యంలో సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా మంది అధికారులు ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు’’అని చెప్పారు. అయితే ఏ విషయం తన వద్దకు రాలేదని ఆమె స్పష్టం చేశారు. చర్చలు జరుపుతున్నది ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి సాయం లభించకపోతే వొడాఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పెట్రోలు,డీజిల్‌పై పన్నువసూళ్ల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నింగిని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల సంక్షోభం కారణంగా విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు. గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్డౌన్, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్ సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే. -
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి ఎంత లాభమంటే..
న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలేం ఖర్మ ఏకంగా గ్రహాలన్నింటిని చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తాజాగా సోమవారం 16వ సారి ఇంధన ధరలు పెరిగాయి. కేంద్రానికి అధిక ఆదాయం తెచ్చే వనరుల్లో ఇంధనానిది ప్రముఖ స్థానం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఇంధనం మీద వసూలు చేసే ఎక్సైజ్, సెస్, సర్‌చార్జీల ద్వారా కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలిపింది. మే 6, 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం లీటర్ పెట్రోల్ మీద 33 రూపాయలు, లీడర్ డీజిల్ మీద 32 రూపాయలు లాభపడినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఎక్సైజ్ సుంకం, సర్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2020 వరకు కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 19.98 రూపాయలు, డీజిల్‌పై 15.83 రూపాయలు ఆర్జించగా.. మార్చి 14 నుంచి మే 5 వరకు ఈ మొత్తం రూ.22.98, 21.19కు పెరగగా.. మే 6 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 32.98, లీటర్ డీజిల్(బ్రాండెడ్) మీద 34.19 రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఇంధన రేట్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు దేశంలో ఇంధన ధరలు.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల మాదిరిగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. "సాధారణంగా, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర దేశాల కంటే ఎక్కువ, తక్కువగా ఉంటాయి. ఇందుకు వివిధ కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పన్ను పాలన, సంబంధిత సబ్సిడీ పరిహారాలు వంటివి ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. వీటి వివరాలను ప్రభుత్వం నిర్వహించదు” అని తెలిపారు. ఇంధన ధరలను నియంత్రించాలంటే.. దీనిని కూడా జీఎస్టీ పరిధిలో చేర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనం అత్యధిక ఆదాయం తెచ్చే వనరుగా ఉంది. కనుక దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావంటున్నారు. ఇంధాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే అంశంపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 “వస్తువులు,సేవల పన్ను”ను వివరిస్తుంది. అంటే వస్తువులు, సేవల సరఫరాపై పన్ను లేదా రెండింటి సరఫరాపై పన్ను విధించాలి. ఇక పెట్రోలియం వంటి ఉత్పత్తుల సరఫరా జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అన్నారు. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ దీని గురించి ప్రతిపాదనలు చేస్తే.. అప్పుడు కేంద్రం ఇంధానాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది అన్నారు. చదవండి: అధిక పెట్రో ధరలు భారమే అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
పెట్రోల్, డీజిల్‌పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
బీరు బుస్సు.. పన్ను తుస్సు!
సాక్షి, హైదరాబాద్ : ముద్దుగా డ్రాట్ బీర్.. లేదా మైక్రో బ్రూవరీ.. ఇలా పేరేదైనా సొంతంగా బీర్లు తయారు చేసుకొని అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న మాల్స్.. పన్నుకు మాత్రం ఎగనామం పెడుతున్నాయి. బీర్లు తయారు చేసి అక్కడే అమ్ముకుంటున్న ఈ మాల్స్.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 70 శాతం వ్యాట్‌ను తమ జేబుల్లోకి వేసుకుంటున్నాయి. డ్రాట్ బీర్లు తయారు చేసి అమ్ముకునే మాల్స్, పబ్‌ల సంఖ్య తక్కువే అయినా జరిగే వ్యాపారం కోట్లలో ఉండడంతో ఏటా రూ.30 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఈ మాల్స్, పబ్‌లకు రాష్ట్రంలోని ఓ మంత్రి అండదండలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా పన్నుల శాఖ అధికారులు వెనుకాడుతుండటం గమనార్హం. నెలకు 20 లక్షల పైనే.. ఎక్సైజ్ శాఖ 2015లో డ్రాట్‌బీర్లకు రాష్ట్రంలో అనుమతి ఇచ్చింది. మాల్స్ లేదా పబ్‌లలో సొంత తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కొన్ని ముడి సరుకుల ద్వారా అక్కడికక్కడే బీర్లను తయారు చేసుకుని అమ్ముకునేందుకు మైక్రో బ్రూవరీల పేరుతో వీటికి అనుమతించింది. మగ్లు, లీటర్లలో ఉండే ఈ బీర్లకు యువతలో క్రేజ్ ఎక్కువగా కనిపించడంతో 2016, 17 సంవత్సరాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 వరకు మాల్స్ ఏర్పడ్డాయి. వీటిలో వారాంతాలు, ఇతర సెలవు దినాల్లో డ్రాట్ బీర్లకు ఫుల్లు గిరాకీ ఉంటుంది. కిక్ కొంచెం తక్కువగా ఉండే ఈ బీర్ల వైపు యువత మొగ్గు చూపింది. ఏడాది తర్వాత కాస్త క్రేజ్ తగ్గడంతో కొన్ని మాల్స్ మూతపడ్డాయని అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద దాదాపు 20 వరకు మెక్రో బ్రూవరీలు జీహెచ్ఎంసీ పరిధిలో నడుస్తున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో మాల్లో నెలకు కనీసం రూ.20 లక్షల వరకు డ్రాట్ బీర్ల వ్యాపారం జరుగుతోంది. అండదండలెవరివి? మొదటి అమ్మకందారు (ఫస్ట్ సెల్లర్)గా ఈ మాల్స్ యాజమాన్యాలు తమ వ్యాపారంలో 70 శాతాన్ని వ్యాట్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ గత రెండేళ్లుగా ఈ మాల్స్ నుంచి రూపాయి కూడా పన్ను రావడం లేదని సమాచారం. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. నెలకు రూ.14 లక్షల చొప్పున కనీసం 15–20 మాల్స్‌లో రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాలి. అంటే ఏడాదికి రూ.30 కోట్లపైనే! ఇంత మొత్తాన్ని ఇష్టారాజ్యంగా మైక్రో బ్రూవరీలు ఎగ్గొడుతున్నా పన్నుల శాఖ అధికారులు కనీసం నోటీసులివ్వడం లేదు. మాల్స్‌లో పన్ను ఎగవేతను ఓ సర్కిల్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, వాటికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే కారణంతోనే నోటీసులు ఇవ్వడం లేదన్న చర్చ ఇప్పుడు పన్నుల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
‘పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను తగ్గించండి’
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో వాటిపై ఎక్సైజ్ పన్నును తగ్గించాల్సిందిగా ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరింది. లీటర్ పెట్రోల్ ధర మంగళవారం ఢిల్లీలో రూ.72.38గా ఉంది. ముంబైలో ఇటీవల రూ.80 దాటిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత ధర ఎప్పుడూ లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్లోనే ఎక్సైజ్ పన్నును తగ్గించాలంటూ పెట్రోలియం శాఖ ఆర్థిక శాఖను కోరింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వమే రూ.19.48 ఎక్సైజ్ పన్నును వసూలు చేస్తోంది. -
పట్టిసీమ.. ఆద్యంతం దోపిడీ పర్వం
కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దల కుమ్మక్కును కడిగిపారేసిన కాగ్ - అప్పనంగా రూ.199 కోట్లు బోనస్ ఇచ్చారని ఆక్షేపణ సాక్షి, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ప్రభుత్వం సాగించిన దోపిడీ పర్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఏకిపారేసింది. ముందస్తు ప్రణాళిక లేకుండా, పోలవరం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టకుండా.. గృహ, పారిశ్రామిక లబ్ధిదారులను గుర్తించకుండా పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టడాన్ని తప్పుబట్టింది. రూ.372.02 కోట్లు కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చిందని ఎత్తి చూపింది. ఇంత చేసినా పోలవరం ముందస్తు ఫలాలు నిర్దేశించిన వారికి అందించలేకపోయిందని పేర్కొంది. 2015 – 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్.. శాసనసభకు సమర్పించిన నివేదికలో ‘పట్టిసీమ’ బాగోతాన్ని స్పష్టంగా వివరించింది. టెండర్ల నిబంధనలు సడలించి అక్రమాలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువ టెండర్లలో పేర్కొన్న ప్రకారం రూ.1,170.25 కోట్లు. జీవో 94 ప్రకారం ఐదు శాతానికి మంచి అదనపు ధరకు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించకూడదు. కానీ, 21.999 శాతం అదనపు ధరతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మేఘా) సంస్థ షెడ్యూలు దాఖలు చేసింది. ఐదు శాతం అదనపు ధరకు.. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్ ఇచ్చేలా నిబంధనలు సడలించి మేఘాకే పనులు అప్పగించిందని, దీని వల్ల అంచనా వ్యయం పెరిగిందని కాగ్ తేల్చింది. కానీ.. ఒప్పంద కాలంలోనే భూసేకరణ పూర్తి చేయడంతో పాటు డిజైన్లను సత్వరమే ఆమోదించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జల వనరుల శాఖ పట్టిసీమ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసింది. దీని వల్ల పనులు ఏడాదిలోగా పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గడువులోగా పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు రూ.199 కోట్లను బోనస్ రూపంలో ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. అవసరం లేకున్నా డయాఫ్రమ్ వాల్ పట్టిసీమ ఎత్తిపోతలకు సంప్రదాయ పద్ధతుల్లో రూ.147 కోట్లతో పంప్ హౌస్ నిర్మించాలని అంచనాల్లో సర్కార్ పేర్కొంది. కానీ.. డయా ఫ్రమ్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో పంప్ హౌస్ నిర్మాణానికి అనుమతించడం వల్ల అంచనా వ్యయం రూ.253.17 కోట్లకు పెరిగింది. పంప్ హౌస్ నిర్మాణంలో బేసిక్ పెరామీటర్లలో మార్పేమీ లేకున్నా కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.106.17 కోట్లను అనుచితంగా లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని జలవనరుల శాఖను ప్రశ్నించగా, తప్పును అంగీకరించిందని పేర్కొంది. కానీ.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్‌కు అదనంగా చెల్లించామని జల వనరుల శాఖ వివరణ ఇచ్చిందని, ఈ వివరణ కూడా ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది. పన్ను మినహాయించినా దోచిపెట్టారు.. సాగు, తాగునీటి పథకాలకు వినియోగించే పైపులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును పూర్తిగా మినహాయించింది. కానీ.. పట్టిసీమ ఎత్తిపోతల కాంట్రాక్టర్‌కు పైపులపై రూ.32.01 కోట్లను ఎక్సైజ్ పన్నుల రూపంలో సర్కారు చెల్లించడాన్ని కాగ్ తప్పుబట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయంలోనే ఒక శాతం కార్మిక సంక్షేమ పన్నును చేర్చారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి రూ.14.22 కోట్లను జల వనరుల శాఖ వసూలు చేయాలి. కానీ.. కార్మిక సంక్షేమ పన్ను రూపంలో కాంట్రాక్టర్‌కు రూ.14.22 కోట్లను అక్రమంగా తిరిగి చెల్లించి.. అనుచిత లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది. మొత్తంగా కాంట్రాక్టర్‌కు రూ.372.02 కోట్ల మేర అనుచితంగా లబ్ధి చేకూర్చిందని కాగ్ స్పష్టం చేసింది. ముందస్తు ఫలాలు దక్కిందెక్కడ? పట్టిసీమ ఎత్తిపోతలను 2016 మార్చి నాటికి పూర్తి చేసినా పోలవరం కుడి కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయలేదు. దీని వల్ల 24 పంపులతో నీటిని తరలించాల్సి ఉండగా.. కేవలం 11 పంపుల ద్వారానే నీటిని ఎత్తిపోయగలిగారని కాగ్ ఎత్తి చూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులు చేయకపోవడం వల్ల పోలవరం కుడి కాలువ కింద 1.2 లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోయారని స్పష్టం చేసింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం 20 ఏళ్ల(లైఫ్ టైమ్)పాటు పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటూనే.. మరోవైపు 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. ఇది పూర్తయితే పట్టిసీమ ఉపయోగించమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ పథకం పనిచేసేది కేవలం మూడేళ్లేనని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఇది అనవసరమని కాగ్ స్పష్టం చేసింది. -
బ్లూస్టార్ శ్రీసిటీ ప్లాంటు ఏడాదిలో సిద్ధం
⇒ జమ్ము ప్లాంటు మరింత ఆలస్యం ⇒ రెండు చోట్లా స్థల సేకరణ పూర్తి ⇒ ప్లాంట్లకు రూ.370 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేషన్ రంగ సంస్థ బ్లూ స్టార్ ప్రతిపాదిత జమ్ము ప్లాంటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై నుంచి జీఎస్టీ అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ పన్ను మినహాయింపు విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. జమ్మూ, కశ్మీర్లో ఏర్పాటయ్యే తయారీ ప్లాంట్లకు జీఎస్టీ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పరిహారాన్ని భరించేది కేంద్రమా, రాష్ట్ర ప్రభుత్వమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటం, మరోవైపు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో కంపెనీ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో మొదట ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ సెజ్‌లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన బోర్డు ముందుకు వచ్చింది. స్థల సేకరణ పూర్తి... జమ్ముతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీసిటీలో స్థలాన్ని సైతం బ్లూ స్టార్ సమీకరించింది. తొలుత జమ్మూ ప్లాంటు రెడీ అవుతుందని కంపెనీ ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం తొలుత చేపట్టాలని భావిస్తున్నా... మార్చిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. కంపెనీకి ఉన్న అయిదు ప్లాంట్లు పశ్చిమ, ఉత్తర భారత్‌కే పరిమితమయ్యాయి. సెన్ వ్యాట్, ఎక్సైజ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. దక్షిణాదికి ఉత్పత్తుల రవాణాకు ఏటా రూ.150 కోట్లపైనే వ్యయం అవుతోంది. శ్రీసిటీ ప్లాంటుతో 65 శాతం దాకా రవాణా వ్యయాలు ఆదా అవుతాయి. 2018 జనవరి నాటికి.. కంపెనీ శ్రీసిటీవైపు మొగ్గు చూపితే 2018 జనవరికల్లా ప్లాంటు సిద్ధం అవుతుందని బ్లూ స్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఎయిర్ కండీషనర్లతోపాటు, వాటర్ కూలర్స్, డీప్ ఫ్రీజర్లను సైతం ఈ ప్లాంట్లలో తయారు చేస్తామన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.185 కోట్ల దాకా పెట్టుబడి పెడతామని పేర్కొన్నారు. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10–12 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం రూమ్ ఏసీల విభాగంలో కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2016లో సంస్థ 4.5 లక్షల యూనిట్లను విక్రయించింది. 2017లో మార్కెట్ కంటే అధిక వృద్ధి ఆశిస్తోంది. -
ప్రజలకు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'..
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెంచిన వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.ఎన్. తులసిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2019 ఎన్నికల్లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం 'ముక్త భారత్', టీడీపీ ప్రభుత్వం 'ముక్త ఆంధ్రా'గా మారక తప్పదని, ప్రజలు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'లను చవిచూస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇందిరాభవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యానాయక్ తో కలిసి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు వారాల్లో నాలుగు సార్లు పెంచడం దారుణమన్నారు. మన దేశ అవసరాలలో దాదాపు 75 శాతం వరకు పెట్రోలు, డీజిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లుగా ఉన్నప్పుడు దేశంలో పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండేదన్నారు. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 49.29 డాలర్లు ఉంది. ఆ ప్రకారం ఇక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.22, డీజిల్ ధర రూ.18 గా ఉండాలని కానీ, మోదీ, చంద్రబాబుల జోడీ పాలనలో పెట్రోలు ధర రూ.70, డీజిల్ ధర రూ.60లుగా ఉండటం విడ్డూరమన్నారు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీలుగా వ్యవహరించడమేనని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఆరుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చి 1 నుంచి నాలుగు రూపాయల వ్యాట్ అదనంగా విధించి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. దీని ద్వారా గత రెండేళ్లలో మోదీ, బాబు ప్రభుత్వాలు దాదాపు రూ.3 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. మోదీ, బాబు ప్రభుత్వాలు అదనంగా విధించిన ఎక్సైజ్ సుంకాన్ని, వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. -
భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
ఏప్రిల్‌లో 66 శాతం డౌన్ న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా 66.33 శాతం తగ్గాయి. 19.6 టన్నులుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో ఈ దిగుమతుల విలువ 60 టన్నులు. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపును నిరసిస్తూ... ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్లో సుంకం విధింపు ప్రతిపాదనను నిరసిస్తూ... ఈ రంగం మార్చి 2న చేపట్టిన సమ్మె 42 రోజులు సాగింది. అయితే ‘ఎక్సైజ్ అధికారుల నుంచి ఎటువంటి వేధింపులూ ఉండబోవని’ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఆభరణ వర్తక సంఘాలు తమ సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశాయి. 2014-15లో భారత్ పసిడి దిగుమతులు 971 టన్నులు. అయితే 2015-16 నాటికి ఈ పరిమాణం 750 టన్నులకు తగ్గింది. మందగమన పరిస్థితుల వల్ల అమెరికా, యూరప్ వంటి సాంప్రదాయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిన ప్రభావం... పసిడి దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. -
జ్యువెలరీ వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధింపు సబబే: జైట్లీ
కోల్‌కతా: నాన్-సిల్వర్ జ్యువెలరీ వస్తువులపై 1% ఎక్సైజ్ సుంకం విధింపు నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకున్నారు. సిమెంట్, వస్త్ర పరిశ్రమ సహా తదితర రంగాలు తయారీ పన్నును చెల్లిస్తున్నప్పుడు.. లగ్జరీ వస్తువులను పన్ను పరిధి నుంచి ఎందుకు తప్పించాలన్నారు. జీఎస్టీ పరిధిలోకి బంగారు ఆభరణాలను తీసుకురాకపోతే దేశంలోని ఇతర వస్తువులపై పన్నులు పెరిగే అవకాశముందని తెలిపారు. 12న అమెరికాకు... అరుణ్ జైట్లీ పది రోజుల యూఎస్ పర్యటన ఖరారైంది. ఈ నెల 12 న అమెరికా బయల్దేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్, న్యూయార్క్‌లలో జరిగే పలు సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటనలో తొలుత అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)-ప్రపంచ బ్యాంకు సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారు. ఇదే సందర్భంగా యూఎస్ పరిపాలన ఉన్నతాధికారులతో భేటీ అవుతారని ఆర్థిక శాఖ వెల్లడించింది. సమావేశాలకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ హాజరుకానున్నారు. -
31 లోపు ఎక్సైజ్ సుంకం, సేవాపన్ను చెల్లించాలి
విజయవాడ బ్యూరో: కేంద్ర ఎక్సైజ్, సర్వీసు ట్యాక్సుల పరిధిలో ఉన్న సంస్థలు, తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సిన 2015-16 ఆర్థిక సంవత్సరపు ఎక్సైజ్ సుంకాలు, సేవాల పన్నులను ఈ నెల 31లోగా చెల్లించాలని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి. నాగేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) ముందస్తు సేవా పన్నులు చెల్లించువారు కూడా ఈ నెల 31లోగానే జమ చేసి సహకరించాలన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పన్నులు చెల్లించని వారి నుంచి వడ్డీలు, అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఈ-పేమెంటు పద్ధతిలో చెల్లించే వారికి కూడా 31నే ఆఖరు తేదీగా పేర్కొన్నారు. శాఖకు సంబంధించిన పాత బకాయిలు, వడ్డీలు, కేసులకు సంబంధించిన పెనాల్టీలను కూడా నెలాఖరులోగా చెల్లించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం గుంటూరు ఫోన్ 0863-2321554, విజయవాడ ఫోన్0866-2573672 లలో సంప్రదించాలని నాగేంద్రరావు కోరారు. -
పుత్తడిపురం వెలవెల
♦ రెండు వారాలుగా బంగారం దుకాణాలు బంద్ ♦ కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ ♦ ఆగిన కోట్ల రూపాయల వ్యాపారం ♦ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందిపై ప్రభావం తక్కువలో తక్కువ అంటే ప్రొద్దుటూరులో రోజూ 10 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. మంచి బంగారం దొరుకుతుందని ఎక్కడెక్కడి నుంచో నగల కొనుగోలుకు కార్లు, బస్సులు, రైళ్లలో జనం వచ్చే వారు. దుకాణాలు మూత పడటంతో బయటి నుంచి వచ్చే వారు లేక హోటళ్లు సైతం వెలవెలబోతున్నాయి. ఆగిన కోట్ల రూపాయల టర్నోవర్ ప్రొద్దుటూరు పట్టణంలో 500కుపైగా బంగార ం విక్రయించే దుకాణాలున్నాయి. 3 నుంచి 5 వేల మంది కార్మికులు బంగారం ఆభరణాలు తయారు చేయడానికి, మరమ్మతులు చేయడానికి ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు తయారు చేసిన బంగారు, వెండి నగలను వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తారు. రాయలసీమ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడి వ్యాపారులపై నమ్మకంతో వచ్చేవారు. కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణంగా అటు వ్యాపారులకు, ఇటు కార్మికులకు లబ్ధి చేకూరేది. దుకాణాలు మూత పడటంతో వీటిలో పని చేసే గుమాస్తాలు, సేల్స్మెన్లు దాదాపు 10 వేల మంది నష్టపోతున్నారు. ఏప్రిల్ నెల దాటితే మరో రెండు నెలల వరకు శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు లేవు. ఇలాంటి కీలక సమయంలో దుకాణాలు మూత పడటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రొద్దుటూరు : కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను నిరసిస్తూ ఆ వ్యాపారం చేసే వర్తకులు సుమారు రెండు వారాలుగా దుకాణాలు మూసి వేయడంతో రెండవ ముంబయిగా పేరు గాంచిన ప్రొద్దుటూరు వెలవెలబోతోం ది. నాణ్యమైన బంగారం విక్రయిస్తారనే పేరుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వచ్చే వారు. దుకాణాలు మూసి వేయడంతో బంగారు, వెండి వస్తువులు అమ్మే దుకాణాల యజమానులతో పాటు వాటిని తయారు చేసే కార్మికులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం గత నెల 29న కొత్తగా బంగారు వ్యాపారంపై ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను అమలు చేస్తూ బడ్జెట్లో ప్రకటించింది. ఈ విధానాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఇప్పటికే పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, వంటా వార్పు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. మన జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోని బంగారం దుకాణాలను మూసివేశారు. అయితే పుత్తడి పురంగా ప్రసిద్ధి గాంచిన ప్రొద్దుటూరుపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. స్వర్ణకారులతోపాటు ఈ దుకాణాల్లో పని చేసే సిబ్బంది కూడా నష్టపోతున్నారు. పూర్వం నుంచి మెయిన్ బజార్లో బంగారం దుకాణాలు ఉండగా.. కాలక్రమంలో అనేక కాంప్లెక్స్‌లు వెలిశాయి. కాంప్లెక్స్‌లలో వ్యాపారులతోపాటు వాటిని తయారు చేసే వారు కూడా దుకాణాలను నిర్వహిస్తున్నారు. మోక్ష గుండం వీధిలో బంగారం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీరిపై ఆధారపడి ఎన్నో టీ, కూల్‌డ్రింక్ షాపులు, టిఫిన్, భోజన హోటళ్లు వారు జీవనం సాగిస్తున్నారు. ఆందోళనలో కార్మికులు బంగారం దుకాణాల బంద్ కారణంగా చిన్న చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, మరో వైపు బాడుగులు చెల్లించే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే అసోసియేషన్ వారు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, టీడీపీ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డిలను కలిసి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని పార్లమెంటులో ఎంపీల ద్వారా చర్చించేలా చూడాలని కోరారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాల బంద్ కొనసాగనుంది. ఆ తర్వాత అసోసియేషన్ నిర్ణయం మేరకు భవ్యష్యత్ కార్యాచరణ ఉంటుంది. అద్దెలు చెల్లించే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా దుకాణాలు బంద్ చేశాం. ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారాలు లేక అద్దెలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. చిన్న స్థాయి స్వర్ణకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. - ఎం.ఫయాజ్, స్వర్ణ కార్మికుడు ఎన్నడూ ఇలాంటి బంద్ జరగలేదు ఇటీవలి కాలంలో ఎన్నడూ ఇన్ని రోజుల పాటు దుకాణాలను మూసివేసిన సందర్భం లేదు. సీజన్లో వ్యాపారాలు కోల్పోతున్నాం. ఇప్పటికే రెడిమేడ్ వస్తువుల కారణంగా వ్యాపారాలు తగ్గిపోయాయి. ఈ పరిణామం ఊహించలేదు.- బి.నాగేంద్రరావు, బీఎన్ఆర్ జ్యువెలర్స్ పన్ను పేరుతో ఇబ్బంది పెడతారు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అమలైతే ఆ పేరుతో అధికారులు తమను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తారు. పూర్వం ఈ విధా నం అమలులో ఉన్నప్పుడు పోరాటం చేసి రద్దు చేయించుకున్నాం. అదే పరిస్థితి మళ్లీ వస్తుందంటే ఎలా అంగీకరించగలం? జిల్లా అంతటా దుకాణాలు మూతపడ్డాయి. - గూడూరు రామమనోహర్‌రావు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-ఆగస్ట్ మధ్యకాలంలో 36.5 శాతం వృద్ధితో రూ.2.63 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ఎక్సైజ్ పన్ను వాటా రూ. 1.02 లక్షల కోట్లుగా, కస్టమ్స్ పన్ను వాటా రూ.85,138 కోట్లుగా, సేవా పన్ను వాటా రూ. 75,006 కోట్లుగా ఉంది. జీడీపీ, పరోక్ష పన్ను గణాంకాలు వంటి అంశాలు దేశ ఆర్థిక పరిస్థితుల మెరుగుదలను సూచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తె లిపారు. పన్ను వసూళ్ల పెరుగుదల జీడీపీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
బడ్జెట్ఎవరికి లాభం ?
ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ఎవరికి లాభం అంటే.. కచ్చితంగా ఉత్పత్తిదారులకే. దీనివల్ల వినియోగదారులకు సమకూరే ప్రయోజనం స్వల్పమే. దీనికితోడు రవాణా చార్జీలు పెరిగాయి. డీజిల్ ధరలు తగ్గనంటున్నాయి. దీనివల్ల బడ్జెట్ ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గినా ట్రాన్స్‌పోర్టు చార్జీలు కలిపితే మరింత ప్రియమయ్యే ప్రమాదం నెలకొంది. కొత్త బడ్జెట్ విధానాన్ని స్పష్టం చేయాలంటే మరికొంత కాలం ఆగాలని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘చల్లదనం’ ఇక వేడెక్కుతుంది కూల్డ్రింక్లంటే పిల్లల నుంచి పెద్దలదాకా ఇష్టపడాల్సిందే. ఎండాకాలంలో అయితే వాటికి యమ డిమాండ్ ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం వాటి ధరలు పెరగనుండటంతో శీతల పానీయాల ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సరాసరిన రూ.10 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎండాకాలంలో అయితే సుమారు 15 లక్షల వరకు, మిగిలిన సమయంలో రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూల్డ్రింక్స్పై ఎక్సైజ్ సుంకం 5 శాతం పెరగనుంది. 200 ఎంఎల్ బాటిల్ ధర 10కు విక్రయించాల్సి ఉన్నా.. మార్కెట్లో రూ. 13వరకు విక్రయిస్తున్నారు. ఇక ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగితే ఈ బాటిల్‌కు మరో రూపాయి పెరుగుతుంది. అంటే వ్యాపారులు కచ్చితంగా రూ. 15కు విక్రయిస్తారు. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే రోజుకు లక్ష రూపాయల దాకా వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇదే జరిగితే వ్యాపారం తగ్గుముఖం పడుతుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరికే పాద‘రక్షలు’ నూతన బడ్జెట్లో పాద రక్షల ధరలు దిగివచ్చేలా చర్యలు తీసుకున్నా.. అది కొంతమందికే ఉపయోగపడనుంది. వీటిపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అయితే ఇక్కడే మెలిక ఉంది. రూ. 500 నుంచి వెయ్యి రూపాయల్లోపు ఉండే పాదరక్షలకే ఈ సుంకం తగ్గింపు వర్తిస్తుంది. జిల్లాలో పరిశీలిస్తే దాదాపు 60 శాతం మార్కెట్ రూ. 500 లోపు కొనుగోలు చేసేవారిదే. ఇక మిగిలిన 40 శాతం మందిలో కూడా దాదాపు 30 శాతం మంది మాత్ర మే బ్రాండెడ్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రముఖ కంపెనీల ఉత్పత్తులన్నీ వెయ్యి రూపాయల పైగానే ఉంటాయి. అంటే సెమీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనేవారే తాజా సవరణల వల్ల లబ్ధిపొందుతారన్నమాట. ఇలాంటివారు జిల్లాలో పదిశాతం మందే ఉన్నట్లు అంచనా. దీనివల్ల పేద , మధ్య తరగతివారికి ఒరిగిందేమీలేదు. ‘పోర్టబుల్’ మేజిక్ పని చేసేనా? పోర్టబుల్ టీవీల సైజు 14 అంగుళాలుంటుంది. అయితే పోర్టబుల్ టీవీల కొనుగోళ్లు జిల్లాలో పదిశాతానికి మించి లేదు. మధ్యతరగతివారు ఎక్కువగా ఫ్లాట్ టీవీలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి, 20 లేదా 21 అంగుళాల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎల్సీడీలు అయితే 23 అంగుళాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. 19 అంగుళాల్లోపు ఉండే కలర్ టీవీలకు మాత్రమే 10 శాతం కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇంత తక్కువ సైజు టీవీల కొనుగోలుకు మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉండరు. దీనివల్ల తక్కువమంది మాత్రమే ప్రయోజనం పొందగలరు. అదే సమయంలో సుంకం నుంచి మినహాయింపు వచ్చింది కాబట్టి 19 అంగుళాల సైజులో ఉండే టీవీలు త్వరలో మార్కెట్లోకి భారీగా వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల ఒక్కో టీవీకి 500 రూపాయల దాకా తగ్గుతుంది. అయితే తక్కువ సైజులో ఉంటే టీవీలను ఎంతమంది ఇష్టపడతారో చూడాలి. కలర్ పిక్చర్ ట్యూబులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చినందువల్ల కలర్ టీవీ ధర కూడా 200 రూపాయల దాకా తగ్గే అవకాశాలున్నాయి. పొగ ఊదితే జేబుకూ చిల్లు.. జిల్లాలో పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారికి కొదువే లేదు. మొత్తం మీద 33.97 లక్షల మంది జనాభా ఉండగా వారిలో ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది దాకా ధూమపానం లేదా పాన్ మసాలా ఉత్పత్తులు తీసుకుంటారు. వీరి ద్వారా రోజుకు 3 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే బడ్జెట్ ప్రకారం పొగాకు ఉత్పత్తుల ధరలు 25 శాతం మేర పెరగనున్నాయి. అంటే జిల్లాలో రోజుకు వ్యాపారం 4 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అయితే ఈ ధరల దెబ్బకు కొంతమేర వినియోగదారుల సంఖ్య తగ్గినా.. అది తాత్కాలికమే అని భావిస్తున్నారు.