36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-ఆగస్ట్ మధ్యకాలంలో 36.5 శాతం వృద్ధితో రూ.2.63 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ఎక్సైజ్ పన్ను వాటా రూ. 1.02 లక్షల కోట్లుగా, కస్టమ్స్ పన్ను వాటా రూ.85,138 కోట్లుగా, సేవా పన్ను వాటా రూ. 75,006 కోట్లుగా ఉంది. జీడీపీ, పరోక్ష పన్ను గణాంకాలు వంటి అంశాలు దేశ ఆర్థిక పరిస్థితుల మెరుగుదలను సూచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తె లిపారు. పన్ను వసూళ్ల పెరుగుదల జీడీపీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.