న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో వాటిపై ఎక్సైజ్ పన్నును తగ్గించాల్సిందిగా ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరింది. లీటర్ పెట్రోల్ ధర మంగళవారం ఢిల్లీలో రూ.72.38గా ఉంది. ముంబైలో ఇటీవల రూ.80 దాటిపోయింది.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత ధర ఎప్పుడూ లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లోనే ఎక్సైజ్ పన్నును తగ్గించాలంటూ పెట్రోలియం శాఖ ఆర్థిక శాఖను కోరింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వమే రూ.19.48 ఎక్సైజ్ పన్నును వసూలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment