31 లోపు ఎక్సైజ్ సుంకం, సేవాపన్ను చెల్లించాలి | Excise tax, service tax to be paid by march 31 | Sakshi
Sakshi News home page

31 లోపు ఎక్సైజ్ సుంకం, సేవాపన్ను చెల్లించాలి

Published Sun, Mar 27 2016 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

Excise tax, service tax to be paid by march 31

విజయవాడ బ్యూరో: కేంద్ర ఎక్సైజ్, సర్వీసు ట్యాక్సుల పరిధిలో ఉన్న సంస్థలు, తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సిన 2015-16 ఆర్థిక సంవత్సరపు ఎక్సైజ్ సుంకాలు, సేవాల పన్నులను ఈ నెల 31లోగా చెల్లించాలని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి. నాగేంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) ముందస్తు సేవా పన్నులు చెల్లించువారు కూడా ఈ నెల 31లోగానే జమ చేసి సహకరించాలన్నారు.

నిర్ణీత వ్యవధిలోగా పన్నులు చెల్లించని వారి నుంచి వడ్డీలు, అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఈ-పేమెంటు పద్ధతిలో చెల్లించే వారికి కూడా 31నే ఆఖరు తేదీగా పేర్కొన్నారు. శాఖకు సంబంధించిన పాత బకాయిలు, వడ్డీలు, కేసులకు సంబంధించిన పెనాల్టీలను కూడా నెలాఖరులోగా చెల్లించాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం గుంటూరు ఫోన్ 0863-2321554, విజయవాడ ఫోన్0866-2573672 లలో సంప్రదించాలని నాగేంద్రరావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement