ports
-
భవిష్యత్తు కోసం బాబు గారి ప్లానింగ్ అన్ని అమ్మేసి అస్సాం కు ఆంధ్రను..!
-
పోర్టుల్లో చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ: ఎగుమతి, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పోర్టుల్లో కొన్ని రకాల చార్జీలు తగ్గించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటెయినర్ వెసెల్స్ (సరుకులు, ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే) కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.వాణిజ్య, పరిశ్రమలు, షిప్పింగ్, పోర్టులు, ఫైనాన్స్, పౌర విమానయాన, రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు, ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో, కస్టమర్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘తాజాగా తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే, ఖాళీ కంటెయినర్ల లభ్యత పెరుగుతుంది. సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. పోర్టుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది’ అన్నారు. చర్యలు ఇవీ.. » కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎస్సీఐ అదనంగా 5 సెకండ్ హ్యాండ్ కంటెయినర్ నౌకలను కొనుగోలు చేస్తుంది. » రైల్వే బోర్డు, కంటెయినర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటెయినర్లను యార్డులో 90 రోజుల పాటు చార్జీల్లేకుండా అందుబాటులో ఉంచుతా యి. 90 రోజుల తర్వాత రూ.3,000గా వసూ లు చేస్తున్న చార్జీని రూ.1,500కు తగ్గించారు. » కంటెయినర్ సామర్థ్యాన్ని 9,000 టీఈయూల మేర పెంచుతున్నట్టు ఎస్సీఐ ప్రకటించింది. » 40 అడుగుల కంటెయినర్‌కు రేట్లను రూ.9,000 నుంచి రూ.2,000కు తగ్గించారు. 20 అడుగుల కంటెయినర్ చార్జీలు రూ.6,000 నుంచి రూ.1,000కు దిగొచ్చాయి. -
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
రామాయపట్నం 'రెడీ'
ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ, దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఒక్కో పోర్టు, ఒక్కో ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.20,000 కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో పాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనుంది. రాష్ట్రంలోని 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా ఏపీ మారిటైమ్ బోర్డు అడుగులు ముందుకు వేస్తోంది. ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో ఐదు నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్‌వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్పోర్టులున్నాయి. ఇవి కాకుండా ఇంకో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేస్తుండగా, కాకినాడ గేట్‌వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. రామాయపట్నంలో బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులు 300 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. త్వరలోనే తొలి నౌక ఆగమనం మొదలు పెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యిందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్న రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022 జూన్‌లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) సామర్థ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) అభివృద్ధి చేయనుండగా, అందులో ఇప్పటికే బల్క్ బెర్త్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్య పరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన మూడు బెర్తులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పోర్టు కోసం భూమిని ఇచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లు వ్యయం చేసింది. ఈ గ్రామంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది. పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం చేసింది. ఇప్పటి వరకు పనులు ఇలా.. ♦ పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా ఇప్పటి వరకు 59 లక్షల టన్నుల రాళ్ల వినియోగం. ♦ భారీ ఓడలను సురక్షితంగాతీరానికి తీసుకు వచ్చేలా 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్లడ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ చానల్ నిర్మాణం. ♦ అప్రోచ్ టెస్టిల్, బల్క్ బెర్త్, కస్టమ్స్ బిల్డింగ్, సెక్యూరిటీ కమ్ రిసెప్షన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి. ♦ శరవేగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు.. పోర్టును జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కు అనుసంధానం చేస్తూ రహదారి పనులు వేగవంతం. ♦ సముద్రంలో చేయాల్సిన పనులు దాదాపు పూర్తి. తీరంలో నిర్మించే భవనాలు, ఇతర నిర్మాణాలు 45 శాతం వరకు పూర్తి. స్వరూపం ఇదీ.. ప్రాజెక్టు వ్యయం : రూ.4,902 కోట్లు తొలి దశలో పోర్టు సామర్థ్యం: 34.04ఎంఎంటీపీఏ పూర్తి స్థాయి సామర్థ్యం: 138.54 ఎంఎంటీపీఏ తొలి దశలో బెర్తులు: 4 (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీ పర్పస్) తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం : 80,000 డీడబ్ల్యూటీ (డెడ్ వెయిట్ టన్నేజ్) పనులు ప్రారంభించినది : 2022 జూన్ 24 కార్యకలాపాలు ప్రారంభం : 2024 జనవరి ప్రారంభించేందుకు చర్యలు సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా హార్బర్ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నం పోర్టులో ఒక బెర్తు పనులు పూర్తి కావడంతో త్వరలో వాణిజ్య పరంగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీమారిటైమ్ బోర్డు, వీసీఎండీ ఏపీఐఐసీ రికార్డు సమయంలో .. నిర్మాణ పనులు ప్రారంభమైన 18 నెలల రికార్డు సమయంలోనే రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బల్క్ బెర్త్ నిర్మాణం, డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ పనులు పూర్తి కావడంతో ఓడలను తీసుకురావడానికి అనుమతి కోసం కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖకు లేఖ రాశాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే రామాయపట్నం పోర్టులో వాణిజ్య కార్యక్రమాలను ప్రారంభింస్తాం. – పి. ప్రతాప్, ఎండీ రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మా ప్రాంతం మారుతోంది.. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వేగంగా సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా కలగా ఉన్న పోర్టు నిర్మాణం మా కళ్ల ముందటే పూర్తవుతుంటే సంతోషంగా ఉంది. పోర్టు నిర్మాణంతో మా ప్రాంతం వేగంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటికే భూముల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. – రాయిని రామకృష్ణ, చేవూరు గ్రామం సొంత ఊళ్లోనే ఉద్యోగం మా ప్రాంతంలో పోర్టు నిర్మాణం వల్ల యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. నేను ఉళ్లోనే ఉండి ప్రస్తుతం రామాయపట్నం పోర్టులో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నా. నాలాంటి వందల మంది యువకులు స్థానికంగానే ఉద్యోగం చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు పోయే ఇబ్బందులు తప్పాయి. అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులో కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు స్థానికంగానే దొరుకుతాయి. – అట్ల సురేష్, రావూరు గ్రామం -
అభివృద్ధి దిశగా..వడివడిగా అడుగులు
-
ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్‌యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష
-
ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టాలన్న సీఎం.. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలని సీఎం పేర్కొన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.. సెప్టెంబరు కల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను అధికారులు వివరించారు. చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు.. సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని కూడా సీఎంకు అధికారులు వివరించారు. 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష తొలి దశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి కాగా, జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. -
కాలువల ద్వారా పోర్టులకు సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతమున్న మొత్తం 974 కి.మీలను వినియోగిస్తూ ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులను నిరి్మస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వీటిని నదులు, కాలువల ద్వారా అనుసంధానించే ప్రక్రియపై దృష్టిపెట్టింది. రోడ్డు మార్గంతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయంతో వేగంగా సరుకు రవాణాకు అంతర్గత జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటుచేస్తూ చట్టాన్ని తీసుకురావడమే కాక బోర్డును సైతం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సుమారు 1,555 కి.మీ మేర జలరవాణా మార్గాలున్నప్పటికీ.. అందులో వినియోగంలో ఉన్నది చాలా తక్కువే. పర్యావరణ హితం, తక్కువ వ్యయంతో కూడిన జలరవాణా పెంపుపై కేంద్రంప్రత్యేక దృష్టిసారించడంతో దానితో కలిసి పలు ప్రాజెక్టులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధంచేస్తోంది. నిజానికి.. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత జలరవాణా మార్గాలు 22.93 లక్షల కి.మీ.లు ఉండగా అందులో భారత్ కేవలం 0.20 లక్షల కి.మీ మాత్రమే కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 4,543 కి.మీ మేర జలరవాణా మార్గాలుండగా, ఏపీ 1,555 కి.మీ.లతో 4వ స్థానంలో ఉంది. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ వాటర్‌వేస్ ప్రాజెక్టుల కింద కృష్ణా–గోదావరి–కాకినాడ–ఏలూరు, బకింగ్‌హామ్ కెనాల్‌ను అభివృద్ధిచేయడానికి ఎన్‌డబ్ల్యూ–4 కింద ప్రకటించింది. ఎన్‌డబ్ల్యూ–79 కింద పెన్నా నదిలో, ఎన్‌డబ్ల్యూ–104 కింద తుంగభద్ర నదిలో జలరవాణా మార్గాలను కేంద్రం చేపట్టనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. తొలుత ముక్త్యాల–మచిలీపట్నం రూట్ ఇక ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ ముక్త్యాల నుంచి అంతర్గత జలరవాణా చేపట్టడానికి ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీ వద్ద బందరు కాలువ లాకులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే జగ్గయ్యపేట వద్ద ఉన్న సిమెంట్ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, బియ్యంను తీసుకెళ్లడంతోపాటు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న థర్మల్ పవర్ కేంద్రానికి దిగుమతి చేసుకున్న బొగ్గును చౌకగా రవాణా చేయవచ్చు. రెండో దశలో ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు, కాకినాడ కాలువల ద్వారా కాకినాడ పోర్టును అనుసంధానించే ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే, పెన్నా, తుంగభద్ర నదుల పరీవాహక ప్రాంతాలను వినియోగించుకుంటూ కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానిస్తారు. ఇప్పటికే ముక్త్యాల–మచిలీపట్నం జలరవాణా మార్గానికి డీపీఆర్ సిద్ధంచేయగా కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ‘పెన్నా’లో 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా.. పెన్నా నది పరీవాహక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉండటంతో ఏటా 16 మిలియన్ టన్నుల సరుకు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్లు అంచనా. ఇదే జలమార్గం ద్వారా రవాణాచేస్తే టన్నుకు కి.మీ.కు రూ.2.50 తగ్గడంతో పాటు డీజిల్ వినియోగం, పర్యావరణ కాలుష్యం తగ్గుతాయి. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పలు నౌకాశ్రయాలు నిర్మాణం జరుగుతుండటంతో వాటికి అనుసంధానం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈఓ, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
ఏపీలో రోడ్ల నిర్మాణం ‘డబుల్ స్పీడ్’
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/తిరుమల: అభివృద్ధి పనులకు నిధులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. గురువారం ఆయన తిరుపతిలో పర్యటించారు. సుమారు రూ. 2,900 కోట్లతో కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన సభలో డిజిటల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఏపీలో 2014 నాటికి 4,193 కి.మీ జాతీయ రహదారులు ఉంటే.. 2023 నాటికి అది 8,744 కి.మీకు చేరిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో నిరుద్యోగానికి చెక్ పెట్టవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పోర్ట్ విశాఖపట్నం ఉందని, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మరో 3 పోర్ట్‌ల ఏర్పాటుకు ఆసక్తి కనబరచటం మంచిపరిణామం అని చెప్పారు. పోర్ట్‌లు దేశాభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. ఈ ఏడాదిలో 91 ప్రాజెక్టుల పరిధిలో 3,240 కి.మీలను రూ. 50 వేల కోట్లతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మరో రూ. 75 వేల కోట్లతో 190 ప్రాజెక్టులు పలు దశల్లో ఉన్నాయని, త్వరలో అవీ కానున్నాయని వివరించారు. ఇక 25 ప్రాజెక్టులు 800 కి.మీ. మేర రూ. 20 వేల కోట్లతో, 45 ప్రాజెక్టులు 1,800 కి.మీ. మేర రూ.50 వేల కోట్లతో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. రూ.19 వేల కోట్లతో 430 కి.మీ. మేర పోర్టుల అనుసంధాన పనులు జరుగుతున్నాయని వివరించారు. పెట్టుబడిదారుల చూపు ఏపీ వైపు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు మొగ్గు చూపడానికి రవాణా సౌకర్యం కారణమని గడ్కరీ తెలిపారు. కడప–రేణిగుంట, తిరుపతి–మదనపల్లి, రేణిగుంట–నాయుడుపేట రహదారులు 2025 నాటికి పూర్తి చేయనున్నట్లు వివరించారు. కృష్ణపట్నం పోర్టుకు వేగవంతమైన కనెక్టివిటీ వస్తోందని వివరించారు. తిరుపతి నగరంలో ఇంటర్ మోడల్ సెంట్రల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి గతేడాది ఆగస్టులో ఎంవోయూ జరిగిందని ఈ జూలైలో టెండర్ పూర్తి కానుందని తెలిపారు. ఏపీలో 7 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాలు చేపట్టామన్నారు. దక్షిణ భారతంలోని రాజధాని నగరాలను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి ఈ రహదారులు దోహదం చేస్తాయన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలా సౌకర్యాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ ప్రతిపాదనలతో.. తిరుపతి జిల్లాలో రూ. 17 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం సంతోషమని స్థానిక పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన పనులకు నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని, తిరుపతి బస్ టెర్మినల్, మరికొన్ని రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మార్పు కోరిన వెంటనే కేంద్ర మంత్రి అంగీకరించడం సంతోషమని తెలిపారు. కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్అండ్బీ కార్యదర్శి ప్రద్యుమ్న ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. శ్రీవారి సేవలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే ముందు తెల్లవారుజామున నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని గడ్కరీకి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. పేదలకు ఉచితంగా గుండె చికిత్సలు అభినందనీయం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అభినందనీయమని నితిన్ గడ్కరీ ప్రశంసించారు. తిరుపతిలోని ఆ ఆస్పత్రిని కేంద్రమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు దాదాపు 1,600 గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారని, ఇది భగవంతుని సేవ అని అభివర్ణించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని, డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు. -
వడి వడిగా నీలివిప్లవం దిశగా..!
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సహజ వనరు లకు నిలయం. ప్రపంచంలోని చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా, మారి షస్, ఐరోపా దేశాలు గొప్పగా అభి వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడమే. ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో(జీడీపీ) దాదాపు 35 శాతం ఈ వనరుల ద్వారానే వస్తుంది. అలాంటి గొప్ప అవకాశం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి మన సముద్ర తీర వనరులను వినియోగించుకొని నీలి విప్లవం సృష్టించడానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం. ఎన్నో పోర్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీన్ని గమ నించే జగన్ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విధానం 2022– 2027’ ప్రకారం అద్భుతమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ తీర రేఖ కలిగిన జిల్లాలో ఎగుమతుల హబ్‌ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర పరిశ్రమల విధానాల్లో సైతం ‘బ్లూ ఎకానమీ’కి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సైతం బ్లూ ఎకానమీ పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సహక రిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తోంది. మేఘవరం పోర్టు (శ్రీకాకుళం), కాయప్ట్సీన్ పోర్టు (కాకినాడ), ముళ్లపేట పోర్టు (మచిలీపట్టణం), నిజాంపట్నం, వాడరేవు లాంటి పోర్టులను రూ. 30,000 కోట్లతో నిర్మిస్తుంది. వీటి ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్ల ఎగుమతుల వ్యాపారం జరగబోతోంది. కడపలోని ఉక్కు, యురేనియం; నెల్లూరులో మైకా; కోస్తా జిల్లాల నుండి అరటి, కొబ్బరి, పంచదార, పండ్లు లాంటి భారీ ఆదాయాన్ని సమకూర్చే వాటిని మన రాష్ట్రం నుండే ఎగుమతి చేయొచ్చు. కేంద్రం నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్లలో మన రాష్ట్రంగుండా మూడు వెళ్తున్నాయి. అందులో ముఖ్యమైంది విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధి వలన విదేశీ పెట్టుబడులు పెరిగి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏపీ చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బ్లూ ఎకానమీలో చేపల ఉత్పత్తి, ఎగుమతులు చాలా కీలకం. కేవలం చేపల ఉత్పత్తే కాకుండా దానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఐరోపా దేశాల తరహాలో ఫిషింగ్ లాండింగ్ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 6 ఫిషింగ్ హార్బర్లతో వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ౖ‘వెఎస్సాఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ప్రతి కుటుంబానికీ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది. బ్లూ ఎకానమీలో సముద్రపు ఖనిజాల వెలికితీత చాలా ముఖ్యమైన లక్ష్యం. కృష్ణ – గోదావరి బేసిన్‌లోని సహజ వాయువు, విశాఖపట్నంలో పాలి మెటాలిక్ నొడ్యూల్స్ వెలికితీతకు మంచి అవకాశాలు ఉన్నాయి. మడ అడవుల అభివృద్ధి, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడం వంటి విధానాలు కూడా బ్లూ ఎకానమీలో ప్రధానం. రాష్ట్రంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. అరుదైన లోహాలు సము ద్రాల్లో లభ్యం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోంది. విద్యారంగంలో సైతం బ్లూ ఎకానమీ ద్వారా మెరైన్ ఇంజ నీరింగ్, షిప్ బిల్డింగ్, ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు అధిక అవకాశం ఉంది. ఫిషింగ్ విశ్వ విద్యాలయం పూర్తయినవెంటనే ఈ రంగాల్లో విద్య అవకాశాలు విరివిగా వస్తాయి. రాష్ట్రం కర్కట రేఖ మీద ఉన్నందున మంచి సూర్యరశ్మి సముద్రంపై లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన విద్యుత్తును సముద్రాల్లో తయారు చేయాలని సంకల్పించింది. కేంద్రం ఇటీవల లక్షద్వీప్‌లో సముద్ర ఉష్ణ శక్తి ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అదే తరహాలో మన రాష్ట్రంలో 3 సముద్రపు ఉష్ణ శక్తిప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ముందుకు సాగుతోంది. వచ్చే 2030–2035 నాటికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రాష్ట్రంలో బ్లూ ఎకానమీ ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సుస్థిరత్వం సాధ్యం అవుతుందనేది ఒక అంచనా. - కన్నోజు శ్రీహర్ష, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు -
అదానీ పోర్ట్స్ లాభం ఫ్లాట్.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ లాభం జూమ్ అదానీ ట్రాన్స్మిషన్ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్మిషన్ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్ చేసింది. ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది. -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
తీరప్రాంత అభివృద్ధికి రూ.16 వేల కోట్లు
బిట్రగుంట: ‘రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, సహజ వనరులను సద్వినియోగం చేసుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీరంలో రూ.16 వేల కోట్ల వ్యయంతో నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ పనులను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, స్థానిక ఎమ్మె ల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అమర్నాథ్ మాట్లాడు తూ రామాయపట్నం పోర్టుతోపాటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతు న్నాయన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన హార్బర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు చెప్పారు. రామాయపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి, ఫిషింగ్ హార్బర్ ద్వారా మరో ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి విజ్ఞప్తి మేరకు బకింగ్‌హాం కెనాల్ మరమ్మతులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణం, మత్స్యకా రులకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారా నికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్, జేసీ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏపీ మారిటైం చీఫ్ ఇంజినీర్ రాజగో పాల్, ఆర్డీవో వీకే శీననాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వివిధ స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్
-
దేశీ పోర్టుల్లో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రధాన పోర్టులు 2022 - 23లో రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల మేర కార్గోను హ్యాండిల్ చేశాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం అధికం అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా వైజాగ్‌తో పాటు ముంబై, కొచ్చిన్, చెన్నై, పారాదీప్ తదితర 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ (ఏఐ)ను ఉపయోగించి పోర్టుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు వీలుందని మంత్రి చెప్పారు. హరిత హైడ్రోజన్ హ్యాండ్లింగ్, నిల్వ, రవాణా కోసం ప్రధాన పోర్టులను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద 2035 నాటికి అన్ని పెద్ద పోర్టుల్లోనూ హరిత హైడ్రోజన్ / అమోనియం బంకర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు సోనోవాల్ చెప్పారు. -
కార్గోలో అదానీ పోర్ట్స్ రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కార్గో పరిమాణంలో సరికొత్త రికార్డు సాధించింది. 33.9 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధికాగా.. తద్వారా అత్యధిక పోర్ట్ కార్గోను నమోదు చేసింది. (ఇది కూడా చదవండి: సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కంపెనీ వివరాల ప్రకారం గత నెల(మార్చి)లోనే 9.5 శాతం అధికంగా 3.2 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. 2022 జులై తదుపరి కార్గో పరిమాణంలో తొలిసారి 3 కోట్ల టన్నుల మార్క్‌ను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దేశీ కార్గో పరిమాణంలో మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తున్నట్లు అదానీ పోర్ట్స్ తెలియజేసింది. (ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు) పశ్చిమ తీరప్రాంతంలో ఆరు, తూర్పుతీరంలో ఐదు పోర్టులను కలిగి ఉన్న కంపెనీ మరిన్ని పోర్టులను జత చేసు కుంటోంది. తద్వారా అతిపెద్ద పోర్టుల నిర్వాహక కంపెనీగా నిలుస్తోంది. ఈ బాటలో ఈ వారం మొదట్లో కరైకాల్ పోర్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11 పోర్టులతో మొత్తం కార్గో పరిమాణంలో 25 శాతాన్ని హ్యాండిల్ చేస్తోంది. శ్రీలంకలోని కొలంబో, కేరళలోని విజింజంలో ట్రాన్షిప్మెంట్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. -
అభివృద్ధికి బాటలు
(నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తీర ప్రాంతాలు, వాటి సమీపంలోని పట్టణాల శాశ్వత ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తోంది. పూర్వపు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని జాతీయ రహదారులతో ఎక్కడికక్కడ కొత్త మార్గాలతో అనుసంధానించాలనే ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలతతో అభివృద్ధి వేగం అందుకోనుంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు/ఫిషింగ్ హార్బర్.. ఏదో ఒకటి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. దీనికి తోడు లాజిస్టిక్ పార్కులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు రూపు దిద్దుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు చెన్నై– కోల్‌కతా, కత్తిపూడి– త్రోవగుంట తదితర జాతీయ రహదారులు, రైలు మార్గాలు ఇప్పటికే ఉన్నాయి. పోర్టులు, హార్బర్లతో ఎన్‌హెచ్‌ల అనుసంధానానికి భారత్‌మాల పరియోజనలో భాగంగా నూతన రోడ్ల నిర్మాణం.. నాలుగు, ఆరు వరుసలకు విస్తరించడం ద్వారా సమీప పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. సరుకు రవాణా వేగవంతం, పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా వ్యవహరించాలని ఢిల్లీ పర్యటనల సమయంలో ప్రధానితో పాటు సంబంధిత శాఖల మంత్రుల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదిస్తూ వచ్చారు. ఫలితంగా నెలల వ్యవధిలోనే పోర్టుల అనుసంధానానికి నిర్ణయాలు వేగవంతమయ్యాయి. 22 పోర్టు అనుసంధాన ప్రాజెక్టులు రాష్ట్రంలోని పోర్టులను అనుసంధానిస్తూ 22 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.18,896 కోట్ల అంచనాలతో 446 కిలోమీటర్ల మేర విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నుంచి ఎన్హెచ్లను అనుసంధానిస్తూ నూతన రహదారులు నిర్మితం కానున్నాయి. రెండు మార్గాలకు సంబంధించి పురోగతిలో ఉన్న వాటిలో.. అచ్చంపేట జంక్షన్ (ఎన్‌హెచ్ –216) నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు – వాకలపూడి లైట్ హౌస్ (ఎన్‌హెచ్–516 ఎఫ్) వరకు రూ.140.50 కోట్లతో 13.19 కి.మీ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టు సంస్థకు సూచించింది. విశాఖపట్నం పోర్టును అనుసంధానించేలా ఈస్ట్ బ్రేక్ వాటర్ (ఎన్‌హెచ్–216) నుంచి కాన్వెంట్ జంక్షన్ (ఎన్ హెచ్–516సి) వరకు 3.49 కి.మీలను రూ.40 కోట్లతో ఫేజ్–1 కింద నాలుగు లేన్ల రహదారి పనులను నిర్మాణ సంస్థ చేపట్టాల్సి ఉంది. బిడ్ల పరిశీలన.. డీపీఆర్ కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి మూడు ప్రాజెక్టుల కింద రూ.2,109.61 కోట్లతో 58.50 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి సంబంధించిన బిడ్లు పరిశీలన దశలో ఉన్నాయి. ఇందులో భాగంగా సబ్బవరం నుంచి షీలానగర్ వరకు 12.50 కి.మీ మేర రూ.1,028.26 కోట్లతో ఆరు లైన్ల మార్గాన్ని భారతమాల పరియోజన కింద విశాఖ పోర్టు వరకు చేపట్టనున్నారు. విశాఖ, కృష్ణపట్నం, కృష్ణా రివర్ టెర్మినల్, నిజాంపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీకి సంబంధించి 148.08 కి.మీ మేర రహదారి నిర్మాణానికి రూ.8,963 కోట్లతో ఆరు ప్రాజెక్టులుగా చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో నెల్లూరు సిటీ నుంచి కృష్ణపట్నం, వైజాగ్ పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు, గుంటూరు– నారాకోడూరు– తెనాలి– చందోలు మీదుగా నిజాంపట్నం పోర్టుకు, గంగవరం పోర్టు నుంచి తుంగలం వరకు, ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి పవిత్ర సంగమం మీదుగా కృష్ణా రివర్ టెర్మినల్ వరకు, విశాఖ పోర్టుకు సంబంధించి ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. కాగా, భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అనుసంధానానికి 106.7 కి.మీ మేర రూ.2,870 కోట్లతో ఐదు ప్రాజెక్టుల కింద రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెంట్లను ఎన్హెచ్ఏఐ నిర్ణయించాల్సి ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో భరోసా విశాఖలో ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) దేశంలోనే పారిశ్రామిక ప్రగతికి భవిష్యత్ వేదిక ఆంధ్రప్రదేశ్ అనే విశ్వసనీయతను పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో కల్పించింది. రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 386 ఒప్పందాల ద్వారా దాదాపు 20 రంగాలలో ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఉండటం, సుదీర్ఘ సముద్రతీరంతో తూర్పు ఆసియా దేశాలకు ముఖ ద్వారం కావడం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, జాతీయ రహదారులు, రైలు కనెక్టివిటీ కలిగి ఉండటం ప్రగతికి సోపానాలే. తద్వారా చెన్నై–కోల్‌కతా ఎన్‌హెచ్ వెంబడి, ఈ రెండింటికి మధ్యలో విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు గూడూరు తరహా పట్టణాలు, పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆక్వా అదనపు అవకాశం కోస్తా జిల్లాల్లో 5.30 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆక్వా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు దేశీయ ఎగుమతుల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర వాటా ఐదు శాతం నుంచి రానున్న ఏడేళ్లలో పది శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఏపీ నుంచి వివిధ ఆహార ఉత్పత్తులు, అన్ని రంగాల వర్తక వాణిజ్యాల ముడి సరుకుల ఎగుమతులు, దిగుమతులను పెంచే ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అగ్రిమెంట్ దశలో ఐదు ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులతో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులను నాలుగు, ఆరు వరుసల రహదారులతో అనుసంధానించే ఐదు ప్రాజెక్టుల కాంట్రాక్టులు అవార్డు పూర్తయి అగ్రిమెంటు దశలో ఉన్నాయి. వీటిని రూ.3,745 కోట్లతో 104 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ♦ కాకినాడ పోర్టును అనుసంధానించేలా 12.25 కి.మీ మేర సామర్లకోట నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు రహదారి ♦ కృష్ణపట్నం పోర్టును కనెక్టు చేసే చిలకర్రు క్రాస్ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా పోర్టు దక్షిణ గేటు వరకు 36.06 కి.మీ రోడ్డు ♦ నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు (ఎన్‌హెచ్–71) వరకు 34.88 కి.మీ రోడ్డు ♦ 11 కి.మీ మేర విశాఖ పోర్టు రోడ్డు అభివృద్ధి ♦ కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ జంక్షన్ (ఎన్‌హెచ్–516సీ) రోడ్డు అభివృద్ధి 22 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 446 కి.మీ మొత్తం దూరం రూ.18,896 కోట్లు ప్రాజెక్టుల వ్యయం పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరింగ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం రానున్నవి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ గేట్‌వే ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్నె (నెల్లూరు), నిజాంపట్నం (బాపట్ల జిల్లా), మచిలీపట్నం (కృష్ణా జిల్లా), ఉప్పాడ (కాకినాడ జిల్లా) పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. -
పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి పథకంతో మౌలిక సదుపాయల కల్పన వేగవంతం కావడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాలూ తగ్గుతున్నాయని చెప్పారు. వివిధ రవాణా మార్గాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంటుందని అన్నారు. సాగర్మాలా కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.1 లక్షల కోట్ల విలువ చేసే 110 ప్రాజెక్టులను గుర్తించినట్లు సోనోవాల్ చెప్పారు. ఇప్పటికే రూ. 32,000 కోట్ల విలువ చేసే 32 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజాగ్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉందని తెలిపారు. వైజాగ్ పోర్టు కార్గో విభాగం ఆరోగ్యకరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంద అన్నారు. దాదాపు రూ. 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ పనులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీతో ఎంతో లాభం
సాక్షి, అమరావతి: విశాఖలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)–2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది. ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు.. సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జీఐఎస్‌లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటంతో తీర ప్రాంత వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం ఆరు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సుమారు రూ.30,000 కోట్లతో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. రామయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా, కాకినాడ గేట్‌వే పోర్టు పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయడమే కాకుండా పోర్టు సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఆరు ఎయిర్‌పోర్టులు.. గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి. చౌక ధరలకే వేల ఎకరాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లలో పలు చోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ కారిడార్ల పరిధిలో 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్ను అభివృద్ధి చేస్తుండగా, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్‌లో ఎకరం రూ.12 నుంచి రూ.15 లక్షలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్‌లో ప్రధానంగా వివరించనుంది. రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70 శాతం మంది యువతీ యువకులే. అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 25 శాతం మంది తెలుగు మాట్లాడే వారే. ఈ లెక్కన పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతగా అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 2021–22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023–28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022–27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020–25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ–22, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020–25, టూరిజం పాలసీ 2020–25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021–26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించనుంది. -
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాకిస్తాన్లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్ ప్రచురించింది. ఖజనా ఖాళీ తాజాగా పాక్ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. తగ్గిన కొనుగోలు శక్తి నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5వేల కంటైనర్ల నిండా మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్,బేవరేజెస్,క్లోతింగ్,షూస్,గ్యాస్ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్లను ఉంచినట్లు హైలెట్ చేసింది. పాక్ పర్యటనలో ఐఎంఎఫ్ బృందం ఇక డిసెంబర్ నెల నాటికి పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధుల బృందం ఈ వారం పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది. -
ఎన్ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్– ఎన్ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది. అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా... ► 2021–22లో ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది. ► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయితే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తాజా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్ మోనిటైజేషన్ జరగవచ్చని భావిస్తోంది. ► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు అసెట్ మానిటైజేషన్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది. ► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు. ► విద్యుత్ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. ► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది. ► మోనిటేజేషన్ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది. ► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్ ఎన్ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది. -
ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్‌లో ఏపీసెజ్‌కు వాటా, రూ.1,050 కోట్ల డీల్
ఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) మరో కొనుగోలుకు తెరతీసింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ లిమిటెడ్‌లో 49.38 శాతం వాటాను రూ.1,050 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు బుధవారం ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ సబ్సిడరీ అయిన ‘ఐవోటీ ఉత్కల్ ఎనర్జీ సర్వీసెస్’లో 10 శాతం వాటాను సైతం కొనుగోలు చేయడం ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నట్టు ఏపీ సెజ్ తెలిపింది. ఇందుకోసం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద రవాణా సదుపాయాల కల్పన కంపెనీగా అవతరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొనుగోలు ఉన్నట్టు సంస్థ పేర్కొంది. లిక్విడ్ స్టోరేజీ (ద్రవరూప నిల్వ సదుపాయాలు)లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్.. దేశవ్యాప్తంగా 2.4 మిలియన్ కిలో లీటర్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంలో ఆరు టెర్మినళ్లను కలిగి ఉన్నట్టు తెలిపింది.