పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి | Maritime State Development Council Virtual Meeting | Sakshi
Sakshi News home page

పోర్ట్స్‌ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి

Published Thu, Jun 24 2021 2:37 PM | Last Updated on Thu, Jun 24 2021 3:51 PM

Maritime State Development Council Virtual Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: మారిటైం స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్‌ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్‌రెడ్డి అన్నారు.

చదవండి: APPSC Member: గ్రూప్ వన్ పరీక్షలపై విమర్శలు అర్ధరహితం
ఏపీ బీజీ ఇంటర్‌ సెట్‌–2021


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement