
సాక్షి, తాడేపల్లి: 2023 డిసెంబర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన మారిటైమ్ ఇండియా-2021 సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను10 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని వెల్లడించారు. తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలు కల్పిస్తుందన్నారు.
గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువని వివరించారు. కేంద్రం కొత్తగా మారిటైమ్ పాలసీ-2030ను తీసుకుని వచ్చిందని, మారిటైమ్ నావిగేషన్, మానిటరింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్కరించిందని పేర్కొన్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రావాణ సామర్థ్యం పెంచనున్నామని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని, లైట్ హౌసుల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారని మంత్రి మేకపాటి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment