Maritime Conference
-
పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధారంగా పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సదస్సులో పరిశ్రమలు, ఇంధన రంగం తర్వాత పోర్టు ఆధారిత రంగంలో పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్గో టెర్మినల్స్, లాజిస్టిక్స్ పార్క్, ఐసీడీ, వేర్ హౌసింగ్ తదితరాల్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. యూఏఈ, జపాన్ తదితర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మారిటైమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు.. ఈ పోర్టుల పక్కనే అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులు, వాటిలో మౌలిక వసతుల కల్పన తదితరాలను కూడా వివరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సముద్ర ఆధారిత వాణిజ్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ జనవరిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు వేదికగా సముద్రపు ఆహార ఉత్పత్తులు, వాటి రంగంలో పెట్టుబడుల అవకాశాలపై సదస్సు నిర్వహించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. -
వైజాగ్ పోర్టుకు 6 కనెక్టివిటీ ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతిశక్తి పథకంలో భాగంగా పోర్టు కనెక్టివిటీ రహదారుల్లో వైజాగ్ పోర్టుకు 6 ప్రాజెక్టులను కేటాయించినట్టు పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్రావు చెప్పారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో పోర్టు ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే మారిటైమ్–2022 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రామ్మోహన్రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 35 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్(ఎంఎంఎల్పీ)లో భాగంగా విశాఖపట్నం లాజిస్టిక్ హబ్‌గా భాసిల్లుతుందని అశాభావం వ్యక్తం చేశారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన గతిశక్తి ద్వారా ప్రాజెక్టులు వేగవంతం అవుతాయన్నారు. వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి మాట్లాడుతూ.. పోర్టులు, రైల్వేలు పరస్పర సహకారంతో గతిశక్తి ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు పూర్తి చేసి.. విశాఖపట్నం రైల్వే జంక్షన్‌ను శరవేగంగా అభివృద్ధి చేసే చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు వివరించారు. -
ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసుకునేలా రాష్ట్రంలో ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు తెలిపింది. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘భవిష్యత్తు అవసరాల కోసం పోర్టుల అభివృద్ధి–న్యూ ఇండియా 75’ అనే అంశంపై ఆన్లైన్లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తీర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.చదవండి: Andhra Pradesh: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు : ముఖ్యంగా సరుకు రవాణా వ్యయం తగ్గించడానికి పోర్టుల సమీపంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామన్నారు. దీంతో దేశంలోనే అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పోర్టులకు సమీపంలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని కోరారు.చదవండి: ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ! రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగి ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అంతకుముందు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి, పారిశ్రామికీకరణలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. -
సముద్రప్రాంత సహకారానికి పంచ సూత్రాలు
ఐక్యరాజ్యసమితి: సముద్రప్రాంత రక్షణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశాల మధ్య సముద్ర జల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. సముద్ర జలాల్లో విద్రోహ శక్తులతో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. సముద్ర ప్రాంత రక్షణ పెంపు–అంతర్జాతీయ సహకారం అంశంపై ఐరాస భద్రతామండలిలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. సముద్ర ప్రాంత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఐదు సూత్రాలతో కూడిన సముద్ర సమ్మిళిత రక్షణ వ్యూహాన్ని ప్రతిపాదించారు. ఆ పంచ సూత్రాలివే.. ► ప్రపంచ ప్రగతి సముద్ర ప్రాంత వాణిజ్యం క్రియాశీలతపైనే ఆధారపడి ఉంది. చట్టపరమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి. ► సముద్ర జల వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఏకైక మార్గం ఇదే. ► ప్రకృతి వైపరీత్యాలు, విద్రోహ శక్తుల కారణంగా తలెత్తే సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ► సముద్ర పాంత పర్యావరణం, వనరులను కాపాడుకోవడం, జవాబుదారీతనంతో కూడిన సముద్ర ప్రాంత అనుసంధానితను ప్రోత్సహించడం. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల్లో జరిగే సముద్ర నేరాలపై ప్రత్యక్షంగా పోరాడేందుకు ఐరాస ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర జలాల్లో సముద్రపు దొంగలు, ఉగ్రవాదులపై కొన్ని దేశాలు సొంతంగా పోరాడలేకపోతున్నాయని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తలెత్తిన వివాదం భద్రత, వాణిజ్యం విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. నియమోల్లంఘన ప్రతి చోటా నష్టానికి, అస్థిరతకు ఆజ్యం పోస్తుందని చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
పోర్ట్స్ బిల్లుపై అభ్యంతరాలు తెలిపిన మంత్రి గౌతమ్‌రెడ్డి
-
పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: మారిటైం స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: APPSC Member: గ్రూప్ వన్ పరీక్షలపై విమర్శలు అర్ధరహితం ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021 -
తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులు
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ విజన్ 2030 పేరుతో వచ్చే తొమ్మిదేళ్లల్లో రాష్ట్ర ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం 100 మిలియన్ టన్నులుగా ఉన్న ఓడరేవుల నిర్వహణ సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్వీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలి దశలో 2024 నాటికి సరుకు రవాణా సామర్థ్యం 200 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో మూడు డీప్ వాటర్ పోర్టులు ఉండగా, అదనంగా మరో నాలుగు డీప్ వాటర్ పోర్టులు నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం చేపట్టనుండగా, కాకినాడ సెజ్ సమీపంలో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ మరో ఓడరేవును నిర్మించనుంది. మూడు ఎల్ఎన్జీ టెర్మినల్స్ రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్నిచ్చే ఎల్ఎన్జీ టెర్మినల్స్ నిర్మాణానికి మారిటైమ్ బోర్డు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగా గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వద్ద ఎల్ఎన్జీ టెర్మినల్స్ ఏర్పాటు కోసం వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో ఇప్పటికే ఏజీ అండ్ పీ అనే సంస్థ రూ.1,000 కోట్లతో గంగవరం వద్ద 3 మిలిఠియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. కాకినాడ వద్ద హెచ్ ఎనర్జీ అనే సంస్థ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే 15 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు వ్యాట్ రూపంలో రూ.50,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. పర్యాటకం కోసం క్రూజ్ టెర్మినల్స్ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఆధారంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ తెలిపారు. క్రూజ్ టూరిజం (పెద్ద సంఖ్యలో పర్యాటకులను తీసుకెళ్లే) ద్వారా ఈ రేవులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో భీమిలి, కాకినాడల్లో క్రూజ్ టెర్మినల్స్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
ఏపీ అనుకూలం.. పెట్టుబడులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన తీర ప్రాంతముందని.. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021లో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రహదారులు, రైళ్లు, పోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరుకు రవాణా వ్యయం తగ్గించేందుకు.. ఏపీలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు అవసరమైన సహజసిద్ధమైన వనరులన్నీ ఏపీలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రూజ్ టూరిజం ద్వారా ఈ రేవులను అనుసంధానం చేస్తామన్నారు. సదస్సులో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహనరావు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అన్ని విధాలా అనుకూలం
పరిశ్రమల నిర్వహణకు రాష్ట్రంలో పూర్తి అనువైన వాతావరణం, పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి అవకాశాలను వినియోగించుకుంటూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులను కోరుతున్నాం. ఈ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఓడ రేవులన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సరుకు రవాణాకు నౌకా యానంపైనే ఎక్కువగా ఆధారపడే తయారీ రంగం, పెట్రో కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్ రంగాలలో పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాం. ఈ రంగంలో నైపుణ్యాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, టెస్టింగ్ ల్యాబ్‌లు, శీతల గిడ్డంగులు (కోల్డ్ చైన్ ఫెసిలిటీ) కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటితో ఆయా పోర్టుల ద్వారా కార్గో రవాణాలో ఆక్వా, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. సాక్షి, అమరావతి: సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్.. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న ప్రధాని మోదీ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో పలు కీలక చర్యలు చేపట్టామని చెప్పారు. విశాఖ పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో ఫిక్కి(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్ – 2021ను మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. 974 కిలోమీటర్లతో దేశంలోనే రెండో సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు తూర్పున అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో 4 శాతం వాటా కలిగిన రాష్ట్రం 2030 నాటికి దానిని 10 శాతానికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విశాఖలో మేజర్ పోర్టు, ఇతరత్రా 5 రాష్ట్ర పోర్టుల (మైనర్) నిర్వహణలో ఏటా 170 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తూ దేశంలోనే గుజరాత్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరో 10 ప్రతిపాదిత (నిర్మాణానికి గుర్తించిన) పోర్టులు ఉన్నాయని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. మూడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుల నిర్మాణం ► రాష్ట్రంలో ఓడ రేవులు ప్రధాన కేంద్రంగా అనేక పారిశ్రామికవాడలు (నోడ్స్) ఏర్పాటయ్యాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మరో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల నిర్మాణం చేపడుతున్నాం. ► 2023 నాటికి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టులను నిర్మించడం ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► ఈ పోర్టుల నిర్వహణ చేపట్టే ప్రైవేటు సంస్థలకు ఎటువంటి నష్ట భయం లేకుండా వినూత్నమైన విధానంలో వీటిని నిర్మిస్తున్నాం. ఈ మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అభివృద్ధి చేసి, వ్యాపారంలో వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి అత్యధికంగా వచ్చే విధంగా పోటీ బిడ్డింగ్ విధానంలో ప్రైవేటు సంస్థను ఎంపిక చేస్తామన్నారు. బ్లూ ఎకానమీలో అపార అవకాశాలు ► సముద్ర ఆధారిత వాణిజ్యంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశీయ వాణిజ్యంలో పరిమాణం పరంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం నౌకాయానం ద్వారానే జరుగుతోంది. ► గతేడాది(2019–20)లో దేశంలోని నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. ఈ రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం వంటి సంస్కరణలతో పాటు, మేకిన్ ఇండియా, సాగర్ మాల, భారత్ మాల వంటి కార్యక్రమాలు ఈ రంగంలో విశేష పురోగతికి దోహదం చేస్తాయి. ► ఆ దిశలో రూపొందించిన మారిటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్ ఈ రంగంలో ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనం. తద్వారా ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన అనుబంధ విభాగాలు.. ఆక్వా కల్చర్, సముద్రయానం (మారిటైమ్), సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటక రంగం, రసాయన, జీవ సాంకేతిక పరిశోధన, నౌకల నిర్మాణం(షిప్ బిల్డింగ్), నౌకాశ్రయాలపై ఆధారపడిన అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా వృద్ధి అవకాశాలతోపాటు, సుస్థిరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందనడానికి గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన మొట్ట మొదటి జాతీయ మత్స్య విధాన ముసాయిదా ఓ ఉదాహరణ. ► ఓడరేవులు, వీటిపై ఆధారపడిన పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక పురోగతి సాధించడంతోపాటు, సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో నూతన ఆర్థిక నగరాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 మంది గ్లోబల్ సీఈవోలు.. 160 మంది వక్తలు పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో ప్రారంభమైన మారిటైం ఇండియా సమ్మిట్ 2021లో అన్ని పోర్టుల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర పోర్టులు, నౌక, జల రవాణా మంత్రి మన్షుక్ మాండవీయ ఉపన్యాసంతో సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 8 దేశాల మంత్రులు, 50 మందికి పైగా గ్లోబల్ సీఈవోలు, 160 మందికి పైగా వక్తలు పాల్గొంటున్నారు. ఇందులో 24 దేశాల నుండి 115 మంది అంతర్జాతీయ వక్తలు ఉండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సదస్సులో పాల్గొనడానికి లక్ష మందికి పైగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, గుజరాత్ సీఎం విజయరూపానీ, ఫిక్కి జాతీయ అధ్యక్షుడు ఉదయశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామమోహనరావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దుబే, పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగస్వాములయ్యారు. ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దీన్ని వీక్షించే ఏర్పాటు చేశారు. -
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
-
పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువ: మేకపాటి
సాక్షి, తాడేపల్లి: 2023 డిసెంబర్ నాటికి రామాయంపాడు పోర్టు అందుబాటులోకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన మారిటైమ్ ఇండియా-2021 సదస్సు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను10 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని వెల్లడించారు. తూర్పు తీరంలో రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి అదనపు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్, మహారాష్ట్రల్లో ఉన్న తీర ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి విస్తరణకు అవకాశం తక్కువని వివరించారు. కేంద్రం కొత్తగా మారిటైమ్ పాలసీ-2030ను తీసుకుని వచ్చిందని, మారిటైమ్ నావిగేషన్, మానిటరింగ్ యాప్‌ను కేంద్రం ఆవిష్కరించిందని పేర్కొన్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల ద్వారా అదనంగా 100 మిలియన్ టన్నుల కార్గో రావాణ సామర్థ్యం పెంచనున్నామని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక నగరాలు, పరిశ్రమలు పెరగనున్నాయని, లైట్ హౌసుల చుట్టూ పర్యాటక అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారని మంత్రి మేకపాటి వివరించారు. చదవండి: ‘మారిటైమ్ ఇండియా’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ -
‘మారిటైమ్ ఇండియా’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు జరగనుంది. కాగా, సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: పోలవరం మరింత వేగంగా: సీఎం జగన్ టీడీపీ నేత.. ఎరువుల మేత! -
మారిటైమ్ ఇండియా-2021 సదస్సు ప్రారంభం
-
‘జలరవాణా’తో అవకాశాలు
కొత్త ప్రాజెక్టులతో కోటిమందికి ఉపాధి ♦ మారిటైమ్ సదస్సులో ప్రధాని మోదీ ముంబై: దేశంలోని జలరవాణా అభివృద్ధి, అనుసంధానానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చారు. ముంబైలో మొదటి మారిటైమ్ ఇండియా సమిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ... ఓడరేవుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి ఇదే సరైన సమయమన్నారు. ఓడరేవుల సామర్థ్యాన్ని 2025 నాటికి 140 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నులకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని అందుకునేందుకు ఐదు కొత్త ఓడరేవుల్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. భారతీయ నౌకా పరిశ్రమ అభివృద్ధి కోసం సుదీర్ఘ కసరత్తుకు కట్టుబడి ఉన్నామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవ ద్దని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కరే... దేశ జల, నదీ రవాణా విధానానికి రూపకర్తని చెప్పారు. 10 ఏళ్లలో కోటిమందికి ఉపాధి మారిటైమ్ విభాగంలో 250 ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం నౌకాయాన శాఖ ఆహ్వానిస్తోందని తెలిపారు. 12 ప్రధాన ఓడరేవుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటిలోని 100 ప్రాజెక్టులు సాగరమాల పథకంలో భాగంగా నిర్మిస్తారని మోదీ వెల్లడించారు. ఇవి అమలైతే కోటి మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.సాగరమాలకు సంబంధించి జాతీయ విధానాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. పోర్టుల అభివృద్ధికి ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టు కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈనామ్ ఆవిష్కరణ ఢిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ (ఈనామ్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతానికి తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 21 మార్కెట్లను అనుసంధానిస్తారు.