Council meetings
-
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అన్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయని అన్నారు. అందుకే తమ పాలనలో పలు వ్యవస్థలను ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని.. తాము ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇవ్వమని మోదీ స్పష్టం చేశారు. తాము తప్ప వికాస్ భారత్‌కు ఎవరూ హామీ ఇవ్వరని అన్నారు. అదే విధంగా 2029లో దేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకా... ‘400సీట్లు గెలిచేందుకు పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి. మోడీ గ్యారెంటీ వికసిత్ భారత్. ఎన్డీఏ వల్లే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మోడీ 3.0లో దేశాన్ని ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా పైకి తీసుకొస్తాం. ఈ పదేళ్ల కాలంలో 11వ నెంబర్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో నెంబర్‌కి తీసుకొచ్చా. 25 కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. పదేళ్లపాటు అవినీతి రహిత పాలన అందించాం. ... లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే లక్ష్యం. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్‌కు విజన్ లేదు. దేశ అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు జనని కాంగ్రెస్. కులాల ఆధారంగా ప్రజలను విభజించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. రానున్న రోజుల్లో ప్రతి లబ్ధిదారుని కలవాలి. నేను పంపే ఉత్తరాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలి. పదేళ్ల పాలన, రానున్న ఐదేళ్ల మన విజన్ వారి చేతికి ఇవ్వాలి’ అని ప్రధాని మోదీ తెలిపారు. -
తెలంగాణలో హంగ్.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి. నేతలు వివేకంతో ఆలోచించాలి’’ అని బీఎల్ సంతోష్ హితవు పలికారు. కాగా, నిన్న(గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో కూడా బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని సంతోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో సీఎం పోస్టుపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
పోర్ట్స్ బిల్లుపై అభ్యంతరాలు తెలిపిన మంత్రి గౌతమ్‌రెడ్డి
-
పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: మారిటైం స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో పోర్ట్స్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పోర్టులపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. కేంద్రం చేసే మంచి నిర్ణయాలకు సహకరిస్తామన్నారు. నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరామని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: APPSC Member: గ్రూప్ వన్ పరీక్షలపై విమర్శలు అర్ధరహితం ఏపీ బీజీ ఇంటర్ సెట్–2021 -
సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్లో గురువారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్‌ను అధికారులు సిద్ధం చేసుకుని ఉండాలని సీఎస్ సోమేష్‌కుమార్ సూచించారు. -
చైనా వెళ్లొచ్చా.. అయితే ఇప్పుడు కాదులే
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో శనివారం కరోనా వైరస్‌పై ఆసక్తికర చర్చజరిగింది. స్వల్పకాలిక చర్చలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కరోనా వైరస్‌పై మాట్లాడుతూ సభలో నవ్వులు పూయించారు. ఆయన స్థానంలో నిలబడి ‘నేను చైనా వెళ్లొచ్చాను’అనగానే పక్కనే ఉన్న సహచర ఎమ్మెల్సీలు ‘ఎప్పుడూ?’అంటూ ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే ఆయన ‘‘ఇప్పుడే కాదులే మూడు, నాలుగేళ్ల క్రితం వెళ్లొచ్చాను. నిన్న, మొన్న మీతోటే ఉన్న కదా’అని సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా గొల్లున నవ్వారు. ‘చైనాకు పోయుంటే సక్కగా హాస్పిటల్‌కే పోయేటోడిని’అని మల్లేశం బదులిచ్చారు. తాతల కాలంలో గత్తరొచ్చి పెద్దసంఖ్యలో చనిపోయినట్టు విన్నామే తప్పించి, ఈ విధమైన జబ్బు గురించి ఎన్నడూ వినలేదు. చూడలేదన్నారు. బడ్జెట్ సమావేశాలను కూడా వాయిదా వేస్తారనే అనుమానమొచ్చిందన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ..ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారికి కోవిడ్ సోకే అవకాశం లేదని, ఇప్పుడు హిందూ మహిళలు, విద్యార్థినులు కూడా ముఖం కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకుంటున్నందున వారికి కూడా అది రాదన్నారు. వారికి గూండాలు, పోకిరీల బెడద కూడా ఈ రకంగా తీరిందన్నారు. తాను పాతబస్తీలో ఒక బట్టలషాపులో వస్త్రాలను పరిశీలిస్తుండగా, ఆ దుకాణం యజమాని తనవద్దకొచ్చి దగ్గుతూ ‘కరోనా అంటే ఏమిటి’? అని తనను ప్రశ్నించగానే ఏదో ఫోన్ వచ్చినట్టుగా ‘హలో.. హలో’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయానని ఫారుఖ్‌హుస్సేన్ వ్యాఖ్యానించగానే కౌన్సిల్లో నవ్వులు విరిశాయి. సభలో రామచంద్రరావు, చిన్నపరెడ్డి, జీవన్‌రెడ్డి ఇతర సభ్యులు జోరుగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఒక్కముక్క కూడా అర్థం కావడం లేదని, రాబోయే రోజుల్లో అందరూ తెలుగు,ఉర్దూలకు దూరమయ్యేట్టు కనిపిస్తోందన్నారు. ఇంతలో కొందరు సభ్యులు ఫారుఖ్‌హుస్సేన్‌ను ఉద్దేశించి ‘కరోనాను తెలుగులో ఏమంటారు?’అంటూ ప్రశ్నించడంతో తడుముకోవడం ఆయన వంతైంది. -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
మండలి కూడా వాయిదా 18 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాలు 94.56 గంటల పాటు సాగిన చర్చలు 15 అంశాలపై స్వల్పకాలిక చర్చ 16 బిల్లులను పాస్ చేసిన అసెంబ్లీ 66.25 గంటలు నడిచిన శాసనమండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 16న మొదలైన సమావేశాలు 18 పనిదినాలపాటు జరిగాయి. బుధవారం మైనార్టీ సంక్షేమంపై చర్చ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో 16 రోజులు, పది రోజుల సెలవు తర్వాత రెండో విడతలో రెండు రోజులు (మంగళ, బుధవా రాలు) సమావేశాలు జరిగాయి. మొత్తంగా 18 పనిదినాల్లో ఆయా అంశాలపై 94 గంటల 56 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. 15 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ప్రభుత్వం 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంది. పలు కీలకమైన, విధాన నిర్ణయాల ప్రకటనకూ ఈ సమావేశాలు వేదికయ్యాయి. విద్యుత్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ‘ఉదయ్’ పథకంలో చేరుతు న్నట్లు సీఎం ప్రకటించారు. ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పెన్షన్, బీసీ సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు, సైనిక సంక్షేమం వంటి అంశాలపైనా ప్రకటనలు చేశారు. ప్రతిపక్షమే ఎక్కువ ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడిన సమయాన్ని మినహాయించి పార్టీల వారీ గా చూస్తే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభ్యులు 19.13 గంటలపాటు మాట్లాడారు. తర్వాత టీఆర్ఎస్ 17.21 గంటలు, బీజేపీ 10.10 గంటలు, ఎంఐఎం 6.54 గంటలు, టీడీపీ 06.05 గంటలు, సీపీఎం 01.42 గంటలు వినియోగించుకున్నాయి. ఇక సీఎం, మంత్రులు కలిసి 33.28 గంటల సమయం వినియోగించుకున్నా రు. 18 రోజుల్లో 94.56 గంటలపాటు సాగిన సమావేశాల్లో.. విపక్షాలు 1.03 గంటలు సభకు అంతరాయం కల్పించాయి. ఇందులో కాంగ్రెస్ 43 నిమిషాలు, ఎంఐఎం 05 నిమిషాలు, టీడీపీ 15 నిమిషాలపాటు అంతరాయం కల్పించాయి. 110 ప్రశ్నలకు సమాధానాలు ఈ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు కలిపి మొత్తంగా 110 ప్రశ్నలు వేసి.. ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టారు. వీటికి 361 అనుబంధ ప్రశ్నలు కూడా వేశారు. దాదాపు అందరు సభ్యులూ చర్చల్లో పాల్గొన్నారు. చాలా మందికి జీరో అవర్‌లో అవకాశం లభించింది. సభ్యులు 186 ప్రసంగాలు చేశారు. 15 అంశాల పై లఘు చర్చ జరగగా.. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై చేపట్టిన చర్చ 4.57 గంటలపాటు జరిగింది. వ్యవసాయం, రుణమాఫీపై 4.36 గంటలు, జీహె చ్ఎంసీపై 4.10 గంటలు, మైనారిటీ సంక్షేమంపై 3.27 గంటలు చర్చ సాగింది. 66.25 గంటలపాటు మండలి సమావేశాలు శాసనమండలి సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సభలో పార్టీల వారీగా బలాబలాలు, శాసనమండలి ఎన్ని రోజులు కొలువు దీరింది, ఎన్ని గంటల పాటు సమావేశాలు జరిగాయి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తంగా శాసన మండలి కూడా 18 రోజుల పాటు సమావేశమైంది. 66.25 గంటల పాటు చర్చలు జరగగా... సభ్యులు 108 ప్రసంగాలు చేశారు. 14 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు 139 ప్రశ్నలు వేశారు. 16 బిల్లులను మండలి ఆమోదించింది. -
ముగిసిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలు
తాళ్లరేవు : రెండు రోజుల పాటు స్థానిక నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మ¯ŒS బూరిగ ఆశీర్వాదం తదితరులు హాజరయ్యారు. సీపీఎస్ పోరాటంలో పాల్గొంటామని, సీసీఈకి వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడతానని సూర్యారావు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో లక్షా 20 వేల సభ్యత్వాలుండగా, 15 వేల సభ్యత్వాలతో సంఘ జిల్లా శాఖ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా జి.ప్రభాకరవర్మ, అధ్యక్షునిగా డీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా టి.కామేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎ¯ŒS.అరుణకుమారి, జె.అప్పారావు, కోశాధికారిగా కేవీ ప్రసాద్‌బాబుతో పాటు మరో 19 మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.