వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ | PM Modi Speech At BJP National Council Meeting Delhi | Sakshi
Sakshi News home page

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

Published Sun, Feb 18 2024 2:27 PM | Last Updated on Sun, Feb 18 2024 3:39 PM

PM Modi Speech At BJP National Council Meeting Delhi - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అ‍న్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా  18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్‌ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని  ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు.

ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు  రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. 

దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ వ్యవస్థలు అలాగే ఉంటాయని అన్నారు. అందుకే తమ పాలనలో పలు  వ్యవస్థలను ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని.. తాము ఎన్నికల కోసం అబద్ధపు  హామీలు ఇవ్వమని మోదీ స్పష్టం చేశారు. తాము తప్ప వికాస్‌ భారత్‌కు ఎవరూ హామీ ఇవ్వరని అ‍న్నారు. అదే విధంగా 2029లో దేశంలో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇంకా... ‘400సీట్లు గెలిచేందుకు పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలి. మోడీ గ్యారెంటీ వికసిత్ భారత్. ఎన్డీఏ వల్లే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మోడీ 3.0లో దేశాన్ని ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థగా పైకి తీసుకొస్తాం.  ఈ పదేళ్ల కాలంలో 11వ నెంబర్‌లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో నెంబర్‌కి తీసుకొచ్చా. 25 కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం.  పదేళ్లపాటు అవినీతి రహిత పాలన అందించాం. 

... లోక్ సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలవడమే లక్ష్యం. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్‌కు విజన్ లేదు. దేశ అస్థిరతకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు జనని కాంగ్రెస్.  కులాల ఆధారంగా ప్రజలను విభజించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. రానున్న రోజుల్లో ప్రతి లబ్ధిదారుని కలవాలి.  నేను పంపే ఉత్తరాన్ని లబ్ధిదారులకు ఇవ్వాలి. పదేళ్ల పాలన, రానున్న ఐదేళ్ల మన విజన్ వారి చేతికి ఇవ్వాలి’ అని ప్రధాని మోదీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement