పాట్నా: మహిళల వస్త్రధారణపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను అధికారం చేపట్టిన 20ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ మెరుగుపడిందంటూ వ్యాఖ్యానించారాయన. దీనిపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నితీష్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రమంతటా ‘ప్రగతి యాత్ర’ ( Pragati Yatra)ను నిర్వహిస్తుంది. బెగుసరాయ్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీష్ కుమార్ మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. సీఎం నితీష్ కుమార్ ఫ్యాషన్ డిజైనర్ కాదని, ఆ మాటలు ఆయన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
అయితే, సీఎం నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో "ShameOnNitish" వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ‘అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బాగా మాట్లాడతారు. చక్కని దుస్తులు ధరిస్తారు. వారు ఇంతకు ముందు ఇంత మంచి బట్టలు ధరించడం మనం చూశామా?
అని ప్రశ్నిస్తూనే.. ‘ఇంతకు ముందు బీహార్ కుమార్తెలు మంచి దుస్తులు ధరించలేదని కాదు. వారు తమను తాము ఆత్మగౌరవం, స్వావలంబనతో కప్పుకున్నారు’ అంటూ సీఎం నితిష్ వ్యాఖ్యల్ని ఖండించారు. సీఎంగారు.. మీరు మహిళల కోసం ఫ్యాషన్ డిజైనర్‌గా మారడానికి ప్రయత్నించవద్దు. మీ ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ ప్రకటన రాష్ట్ర మహిళల్ని అవమానించేలా ఉన్నాయని’ ధ్వజమెత్తారు.
पहले बिहार की बेटियां कपड़े ही नहीं, स्वाभिमान, स्वावलंबन और सम्मान भी पहनती थीं नीतीश कुमार जी।
‘स्त्री परिधान वैज्ञानिक' मत बनिए’! आप 𝐂𝐌 है 𝐖𝐨𝐦𝐞𝐧 𝐅𝐚𝐬𝐡𝐢𝐨𝐧 𝐃𝐞𝐬𝐢𝐠𝐧𝐞𝐫 नहीं। 'स्त्री परिधान विशेषज्ञ' बनकर अपनी घटिया सोच का प्रदर्शन बंद कीजिए। ये बयान नहीं,… pic.twitter.com/9DPrOqbTjS— Tejashwi Yadav (@yadavtejashwi) January 18, 2025
Comments
Please login to add a commentAdd a comment