bhihar
-
పరారీలో నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్.. ఎవరీ సంజీవ్ ముఖియా
పాట్నా: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్ర దారి బీహార్‌లోని షాపూర్‌కు చెందిన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహణకు ముందు పేపర్ లీకేజీ కావడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.అయితే ఈ పేపర్ లీకేజీ అంతా బీహార్‌లోని పాట్నా ఓ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 4న లీకేజీలో మాస్టర్ మైండ్ బీహార్ నూర్సరాయ్లోని నలంద కాలేజీ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్ ముఖియా బాయ్స్ హాస్టల్లో నీట్ పరీక్ష రాసే 25మంది విద్యార్ధులకు వసతి కల్పించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంజీవ్ ముఖియా నీట్ క్వశ్చన్ పేపర్, జవాబుల పత్రాన్ని అదే హాస్టల్లో విద్యార్ధులకు అందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ హాస్టల్‌ను ప్రభాత్ రంజన్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ప్రభాత్ రంజన్‌కు సైతం ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని గుర్తించారు. రంజన్ నీట్ పేపర్లను ప్రొఫెసర్ నుంచి తీసుకొని సంజీవ్ ముఖియాకు ఇచ్చినట్లు తేలింది. పరీక్షకు ముందు రోజే పేపర్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చినా సమయం లేకపోవడం వల్ల పూర్తిగా చదవలేదని సమాచారం. ఇక, పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేపర్ లీక్ కేసులో ముఖియాతో సంబంధం ఉన్న రవి అత్రి పేరు కూడా బయటపడింది.చదవండి : 👉 నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం చర్యలుముఖియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరం చేశారు. నీట్ పేపర్ లీక్‌తో ముఖియా ప్రమేయం ఉన్నట్లు సూచించే వివరాలు వెలుగులోకి రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం( ఈఓయూ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఈఓయూ నలంద, గయా, నవాడా జిల్లాల్లోని పోలీసు బృందాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, లీకైన పేపర్లు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదుగా బీహార్‌కు చేరుకున్నాయని పోలీసులు అనుమానించడంతో జార్ఖండ్‌కు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ ముఖియా ఎవరు2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి టికెట్‌పై పోటీ చేశారు. నిందితులపై కఠిన చర్యలుకాగా, వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. -
మోదీజీ మీతోనే సాధ్యం.. పాశ్వాన్ ఆసక్తిర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జీపీ)పార్టీ అధినేత, ఎన్డీఏ భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ మోదీకి మద్దతు పలికారు. అనంతరం మోదీతో కరచాలనం చేశారు. ఆపై కౌగిలించుకున్నారు. ప్రతి స్పందనగా మోదీ పాశ్వాన్ తలను నిమిరారు. ఆ అద్భుత క్షణాల్ని పాశ్వాన్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ (ఎన్డీఏ) విజయానికి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ ఘనత మీకే దక్కుతుంది. మీ సంకల్పబలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడానికి దోహదపడింది. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసించారు.ప్రధానిపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మీ వల్లే ఈ రోజు ప్రపంచం ముందు భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పాశ్వాన్ మోదీనిపై ప్రశంసలు కురిపించారు. -
బీహార్ లోక్‌సభ ఎన్నికలు.. పోలింగ్ సమయం పెంపు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం, బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ లోక్‌సభ స్థానాలకు చెందిన వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సాధారణ పోల్ సమయాలు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఉంటాయి. అయితే అవి భూభాగం, సూర్యాస్తమయం సమయం, భద్రతా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. -
మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్
పాట్నా: మీరు చేప, ఏనుగు లేదా గుర్రాన్ని తినండి. ఇలా చూపించడం ఎందుకు? అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల్ని జైల్లో పెట్టిస్తాంటూ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఒకరైన పాటలీపుత్ర లోక్‌సభ అభ్యర్ధి మిసా భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఈ తరుణంలో అలయన్స్‌లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం తరుపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీహార్‌లోని జమూయిలో ఎన్డీయే అభ్యర్థి, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ నేత అరుణ్ భారతికి మద్దతుగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. మాంసాహారం తింటూ వీడియోలు ఈ సందర్భంగా ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘కొంతమంది నాయకులు ఓ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నవరాత్రుల సమయంలో మాంసాహారం తింటున్న వీడియోల్ని పోస్టు చేశారని’ ఆరోపించారు. మీరు తినే తిండి మాకు చూపించడం ఎందుకు? ‘నవరాత్రులలో చేపలు తింటున్నావు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు. చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను. ఇందులో చూపించాల్సిన అవసరం ఏముంది. ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసమేనని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓటు వేస్తారని భావిస్తున్నారు అని ఆరోపించారు. మోదీని జైల్లో వేస్తారా? లాలూ ప్రసాద్ యాదవ్‌ను తన స్నేహితుడంటూ.. ఆయన కుటుంబ సభ్యులు.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోదీని జైల్లో పెడతామని చెబుతున్నారు. జైల్లో లేదా బెయిల్‌పై ఉన్నవారు మోదీని జైలుకు పంపిస్తారా? బీహార్ ప్రజలు అన్నింటినీ సహిస్తారు, కానీ ఇది కాదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మరోసారి మోదీయే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోందని, వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ఇతర దేశాలు ఆయనను ఆహ్వానించడం ప్రారంభించాయని,ఈ ఎన్నికలను లాంఛనప్రాయంగా చూస్తున్నారని తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసిస్తూ, యువ నాయకుడు ఎన్డీయే పిచ్‌పై రన్ హిట్టర్ అని, అవసరమైనన్ని పరుగులు చేస్తారని కొనియాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ కలలను ఆయన నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. -
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
మ్యాంగో ఈటింగ్ పోటీలు
-
దేవాలయాలపై పన్ను: ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం
పట్న: రాష్ట్రంలోని దేవాలయాలపై బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆలయాలను రిజిస్టెర్ చేయించుకుని పన్నులు చెల్లించాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై ధార్మిక సంస్థలు, భక్తులు భగ్గుమంటున్నారు. వ్యక్తులు తమ ఇంటి ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించి భక్తులను అనుమతించినా కూడా ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆ ఆలయాలు 4 శాతం పన్ను చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీలో చేరిన అకాలీదళ్ కీలక నేత.. భక్తులు దర్శించే పత్రి ఆలయాన్ని నమోదు చేయించాలని ఆపై వాటికి వచ్చే ఆదాయంలో 4 శాతం పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆలయాలపై పన్ను విధింపు నిర్ణయాన్ని ‘జిజియా పన్ను’ గా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ అభివర్ణించారు. అయితే దీనిపై బీహార్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఆలయాలపై తాము పన్ను విధించలేదని తెలిపింది. అయితే అది కేవలం వార్షిక సేవా రుసుమని వివరణ ఇచ్చింది. చదవండి: దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ -
రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు
పట్నా: బిహర్లో దారుణం చోటుచేసుకుంది. పడవ ఛార్జీ అడిగినందుకు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు. సికల్ యాదవ్ తన బోట్లో ప్రయాణించినందుకు రూ.10 చార్జీగా అడిగాడు. దీంతో ఆ వ్యక్తులు యువకుడుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న గ్రామస్తులు జోక్యం చేసుకుని వారి నుంచి ఆ యువకుడిని రక్షించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం సికల్ యాదవ్ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని వెల్లడించారు. చదవండి: 22 రోజులుగా ఫ్రీజర్‌లో కుమారుడి మృతదేహాం.. చివరకు.. -
తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను..
పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో కన్న పిల్లలను దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన కమల్‌దేవ్, వీణా దేవి అనే మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా,వీణా దేవి పలువురితో అక్రమసంబంధం కలిగి ఉందని, ఆమెతో కమల్‌దేవ్ తరచూ గొడవపెట్టుకునేవాడు. వారిద్దరి మధ్య తరచూ గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె పిల్లలను ఇంట్లో వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి తన భర్తపై గృహహింస, అదనపు కట్నం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై కోపంతో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న చిన్నారుల తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి చూడగా అంకిత్, అలీషా మృతదేహాలు వారు నిద్రిస్తున్న మంచం మీద రక్తపు మడుగులో పక్కపక్కనే పడి ఉన్నాయి.తన భార్య పలువురితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ పిల్లలు తన వల్ల కలిగిన సంతానం కాదని చెబుతూ మానసికంగా వేదించేదని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య) -
ఇద్దరు చైనీయులు అరెస్ట్
పాట్నా: బిహార్‌లో ఇద్దరు చైనా యువకులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. చైనా నుంచి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం సీసాలతో ఓ హోటల్లో పట్టుబడటంతో ఆ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యపానం నిషేధించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం చైనా నుంచి పాట్నాకి వచ్చిన యువకులు ఒప్పో ఫోన్ కంపెనీకి సంబందించిన వ్యక్తులుగా చెప్పి ఓ హోటల్లో ఉంటున్నారు. వారి వద్ద మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పాట్నా పోలీసు అధికారి మాను మహారాజ్ తెలిపారు. రాష్టంలో మద్యం నిషేదం ఉన్నా నిషేధాన్ని ఉల్లంఘించినందుకు సూమారు 1.5 లక్షల మందిపై కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కను ఉన్న నేపాల్, చైనా నుంచి రహస్యంగా మద్యం సరఫర అవుతోందని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
పేరులోనే ఉన్నది పెన్నిధి
విశ్లేషణ: ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును ప్రేరేపిస్తున్నదో గమనించండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమింపజేయటం ప్రారంభమైంది. ఇది సహజంగానే కొందరిలో ఆగ్రహావేశాలను రగిల్చింది. వాటిని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇది మాసికే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది ఓటరుకు అందించలేదు. పేరు అనేది ఉందే అది మహా జిత్తులమారిది. మీరు మీ పేరుకు తగ్గట్టుగా నడుచుకోక తప్పని పరిస్థితిని ఎప్పుడు కల్పిస్తుందో తెలియనే తెలీదు. అందుకే రాజకీయ పార్టీలు తెలివిగా... తర్వాత చింతించడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటాన్ని కోరుకుంటాయి. భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లేదా సమాజ్‌వాదీ పార్టీ వంటి పేర్లు పెద్ద పెద్ద లక్ష్యాలను అతి సామాన్యంగా నిర్వచించే బాపతు పేర్లు. ఇక సీపీఐ(ఎమ్) లోని మార్క్సిస్టు అనే భాగం కచ్చితంగా చెప్పేది ఏమిటా అని ఆశ్యర్యం కలుగుతుంటుంది. అయితే అది ఈ చర్చను పెడదోవ పట్టించే అనవసర మైన ఆ సంగతిని అలా ఉంచితే... కూటములు అని పిలిచే చలనశీల మైన వాస్తవాలకు సామాన్యంగా సూటిగా లక్ష్యాన్ని తెలిపే పొట్టి పేరు ఉండటం అవసరం. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, యూపీఏలు రెండూ వాటి ఉద్దేశాలను సమంజసమైన రీతిలో వివరించేవే. బిహార్‌లో ఇటీవల నితీష్‌కు మార్, లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, శరద్ పవార్, సోనియా గాంధీలు 'మహా కూటమి' ని నిర్మించారు. అతుకుల బొంతలా ఏర్పాటు చేసిన ఆ కూటమి పగులు బారి ఉండటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ కూటమి తనకే కీడు చేసేటంతటి అతి బృహత్తరమైనది మరి. జ్ఞాపకం స్వల్పకాలిక మే, కానీ మరీ అంత స్వల్పకాలికమైనదేమీ కాదు. ఆ కూటమి ప్రారంభ స్థానం 'మహా విలీనం' ములాయం మూలపురుషునిగా ఏర్పడ్డ ఆ కూటమికి... గతం జ్ఞాపకం మీది మక్కువతో 'జనతా పరివార్' అని నామకరణం చేశారు. జయజయ ధ్వానాల హోరు మధ్య ఆ విషయాన్ని ప్రకటించారు. అది సద్దుమణగక ముందే ఆ కూటమి కాస్తా కుప్ప కూలింది. విలీనానికి బదులుగా బిహార్ ఎన్నికల్లో అంతా కలసి పోటీ చేస్తామంటూ.. వారు అంతటి ఘనమైననదేమీ కాని ప్రత్యామ్నాయాన్ని చూ పారు. అంతా ప్రశాంతంగా ఉన్న ఓ రోజున నితీష్, లాలూప్రసాద్‌లు శాసన సభ ఎన్నికలకు సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఇద్దరు బడా నేతలకు చెరి 100, దీన మౌన ముద్రలో ఉన్న కాంగ్రెస్‌కు 40, ఏ భాగస్వామైనా ఏరుకోవ చ్చని ఓ మూడు సీట్లను వదిలారు. పవార్ లేదా ములాయం సంప్రదించవ లసిన నేతలని ఎవరూ ఆలోచించలేదు. ఇది సహజంగానే కొందరికి ఆగ్రహావే శాలను కలిగించింది. ఇది రాస్తున్నప్పటికి ఆగ్రహావేశాలను చల్లార్చే ప్రయ త్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ జాబితా నుంచి 10 సీట్లు తమకు ఇవ్వాలని ములాయం కోరుతున్నారు. ఇది అత్యంత అమోఘమైన ఎత్తుగడ. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అయితే ఓటరుకు సంబంధించినంత వరకు ఇది మాసిక వేయడమే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది అందించలేదు. ఎన్నికల సరళి ఏ దిశను చూపిస్తున్నదో తెలుసుకోవాలనుకునే వారి కోసం అందుకు సంబంధించిన కొన్ని సూచికలను ఇస్తున్నాం. 1. వలసను గమనించండి. ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును పేరేపిస్తున్నదో గమనిం చండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమిం పజేయటం ప్రారంభమైంది. 2. ప్రజాభిప్రాయ సేకరణలను గమనించండి. కానీ అవి తమకు తాముగా చేసుకునే ప్రచారాన్ని బట్టి మాత్రం చూడకండి. అవి సీట్ల అంచనాలను ప్రకటించేటప్పుడు మీలో కొంత సంశయవాదానికి తావు ఉండనివ్వండి. బ్రిటన్ ఎన్నికల అంచనాల పండితులు ప్రపంచంలోనే అత్యంత నిపుణులు. అయినా ఈ వేసవి సార్వత్రిక ఎన్నికల్లో వారి అంచనాలు ఎంతగా తప్పాయంటే...వారింకా టీవీ స్టూడియోల్లో ముక్కలు చెక్కలై పడివున్న తమ అహం శకలాలను ఏరుకుంటూనే ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలు ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించడానికి ఉద్దేశించినవి. కానీ చాలా తరచుగా అవి విశ్లేషకులకున్న పక్షపాత వైఖరినే సూచిస్తుంటాయి. ఏది ఏమైనా. మీరు శ్రద్ధగా గమనించాల్సింది మాత్రం ఒక ఎన్నికల సీజనులో జరి పిన పలు అభిప్రాయ సేకరణల్లో ఒక్కో పార్టీకి లభించిన మద్దతు గ్రాఫ్‌ను. కాలానుగ తంగా వచ్చే హెచ్చుతగ్గులు స్వల్పంగానే ఉండొచ్చు, కానీ అవి ఆ గ్రాఫ్‌లో నమోదు అవుతాయి. ఒక పక్షాన ఆ గ్రాఫ్ పైకి ఎదుగుతుంటే, మరో పక్షాన దిగువకు దిగజారుతుంటుంది. ఒక్కొక్క అంగుళమే పైకి ఎగబాకే పార్టీని వెన్నంటే విజయాన్ని సాధించిపెట్టే 'గాలి' వీస్తుంటుంది. 3. మాటల్ని జాగ్రత్తగా గమనించండి. మీ స్వంత మాటల్ని కాదు...అవి ఎప్పుడూ ప్రశాతంగా, స్థిరంగా ఉంటాయనే అంతా భావిస్తారు. శ్రద్ధగా గమ నించాల్సింది రాజకీయ నాయకుల మాటలను. స్థిమితత్వాన్ని కోల్పోవడం మొదలుపెట్టిన నాయకులు క్షేత్రస్థాయిలోని ప్రతికూల పరిస్థితుల వేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నవారై ఉంటారు. ఒక బహిరంగ సభలో నితీష్ కుమార్ చిరచిరలాడి, ఆగ్రహంతో జగడానికి దిగారు. మొబైల్ కెమెరా అనే ప్రమాదక రమైన ఆవిష్కరణ దాన్ని ఖండించే ఆవకాశం ఆయనకు లేకుండా చేసేసింది. ఆ వీడియో క్లిప్పు వైరస్‌లా సోషల్ మీడియాలో వ్యాపించిపోయింది. 4. కళ్లను గమనించండి. సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య లెక్కలోకి వచ్చేదే. అయితే ఓటర్లు ప్రత్యర్థిని గేలి చేయడం కోసం గాక, తమ పక్షానికి హర్షధ్వా నాలు పలకడానికి వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలకు హాజరైన వారిలో ఎక్కువ మంది యువతే. అయితే అది కథలో ఓ భాగం మాత్ర మే. అసలు కథ వారి కళ్లల్లో ఉంది. అవి విశ్వాసంతో నిండిన సజీవమైన వెలుగును నింపుకుని ఉన్నాయి. ఆ వెలుగు రవ్వ ఇతరులకు సైతం సోకేది. 5. గెలుపు, ఓటముల మధ్య స్వల్ప తేడాలను, ఆధిక్యతలను గమనించండి. మీరు అలాంటి వివరాల్లోకి వెళ్లే బాపతు రాజకీయ వ్యసనపరులు కాక పోవచ్చు. కానీ నిజం వెల్లడయ్యేది అక్కడే. గత ఎన్నికల్లో గెలుపు, ఓటము లకు మధ్య తేడా 5,000 ఓట్లు ఎక్కువ లేదా తక్కువ ఉన్న నియోజక వర్గాల్లో ఏం జరుగుతోందో పరిశీలించండి. ఫలితాన్ని తారుమారు చేయ డానికి 1 శాతం మొగ్గు సరిపోతుంది. ఆ మాత్రం బలం మీ పక్షానికి చేరితే 5,000 ఓట్ల తేడాతో కోల్పోయిన సీటును 3,000 ఓట్ల తేడాతో గెలుచుకుంటారు. వీటికి నేను ఆరో విషయాన్ని కూడా చేర్చగలను. కానీ అది పూర్తిగా అభ్యర్థులను ఉద్దేశించినది: మీరు మీ జేబుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎన్నికల పోరాటానికి డబ్బు అవసరమే. కానీ డబ్బు ఎన్నికల్లో గెలుపును సంపాదించిపెట్టలేదు. ఒత్తిడికి గురైన అభ్యర్థులు ఊహల భూతాలను మనీ పర్సులతో తరిమికొట్టాలని చూస్తుంటారు. కానీ డబ్బు ఎప్పుడూ మీ వెంట తిరిగే వారిని సంపాదించిపెట్టగలదే తప్ప, క్షేత్ర స్థాయి వాస్తవికతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపజాలదు. ప్రజలు ఒకరోజు సంబరం కోసం గాక, మెరుగైన జీవితం కోసం ఓటు వేస్తారు. మీరు సరళమైన పేరున్న కూటమికి ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త వహించండి. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)