పాట్నా: బిహార్‌లో ఇద్దరు చైనా యువకులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. చైనా నుంచి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం సీసాలతో ఓ హోటల్‌లో పట్టుబడటంతో ఆ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యపానం నిషేధించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం చైనా నుంచి పాట్నాకి వచ్చిన యువకులు ఒప్పో ఫోన్ కంపెనీకి సంబందించిన వ్యక్తులుగా చెప్పి ఓ హోటల్‌లో ఉంటున్నారు.
వారి వద్ద మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పాట్నా పోలీసు అధికారి మాను మహారాజ్ తెలిపారు. రాష్టంలో మద్యం నిషేదం ఉన్నా నిషేధాన్ని ఉల్లంఘించినందుకు సూమారు 1.5 లక్షల మందిపై కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కను ఉన్న నేపాల్, చైనా నుంచి రహస్యంగా మద్యం సరఫర అవుతోందని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment