consuming alcohol
-
గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
గంజాయిపై భారత్‌తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..? గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు. గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. -
విషాదం: కల్తీమద్యం తాగి 11 మంది మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. కల్తీమద్యం సేవించి 10 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీమద్యం ఘటన మోరెనాలో కలకలం రేపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు, వైద్య అధికారులు ఘటనకు గల కారణాలను అనేష్విస్తున్నారు. ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశిచింది. సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్ సుజనీయ సంఘటనాస్థలికి చేరుకుని మద్యం షాపు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానికులు తెలుపుతున్న సమచారం ప్రకారం.. మోరానా సమీపంలోని ఓగ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతగా మద్యం తయారు చేసుకుని తాగారని, ఆ తరువాత ఒక్కరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో 11 మంది మృతి చెందినట్లు చెప్పారు. -
ఇద్దరు చైనీయులు అరెస్ట్
పాట్నా: బిహార్‌లో ఇద్దరు చైనా యువకులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. చైనా నుంచి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం సీసాలతో ఓ హోటల్లో పట్టుబడటంతో ఆ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యపానం నిషేధించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం చైనా నుంచి పాట్నాకి వచ్చిన యువకులు ఒప్పో ఫోన్ కంపెనీకి సంబందించిన వ్యక్తులుగా చెప్పి ఓ హోటల్లో ఉంటున్నారు. వారి వద్ద మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పాట్నా పోలీసు అధికారి మాను మహారాజ్ తెలిపారు. రాష్టంలో మద్యం నిషేదం ఉన్నా నిషేధాన్ని ఉల్లంఘించినందుకు సూమారు 1.5 లక్షల మందిపై కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కను ఉన్న నేపాల్, చైనా నుంచి రహస్యంగా మద్యం సరఫర అవుతోందని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
కెమెరాలో ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయాడు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమలు చేస్తున్న మద్యనిషేధం పథకానికి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూట్లు పొడిచారు. నర్కటియగంజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ వర్మ మద్యంతాగుతూ కెమెరాలో అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యే మద్యంతాగుతూ అతిథులకు డ్రింక్ ఆఫర్ చేస్తున్న వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. భారత్‌లో తయారైన బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం కూడా తన దగ్గర ఉన్నట్టు వినయ్ వర్మ అతిథులతో చెబుతున్నప్పటి దృశ్యాలు రికార్డు కావడం కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. వినయ్ వర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బిహార్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం.. మద్యం విక్రయించినా, తాగినా, ఇతరులకు ఆఫర్ చేసినా నేరం. దోషీగా తేలితే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. -
కొడుకు తాగొద్దన్నాడని తండ్రి ఆత్మహత్య
లక్నో: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కుమారుడు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుఖ్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. బాల్లియా ఎస్పీ అనియా అన్సారీ కథనం ప్రకారం.. వీర్ బహదుర్ సింగ్(60) తన కుటుంబంతో పాటు సుఖ్పురాలో నివాసం ఉంటున్నాడు. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రోజు లాగానే మద్యం సేవించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా అతని కొడుకు బహదూర్ సింగ్ అడ్డుకున్నాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యం సేవించడం మానేయాలని తండ్రికి సూచించాడు. కొడుకు మందలించడంతో బహదూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంసభ్యులు నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరేసుకుని బహదూర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన అలవాట్లను కొడుకు వ్యతిరేకించడంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని ఎస్పీ అన్సారీ వివరించారు.