
గంజాయిపై భారత్‌తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..?
గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు.
గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు.
నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..
Comments
Please login to add a commentAdd a comment