
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. కల్తీమద్యం సేవించి 10 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీమద్యం ఘటన మోరెనాలో కలకలం రేపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు, వైద్య అధికారులు ఘటనకు గల కారణాలను అనేష్విస్తున్నారు. ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశిచింది. సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్ సుజనీయ సంఘటనాస్థలికి చేరుకుని మద్యం షాపు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానికులు తెలుపుతున్న సమచారం ప్రకారం.. మోరానా సమీపంలోని ఓగ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతగా మద్యం తయారు చేసుకుని తాగారని, ఆ తరువాత ఒక్కరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో 11 మంది మృతి చెందినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment