Morena
-
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
పాత కక్షలు..తుపాకులతో వెళ్లి విధ్వంసం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
భోపాల్: మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పాత కక్షతో ఓ కుటుంబానికి చెందిన వారు తుపాకులతో వెళ్లి మరో కుటుంబంపై భీకర దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. లేప గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తుపాకులతో ముఠాగా వెళ్లిన కొందరు.. బాధిత కుటుంబంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా పెద్ద పెద్ద తుపాకులు తీసుకెళ్లి దాడి చేశారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పాత వైరం ఉంది. 2013లో చెత్త పడేసే విషయంపై ధీర్ సింగ్ థోమర్, గజేంద్ర సింగ్ థోమర్ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ధీర్ సింగ్ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత గజేంద్ర కుటుంబం ఊరు విడిచి పారిపోయింది. అయితే ఇరు కుటుంబాలు ఇటీవలే కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో గజేంద్ర సింగ్ థోమర్ ఫ్యామిలీ 10 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. వీరు ఇంటికి వచ్చిన కాసేపటికే పగతో రగిలిపోతున్న ధీర్ సింగ్ కుటుంబం దాడి చేసింది. మొదట కర్రలతో గజేంద్ర కుటంబసభ్యులను వీరు చితకబాదారు. ఆ తర్వాత తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గజేంద్ర సింగ్ థోమర్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు, ముగ్గురు మహిళలు చనిపోయారు. పాత పగలే ఈ హత్యలకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి.. -
Fighter Jets: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధ విమానాలు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్, మిరాజ్ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి. -
కన్నీటికే కన్నీరు! రెండేళ్ల తమ్ముడు మృతి.. రెండు గంటలు జాడలేని తండ్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు. రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు. రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు. తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు. -
Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!
ఎన్నో అద్భుత, మర్మగర్భ దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. వాటిల్లో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగ్గవే. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో రెండు దేవాలయాలు ఒడిస్సాలో, రెండు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలో ఉన్న 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇది గుండ్రని ఆకారంలో, 64 గదుల్తో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత విగ్రహం ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనేపేరు వచ్చింది. ఐతే వీటిల్లో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఉంటుంది ఈ దేవాలయం. చూపరులకు పళ్లెం ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మంటపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్‌ను నిర్మించిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని నానుడి. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాలమాదిరిగానే ఉంటాయి. చదవండి: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. తాబేలు రాజు దేవ్‌పాల్ 1323లో ఈ దేవాలయాన్నినిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం బోధించేవారట. తంత్ర మంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి తరలివచ్చేవారట. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడివుందని అక్కడి స్థానికుల నమ్మకం. అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ 64 యోగిని దేవాలయంలో దాగివున్నాయి. చదవండి: 'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’ -
‘ఇళ్లల్లోకి వెళ్లండి, రోడ్లపై కనిపిస్తే కాల్చిపడేస్తాం’
భోపాల్: ఆకతాయిలు వీరంగం సృష్టించారు. పట్టపగలే బైకులపై తిరుగుతూ తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. రోడ్లమీద కనిపిస్తే కాల్చిపడేస్తాం’ అంటూ కొందరు ఆకతాయిలు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన మొరెనా జిల్లా బంఖండి ప్రాంతం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని 25మంది దుండగులు మాస్క్ ధరించి గన్స్‌తో వీరంగం సృష్టించారు. బైక్‌పై డ్రైవ్ చేసుకుంటూ 100 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీ గుళ్ల శబ్దంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇళ్లు, బస్సులు ద్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ రాయ్ సింగ్ నార్వారియా పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు పాల్పడ్డ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే స్థానికుల వెర్షన్ మరోలా ఉంది. ఈ కాల్పులు లాక్డౌన్ నిబంధనల్ని పాటించనందుకు కాదు. ఓ యువతి ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ వల్ల రెండు సామాజిక వర్గాల మధ్య అగ్గిరాజేసిందని చెప్తున్నారు. ఓ వర్గం మరో వర్గంవారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగిందని అంటున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదే అంటూ స్థానికులు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యం.. అందుకే రాష్ట్రంలో మే15 వరకు జనతాకర్ఫ్యూ పేరుతో లాక్డౌన్ విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. #CoronaCurfew not in Morena! dozens masked riding mobikes openly firing targeting the other caste over a social media post! @GargiRawat @ndtv @ndtvindia pic.twitter.com/B7GG8tXAa1 — Anurag Dwary (@Anurag_Dwary) May 8, 2021 -
విషాదం: కల్తీమద్యం తాగి 11 మంది మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో తీరని విషాదం చోటుచేసుకుంది. కల్తీమద్యం సేవించి 10 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కల్తీమద్యం ఘటన మోరెనాలో కలకలం రేపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు, వైద్య అధికారులు ఘటనకు గల కారణాలను అనేష్విస్తున్నారు. ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశిచింది. సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్ సుజనీయ సంఘటనాస్థలికి చేరుకుని మద్యం షాపు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానికులు తెలుపుతున్న సమచారం ప్రకారం.. మోరానా సమీపంలోని ఓగ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతగా మద్యం తయారు చేసుకుని తాగారని, ఆ తరువాత ఒక్కరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో 11 మంది మృతి చెందినట్లు చెప్పారు. -
కరోనా: పాజిటివ్ వ్యక్తి విందులో 1500 మంది!
భోపాల్: ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఉదంతం మరువకముందే మధ్య ప్రదేశ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా.. అతను ఓ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియడం కలకలం రేపుతోంది. వివరాలు.. దుబాయ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న సురేశ్ అనే వ్యక్తి తల్లి గత నెలలో మరణించారు. దీంతో గత నెల 17 న అతను స్వస్థలం మొరేనాకు తిరిగొచ్చాడు. మార్చి 20న దశదిన కర్మ నిర్వహించి బంధువులు, కాలనీవాసులకు భోజనాలు పెట్టించాడు. దాదాపు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే, మార్చి 25న సురేశ్ జ్వరం బారినపడ్డాడు. ఓ నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లడంతో అతనికి, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్ 2 న బయటపడింది. (చదవండి: షాకింగ్ రిపోర్టు: జూన్ వరకు లాక్డౌన్ పొడిగింపు..!) కాగా, ఆ దంపతులతో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం 12 మందిని ఆస్పత్రి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని మెరెనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ బండిల్ చెప్పారు. నెగెటివ్ ఫలితాలు వచ్చినవారిని ఇళ్ల వద్దే గృహ నిర్భంధంలో ఉంచామని తెలిపారు. దుబాయ్ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్ సోకిందని, కానీ లక్షణాలు బయటపలేదని డాక్టర్ వెల్లడించారు. ఇక సురేశ్ భోజనాలు ఏర్పాటు చేసిన కాలనీ మొత్తాన్ని స్థానిక యంత్రాంగం సీజ్ చేసింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా 2,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 72 మంది మరణించారు. రాష్ట్రంలో 154 కేసులు నమోదయ్యాయి. (చదవండి: కరోనా వైరస్: ‘పాజిటివ్’ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్) -
మెక్సికోకు వామపక్ష అధ్యక్షుడు
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు. పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్‌ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు. -
గాంధీ బొమ్మను మరిచిపోయారట!
భోపాల్: నిత్యవసర సరుకుల కొనేందుకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వ్యక్తికి కొత్త 500 రూపాయల నోట్లు నకిలీవి రావడంతో షాక్ తిన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరేనాలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గోవర్ధన్ శర్మ నేటి ఉదయం డబ్బులు డ్రా చేసుకునేందుకు మోరెనాలోని ఏ ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తినడం అతడి వంతయింది. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో నకిలీ నోట్లు అని గుర్తించి తాను మోసపోయానని గ్రహించాడు. ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు తాను డ్రా చేసిన నోట్లను చూపించి అసలు విషయాన్ని చెప్పాడు. అతడు ఏటీఎంలో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేశాడు. వెంటనే ఎస్బీఐ అధికారులు కొందరు ఏటీఎం వద్దకు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కాదని, అయితే ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరిచిపోయారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు పంపిస్తామని ఆ ఎస్బీఐ ఉద్యోగి వివరించారు. పెద్ద నోట్లరద్దు చేసిన ఐదు నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండగా.. మరోవైపు పదే పదే ఎస్బీఐ ఏటీఎంలలో ఇలా నకిలీ నోట్లు వస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంతకుముందు ఢిల్లీలోని మరో ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ షాజహాన్పూర్లో పలు ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 2000 నోట్లు నకిలీవి కలకలం రేపిన విషయం తెలిసిందే.