![Poisonous Liquor Confiscated by Digging with JCB](/styles/webp/s3/article_images/2024/08/28/jcb-main.jpg.webp?itok=w1oJ61lM)
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.
మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్‌కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్‌ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment