Couple Consumes Poison During Their Marriage Ceremony, Groom Dies Indore - Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలిని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు

Published Thu, May 18 2023 5:03 PM | Last Updated on Fri, May 19 2023 5:29 AM

Couple Consumes Poison During Their Marriage Ceremony, Groom Dies Indore - Sakshi

భోపాల్‌: పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన వధూవరులు విషం తాగి అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతోంది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగి ఈ విషయాన్ని వధువుకు తెలియజేశాడు. వరుడు విషం సేవించాడని తెలిసిన వెంటనే వధువు కూడా తాగింది. వధూవరుల బంధువుల వారిద్దరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వరుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వధువు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు.

కాగా గత కొన్ని రోజులుగా తన పెళ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేస్తోందని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కెరీర్ దృష్ట్యా తమ పెళ్లికి రెండేళ్లు గడువు కావాలని కోరడంతో యువతి వినక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్‌ ఫ్యాక్టరీగా మార్చారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement