పేరులోనే ఉన్నది పెన్నిధి | Sakshi
Sakshi News home page

పేరులోనే ఉన్నది పెన్నిధి

Published Mon, Sep 7 2015 12:53 AM

పేరులోనే ఉన్నది పెన్నిధి

విశ్లేషణ:

ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును ప్రేరేపిస్తున్నదో గమనించండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమింపజేయటం ప్రారంభమైంది. ఇది సహజంగానే కొందరిలో ఆగ్రహావేశాలను రగిల్చింది. వాటిని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇది మాసికే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది ఓటరుకు అందించలేదు.


 పేరు అనేది ఉందే అది మహా జిత్తులమారిది. మీరు మీ పేరుకు తగ్గట్టుగా నడుచుకోక తప్పని పరిస్థితిని ఎప్పుడు కల్పిస్తుందో తెలియనే తెలీదు. అందుకే రాజకీయ పార్టీలు తెలివిగా... తర్వాత చింతించడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటాన్ని కోరుకుంటాయి. భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లేదా సమాజ్‌వాదీ పార్టీ వంటి పేర్లు పెద్ద పెద్ద లక్ష్యాలను అతి సామాన్యంగా నిర్వచించే బాపతు పేర్లు. ఇక సీపీఐ(ఎమ్) లోని మార్క్సిస్టు అనే భాగం కచ్చితంగా చెప్పేది ఏమిటా అని ఆశ్యర్యం కలుగుతుంటుంది. అయితే అది ఈ చర్చను పెడదోవ పట్టించే అనవసర మైన ఆ సంగతిని అలా ఉంచితే... కూటములు అని పిలిచే చలనశీల మైన వాస్తవాలకు సామాన్యంగా సూటిగా లక్ష్యాన్ని తెలిపే పొట్టి పేరు ఉండటం అవసరం. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, యూపీఏలు రెండూ వాటి ఉద్దేశాలను సమంజసమైన రీతిలో వివరించేవే. బిహార్‌లో ఇటీవల నితీష్‌కు మార్, లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, శరద్ పవార్, సోనియా గాంధీలు 'మహా కూటమి' ని నిర్మించారు. అతుకుల బొంతలా ఏర్పాటు చేసిన ఆ కూటమి పగులు బారి ఉండటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆ కూటమి తనకే కీడు చేసేటంతటి అతి బృహత్తరమైనది మరి.


 జ్ఞాపకం స్వల్పకాలిక మే, కానీ మరీ అంత స్వల్పకాలికమైనదేమీ కాదు. ఆ కూటమి ప్రారంభ స్థానం 'మహా విలీనం' ములాయం మూలపురుషునిగా ఏర్పడ్డ ఆ కూటమికి... గతం జ్ఞాపకం మీది మక్కువతో 'జనతా పరివార్' అని నామకరణం చేశారు. జయజయ ధ్వానాల హోరు మధ్య ఆ విషయాన్ని ప్రకటించారు. అది సద్దుమణగక ముందే ఆ కూటమి కాస్తా కుప్ప కూలింది. విలీనానికి బదులుగా బిహార్ ఎన్నికల్లో అంతా కలసి పోటీ చేస్తామంటూ.. వారు అంతటి ఘనమైననదేమీ కాని ప్రత్యామ్నాయాన్ని చూ పారు. అంతా ప్రశాంతంగా ఉన్న ఓ రోజున నితీష్, లాలూప్రసాద్‌లు శాసన సభ ఎన్నికలకు సీట్ల కేటాయింపును ప్రకటించారు. ఇద్దరు బడా నేతలకు చెరి 100, దీన మౌన ముద్రలో ఉన్న కాంగ్రెస్‌కు 40, ఏ భాగస్వామైనా ఏరుకోవ చ్చని ఓ మూడు సీట్లను వదిలారు. పవార్ లేదా ములాయం సంప్రదించవ లసిన నేతలని ఎవరూ ఆలోచించలేదు. ఇది సహజంగానే కొందరికి ఆగ్రహావే శాలను కలిగించింది. ఇది రాస్తున్నప్పటికి ఆగ్రహావేశాలను చల్లార్చే ప్రయ త్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ జాబితా నుంచి 10 సీట్లు తమకు ఇవ్వాలని ములాయం కోరుతున్నారు. ఇది అత్యంత అమోఘమైన ఎత్తుగడ.


 ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అయితే ఓటరుకు సంబంధించినంత వరకు ఇది మాసిక వేయడమే గానీ ఐక్యత కాదు. సుపరిపాలనకు మౌలిక ఆవశ్యకత అయిన సుస్థిరతను అది అందించలేదు.
 ఎన్నికల సరళి ఏ దిశను చూపిస్తున్నదో తెలుసుకోవాలనుకునే వారి కోసం అందుకు  సంబంధించిన కొన్ని సూచికలను ఇస్తున్నాం.
 1.  వలసను గమనించండి. ఏ ఒక్క పార్టీలోనూ లేదా కూటమిలోనూ పూర్తి లోపరహితమైన సీట్ల పంపిణీ జరగదు. అయితే అది ఏ పక్షాన కల్లోలం సద్దుమణగేలా చేసిందో, ఏ పక్షాన ఫిరాయింపును పేరేపిస్తున్నదో గమనిం చండి. అగ్రశ్రేణి నేతలు 'మహా కూటమి' లోని ప్రధాన పార్టీలను నిష్ర్కమిం పజేయటం ప్రారంభమైంది.
 2. ప్రజాభిప్రాయ సేకరణలను గమనించండి. కానీ అవి తమకు తాముగా చేసుకునే ప్రచారాన్ని బట్టి మాత్రం చూడకండి. అవి సీట్ల అంచనాలను ప్రకటించేటప్పుడు మీలో కొంత సంశయవాదానికి తావు ఉండనివ్వండి. బ్రిటన్ ఎన్నికల అంచనాల పండితులు ప్రపంచంలోనే అత్యంత నిపుణులు. అయినా ఈ వేసవి సార్వత్రిక ఎన్నికల్లో వారి అంచనాలు ఎంతగా తప్పాయంటే...వారింకా టీవీ స్టూడియోల్లో ముక్కలు చెక్కలై పడివున్న తమ అహం శకలాలను ఏరుకుంటూనే ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలు ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించడానికి ఉద్దేశించినవి. కానీ చాలా తరచుగా అవి విశ్లేషకులకున్న పక్షపాత వైఖరినే సూచిస్తుంటాయి. ఏది ఏమైనా. మీరు శ్రద్ధగా గమనించాల్సింది మాత్రం ఒక ఎన్నికల సీజనులో జరి పిన పలు అభిప్రాయ సేకరణల్లో ఒక్కో పార్టీకి లభించిన మద్దతు గ్రాఫ్‌ను.  కాలానుగ తంగా వచ్చే హెచ్చుతగ్గులు స్వల్పంగానే ఉండొచ్చు, కానీ అవి ఆ గ్రాఫ్‌లో నమోదు  అవుతాయి. ఒక పక్షాన ఆ గ్రాఫ్ పైకి ఎదుగుతుంటే, మరో పక్షాన దిగువకు దిగజారుతుంటుంది. ఒక్కొక్క అంగుళమే పైకి ఎగబాకే పార్టీని వెన్నంటే విజయాన్ని సాధించిపెట్టే 'గాలి' వీస్తుంటుంది.  

 3. మాటల్ని జాగ్రత్తగా గమనించండి. మీ స్వంత మాటల్ని కాదు...అవి ఎప్పుడూ ప్రశాతంగా, స్థిరంగా ఉంటాయనే అంతా భావిస్తారు. శ్రద్ధగా గమ నించాల్సింది రాజకీయ నాయకుల మాటలను. స్థిమితత్వాన్ని కోల్పోవడం మొదలుపెట్టిన నాయకులు క్షేత్రస్థాయిలోని ప్రతికూల పరిస్థితుల వేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నవారై ఉంటారు. ఒక బహిరంగ సభలో నితీష్ కుమార్ చిరచిరలాడి, ఆగ్రహంతో జగడానికి దిగారు. మొబైల్ కెమెరా అనే ప్రమాదక రమైన ఆవిష్కరణ దాన్ని ఖండించే ఆవకాశం ఆయనకు లేకుండా చేసేసింది. ఆ వీడియో క్లిప్పు వైరస్‌లా సోషల్ మీడియాలో వ్యాపించిపోయింది.

 4. కళ్లను గమనించండి. సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య లెక్కలోకి వచ్చేదే. అయితే ఓటర్లు ప్రత్యర్థిని గేలి చేయడం కోసం గాక, తమ పక్షానికి హర్షధ్వా నాలు పలకడానికి వెళ్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలకు హాజరైన వారిలో ఎక్కువ మంది యువతే. అయితే అది కథలో ఓ భాగం మాత్ర మే. అసలు కథ వారి కళ్లల్లో ఉంది. అవి విశ్వాసంతో నిండిన సజీవమైన వెలుగును నింపుకుని ఉన్నాయి. ఆ వెలుగు రవ్వ ఇతరులకు సైతం సోకేది.

 5. గెలుపు, ఓటముల మధ్య స్వల్ప తేడాలను, ఆధిక్యతలను గమనించండి. మీరు అలాంటి వివరాల్లోకి వెళ్లే బాపతు రాజకీయ వ్యసనపరులు కాక పోవచ్చు. కానీ నిజం వెల్లడయ్యేది అక్కడే. గత ఎన్నికల్లో గెలుపు, ఓటము లకు మధ్య తేడా 5,000 ఓట్లు ఎక్కువ లేదా తక్కువ  ఉన్న నియోజక వర్గాల్లో ఏం జరుగుతోందో పరిశీలించండి. ఫలితాన్ని తారుమారు చేయ డానికి 1 శాతం మొగ్గు సరిపోతుంది. ఆ మాత్రం బలం మీ పక్షానికి చేరితే 5,000 ఓట్ల తేడాతో కోల్పోయిన సీటును 3,000 ఓట్ల తేడాతో గెలుచుకుంటారు.

 వీటికి నేను ఆరో విషయాన్ని కూడా చేర్చగలను. కానీ అది పూర్తిగా అభ్యర్థులను ఉద్దేశించినది: మీరు మీ జేబుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎన్నికల పోరాటానికి డబ్బు అవసరమే. కానీ డబ్బు ఎన్నికల్లో గెలుపును సంపాదించిపెట్టలేదు. ఒత్తిడికి గురైన అభ్యర్థులు ఊహల భూతాలను మనీ పర్సులతో తరిమికొట్టాలని చూస్తుంటారు. కానీ డబ్బు ఎప్పుడూ మీ వెంట తిరిగే వారిని సంపాదించిపెట్టగలదే తప్ప, క్షేత్ర స్థాయి వాస్తవికతపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపజాలదు. ప్రజలు ఒకరోజు సంబరం కోసం గాక, మెరుగైన జీవితం కోసం ఓటు వేస్తారు. మీరు సరళమైన పేరున్న కూటమికి ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త వహించండి.
 (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)

Advertisement
 
Advertisement
 
Advertisement