
న్యూఢిల్లీ: బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జీపీ)పార్టీ అధినేత, ఎన్డీఏ భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ మోదీకి మద్దతు పలికారు. అనంతరం మోదీతో కరచాలనం చేశారు. ఆపై కౌగిలించుకున్నారు. ప్రతి స్పందనగా మోదీ పాశ్వాన్ తలను నిమిరారు. ఆ అద్భుత క్షణాల్ని పాశ్వాన్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ (ఎన్‌డీఏ) విజయానికి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ ఘనత మీకే దక్కుతుంది. మీ సంకల్పబలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడానికి దోహదపడింది. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసించారు.
ప్రధానిపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మీ వల్లే ఈ రోజు ప్రపంచం ముందు భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పాశ్వాన్ మోదీనిపై ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment