LJP party
-
కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. ‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. .. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. -
మోదీజీ మీతోనే సాధ్యం.. పాశ్వాన్ ఆసక్తిర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జీపీ)పార్టీ అధినేత, ఎన్డీఏ భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ మోదీకి మద్దతు పలికారు. అనంతరం మోదీతో కరచాలనం చేశారు. ఆపై కౌగిలించుకున్నారు. ప్రతి స్పందనగా మోదీ పాశ్వాన్ తలను నిమిరారు. ఆ అద్భుత క్షణాల్ని పాశ్వాన్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ (ఎన్డీఏ) విజయానికి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ ఘనత మీకే దక్కుతుంది. మీ సంకల్పబలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడానికి దోహదపడింది. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసించారు.ప్రధానిపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మీ వల్లే ఈ రోజు ప్రపంచం ముందు భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పాశ్వాన్ మోదీనిపై ప్రశంసలు కురిపించారు. -
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్‌లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్‌కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్‌తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
హిట్ అండ్ రన్ : రేడియో జాకీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్జే) అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ధీరజ్ కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారంపరామర్శించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గులాటిని అరెస్ట్ చేశారు. -
సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి
అమిత్ షాతో చిరాగ్ భేటీ.. 43 మందితో బీజేపీ తొలిజాబితా న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల్లో అసంతృప్తి ప్రారంభమైంది. సీట్ల కేటాయింపుపై ఎన్డీయే మిత్రపక్షం లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదట్లో హామీ ఇచ్చిన ప్రకారం తమకు సీట్లు కేటాయించకపోవడం నిరుత్సాహపరిచిందని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఎన్డీయే మిత్రపక్షాల్లో సోమవారం ఒక అవగాహన కుదిరిన విషయం తెలిసిందే. దాని ప్రకారం బీజేపీ 160, ఎల్జేపీ 40, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎం-ఎస్ 20, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహకు చెంది న ఆర్ఎల్ఎస్పీ 23 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ చిరాగ్ పాశ్వాన్ సోమవారం అర్ధరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయి, తమ వాదనను ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు గతంలో చెప్పిన సీట్ల కేటాయింపు ఫార్మూలాకు, నిన్నటి ప్రకటనకు తేడా ఉంది. అది మమ్మల్ని నిరుత్సాహపరిచింది. కోపమేం లేదు కానీ పార్టీలో అసంతృప్తి నెలకొంది. నిన్నటి ప్రకటనతో మేం షాక్‌కు గురయ్యాం’ అన్నారు. అయితే, ఎన్డీయేకు దూరం కాబోమని, బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమిత్ షా తమ పార్టీ ఆందోళనను అర్థం చేసుకున్నారని, త్వరలో దీనికో పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు. ఎల్జేపీకి కేటాయించిన స్థానాల సంఖ్యను పెంచేందుకు షా అంగీకరించారా? అన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. మాంఝీకి కేటాయించిన సీట్లపై తమకు అసంతృప్తి లేదని, ఏ ఫార్మూలా ప్రకారమైతే ఆర్ఎల్ఎస్పీకి 23 సీట్లు కేటాయించారో, అదే ఫార్మూ లా ప్రకారం తమకూ కేటాయింపు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు. సీట్ల సర్దుబాటులో మాంఝీ, కుష్వాహాల పార్టీలు ఎక్కువ లాభపడ్డాయని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీతో మొదట కుదిరిన అవగాహన గురించి ఎల్జేపీ సీనియర్ నేత ఒకరు వివరించారు. ఆ వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ ఎంపీ స్థానంలోని 6 అసెంబ్లీ స్థానాలను ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీలకు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం ఎల్జ్జేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 42, ఆర్ఎల్ఎస్పీకి 18 స్థానాలు దక్కాల్సి ఉంది. అలాగే, మాంఝీ పార్టీ హెచ్ఏఎం-ఎస్‌కు 12 సీట్లు కేటాయించాలనుకున్నారు. ఆ 12లో.. 9 బీజేపీ, 2 ఎల్జేపీ, 1 ఆర్ఎస్ఎల్పీ త్యాగం చే యాలనుకున్నారు. అలా చేస్తే, ఎల్జేపీ 40, ఆర్ఎల్ఎస్పీ 17, హెచ్ఏఎం-ఎస్ 12 స్థానా ల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవ ప్రకటనలో ఆర్ఎల్ ఎస్పీ, హెచ్ఏఎంలకు ఎక్కువ రావడంతో పాశ్వాన్ అసంతృప్తి చెందారు. కాగా బీజేపీ 43మందితో మంగళవారం రాత్రి తొలి జాబితా విడుదల చేసింది. మరిన్ని సీట్లిస్తే పొత్తుకు రెడీ: పవార్ సీట్ల కేటాయింపులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తే బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమితో పొత్తుకు సిద్ధమేననిమంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కి 40 స్థానాలు కేటాయించినప్పుడు, ఒక ఎంపీ ఉన్న తమకు కూడా అదే రీతిన సీట్లివ్వాలన్నారు. జేడీయూ, ఆర్జేడీలు చెరో 100 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేస్తూ.. ఎన్సీపీకి 3 సీట్లు కేటాయించిన విషయం, దాంతో కూటమి నుంచి ఎన్సీపీ వైదొలగిన విషయం తెలిసిందే.