రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు | Bihar Young Man Assassinated Asking Rs 10 As Boat Fare | Sakshi
Sakshi News home page

రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు

Published Tue, Aug 24 2021 6:37 PM | Last Updated on Tue, Aug 24 2021 7:14 PM

Bihar Young Man Assassinated Asking Rs 10 As Boat Fare - Sakshi

పట్నా: బిహర్‌లో దారుణం చోటుచేసుకుంది. పడవ ఛార్జీ అడిగినందుకు ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన  వివరాలు.. సమస్తిపూర్ జిల్లాలో బన్‌భౌరా గ్రామానికి చెందిన సికల్ యాదవ్‌ అనే యువకుడు గత కొద్ది కాలంగా బోటు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బోటులో ప్రయాణించారు.

సికల్ యాదవ్‌  తన బోట్‌లో ప్రయాణించినందుకు రూ.10 చార్జీగా అడిగాడు. దీంతో ఆ వ్యక్తులు యువకుడుతో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో బోటులో ప్రయాణిస్తున్న గ్రామస్తులు  జోక్యం చేసుకుని వారి నుంచి ఆ యువకుడిని  రక్షించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం సికల్ యాదవ్‌ తన ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు  కాల్పులు జరిపారు. దీంతో ఆ యువకుడు సంఘటన స్ధలంలో మృతిచెందాడని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని వెల్లడించారు.

చదవండి:  22 రోజులుగా ఫ్రీజర్‌లో కుమారుడి మృతదేహాం.. చివరకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement