కాల్పులు జరిగిన ఘటన స్థలం
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్‌మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను పోలీసులు విచారిస్తున్నారు. నేడు(బుధవారం) పలువురు భూమి యజమానులను పోలీసులు విచారించనున్నారు.
లేక్ వ్యూ విల్లాస్ యజమానులను వద్ద సైతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కృష్ణా, అఫీజ్‌లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదస్పద లేక్ విల్లా డెవలప్‌మెంట్ డ్రైవర్ కృష్ణ పేరుతో అగ్రిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ పేరు మీద అబ్ధుల్లాపూర్‌మెట్‌లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment