Cliff Breaks Off, Falls On Boat In Brazil Lake: బ్రెజిల్‌లోని సరస్సులో ప్రయాణికులతో ఉన్న టూరిస్ట్ పడవలపై భారీ కొండ చరియ విరిగిపడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు 32 మంది గాయపడినట్లు వెల్లడించారు. అయితే కాపిటోలియో ప్రాంతంలోని పర్యాటక ప్రాంతమైన ఫర్నాస్ సరస్సుకి వారాంతపు పర్యటనలో భాగంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక పెద్ద రాతిపలక రెండు పడవలపై విరిగిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
(చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!)
నిజానికి బ్రెజిల్‌లోని ఈ సరస్సు సమీపంలో రాతి కొండలు, పచ్చని జలపాతలు, జలవిద్యుత్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వీటిని చూసేందుకు తరలివస్తారు. అయితే ఇటీవల ఆగ్నేయ బ్రెజిల్‌లో కురిసిన వర్షాల కారణంగా ఈ కొండ కూలి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
(చదవండి: ఈ బుడ్డోడు కరోనా వ్యాప్తిని ఎలా విశ్లేషించాడో చూడండి!)
Terrible video out of Lake Furnas, #Brazil, captures the moment a canyon cliff collapses on boats full of tourists. Latest reports say at least 5 dead 20 missing.pic.twitter.com/03LrGX0kIL
— Albert Solé (@asolepascual) January 8, 2022
Comments
Please login to add a commentAdd a comment