tourist boat
-
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం
-
సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా
-
కేరళ బోటు విషాదం..
-
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్‌డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
మోటర్బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. చూస్తుండగానే ఏడుగురి ప్రాణాలు..
Cliff Breaks Off, Falls On Boat In Brazil Lake: బ్రెజిల్‌లోని సరస్సులో ప్రయాణికులతో ఉన్న టూరిస్ట్ పడవలపై భారీ కొండ చరియ విరిగిపడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు 32 మంది గాయపడినట్లు వెల్లడించారు. అయితే కాపిటోలియో ప్రాంతంలోని పర్యాటక ప్రాంతమైన ఫర్నాస్ సరస్సుకి వారాంతపు పర్యటనలో భాగంగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక పెద్ద రాతిపలక రెండు పడవలపై విరిగిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (చదవండి: మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!) నిజానికి బ్రెజిల్‌లోని ఈ సరస్సు సమీపంలో రాతి కొండలు, పచ్చని జలపాతలు, జలవిద్యుత్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వీటిని చూసేందుకు తరలివస్తారు. అయితే ఇటీవల ఆగ్నేయ బ్రెజిల్లో కురిసిన వర్షాల కారణంగా ఈ కొండ కూలి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: ఈ బుడ్డోడు కరోనా వ్యాప్తిని ఎలా విశ్లేషించాడో చూడండి!) Terrible video out of Lake Furnas, #Brazil, captures the moment a canyon cliff collapses on boats full of tourists. Latest reports say at least 5 dead 20 missing.pic.twitter.com/03LrGX0kIL — Albert Solé (@asolepascual) January 8, 2022 -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్టు
ముంబై/థానే: దేశ ఆర్థిక రాజధాని ముంబై తీరం సమీపంలో సముద్రంపై విహరిస్తున్న ఓ పర్యాటక నౌకలో జరుగుతున్న డ్రగ్స్పార్టీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు భగ్నం చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు గాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్‌పై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27, సెక్షన్ 8సీ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అతడిని ఎన్సీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారిస్తున్నారు. నౌకలో మాదక ద్రవ్యాలతో ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, నూపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ పట్టుబడ్డారని, వీరిలో ఇద్దరు యువతులు ఉన్నారని వెల్లడించారు. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22 ఎక్స్టసీ మాత్రలు, 5 గ్రాముల మెఫిడ్రోన్(ఎండీ), 1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుస్తులు, పర్సుల్లో డ్రగ్స్ ముంబై నుంచి గోవాకు పయనమైన కార్డెలియా క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడి చేశారు. నౌకలో అనుమానితులను సోదా చేశారు. వారి వద్ద పలు రకాల మాదక ద్రవ్యాలు లభించాయి. వాటిని దుస్తుల లోపల దాచిపెట్టినట్లు గుర్తించారు. యువతులు తమ పర్సుల్లో డ్రగ్స్ దాచుకున్నారు. ఆదివారం ఉదయం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నిందితులను ప్రశ్నించారు. అయితే, డ్రగ్స్ పార్టీతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని క్రూయిజ్ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు ప్రైవేట్ కార్యక్రమం కోసం ఈ నౌకను అద్దెకు ఇచ్చామని వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, అధ్యక్షుడు జుర్గెన్ బైలామ్ తెలియజేశారు. కేవలం కుటుంబాలకు వినోదం కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని, తమ నౌకల్లో అనుచితమైన పనులను ప్రోత్సహించబోమని వివరించారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటు న్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్యన్ ఖాన్ అరెస్టును అధికారులు ప్రకటించడానికంటే కొద్ది సేపటి ముందు షారుఖ్ ఖాన్ తన ఇంటి నుంచి లాయర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి అరెస్టుపై ఆయన ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి: రాందాస్ అథవాలే నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వంటి తప్పుడు పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో డ్రగ్స్‌కు స్థానం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కోరుతానని అన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ దందా బహిర్గతమయ్యిందని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో ఇదొక పెద్ద జాడ్యంగా తయారయ్యిందని చెప్పారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ముంద్ర పోర్టు ఘటన నుంచి దృష్టి మరల్చడానికే: కాంగ్రెస్ గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో ఇటీవల పట్టుకున్న రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముంబైలో డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత షమా మహమ్మద్ ఆరోపించారు. ముంద్ర పోర్టు ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ముంద్ర పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) రూ.21,000 కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. షారుక్‌ఖాన్ తనయుడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఎన్సీబీని షమా మహమ్మద్ ప్రశ్నించారు. ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌పై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు. ఎవరీ సమీర్ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. -
విషాదంలో బాధితుల కుటుంబ సభ్యులు
-
బోట్ మునిగి 9మంది మృతి,30మంది గల్లంతు
బొగొటా: కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్ట్ బోట్ మునిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 30మందికి పైగా గల్లంతు అయ్యారు. బోట్లో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు మరో పెద్ద బోటు త్వరితగతిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని 100మందికి పైగా సురక్షితంగా రక్షించారు. దాదాపు 20 మందికి పైగా బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మెడెల్లిన్ కు 45 కిలోమీటర్ల దూరంలో తూర్పుగా ఉన్న గుటాపె సమీపంలోని కోస్తా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్‌తో పాటు, కొలంబియన్ వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టి బాధితులను అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే బోట్లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, బోటు ఐదు నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడ్డ ఓ టూరిస్ట్ తెలిపాడు. కాగా ప్రమాదానికి ముందు బోట్ ఒక భాగం నీటిలో మునిగిపోయినట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.